Thursday, January 26, 2012

బ్రాంకైటిస్‌,Bronchitisఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బ్రాంకైటిస్‌,Bronchitis- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి వాతావరణంలో కలిగే మార్పులు సమస్యలను సృష్టిస్తాయి. వేసవి కాలంలో తగ్గుముఖం పడుతున్నాయనుకునే శ్వాసకోశ వ్యాధులు ఆ తరువాత కాలాల్లో మళ్లీ విజృంభిస్తాయి. కాలానుగుణంగా అలవాట్లను మార్చుకోని పక్షంలో శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు పలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదాహరణకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వాటి కారణంగా ఫారింజైటిస్‌, టాన్సిలైటిస్‌, సైనుసైటిస్‌, బ్రాంకైటిస్‌, న్యుమోనియా వంటి వ్యాధులు సోకవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి వ్యాధులతో సతమతమవ్ఞతున్న వారికి చల్లని వాతావరణం ఒక శాపమనే చెప్పాలి. వారు వాడుతున్న మందుల కారణంగా వ్యాధి పూర్తిగా అదుపులో ఉన్నా, జలుబు, గొంతులో వచ్చే ఇన్‌ఫెక్షన్లు మొదలైన వాటితో వ్యాధి మరింత తీవ్రతరంగా పరిణమించే అవకాశం ఉంది.
 • బ్రాంకైటిస్‌
శ్వాసావయవాలను రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది- ముక్కు నుండి గొంతు వరకూ ఉండే వూర్ధ్వ భాగం. రెండోది- గొంతుక దాటి ఛాతీలోకి ఉండే అధో భాగం. ఈ అధో భాగంలో వాయునాళాలు, వాయుగోళాలు ఉంటాయి. వాయునాళాల లోపలి భాగాన్ని జిగురు పొరలు (మ్యూకస్‌ మెంబ్రేన్‌) కప్పి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే బ్రాంకైటిస్‌ అని వ్యవహరిస్తారు.

సాధారణంగా వూర్థ్వ శ్వాసావయవాలు ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడే ఈ బ్రాంకైటిస్‌ కూడా చోటుచేసుకోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా పెద్ద పిల్లల్లో ఎక్కువే అయినా వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల్లోనూ కనబడుతుంటుంది. ఈ ఇన్ఫెక్షన్‌కు అధికంగా వైరస్‌ క్రిములే కారణమవుతుంటాయి.

మొదటి దశలో పొడి దగ్గు కనిపిస్తుంది. కంగుకంగున దగ్గుతుంటారు. ఒకటి, రెండు రోజులు గడిచే సరికి తెమడ తోడవుతుంది. తెమడ పసుపు రంగులో, ఆ తర్వాత ఆకుపచ్చ రంగులో కన్పిస్తుంది. కఫం ఎక్కువగా ఉమ్మివేయకుండా మింగుతుంటారు. దగ్గుతో పాటు అరుదుగా వాంతులు చోటుచేసుకోవచ్చు. ఛాతీ ఎముక వెనుక భాగంలో నొప్పి కూడా ఉండవచ్చు.

ఇన్ఫెక్షన్‌ కారణంగా జిగురు పేరుకోవటం, వాయునాళాలు కుంచించుకుపోవడం వల్ల- ఛాతీలో పిల్లికూతలు వినిపిస్తాయి. ఈ దశలో బ్రాంకైటిస్‌ బాధ చూడటానికి ఉబ్బసాన్ని పోలి ఉంటుంది. అయితే బ్రాంకైటిస్‌లో పిల్లికూతల కంటే ముందే దగ్గు, జ్వరం కనిపిస్తాయి. వీటిని వేరు చేసి గుర్తించటం తేలికే. కొంతమంది పిల్లలు వాతావరణం, కాలుష్యాల కారణంగా తేలికగా బ్రాంకైటిస్‌ బారినపడుతుంటారు. కొందరు మరీ తరచుగా దీనికి గురవుతుంటారు. టాన్సిల్స్‌ ఇన్ఫెక్షన్‌, సైనస్‌ ఇన్ఫెక్షన్‌ మొదలైన బాధలకు గురైన పిల్లలు తరచుగా బ్రాంకైటిస్‌ వ్యాధికి కూడా గురవుతుంటారు. పళ్లు వచ్చే సమయంలో పిల్లలు తరచుగా బ్రాంకైటిస్‌కు గురికావడం గుర్తించిన విషయమే. ఇన్ఫెక్షన్‌ తోడైతే తప్పించి కేవలం బ్రాంకైటిస్‌ వ్యాధికి యాంటిబయాటిక్‌ ఔషధాలతో ఉపయోగం లేదు. ఇక ఫ్లూ, తట్టు, కోరింత దగ్గు, స్కార్లెట్‌ ఫీవర్‌ల ఆరంభ దశలో బ్రాంకైటిస్‌ కన్పించవచ్చు. ఇది గమనార్హం.

ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకువెళ్ళే గొట్టాలకు ఇన్ఫెక్షన్స్‌ రావడాన్నే బ్రాంకైటిస్‌గా వ్యవహరి స్తారు. దీనివల్ల దగ్గుపెద్ద శబ్దంతో వస్తూంటుంది. ఒక్కోసారి తెమడతో కలిసివస్తుంది. బ్రాంకైటిస్‌ అనేది సాధారణంగా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. .ఇది చాలా సాధారణమైన ఊపిరితిత్తుల సమస్య. శ్వాసకోశంలో, వాహికలో వాపు రావడం, దాంతో సంభవించే మార్పులనే బ్రాంకైటిస్ అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్.

అక్యూట్ బ్రాంకైటిస్ 90 శాతం వైరస్ కారణం కాగా, 10 శాతం బ్యాక్టీరియాతో వస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌కూ, అక్యూట్ బ్రాంకైటిస్‌కు లక్షణాలలోనూ, ఊపిరితిత్తుల్లో జరిగే పరిణామాల్లోనూ తేడా ఉంటుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌లో ఏడాదికి మూడునెలలపాటు దగ్గు, తెమడ ఉంటుంది. ఇది పొగతాగడం వల్ల, వాతావరణ మార్పులు, కాలుష్యం, ఇన్‌ఫెక్షన్స్ వలన శ్వాసనాళాలు దెబ్బతినడంతో వస్తుంది. ఇది పురుషుల్లో ఎక్కువ.

కారణాలు:
 • చల్లటి వాతావరణంలో వచ్చే జలుబు, ఫ్లూ జ్వరం,
 • బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ మైక్రో బ్యాక్టీరియమ్ నిమోనియా,
 • దుమ్ము, ధూళి, పొగ, కెమికల్స్, సిగరెట్ పొగ.

వ్యాధి లక్షణాలు...
 • జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వారం నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. ఛాతీనొప్పి, దగ్గు విపరీతంగా ఉంటాయి. పిల్లి కూతలు, ఆయాసం,ఎక్కువ సేపు నడవలేకపోవడం వంటివి.
 • బ్రాంకైటిస్ తరచుగా వస్తూ ఉంటే అది దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌గా మారడానికి అవకాశం ఎక్కువ. క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది, ఆస్తమాకు దారి తీస్తుంది.

వ్యాధి నిర్ధారణ:
 • ఛాతీకి ఎక్స్‌రే
 • కఫం పరీక్ష (స్పుటం కల్చర్)
 • పిఎఫ్‌టి సిబిపి,
 • ఇఎస్‌ఆర్

నివారణ ఎలా:
 • ధూమపానం మానాలి,
 • దుమ్ము, ధూళికి, కాలుష్యానికి దూరం గా ఉండాలి,
 • మంచినిద్ర, ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి.
 • ఆహారంలో ఎక్కువ భాగం ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి,
 • క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి,

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
 • జలుబు కొద్దిగా ఉన్నప్పుడే, రాను రాను తీవ్రంగా మారే ప్రమాదముందని గుర్తించి వెంటనే జలుబుతగ్గించడానికి అవసరమైన యాంటి హిస్టమిస్‌లను,
 • జ్వరం రాకుండా యాంటిపైరటిక్‌ను, ముక్కునుంచి కారుతున్న నీరు, చీముగా మరుతున్నప్పుడు యాంటిబయాటిక్స్‌ను వాడాలి.
 • జలుబు రాకుండా ఉండాలంటే చల్లని నీటితో తలస్నానం చేయకూదడు. తలస్నానం చేసిన వెంట నే అరబెట్టుకోవాలి.
 • శీతా కాలంలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ తాగినపుడుగొంతు పట్టేసి ఫేరింజై టిస్‌, టాన్సిలైటిస్‌ వచ్చే అవకాశం ఉంది.
చికిత్స:
 • సాధారణంగా బ్రాంకో డయలేటర్స్, కార్టిజోన్స్, యాంటిబయాటిక్స్ వాడుతుంటారు.

 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

Your comment is very important to improve the Web blog.