Tuesday, January 10, 2012

cancer screening Tests , క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --cancer screening Tests , క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్ ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా నయము చేయవచ్చును . అయితే క్యాన్‌సర్ ను ముందుగా గుర్తించడానికి మనకు రెండు రకాల కారకాలు అవసరము . అవి 1) క్యాన్సర్ వ్యాధి యొక్క ముందస్తు లక్షణాలు గురించి తెలుసు కోవడము . 2) స్క్రీనింగ్ .

  • క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

  • ముదంస్తు లక్షణాలు :
సామాన్య ప్రజలు కాన్‌సర్ యొక్క ముందస్తు లక్షణాలను గురించిన పరిజ్ఞానము కలిగి ఉండడము వలన క్యాన్సర్ త్వరగా గుర్తించడానికి వీలవుతుంది . గడ్డలు , అసాధారణ రక్తస్రావము , దీర్ఘకాలము పాటు ఆహారము సరిగా జీర్ణము కాకపోవడము , మందులు వాడినా సరిగా మానని పుండు ... మొదలైనవి క్యాన్సర్ ముందస్తు లక్షణాలలో కొన్ని . బ్రెస్ట్ కాన్‌సర్ , నోటి క్యాన్‌సర్ , పెద్దప్రేగుల కాన్‌సర్ , చర్మ కాన్‌సరు వంటివాటిలో పైన పేర్కొన్న లక్షణాలు ద్వారా క్యాన్‌సర్ ముందుగానే గుర్తించవచ్చును .

  • స్క్రీనింగ్ :
స్క్రీనింగ్ అనేది ఆరోగ్య్ముగా ఉండే వ్యక్తులలో నుగూఢమై ఉన్న క్యాన్‌సర్ ను గుర్తించడానికి నిర్వహించే పరీక్ష . క్యాన్‌సర్ కారకాలు శరీరములో దాగి ఉండే లక్షణాలు ఇంకా బయటపడని వ్యక్తులలో నిర్వహించే సాధారణమైన , సులువైన పరీక్ష . ముందుజాగ్రత్తగా ఈ పరీక్షలు చేసుకోవడము వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది .


క్యాన్సర్ వచ్చే అవకాశము గల వ్యక్తులు :
  • పొగ త్రాగడం అలవాటున్నవారు , పొగాకు నమలడము , గుట్కా, పాన్‌మసాల , జర్ధా మఒదలైనవి వేసుకునే అలవాటు ఉన్నవారు .
  • మద్యానికి బానిసలైనవారు . సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధులు కలవారు , .
  • వ్యాయామము చేయనివారు . . ఊబకాయము , కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకునేవారు , .
  • పీచుపదార్ధము తక్కువగా ఉండే ఆహారము తీసుకునేవారు , మసాలాలు ఎక్కువగా తినేవారు .

మహిళలకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు :
  • బ్రెస్ట్ క్యాన్‌సర్ :
  • 20 సం.లు నిందిన ప్రతి మహిళ రెగ్యులర్ గా ఇంటివద్దనే స్థనాలను పరీక్షించుకోవాలి . స్థనాలలో కణుతులు , గడ్డలు , వాపులు ఏమైనా ఉన్నాయోమో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి .
  • 20 నుండి 30 సం. నిండిన మహిళలు ప్రతి 3 సం.లకు ఒకసారి వైద్యునిచే స్థనాలను పరీక్ష చేయించుకోవాలి . 40 సం.ల నుండి మహిళలు ప్రతి సంవత్సరమూ స్థనాలలను వైద్యుని చే పరీక్ష చేయించుకోవాలి .
  • వయసు 40 సంవత్సరాలు నిండిన మహళలు ప్రతి సంవత్సరము డిజిటల్ మమ్మొగ్రామ్‌ పరీక్ష చేయించుకోవడము మంచిది .

సెర్వైకల్ క్యాన్‌సర్ :
  • సెక్ష్ లో పాల్గొనడం మొదలు పెట్టిన 3 సం.లు తరువాత నుండి ప్రతి మహిళ గర్భాశయ ముఖ ద్వారానికి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. సాధారణ పి.ఎ.పి పరీక్ష పద్దతిలో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి . అదే అత్యాధునిక లిక్విడ్ -బెస్ట్ పి.ఎ.పి. పద్దతిలో అయితే 2 సం.ల కొకసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది .
  • 30 సం.లు పైబడిన వయసు కలవారు ప్రతి 3 సం.లు ఒకసారి పి.ఎ.పి పరీక్ష మరియు హెచ్.పి.వి , డి.యన్‌.ఎ , పరీక్షలు చేయించుకుంటే మంచిది .
  • హెచ్ .ఐ.వి. ఉన్నవారు , అవయమార్పిడి , కీమోథెరపీ , మత్తుపదార్ధాల బానిసలు వంటి వాటివలన రోగనిరోధక శక్తి తగ్గినవారు లేదా కోల్పోయినవారు ప్రతిసంవత్సరము పైన చెప్పిన పరీక్షలు చేయించుకోవాలి .
  • 70 సం.లు పైబడిన మహిళలు , గత 10 సంవస్తరాలు గా పి.ఎ.పి. పరీక్ష నార్మల్ గా వచ్చినవారు .. స్క్రీనింగ్ టెస్ట్ ను ఆపేయవచ్చును .
  • హిస్టెరెక్టమీ ద్వారా గర్భాశయము తో పాటు సెర్వెక్ష్ కూడా తొలగించినవారు లో స్క్రీనింగ్ పరీక్షలు చేయాల్సినవసరము లేదు .
  • 10 సం.లు నిండిన ఆడపిల్లలకు , 46 సం.లలోపు మహిళలము సెర్వకల్ క్యాన్‌సర్ వాక్షిన్‌ ఇప్పించడము వలన 90% సెర్వైకల్ క్యాన్‌సర్ ని నివారించవచ్చును .

మగవారికి నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు :
మగవారిలో వచ్చు క్యాన్సర్‌లు : ముఖ్యంగా
  • నోటి క్యాన్సర్‌,
  • గొంతుక్యాన్సర్‌,
  • ఊపిరి తిత్తులు క్యాన్సర్‌,
  • అన్నవాహిక క్యాన్సర్‌,
  • ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మొదలైనవి.
పై మూడు క్యాన్సర్‌లు రావడానికి ముఖ్యకారణం ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడటం. (గుట్కా, పాన్‌ పరాగ్‌ మొదలైనవి). పైన పేర్కొన్న మూడు క్యాన్సర్‌ వ్యాధులు 23 శాతం ధూమపానం వలన వస్తున్నాయి.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ :
  • 50 సంలు నిండిన మగవారు ప్రతి సంవత్సరమూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్‌ (పి.యస్ .ఎ ) రక్తపరీక్ష , డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి .
  • కుటుంబకులో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్‌సర్ ఉన్నట్టు అయితే మిగతావారు 40 సంవత్సరాల వయసునుండే ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి .
క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తలు
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • అధిక బరువు తగ్గించుకోవాలి.
  • ఆహారంలో క్రొవ్వు పదార్థాలు తగ్గించాలి.
  • తాజా పళ్ళు, కూరగాయలు పీచుపదార్థం ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
  • యాంటి ఆక్సిడెంట్స్‌ ఉండే పదార్థాలు సమృద్ధిగా తీసుకోవాలి.
  • వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి.
  • లైంగిక పరిశుభ్రత పాటించాలి.
  • క్రమం తప్పకుండా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

నివారణ సాధ్యమే :
  • క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి.
  • క్యాన్సర్‌ లక్షణాలు గురించి వ్యాధి నిరోధక పద్ధతుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.
  • క్యాన్సర్‌ మొదటి దశలో గుర్తించేలా లక్షణాల గురించి గ్రామీణ వైద్యులు, ఫిజిషియన్స్‌కు ఇతర విభాగాల వైద్యులకు క్యాన్సర్‌ వైద్యులచే శిక్షణాతరగతులు నిర్వహించాలి.
  • ప్రతి సంత్సరం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకునేలా అవగాహనకు ప్రచారం చేయాలి.
  • అన్ని ప్రధాన ఆసుపత్రులలో పేద, మధ్యతరగతి వారికి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయించేలా మరియు ప్రధాన ఆసుపత్రులలో క్యాన్సర్‌ వైద్య నిపుణులు క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటుకు ప్రయత్నించాలి.
  • క్యాన్సర్‌ వైద్య చికిత్సకు అవసరమయ్యే జనరిక్‌ మందులు చవక ధరలో లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
  • క్యాన్సర్‌ వ్యాధి గురించి గ్రామీణ ప్రాంతాలలో ర్యాలీలు, కళాజాతరలు ద్వారా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కలిగించటానికి కృషి చేయాలి.
  • సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు వాడే వ్యాక్సిన్‌ను తక్కువ ధరలలో 13 సం||రాల బాలికలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి.
  • యాంటిఆక్సిడెంట్‌ వున్న ఆహారపదార్థాలు తీసుకొనేలా చిన్నప్పటి నుండి వ్యాయామం చేసేలా పిల్లలకు విద్యార్థి దశ నుంచి నేర్పించాలి.

పై నివారణ చర్యలు పాటించడం ద్వారా రాబోయే రోజులలో క్యాన్సర్‌ వ్యాధిని కొంతవరకైనా అరికట్టగలమని ఆశిద్దాం.

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.