Tuesday, January 31, 2012

Human circulatory System Awareness, మానవ రక్తప్రసరణ వ్యవస్థ అవగాహన


  • image : courtesy with Eenadu news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Human circulatory System Awareness, మానవ రక్తప్రసరణ వ్యవస్థ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మానవ శరీరము లో రక్తప్రసరణ చాలా ముఖ్యమైంది . మన శరీరము లో ఆక్షిజన్‌ , కార్బన్‌డైఆక్షైడ్ , హార్మోనులు , వ్యర్ధపదార్ధాలు రవాణా చేయడానికి రక్తప్రసరణ వ్యవస్థ ఉపయోగపడుతుంది . విలియం హార్వే అనే శాస్త్రవేత్త రక్తప్రసరణ వ్యవస్థని కనుగొన్నారు . ఉన్నత స్థాయి జంతువులలో రక్తము రక్తనాళాలో ప్రవహిస్తుంది . గుండె నుంచి వివిధ శరీరభాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలను " ధమనులు " అని అంటారు . వీటిలో మంచిరక్తము ( ఆక్షిజన్‌ తో కూడిన రక్తము) ప్రవహిస్తుంది . ధమనుల గోడలు మందముగా ఉంటాయి. వీటిలో రక్తము ఎక్కువ పీడనముతో ప్రవహిస్తుంది . శరీర భాగాలనుంచి రక్తాన్ని గుండెకు తీసుకు వచ్చే రక్తనాళాలను " సిరలు " అని అంటారు . వీటిలో చెడు రక్తము (కార్బన్‌ డై ఆక్షైడ్ తో కూడిన రక్తము ) ప్రవహిస్తుంది . సిరల గోడలు పలచగా ఉంటాయి. . వీటిలో రక్తము తక్కువ పీడనముతో ప్రవహిస్తూంది . రక్తము వెన్నక్కి ప్రవహించకుండా సిరలలో కవాటములు ఉంటాయి.

సకశేరుకాల్లో అంటే వెన్నెముక ఉంటే జంతువులలో రక్తప్రసరణ వ్యవస్థ భాగా అభివృద్ధి చెంది ఉంటుంది. వీటిలో గుండె కండరయుతమై గదులుగా విభజన చెంది ఉంటుంది . చేపలలో రెండు గదుల గుండె , ఉభయచర జీవుల్లో మూడు గదుల గుండె , సరీసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదుల గుండె , పక్షులు , క్షీరదాల్లో నాలుగు గదుల గుండె ఉంటుంది .

రక్తములో ప్లాస్మా , రక్తకణాలు ఉంటాయి. రక్తకణాల మధ్య ఉండే ద్రవపదార్ధమే " ప్లాస్మా" దీంట్లో అనేక పదార్ధాలు కరిగి ఉంటాయి. రక్తకణాలు మూడు రకాలు . అవి 1) ఎర్ర రక్తకణాలు , 2)తెల్లరక్తకణాలు , 3) త్రాంబోసైట్లు .

ఎర్రరక్తకణాలను " ఎరిథ్రోసైట్లు " అని అంటాము . వీటిలో ఉన్న హీమోగ్లోబిన్‌ ద్వారా ఆక్షిజన్‌ రవాణా జరుగుతూ ఉంటుంది . ఎర్ర రక్తకణాలు కేంద్రము లేని కణాలు . ప్రతి సెకను కి సుమారు 2.4 మిలియన్ల కణాలు తయారవుతూ ఉంటాయి. ఇవి ఎముకల మజ్జ (Bone marrow)లో తయారవుతాయి. వీటి జీవిత కాలము 120 రోజులు . మనుషులలో 4-5 మిలియన్ల కణాలు /ఘనపు మి.మీ (cubic.mm) ఉంటాయి .

తెల్లరక్తకణాల (white blood cells) ను " ల్యూకోసైట్లు " అని అంటాము . ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పతాయి. శరీరములోని హానికర సూక్ష్మజీవులను భక్షిస్తాయి. . అందుకే వీటిని " శరీర రక్షకభటులు " అని పిలుస్తారు . వీటిలో నిర్ధిష్ట కేంద్రకం ఉంటుంది. ఇవి ఎముకల మజ్జ (Bone marrow)లో తయారవుతాయి. వీటి జీవితకాలము 12 నుండి 13 రోజులు . ఇవి ప్రతి క్యూబిక్ మి.మీ.కు సుమారు 4000-11000/mm^3 . వీటిలో న్యూట్రోఫిల్స్ (54-62%), ఇసినోఫిల్స్(1-6%) ,Basophils(<1%),Lymphocytes(25-33%), monocytes(2-10%), అనేవి రకాలు .

త్రాంబోసైట్లు రక్తము గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. వీటి జీవితకాలము 5-9 రోజులు . ఇవి కూడా ఎముకల మజ్జ (Bone marrow)లో తయారవుతాయి. మన రక్తము లో 1.5 - 4.0 లక్షల కణాలు /కూబిక్ మి.మీ ఉంటాయి. ప్రతిరోజూ 100,000,000,000 కణాలు తయారవుతాయి.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.