Monday, January 2, 2012

ఆరోగ్యానికి చిట్కాలు ,Hints for good healthఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్యానికి చిట్కాలు ,Hints for good health- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...ఆరోగ్యంగా వుండాలని మనలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా దానికి ఆరోగ్యం అవసరం. అందుకే పూర్వం మన పెద్దలు ఆరోగ్యమే మహభాగ్యం అన్నారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము. అవి ఏమిటంటే

 • ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్ళు త్రాగండి. అలా త్రాగటంవల్ల సుఖ విరేచనం అవుతుంది. సమస్త వ్యాధి వర్థకం మలబద్దకం అని మనవైద్యశాస్త్రం చెప్తుంది. సుఖ విరోచనం అవ్వటం అంటే అన్ని జబ్బులు నుండి విముక్తి పొందటమే.
 • రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం. రోజూ ఒకగంట వాకింగ్‌ చేయడం మూలంగా బిపి షుగర్‌ను కొంత వరకు కంట్రోల్‌ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. వాకింగ్‌ చేసేటప్పుడు మాట్లాడడం మానాలి.
 • బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనా లలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు.
 • ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి.
 • అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి.
 • ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి.
 • అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది.

 • మంచి అలవాట్లు !

ఆరోగ్యకరమైన సూత్రాలను పాటించటం అందరికీ మంచిది. కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు అందరూ పాటించాల్సి వుంటుంది. అది ఏమిటంటే
 • ఇండ్లలోని చెత్త, చెదారాన్ని రోడ్ల మీదగాని, ఇతరుల ఇంటి ముందర గాని వేయకూడదు. చెత్తను మున్సిపాలిటీ వారి కుండీలలో మాత్రమే వేయాలి. అది కూడా మనం ఆరోగ్యంగా వుండటానికి సహాయపడుతుంది. చెత్త చెదారాన్ని ఇంటిముందు వుంచుకున్నా అది మనకి అనారోగ్యకరం. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి.
 • కొంతమంది ఎక్కువగా సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పొగాకు ఎక్కువగా కాలుస్తుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటనింట్లో 'నికోటిన్‌' అనే విష పదార్థము ఉంటుంది. పొగ త్రాగటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. వాటిద్వారా నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌, క్షయ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా పొగ త్రాగటం వల్ల ఆయుష్షు క్షీణిస్తుంది.
 • కాఫీ, టీలు ఎక్కువగా త్రాగటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కాఫీలో 'కాఫిన్‌' అనే పదార్థము, టిలో 'టియాన్‌' అనే పదార్థము వుంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. దీనివల్ల జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి. కనుక కాఫీ, టీలు తాగకుండా వుంటే చాలా మంచిది.
 • కొంతమందికి మత్తు పానీయాలు సేవించటం వల్ల బుద్దిమాంద్యం ఏర్పడుతుంది. అనేకమైన ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ రోజుల్లో విద్యార్థులు గంజాయి, మార్ఫిన్‌లకు బానిసలు అవుతున్నారు. అవి మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది మన చేతుల్లోనే వుంటుంది. మన అలవాట్ల మీదే మన ఆరోగ్యం చదువు ఆధారపడి వుంటుంది.


 • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.