Friday, May 11, 2012

లివర్ క్యాన్సర్,Liver Cancer





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లివర్ క్యాన్సర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • -హెపటో లేదా హెపాటిక్ అని అంటుండడం వింటూనే ఉంటాం. దీనికి అర్థం కాలేయం అని జీవవూపక్షికియలలో కీలక పాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తించి పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం. 1000కి పైగా ఎంజైమ్స్‌ని లివర్‌ తయారు చేస్తుంటుంది. మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్ద (చర్మము తరువాత) అవయవమైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా కూడా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజించబడి ఉండే కాలేయం దాదపు ఒకటిన్నర కిలోల వరకు బరువు ఉంటుంది.
మనదేశంలో ప్రతి 20 మందిలో ఒకరు జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యకు లోనవుతున్నారు. గ్యాస్‌ సమస్య మొదలుకొని పెద్దపేగు క్యాన్సర్‌... పొట్ట ఇలా జబ్బుల పుట్టగా మారుతున్నది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో శుభ్రత పాటించకపోవడం, మన జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. చాలా మందిలో నెలలో ఒకటి, రెండు సార్లయినా పొట్టకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గ్యాస్‌, కడుపులో నొప్పి, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, కడుపులో మంటలు ఈ సమస్యలు ఎక్కువమందిని వేధిస్తాయి. పొట్టలో కాస్త ఇబ్బంది కనిపించగానే కొందరు తమకు తోచిన టాబ్లెట్‌ వేసుకుంటారు. ఆ మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన శాశ్వత పరిష్కారం కావు.

విషతుల్యమైన పదార్థాల వల్ల కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, స్మోకింగ్ వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దానిని హెపటైటిస్ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్‌లు ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిలో బి, సి, వైరస్‌లు ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వల్ల, అరక్షిత శృంగారం ద్వారా, తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్‌లు సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి. హెపటైటిస్‌-బి పాజిటివ్ ఉన్నవారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ వేయిస్తే చాలా మంచిది. ఆకలి తగ్గటం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నపుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం వంటి సొంత వైద్యాలు చేసుకోకుండా కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్‌ఫెక్షన్స్ ఫ్యాటి లివర్, లివర్ వెబ్‌సెస్, విల్సన్ డిసీజ్, గిల్‌బర్డ్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా వీటిలో హెపటైటిస్ బి, సి, వైరస్ కలుగజేసే ఇన్‌ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తర్వాత కాలేయనాన్ని గాయపరచడం, గట్టిగా మార్చడం(సిరోసిస్) తర్వాత క్యాన్సర్‌కు దారితీయటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆసియా దేశాలలో హెపటైటిస్-బి, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి లివర్ క్యాన్సర్స్ ఎక్కువే. లివర్ క్యాన్సర్‌ లో హెపటోసెల్యులార్ కార్సినోమా, మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలుంటాయి. జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్లు, ఇలా ఏ క్యాన్సర్స్ అయినా కాలేయానికి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. లేటుగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు.
  • -పొట్ట సంబంధిత క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు తర్వాత లివర్ క్యాన్సర్లు ఎక్కువ. ఇండియా, చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, సౌత్ ఆఫ్రికాలలో హెపటైటిస్ -బి, ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లో ఈ క్యాన్సర్ తక్కువే అయినా హెపటైటిస్ - సి, వైరస్‌వల్ల , అధికబరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల ఈ క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య ఈ దేశాలలో కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా వంటి దేశాలలో స్థిరపడిన ఆసియా దేశస్థులలో హెపటైటిస్-బి ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. పుట్టినపుడే ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నా 30, 40 ఏళ్లలో లక్షణాలు బయటపడడం, క్యాన్సర్‌కు గురవటం జరుగుతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్, హెపటైటిస్-బి పాజిటివ్‌కు ఆల్కహాల్ తోడయితే త్వరగా ముదిరిపోవడం, చికిత్సకు లొంగకపోవడం జరుగుతూ ఉంటుంది.
చికిత్స :
  • కాలేయానికి వ్యాధి వచ్చిన 60 శాతం వరకు ప్రమాద విషయం తెలియదని, కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్‌ ‘బి’ లేక ‘సి’ లతో బాధపడుతున్న వారు అరువందల(600) మిలియన్ల దాకా ఉన్నారు. హెపటైటిస్‌ బి లేక సి తో బాధపడుతూ మరణిస్తున్న వారు ప్రతి సంవత్సరం 105 మిలియన్ల దాకా ఉన్నారు. అవగాహన కోసము ప్రతి సంవత్సరమూ 19-ఏప్రిల్ న ''వరల్డ్ లివర్ డే'' జరుపుకుంటున్నాం.


లివర్‌ దెబ్బతిన్నప్పుడు సాధారణంగా జాండిస్‌ వస్తుంది. లివర్ వ్యాధితో ఉన్నవారు బాగా విశ్రాంతి తీసుకోవాలి . ఎక్కువగా కాచి చల్లారిన లేదా మినరల్ వాటర్ .. నీరు త్రాగాలి. Liv-52 మాత్రలు రోజుకి 2 ఉదయము రెండు రాత్రి వాడుతూ ఉండాలి . జీర్ణశక్తి కి Digeplex (with sorbitol) వాడుతూ ఉండాలి. బి.కాంప్లెక్ష్ మాత్రలు రెగ్యులర్ గా తింటూ ఉండాలి. కొంతమంది వైద్యులు silmarin తో తయారుచేసిన మందులులు వాడమంటారు . Ursodeoxycholic acid, UDCA-(ursodiol) ని కొందరు డాక్టర్లు వాడమని సలహా ఇస్తారు . మంచిదే. హెపటైటిస్ -బి /సి కోసము యాంటి వైరల్ ప్రిపరేషన్స్ వాడాలి. సిర్రోసిస్ తో బాదపడుతున్నవారికి కాళ్ళు వాపులు కోసము తక్కువ మోతాదు లో Diuretics వాడాలి . ఏ మందులు వాడినా వైద్యుల సలహామేరకే తీసుకోవాలి.

  • సర్జరీ : శ్యాప్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, స్ప్లిట్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఆక్సిలరి లివర్ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి .
--Cortesy with Dr.Mohanavamsy ,chief oncologist ,Omega hos.Hyd.@Namste Telangana paper.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, May 9, 2012

Medicine update-జీవగడియారం గుండెలయకు ఆధారం,Cardiac Rythym depends on bio-clock



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జీవగడియారం గుండెలయకు ఆధారం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మనకు చీకటి పడగానే నిద్ర ముంచుకురావటం, తెల్లారగానే మెలకువ రావటం సహజమే. ఇలా వెలుతురును బట్టి మనలోని జీవగడియారం (సిర్కాడియన్‌ రిథమ్‌) శారీరక, మానసిక, ప్రవర్తన మార్పులను కలిగిస్తుంటుంది. అంతేకాదు దీనికి గుండెపోటుతోనూ సంబంధం ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గుండెపోటు రావటానికి గుండెలయ దెబ్బతినటమే (అరిత్మియా) ప్రధాన కారణమవుతోంది. గుండెలయ తప్పటమనేది సాధారణంగా తెల్లవారుజాముననే ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చాలాకాలం కిందటే గుర్తించారు. మరికొందరిలో ఇది సాయంత్రం వేళల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ విషయం తెలిసినప్పటికీ ఇందుకు ఏయే అంశాలు దోహదం చేస్తున్నాయో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. ఇది క్రపెల్‌-లైక్‌ ఫ్యాక్టర్‌ 15 (కేఎల్‌ఎఫ్‌-15) అనే ప్రోటీన్‌తో ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్‌ కేఎల్‌ఎఫ్‌-15 జన్యువు సంకేతాలతో ఉత్పత్తి అవుతుంది. ఇది జీవగడియారంతో అనుసంధానమై గుండెలోని విద్యుత్‌ ప్రసారాన్ని నియంత్రిస్తున్నట్టు తాజాగా కనుగొన్నారు. కేఎల్‌ఎఫ్‌-15 మరీ ఎక్కువైనా, తక్కువైనా గుండెలో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది గుండెలయ దెబ్బతినటానికి కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు గుండె వైఫల్యం బారినపడ్డవారిలో కేఎల్‌ఎఫ్‌-15 లోపం ఉంటుండగా.. ఇది మరీ ఎక్కువగా గలవారిలో గుండె కొట్టుకునే వ్యవస్థలో మార్పులు కనబడుతున్నాయి. గుండెపోటు మరణాలను తగ్గించేలా కొత్త చికిత్సలు రూపొందించటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె వైఫల్యం బారినపడ్డవారికి మందులతో కేఎల్‌ఎఫ్‌-15 మోతాదు పెరిగేలా చేస్తే.. గుండెపోటు మరణాలను తగ్గించొచ్చని ఆశిస్తున్నారు.

Source : Medical updates.com/
  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 8, 2012

Chemical peels-awareness,కెమికల్‌ పీల్స్‌ - అవగాహన





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కెమికల్‌ పీల్స్‌ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చర్మం..మన శారీరక సంరక్షణకే కాదు.. మన సౌందర్యానికీ అదే చిరునామా. అందుకే చర్మం పట్ల ప్రతి ఒక్కరికీ అంత శ్రద్ధ! చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్‌ ప్రయత్నాల వరకూ రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. అయితే మార్గం ఏదైనా.. అది సశాస్త్రీయమైనదైతే ఇబ్బందులుండవు. వైద్యపరంగా సురక్షితమని నిరూపణ ఐన వాటినే ఆశ్రయిస్తే తర్వాత బాధలు పడాల్సిన పని ఉండదు. ముఖ సౌందర్యాన్ని కాంతివంతం చేసేందుకు ఇటీవలి కాలంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన 'కెమికల్‌ పీల్‌' విధానానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ రసాయనాలు చాలా శక్తిమంతమైనవి. కాబట్టి వీటితో వచ్చీరాని ప్రయోగాలు చేస్తే విపరిణామాలు తథ్యం. వీటిని శాస్త్రీయంగా, అనుభవజ్ఞుల చేత చేయించుకోవటమే ఉత్తమం.

మన చర్మం.. పైకి కనిపించేదంతా పాతదే! ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. కింది పొరల్లో నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా చర్మకణాలు పుట్టుకొస్తుంటాయి. అవి పుట్టుకొస్తున్నకొద్దీ.. పైచర్మం మనకు తెలియకుండానే పొట్టుపొట్టుగా రాలిపోతుంటుంది. ఇది నిరంతరం జరుగుతుండే ప్రక్రియే. సరిగ్గా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే.. పైచర్మం పైపైపొరలను తొలగించి.. చర్మానికి చక్కటి కొత్త నిగారింపును తెచ్చేందుకు వినియోగంలోకి దాదాపు వందేళ్ల క్రితమే వాడకంలోకి వచ్చిన ప్రక్రియ కెమికల్‌ పీల్స్‌! వైద్యరంగం కూడా దీనిపై రకరకాల అధ్యయనాలు చేసి.. సురక్షిత విధానాలను రూపొందించటంతో ఇటీవలి కాలంలో ఇది మరింత ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇలా చర్మం పైపొరలను తొలగించేందుకు వాడేవన్నీ కూడా రకరకాల సహజసిద్ధమైన పండ్లు, పదార్ధాల నుంచి తీసే ఆమ్లాలే. అయితే ఇవి చాలా శక్తిమంతమైనవి. అందుకే వీటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం.

  • 'పీల్స్‌' ఎందుకు?
వయసుతో గానీ, మొటిమల వల్లగానీ, రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల కానీ చర్మంలో మార్పులొస్తుంటాయి. కొన్నిసార్లు బాగా ఎండలో తిరిగినా కూడా ముఖం నల్లబడటం, ముసలితనం ఛాయలు వస్తాయి. ఈ మార్పులు ప్రధానంగా మన చర్మం మీది పైపొరల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. ఇలాంటి మార్పులను తొలగించి, చర్మానికి తిరిగి కొత్త నిగారింపు, మంచి ఛాయ తీసుకురావటానికి 'కెమికల్‌ పీల్స్‌' ఉపయోగపడతాయి. వీటితో మన చర్మం పైపొర (ఎపిడెర్మిస్‌)లో వచ్చే మార్పులను, అలాగే దాని కింది పొర- డెర్మిస్‌లో తలెత్తే మార్పులను కూడా తొలగించవచ్చు.

  • వందేళ్ల చరిత్ర
కెమికల్‌ పీల్స్‌కు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ సౌందర్యరాశి క్లియోపాత్ర (ఈజిప్టు) స్నానం చేయటానికి అప్పట్లో 'సోర్‌ మిల్క్‌' (విరిగిన పాలు) ఉపయోగించేదని చెబుతుంటారు. ఒక రకంగా దీన్ని 'పీలింగ్‌' అనుకోవచ్చు. ఈ సోర్‌ మిల్క్‌లో లాక్టిక్‌ ఆమ్లం ఉంటుంది. అందువల్ల క్లియోపాత్ర స్నానం చేసిన తర్వాత ఆమె చర్మం నిగనిగలాడినట్టు కనిపించేది. ఫ్రెంచి వాళ్లు కూడా వైన్‌ సీసాల అడుగున పేరుకునే పాత వైన్‌ని చర్మంపై రాసుకునేవారు. ఇందులో 'టార్టారిక్‌ ఆమ్లం' చర్మం పైపొరను తీసేసేందుకు ఉపయోగపడేది. ఇక ఆధునిక వైద్యంలోకి వస్తే- 1882లో పాల్‌ గెర్సన్‌ ఉన్నా అనే జర్మన్‌ వైద్యుడు సాల్సిలిక్‌ యాసిడ్‌, టార్టారిక్‌ యాసిడ్‌, ట్రైక్లోరో అసిటిక్‌ యాసిడ్‌, ఫైటిక్‌ యాసిడ్‌ వంటి వాటిని పీలర్లుగా ఉపయోగించటం ఆరంభించారు. అప్పట్నుంచి క్రమంగా వీటి వాడకం పెరుగుతూ వచ్చింది. ఆధునిక కాలంలో వీటిని కచ్చితంగా ఎంత మోతాదులో, ఎంత లోతు వరకూ చెయ్యచ్చన్నదంతా శాస్త్రీయంగా ప్రామాణీకరించటంతో వీటి వాడకం బాగా పెరిగింది.

  • ఇవెలా పని చేస్తాయి?
మన చర్మంలో ప్రధానంగా రెండు పొరలు ఉంటాయి. పైపొరను ఎపిడెర్మిస్‌ అంటారు, కింది పొరను డెర్మిస్‌ అంటారు. ఎపిడెర్మిస్‌లో కూడా మళ్లీ నాలుగు సూక్ష్మపొరలుంటాయి. వీటిలో పైపొరను 'స్ట్రేటమ్‌ కార్నియమ్‌' అంటారు. నిజానికిది మృత పొర (డెడ్‌ లేయర్‌). మనకు పైకి కనిపించే చర్మం ఇదే. మనకు తెలియకుండానే ఇది నిరంతరం ఊడిపోతుంటుంది. (వాతావరణంలో తేమ తగ్గిపోయే చలికాలంలో పొట్టులా ఊడిపోయేది ఈ పొరే). దీని స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది. ఎపిడెర్మిస్‌ అడుగుభాగాన ఉండే 'స్ట్రేటమ్‌ బేసల్‌' నుంచి కొత్త చర్మ కణాలు నిరంతరం పుట్టుకొస్తుంటాయి. దీంతో పాత చర్మం పోతూ కొత్త చర్మం వస్తుంటుంది. కెమికల్‌ పీల్స్‌ ఈ పై పొరను తొలగించి మచ్చలు, గుంతలను తొలగిస్తాయి. ఇవి చర్మం పొరను తొలగిస్తూ కణాల్లోని ప్రోటీన్లను ఓ మోస్తరు స్థాయిలో దెబ్బతీస్తాయి. దీంతో అక్కడి చర్మం చక్కగా తనను తాను పునరుద్ధరించుకుంటుంది. ముడతలు, నలుపు మచ్చలు, మొటిమల కారణంగా ఏర్పడే గుంతల వంటివన్నీ కూడా చాలా వరకూ ఈ పైపొరల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ పైపొరలు తొలగిపోయేలా చేసి.. మచ్చలు, గంతల వంటివన్నీ తొలగిపోయేలా చేయటం 'కెమికల్‌ పీలింగ్‌' లక్ష్యం. కెమికల్‌ పీల్‌ తొలగించిన పొర స్థానంలోకి 48 గంటల్లో కొత్త కణాలు వచ్చి చేరతాయి. క్రమేపీ కొత్తపొర ఏర్పడుతుంది. అక్కడ రక్తనాళాలు చురుకుగా మారి చర్మానికి రక్త సరఫరా మెరుగవుతుంది.

ఇక మన చర్మం లోపలి పొరల అడుగున చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచే 'కొల్లాజెన్‌ ఫైబర్స్‌', ఎలాస్టిక్‌ ఫైబర్స్‌ వంటివి ఉంటాయి. సాధారణంగా యవ్వన దశలో ఈ ఫైబర్లన్నీ సమాంతరంగా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి అడ్డదిడ్డంగా అవుతాయి. దీంతో చర్మం వదులు కావటం, ముడతలు పడటం వంటి మార్పులు కనిపిస్తాయి. మనం పీల్స్‌తో పైపొరను తొలగించిన తర్వాత ఇవి తిరిగి సద్దుకుంటాయి. నాలుగైదు నెలల్లో చర్మం బిగుతుగా అవుతుంది. ముడతల వంటివి తగ్గి, ముఖంలో కొత్త కళ, కాంతి వస్తాయి.

  • పీల్స్‌లో వాడేవేమిటి?
వివిధ రకాల ప్రకృతి సిద్ధమైన పదార్ధాలు, పండ్ల నుంచి తీసే ఆమ్లాలనే పీల్స్‌గా వాడతారు. వీటిని 'ఫ్రూట్‌ యాసిడ్లు' లేదా 'ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్‌'.. అంటారు. ఉదాహరణకు గ్త్లెకాలిక్‌ యాసిడ్‌ అన్నది చెరుకు నుంచి తీస్తారు. లాక్టిక్‌ ఆమ్లం పాల నుంచి గ్రహిస్తారు, మాండలిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండ్ల నుంచి వస్తుంది. సిట్రిక్‌ ఆమ్లం పుల్లటి పండ్ల నుంచి వస్తుంది. అయితే ఇవి పండ్ల నుంచి తీసేవే అయినా వీటిని శాస్త్రీయంగా తీసి, శుద్ధిచేసి, మోతాదులు ప్రామాణీకరించి వీటినీ మందుల్లాగానే తయారు చేస్తారు. కాబట్టి వీటికి మూలం పండ్లే అయినా.. మనం నేరుగా పండ్ల రసాలను వాడితే ఇంత సమర్థంగా పనిచేయవు. శాల్సిలిక్‌ ఆమ్లం, బీటాహైడ్రాలిక్‌ ఆమ్లం, ట్రైక్లోరో అసిటిక్‌ ఆమ్లం, ఆల్ఫా కీటో ఆసిడ్స్‌.. ఇవన్నీ వివిధ శాతాల్లో, మోతాదుల్లో లభిస్తాయి. జస్నర్‌ సొల్యూషన్‌, ఎల్లోపీల్‌ వంటివి వంటివి వివిధ ఆమ్లాల మిశ్రమాలు.

  • పీల్స్‌ ఎవరికి?
* హైపర్‌ పిగ్మెంటేషన్‌.. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అక్కడంతా నల్లగా అవుతుంది. అలాంటివాటికి ఉపయోగపడుతుంది.

* పొగలోకి, ఎండలోకి వెళ్లినవారికి పైచర్మం కమిలినట్లుగా నల్లగా తయారవుతుంది(ట్యానింగ్‌). వీరికి పీల్స్‌ ఉపయోగపడతాయి.

* ఎండలోకి వెళితే ముఖం మీద ఒకరకమైన కాఫీపొడిరంగు మచ్చలు (ఫ్రెకిల్స్‌, లెంటిజెన్స్‌ మొ||) వస్తాయి. వీటిని తొలగించటానికి ఉపయోగపడుతుంది.

* మొటిమలు.. చర్మం జిడ్డుగా ఉండే వారికి మొటిమలు ఎక్కువ. ఇలాంటి వారికి శాల్సిలిక్‌ యాసిడ్‌ పీల్స్‌ బాగా ఉపయోగపడతాయి. అయితే మొటిమలు బాగా ఉద్ధృతంగా ఉన్నప్పుడు మొటిమలకు చికిత్స తీసుకుంటూ దాంతో పాటే ఈ పీల్స్‌ చేయించుకోవచ్చు.

* గుంటలు.. మొటిమలు వచ్చి తగ్గిపోయాక అక్కడ మచ్చలు, గుంతలు ఏర్పడొచ్చు. అలాగే మొటిమలు గిల్లటం వల్ల కూడా మచ్చలు వస్తాయి. ఇక ఆటలమ్మ (పొంగు) వచ్చాక మచ్చలు కనబడొచ్చు. ఇలాంటి మచ్చలు, గుంటలు తొలగించటానికి పీల్స్‌ ఉపయోగపడతాయి.

* వృత్తి వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల ముఖానికి ముడతలు వచ్చి, వయసు మీదపడిన భావన కలుగుతుంటుంది. (ఫోటో ఏజింగ్‌). దీన్ని కూడా కెమికల్‌ పీల్స్‌తో బాగా తగ్గించుకోవచ్చు.

* కొందరికి ముఖంపై మంగు మచ్చలు (మెలాస్మా) వేదనకు గురి చేస్తుంటాయి. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఈ మంగు మచ్చలు రావొచ్చు. ఇవి అంత ప్రస్ఫుటంగా కనబడకుండా తగ్గించేందుకు కూడా పీల్స్‌ ఉపయోగపడతాయి.

* కొందరికి చెంపల మీద స్వేద రంధ్రాల వంటివి పెద్దపెద్దగా కనబడుతుంటాయి (ఓపెన్‌ పోర్స్‌). వీటిని ఇబ్బందిగా భావించేవారు పీల్స్‌లో తొలగింపజేసుకోవచ్చు.

లోతు కూడా ప్రధానమే!
సమస్యను బట్టి, పైచర్మాన్ని ఎంత లోతు వరకూ తొలగించాలన్నదాన్ని బట్టి ఏ రకం పీల్‌ వాడాలి, దాన్ని కూడా ఎంత గాఢతలో వాడాలన్నది వైద్యులు నిర్ధారిస్తారు. ఎండలో తిరిగి నల్లబడటం వంటివాటికి పైపైన పొరలు తొలగిస్తే చాలు.. దీనికి శాల్సిలిక్‌ ఆమ్లం వంటివి, 30, 40 శాతాల్లో వాడినా సరిపోతుంది. ట్రైక్లోరో ఎసిటిక్‌ ఆమ్లం వంటివీ ఉపయోగపడతాయి. మరీ లోతుగా వెళ్లేందుకు (డీప్‌ పీల్స్‌) కోసం ఫీనాల్‌ 88% వరకూ వాడతారు.

ఎక్కువగా ఆశించ కూడదు!
ప్రంపచ వ్యాప్తంగా ప్రజల చర్మాలను సాధారణంగా 6 రకాలుగా వర్గీకరించారు. ఇందులో మన భారతీయుల చర్మం 4వ రకం. కాస్త దక్షిణాదికి వచ్చిన కొద్దీ కొద్దిగా నలుపుదనం పెరుగుతూ 4 నుంచి 5వ రకం వరకూ వెళుతుంటుంది. 5వ రకం వరకూ పీల్స్‌తో రిస్కు తక్కువ. 6వ రకం నుంచీ అసలు పీల్స్‌ చెయ్యకపోవటం ఉత్తమం. బాగా నల్లగా ఉన్నవారికి పీల్స్‌తో రంగు రావటం మాట అటుంచి, క్రమేపీ నలుపుదనం మరింత పెరుగుతుంది. పీల్స్‌లోని రసాయనాలు కింది చర్మకణాలను, ముఖ్యంగా ఆ రంగునిచ్చే మెలనోసైట్‌ కణాలను బాగా ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి నల్లగా ఉండే వారికి పీల్స్‌ చేస్తే మరింత సమస్యలు ఎదురవుతాయి. జన్యుపరంగా, జన్మతః వచ్చే రంగును ఏదీ మార్చలేదు. కాబట్టి సహజంగా ఉన్న నలుపు రంగును మార్చుకోవాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు.

  • పీలింగ్‌కు ముందూ.. తర్వాతా..
* పీల్స్‌ చేయించుకోవటానికి రెండు వారాల ముందు నుంచీ సన్‌స్క్రీన్‌ లోషన్లు తప్పనిసరిగా వాడాలి. ఒక వారం ముందు రెటినాయిక్‌ యాసిడ్స్‌ వంటివి వాడి.. తర్వాత ఒక వారం ఖాళీ ఇవ్వాలి. వీటివల్ల చర్మం రంగు ముందుగానే కొంత తగ్గుతుంది, పీల్స్‌లో వాడే రసాయనం ముఖానికి రాసినప్పుడు అది లోపలికి అంతా సమానంగా వెళుతుంది. వీటినే 'ప్రైమింగ్‌ ఏజెంట్స్‌' అంటారు.

* పీలింగ్‌ సమయంలో ముఖం మీద ఎటువంటి వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉండకూడదు. గతంలో బొల్లి వంటివి ఉండకూడదు. ఆస్థమా చరిత్ర, అటోపిక్‌ డెర్మటైటిస్‌, సోరియాసిస్‌, ఎగ్జిమా, పొడి చర్మం వంటివారు పీల్స్‌కు వెళ్లకపోవటం ఉత్తమం. మధుమేహం, థైరాయడ్‌ వంటి సమస్యలతో పొడిచర్మం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ పీల్స్‌కు వెళ్లే ముందరే ఇటువంటి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవాలి. పీలింగ్‌ అశాస్త్రీయంగా ఎవరికివారే చేసుకోవటం ప్రమాదకరం.

ఎలా చేస్తారు?
పీలింగ్‌ రోజున ఉదయం నుంచీ నీరు బాగా తీసుకోవాలి. పీలింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా ఎక్కువగా ఎండ పడకుండా వెళ్లటం ఉత్తమం. తర్వాత పోల్చుకోవటానికి వీలుగా- ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టేటప్పుడే ఒక ఫోటో తీసుకుని అప్పుడు పీలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందు ముఖమంతా 'అసిటోన్‌'తో క్లీన్‌ చేస్తారు, దాంతో ముఖం మీద ఉండే జిడ్డు, దుమ్ము వంటివన్నీ పోతాయి. తర్వాత స్పిరిట్‌తో తుడుస్తారు. ఇది చర్మాన్ని శుభ్రం చెయ్యటంతో పాటు ఎక్కడన్నా బ్యాక్టీరియా వంటివి ఉన్నా తొలగిస్తుంది. ఆ తర్వాత జాగ్రత్తగా పీలింగ్‌ రసాయనాన్ని- నుదురు నుంచి మొదలుపెట్టి కళ్ల భాగం తప్పించి ముఖమంతా జాగ్రత్తగా రాస్తారు. పక్కనే 'టైమర్‌' పెట్టుకుని.. కచ్చితంగా ఎన్ని నిమిషాలు ఉండాలో అంతే సమయం ఉంచి.. వెంటనే.. దాని ప్రభావం పోగొట్టేందుకు 'న్యూట్రలైజింగ్‌ ఏజెంట్‌' రాసేస్తారు. ఇందుకోసం బాగా చల్లగా ఉండే నీరు లేదా కొన్నిసార్లు 'కార్బొనేట్‌' ద్రావణం కూడా వాడతారు. దీంతో పీలింగ్‌ రసాయనం ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత మాయిశ్చరైజింగ్‌ క్రీములు రాసుకోమని, తరచుగా సన్‌స్క్రీన్స్‌ రాసుకోమని సూచిస్తారు. ఎండలోకి వెళ్లకూడదు. ఇలా కనీసం ఐదారు దఫాలుగా చెయ్యాల్సి వస్తుంది. అప్పుడు గానీ పూర్తి ప్రభావం తెలియదు.

* పిగ్మెంటేషన్‌కు సాధారణంగా నెలకోసారి చొప్పున ఐదారుసార్లు చేసిన తర్వాత ఫలితాలు స్థిరపడతాయి. ఎండలోకి వెళుతూనే ఉంటాం కాబట్టి మళ్లీ కొంత పిగ్మెంటేషన్‌ పెరిగే అవకాశం ఉంటుది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మెలాస్మా వంటివి ఉన్నవారు ఆర్నెల్లకు, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే ఫలితాలు బాగుంటాయి.

ఉపయోగాలు
* ఇది సర్జరీలాంటి కోతలు, కుట్ల వంటి అవసరాలేమీ లేని తేలికపాటి ప్రక్రియ. చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు.

* గత 30, 40 ఏళ్లలో పీలింగ్‌ రసాయనాల విషయంలో ఎన్నో ప్రయోగాలు, అధ్యయనాలు చేశారు. భారతీయ చర్మానికి ఏవి సరిపోతాయి, ఏవి సరిపడవన్నది సశాస్త్రీయంగా గుర్తించి దానికి అనుగుణంగానే విధానాలనూ అభివృద్ధి చేశారు. కాబట్టి ఇవి ఇప్పుడు చాలా సురక్షితంగా మారాయి.

* పీలింగ్‌తో పైచర్మంలో మార్పులు వెంటనే కనబడతాయి, చర్మం పొట్టులా రాలిపోయి ఛాయ పెరుగుతుంది. ఇది తక్షణ ఫలితం అనుకుంటే కింది పొరల్లో మార్పులు మెల్లగా వస్తాయి. నలుపు, గుంటలు, ముడతలు తగ్గుతాయి. ఇంకా లోపలగా ఉండే కొల్లాజెన్‌, ఫైబర్స్‌ రిపేర్ల వల్ల ముసలి రూపు తగ్గి చర్మం బిగువుగా మారుతుంది.

* దీన్ని లేజర్లు, బొటాక్స్‌, స్కిన్‌ పాలిషింగ్‌, ఫిల్లర్ల వంటి వాటితో కలిపి చేసుకోవచ్చు.

రిస్కులు
* పీలింగ్‌ అనుభవజ్ఞులైన వైద్యులు సశాస్త్రీయంగా చేస్తే రిస్కులు తక్కువ. జాగ్రత్తలు తీసుకోకపోతే దీనితో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

* పీలింగ్‌ చేసిన తర్వాత సాధారణంగా ఐదారు రోజులకు పైచర్మం పొట్టురాలిపోతుందిగానీ.. పొడిచర్మం ఉన్న వారికి- వారంపది రోజులకు ఊడిపోవాల్సింది ముందే ఊడిపోవచ్చు.

*పీలింగ్‌ లోతుగా చేసినప్పుడు ఎండలోకి వెళితే ముఖమంతా కందినట్లుగా ఎర్రగా అయిపోవచ్చు.

* వైద్యులు చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోకపోతే- పిగ్మెంటేషన్‌ తక్కువ కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. ఇది రసాయనాన్ని బట్టి, లోతును బట్టి ఆధారపడి ఉంటుంది.

  • పరిమితులు
* ఇటువంటి సౌందర్య చికిత్సల గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ, వీటి నుంచి అవాస్తవికంగా, చాలా ఎక్కువ ఆశిస్తుంటారు. ఇది సరికాదు. వీటికి పరిమితులున్నాయి. శాస్త్రీయంగా ఎంత వరకూ సమంజసమో అంత వరకే చేయించుకోవాలి.

* కొందరు ఫలితాలు ఆశిస్తుంటారుగానీ వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించరు. పీలింగ్‌ చేయించుకోవటానికి ముందు వైద్యులు చెప్పినట్టుగా సన్‌స్క్రీన్‌ లోషన్లు, ప్రైమింగ్‌ అన్నీ కచ్చితంగా పాటించటం ముఖ్యం.

* చర్మం మీద దెబ్బలు తగిలినప్పుడు ఉబ్బెత్తు మచ్చలు (కీలాయిడ్స్‌) వచ్చే తత్వం ఉన్నవారు డీప్‌ పీల్స్‌ చేయించుకోకూడదు. అలాగే వృద్ధులకు చర్మం తిరిగి పూడుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వారికి 'డీప్‌ పీల్స్‌' అంత సమంజసం కాదు.
కంటిచుట్టూ వలయాలకూ!
కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలకు (డార్క్‌ సర్కిల్స్‌)కు 'ఆర్జినింగ్‌ పీల్స్‌' అందుబాటులోకి వచ్చాయి. వీటితో నల్ల వలయాలు బాగా తగ్గుతాయి. అయిత ఈ నల్ల వలయాలు రక్తహీనత, నిద్రలేకపోవం, జన్యుపరంగా, ఎండలోకి వెళ్లటం వల్ల కూడా రావచ్చు. కాబట్టి సరైన కారణాలన్నీ విశ్లేషించిన తర్వాతే, అవసరాన్ని బట్టే పీలింగ్‌ చెయ్యాల్సి ఉంటుంది


Article Courtesy with--Dr.Putta Srinivas ,Prof-Dermatology,Osmania Hos. Hyd.@Eenadu Sukhibhava
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Medicine update-ప్రేమ కాలం ఎంత?-How much is the life-span of Love?



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ప్రేమ కాలం ఎంత?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వాషింగ్టన్‌: మీరు ప్రేమలో ఉన్నారా? ఎవరితోనైనా ప్రతేక్య బంధం ఉందా? అది ఎంత కాలం ఉంటుందో తెలుసా? మీ రక్తంలో ఆక్సిటోసిన్‌ (ప్రేమ హార్మోన్‌) శాతం తెలుసుకుంటే అది తెలుస్తుందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రక్తంలో ఆక్సిటోసిన్‌ శాతం ఎక్కువ ఉన్న జంటలు చాలా కాలం కలిసి ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్‌కి చెందిన బార్‌-1 లాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవలే ప్రేమలో పడ్డ కొందరిలో ఈ హార్మోన్‌ శాతం ఎక్కువ ఉన్నవారు ఆర్నెల్ల తర్వాత కూడా తమ బంధం కొనసాగిస్తున్నారని.. తక్కువగా ఉన్న వారు విడిపోయారని 'లైవ్‌సైన్స్‌' పేర్కొంది. జంటల మధ్య వచ్చిన విభేధాలు తగ్గడానికి ఈ హార్మోన్‌ను ముక్కులోంచి స్ప్రే చేయడం ద్వారా విజయవంతమైనట్లు గత పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడికి గురైన జంటల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి ఆక్సిటోసిన్‌ చికిత్స అవసరమని... తాజా వివరాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. తల్లి, పిల్లల మధ్య పెనవేసుకొనే బంధంలోనూ ఈ హార్మోన్‌ ఉంటుందని, అయితే, ప్రేమ బంధం మొదలవుతున్న తొలినాళ్లలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Difference between Gastric Ulcer and Gastric Cancer,గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా.


  • image : Courtesy with http://gastriculcer.blogspot.in

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-నీరు తక్కువ తాగటం వల్లనో, లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి ఒక్కరు జీవితకాలంలో ఏదో ఒక దశలో అల్సర్‌కు గురవటం సహజమే. అందుకనే విద్యార్థులలో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాము. సాధారణంగా మూడు, నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్స్ అంతకంటే ఎక్కువగా ఉండి తరచుగా బాధిస్తూ ఉంటే ఎవ్వరినైనా అనేక అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నోటి పూతతో పాటు, పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఈసోఫీగల్ అల్సర్స్, కదలలేని పరిస్థితులలో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్, హెర్పిస్ వంటి ఎస్‌టీడీ వల్ల, ఈస్పీ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల జెనిటల్ అల్సర్లు, డయాబెటీస్ వల్ల కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లు, పెప్టిక్ అల్సర్లు ఎక్కువగా చూస్తూంటాము. చిన్న పేగు మెదట్లో ఉండే ఈ అల్సర్లను డుయోడినమ్ అల్సర్స్ అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత చాలా తక్కువగా క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది.

జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటారు. పెప్టిక్ అల్సర్ల కంటే ఇవి తక్కువగా కనిపించినప్పటికీ గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువ. అన్నవాహికలో అల్సర్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. నోటిపూతకు స్ట్రెస్, విటమిన్ల లోపం, బి విటమిన్ లోపిం ప్రధాన కారణమైతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన మిగతా అల్సర్స్‌కు హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం.

1980 వరకు అల్సర్‌కు మసాలా ఆహారం, కారం, ఒత్తిడి అనుకునే వారు, ఆల్కహాల్ వల్ల పోట్ట, పేగులకు సంబంధించిన పూతకు కారణాలు అనుకునే వారు. దాదాపు వంద సంవత్సరాల వరకు అల్సర్లకు కారణాలు అదే అనుకుని వీలైనంత వాటికి దూరంగా ఉండమని సలహాలు ఇచ్చే వారు. 1982లో టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే ఇద్దరు డాక్టర్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లకు కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు. దీనికి వారికి నోబెల్ బహుమతి ప్రధానం కూడా జరిగింది. మన జనాభాలో 90 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాక్టీరియాకు గురవుతూ ఉంటారు. కానీ ఒత్తిడి, ఎసిడిటి, పొగతాగడం, ఆల్కహాల్ వంటి కారణాల వల్లనో లేకవారి శరీరతత్వాన్ని బట్టి జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఉన్నపుడు వారికి ఈ బాక్టీరియా వల్ల అల్సర్లు ఏర్పడటం జరుగుతుంది. పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడే వారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. జీర్ణవ్యవస్థలో అల్సర్ ఉన్నవారికి కడుపులో నొప్పితో పాటు ఆకలి తగ్గడం, వికారం, వెక్కిళ్లు, తేన్పులు, మలంలో రక్తం పడటం, రక్తపు వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సాధారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అయితే ఈ లక్షణాలు అల్సర్ ఏ స్థాయిలో ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. మెదటి దశలో కడుపులో మంటగా ఉండటం ఏమైనా తినగానే కొంచెం సేపు తగ్గి, తర్వాత కొద్దిసేపటికి మళ్లీ కడుపులో ఇబ్బందిగా ఉండటం జరుగవచ్చు. రెండు వారాలు యాంటి బయాటిక్ మందులు వాడటం వల్ల ఈ అల్సర్ పూర్తిగా నయమవుతుంది.

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్స్‌లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. స్టమక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్. అందుకే ఒకసారి అల్సర్ వచ్చి తగ్గినవారు రెండోసారి అలాంటి లక్షణాలు కనిపించినా అల్సర్‌కు వాడిన మందులు వాడి తర్వాత తగ్గటం లేరదని డాక్టర్‌ను సంప్రదించడం జరుగుతుంది. అందుకనే ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేసి అనుమానంగా ఉంటే సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ పరీక్షలు చేసి స్థాయిని నిర్థారిస్తారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ చికిత్స కూడా కణితి వచ్చిన ప్రదేశం, క్యాన్సర్ స్థాయి, వయసు, ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటాయి. పొట్టలో కణిత వచ్చిన ప్రదేశాన్ని బట్టి పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి గ్యాస్ట్రెక్టమీ లేక పొట్టని మొత్తంగా తీసివేయటంతో పాటు చుట్టు ఉన్న లింఫ్‌నోడ్స్, చిన్న పేగులో కొంత భాగాన్ని అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేయటం జరుగుతుంది.

క్యాన్సర్‌ను కొంచెం ఆలస్యంగా గుర్తించినపుడు పొట్ట మొత్తాన్ని తీసివేసి అన్నవాహికను చిన్న పేగులతో కలిపి వేస్తారు. సర్జరీ తర్వాత ఆహారం తీసుకోలేక పోవడం, వాంతులు, వికారం, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీ ముందు చేసి తర్వాత కీమో, రేడియో థెరపీలు ఇచ్చినా లేక కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత సర్జరీ చేసినా ఈ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ విషయంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ సర్జరీ తర్వాత సప్లిమెంట్లు, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12 ఇంజక్షన్ల అవసరం చాలా ఎక్కువ. పొట్టని తీసివేసినపుడు ఆహారం నేరుగా చిన్నపేగులలోకి వెళ్లటం వల్ల డంపింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఆహారం తక్కువగా, ఎక్కువ సార్లు తీసుకోవడం ఆహారం ముందు తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవటం వంటి అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను మరీ లేటుగా గుర్తించడం జరిగి కణితి ఆహారం తీసుకోవడానికి అడ్డంకుగా ఉన్నపుడు, లేజర్ థెరపి, రేడియేషన్ థెరపీలలో కణితిని చిన్నగా చేసి పేగులలో స్టంట్‌ను అమరుస్తారు. మెటల్ లేక ప్లాస్టిక్‌తో తయారయిన ఈ ట్యూబ్ ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళుతుంది. కాని ఇలాంటి పరిస్థితులు ఏర్పడినపుడు, క్యాన్సర్ మరీ ముదిరి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో అంత ప్రస్ఫుటంగా ఉండవు. అనుమానించేంత స్థాయిలో లక్షణాలు బయట పడ్డాయి అంటే క్యాన్సర్ స్థాయి పెరిగిందని అనుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపితంగా దాదాపు 8 లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు.

-హెలికో బ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా దాదాపు 60 -80 శాతం వరకు ఈ క్యాన్సర్‌కు కారణం. ఇంకా స్మోకింగ్, మద్యం, జన్యుపరమైన కారణాలు దోహదపడ్తాయి. కాబట్టి అల్సర్‌కు సరియైన చికిత్సలు తీసుకోవడం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తాజాగా ఉండే ఆహారం పరిశువూభమైన నీరు తీసుకోవడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కడుపుబ్బరం, తేన్పులు, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే ఎవరికి వారు యాంటాసిడ్లు వాడటం కాకుండా ఒకసారి డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపి చేయించుకోవడం మంచిది.

కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి ఇలాంటి లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడ అందరూ ఎదుర్కొనేవే అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తున్నా సరియైన పరీక్షలు, అవసరమైన మందులు వాడటం తప్పనిసరి అని అర్థం చేసుకోవడం మంచిది.


Article : Courtesy with Dr.Ch.Mohana Vamsy @NamastheTelangana.com

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఎముకల్లో కణితులు,bone-cancer



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎముకల్లో కణితులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కణవిభజనపై అదుపు తప్పి అసాధారణంగా కణాలు పెరగడం వల్ల వాపులా కనిపించే భాగాన్నే కణితి అంటారు. ఈ కణుతులు అన్నీ క్యాన్సర్‌వే కానక్కర లేదు. కొన్ని హానికరం కానివి కూడా ఉంటాయి. వీటిని బినైన్ ట్యూమర్లు అంటారు. ఇవి ఏర్పడిన చోట మాత్రమే ఉంటాయి. ఇతర భాగాలకు వ్యాపించవు. అందుకే బినైన్ కణుతుల వల్ల ప్రమాదం ఉండదు. మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. వీటినే క్యాన్సర్ కణుతులు అంటాం. ఈ కణుతులు అవి పుట్టిన భాగాన్ని దెబ్బతీయడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి అక్కడి కణాలకు కూడా హాని చేస్తాయి. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.మాలిగ్నెంట్ కణుతులు ఎక్కడ పుట్టాయన్నదాన్ని బట్టి క్యాన్సర్లు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు సార్కోమా, కార్సినోమా, లుకేమియా. ఎముక కణజాలంలో కూడా రొమ్ములు, ప్రొస్టేట్, థైరాయిడ్, కిడ్ని, ఊపిరితిత్తుల మాదిరిగానే కణాలలో లాగే విభజన చాలా త్వరగా జరిగి త్వరగా వ్యాపిస్తుంది. ఎముకలో ఏర్పడే ట్యూమర్లు చాలా సందర్భాల్లో క్యాన్సర్ ట్యూమర్లు కాకపోవచ్చు. ఎముకలో ఏర్పడిన క్యాన్సర్ కణాలతో ఏర్పడిన ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. ప్రైమరీ ట్యూమర్లు, సెకండరీ ట్యూమర్లు. ప్రైమరీ ట్యూమర్లను సార్కోమా అంటారు. సెకండరీ ట్యూమర్లు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలేవీ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు.త్వరగా వ్యాప్తి చెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువల్ల ఎముక బలహీన పడి విరిగి పోవడానికి కారణమవుతాయి. చాలా త్వరగా పెరిగే ఈ ట్యూమర్ల వల్ల ముఖ్యంగా లక్షణాలు కనిపించనపుడు లేదా కనిపించిన చిన్న లక్షణాలు కూడా అశ్రద్ధ చేసినపుడు అంగవైకల్యం ఏర్పడవచ్చు, అప్పుడప్పుడు మరణం కూడా సంభవించవచ్చు.

రకాలు :
ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా సామాన్యంగా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

లక్షణాలు :
సాధారణంగా ఇతర శరీర భాగాలలో కాన్సర్లు ఏర్పడినపుడు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. ఏర్పడినట్టు తెలిసేసరికే చాలా వరకు పరిమాణంలో పెద్దగా పెరిగిపోయి ఉంటాయి. కానీ ఎముకలో ట్యూమర్ ఉన్నపుడు సాధరణంగా కనిపించే లక్షణాలు వాపు, నొప్పి. కొన్ని సార్లు కాళ్లు చేతులు కదల్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో ఎముకలో క్యాన్సర్ ఎముక విరగటం ద్వారా బయటపడుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా ఏర్పడిన చిన్న కణితి పెరిగే కొద్దీ దాని పరిసరాల్లో ఉన్న నాడులు, కండరాల మీద ఒత్తిడి పెంచడం వల్ల వాపు, నొప్పి రావడం ప్రారంభమౌతుంది.

పరీక్షలు :

ఎముక క్యాన్సర్‌ను నిర్ధారించడానికి చాలా రకాల పరీక్షలు అంచెలంచెలుగా నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి
- పేషెంట్ పూర్తి ఆరోగ్య వివరాలు, ఏవైనా ఇతర సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు
- రక్తపరీక్షలు
- ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు
- బయాప్సీ : ఇది ఒక చిన్న సర్జరీ వంటి పరీక్ష. క్యాన్సర్‌గా భావిస్తున్న కణితి నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపుతారు.

క్యాన్సర్ స్థాయి :
ఏ క్యాన్సర్ చికిత్సలోనైనా క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాధి ప్రారంభమైన చోటనే ఉందా లేక ఇతర అవయవాలకు వ్యాపించిందా అనే దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఎముక క్యాన్సర్‌లో క్యాన్సర్ స్థాయి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ఛాతి, ఎముకలకు సీటీ స్కాన్, కొన్ని సార్లు పెట్ స్కాన్ అవసరముంటుంది. 90 శాతం ఎముక క్యాన్సర్లు ఇతర ఎముకలకు, ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

చికిత్స :
-ఎముక క్యాన్సర్ చికిత్సలో ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు డాక్టర్లు కూడా టీమ్‌గా కలిసి పనిచెయ్యాల్సి ఉంటుంది. ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేసి క్యాన్సర్ కణితికి చికిత్స చేస్తే, మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ద్వారా, రేడియాలజీ ఆంకాలజిస్ట్ రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ అన్ని చికిత్సల ద్వారా క్యాన్సర్‌కు చికిత్స అందించడమే కాదు ఎముక నష్టాన్ని కూడా నివారిస్తారు.

చికిత్సలో చేసే సర్జరీల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి పద్ధతిలో క్యాన్సర్ వచ్చిన ప్రదేశంలోని అవయవాన్ని కాపాడడానికి చేసే సర్జరి. ఇందులో కేవలం క్యాన్సర్ కణితిని మాత్రమే తొలగించి, ఎముక నష్టాన్ని నివారించడానికి కావల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అవయవాన్ని కాపాడతారు. దీనిని లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటారు.కొన్నిసార్లు వ్యాధి ముదిరిపోవడం వల్ల అవయవాన్ని కాపాడలేకపోతారు. అటువంటి సందర్భాల్లో ప్రాణాలు కాపాడడానికి ఆ అవయవాన్ని తొలగిస్తారు. దీన్ని ఆంప్యు అంటారు.
సర్జరీ, కీమో, రేడియోథెరపీలతో చికిత్స పూర్తయిందనుకుంటే అది తప్పే అవుతుంది. చికిత్స అనంతరం క్రమం తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించడం, అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం ఎందుకంటే పూర్తిగా నయమైందని అనుకున్న వారిలో క్యాన్సర్ తిరగబెట్టవచ్చు. కాబట్టి డాక్టర్ అవసరం లేదని చెప్పే వరకు తరచుగా డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

క్యాన్సర్ కానీ ట్యూమర్లు చాలా రకాలుగా ఉండవచ్చు. మృదువైన కణజాలాల్లో ఏర్పడే ట్యూమర్లు చాలా వరకు ఎముకలో వచ్చే ట్యూమర్లలాగానే కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ ట్యూమర్లు కావచ్చు, కాక పోవచ్చు.
క్యాన్సర్ కానీ కణితుల్లో సాధరణంగా కణితి ఏర్పడిన ప్రాంతంలో సర్జరి చేసి కణితి తొలగించడం ద్వారా ఎముక లేదా కీలు నష్టాన్ని నివారించవచ్చు. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత తేలికవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్లు మళ్లీమళ్లీ రావచ్చు. ఏది ఏమైనా సరియైన సమయంలో గుర్తించిన ట్యూమర్లకు చికిత్స సలభంగానే చేయవచ్చు.

-- Article : courtesy with Dr.Kishore @ Namasthe Telangana.com
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, May 7, 2012

Deafness in Children leads to Dumb,పసిపిల్లలో వినికిడిలోపము మూగకు దారితీయును


  • image : courtesy with Namaste Telangana.com/.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పసిపిల్లలో వినికిడిలోపము మూగకు దారితీయును - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిలిచిన వెంటనే పలకకపోయినపుడు ముందు చిన్నారికి వినబడుతుందో లేదో అన్న ఆలోచన రావాలి. కొంచెం పెద్దపిల్లలైతే వినబడటం లేదని చెప్పగలుగుతారు. కానీ పసిపిల్లల్లో లోపాన్ని గ్రహించాల్సింది పెద్దవాళ్లే. ఇప్పుడు వినలేకపోతే భవిష్యత్తులో మాట్లాడలేరు కూడా. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల పెరుగుదల, మానసిక వికాసం, వినికిడి శక్తి, మాటలు నేర్చుకోవడం, మాట్లాడటం మొదలైనవన్నీ ముఖ్యంగా తల్లిదండ్రు లపై ఆధారపడి ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం అనుమానం కలిగినా చెవిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయ్యేందుకు చెవి, వినికిడికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. శబ్దాన్ని గ్రహించే శక్తి కొరవడటాన్ని లేదా శబ్దాన్ని అసలు వినలేకపోవడాన్ని చెవుడు అంటారు. కచ్చితంగా ఈ కారణంగా చెవుడు వచ్చిందని అన్ని సందర్భాల్లోనూ చెప్పడం కష్టం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు వినగలిగిందే తిరిగి మాట్లాడగలుగుతారు. అమ్మమ్మ, తాతయ్య ల్లాంటి వారు చెప్పే చిన్న చిన్న మాటలు తిరిగి చెప్పలేకపోతున్నారని గమనించకపోతే వారు మాటలు కూడా నేర్చుకోలేరు. ఎంత త్వరగా, ఎంత చిన్న వయసులో పిల్లలు వినటం లేదో వారి వినికిడి శక్తి ఎంత కొరవడిందో తెలుసుకుని వెంటనే వారికి వినబడేట్టు చేయడం వల్ల వారు మాట్లాడగలిగేట్టు చేయవచ్చు. వినికిడి శక్తి మాట్లాడ్డంపై ప్రభావం చూపిస్తుంది. వినికిడికి మాట్లాడటానికి అవినాభావ సంబంధం ఉంది. చిన్న పిల్లల్లో మాట్లాడటం రాని వయసులో వినికిడి లేదంటే వారికి మాట్లాడటం కూడా రాదు.తల్లిదండ్రులు ఎంత త్వరగా పిల్లలకు వినబడటం లేదో గ్రహించి, అంత త్వరగా ఇఎన్‌టి స్పెషలిస్టును కలిసి వినికిడి పరీక్ష చేయించడం అవసరం.

  • చెవుడు.. రకాలు
శబ్దం లోపలికి చేరకపోవడం వల్ల వచ్చే చెవుడును కండక్టివ్ చెవుడు (కండక్టివ్ హియరింగ్ లాస్) అంటారు. కొన్నిసార్లు బయటిచెవి, చెవినాళం, మధ్యచెవి బాగానే ఉంటుంది. శబ్దం కూడా ప్రసారం అవుతుంటుంది. కానీ ఆ శబ్దాన్ని లోపలి చెవి వినికిడి నరం, మెదడు గ్రహించలేకపోవడం వల్ల చెవుడు వస్తుంది. దీన్ని నరం చెవుడు (సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్) అంటారు.

  • చిన్నారుల్లో చెవుడుకు కారణాలు..
- కొందరిలో పుట్టుకతోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడిన మందులు, ఇన్‌ఫెక్షన్లు, పిండం అభివృద్ధి చెందడంలో మార్పులు రావడం లాంటి కారణాల వల్ల లోపాలతో పుట్టవచ్చు.
- రుబెల్లా, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, సిఫిలిస్ (తల్లిదంవూడుల ద్వారా సంక్రమించే వ్యాధి), హెర్పిస్ సింప్లెక్స్, గవదబిళ్లలు, తట్టు, మెదడువాపు లాంటి ఇన్‌ఫెక్షన్లు,
- స్ట్రెప్టోమైసిన్, ఫ్రూసిమైడ్, జెంటామైసిన్ లాంటి మందులు,
- రేడియేషన్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు, ప్రసవ సమయంలో హైపోక్సియా, హైపర్‌బిలిరూబినిమియా (తల్లిదండ్రుల రక్తం సరిపడని కారణంగా వచ్చే వ్యాధి), -అతితక్కువ బరువుతో (15 వందల గ్రాముల కన్నా తక్కువ) పుట్టడం,
- తల, మెడ, చెవి సరిగ్గా ఉండాల్సిన రీతిలో లేనప్పుడు ,
- కుటుంబంలో ఎవరికైనా చెవుడు ఉండటం ,
- డౌన్స్ సిండ్రోమ్, మార్‌ఫాన్స్ సిండ్రోమ్, గోల్డెన్ హార్స్ సిండ్రోమ్, పియరీ రాబిన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుసంబంధ వ్యాధులు చెవుడుకు కారణమవుతాయి.
- ఆస్టియోజెనిసిస్ ఇంపర్‌ఫెక్టా, ఆస్టియోస్క్లీరోసిస్ లాంటి ఎముకల వ్యాధి వల్ల చెవిలోని ఎముకల గొలుసులో కంపనాలు ఏర్పడవు. దానివల్ల శబ్దం లోపలి చెవికి చేరదు.
- సెక్రిటరీ డైటిస్ మీడియా వల్ల మధ్యచెవిలో నీరు లేదా జిగురు లాంటి పదార్థం చేరుతుంది. శబ్ద ప్రకంపనాలు లోపలి చెవికి అందక సరిగ్గా వినపడదు.
- వెలుపలి చెవి లేదా మధ్యచెవిలో గానీ ఇన్‌ఫెక్షన్ వల్ల చీము చేరి రంధ్రం ఏర్పడుతుంది. తద్వారా వినికిడి శక్తి దెబ్బతింటుంది.
- చెవికి దెబ్బలు తగిలినప్పుడు సాధారణంగా కర్ణభేరి పగిలిపోవడమో, ఎముకల గొలుసు అస్తవ్యస్తం కావడమో జరుగుతుంది. తల ఎముకలు చిట్లిపోవచ్చు. ఇలాంటప్పుడు వినికిడి పోతుంది.
- గింజలు, పూసలు, పుల్లల లాంటివి పిల్లలు తెలియక చెవిలో పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా వినికిడి పోయే ప్రమాదం ఉంది.

  • పరిష్కారాలు...
వెలుపలి చెవి పూర్తిగా లేని పిల్లల్లో మధ్యచెవి, లోపలి చెవి సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందు పరిశీలిస్తారు. అవి బాగానే ఉంటే ప్లాస్టిక్ సర్జన్, ఇఎన్‌టి సర్జన్ కలిసి బయటిచెవిని, చెవినాళాన్ని కృత్రిమ పదార్థాలతో గానీ, శరీరంలోని ఇతర పదార్థాలతో గానీ రూపొందించి శబ్దం మధ్యచెవికి అందేవిధంగా చేస్తారు. తద్వారా వినగలుగుతారు. చెవిలో పెట్టుకునే గింజలు, పూసలు, పిన్నులు, దూది, స్పాంజి, పెన్సిల్ ముక్కలు, లేదా కీటకాలు చేరడం వల్ల వినికిడి తగ్గిపోతు ముందుగా కర్ణభేరికి అపాయం కలుగకుండా వాటిని బయటకు తీస్తారు. ఇలాంటప్పుడు ఏమాత్రం అజాక్షిగత్తగా ఉన్నా వినికిడి శక్తి మొత్తం పోవచ్చు.
చెవిలో ఇన్‌ఫెక్షన్లు చేరినప్పుడు సకాలంలో మందులు వేయడం, డ్రెస్సింగ్ చేయడం జరగాలి.
కొన్నిసార్లు చెవిలో అదనంగా కండరాలు పెరుగుతాయి. వీటిని మైక్రోసర్జరీ ద్వారా తొలగిస్తే వినకిడి శక్తి వస్తుంది. ఆటోస్క్లీరోసిస్ లాంటి వ్యాధి వల్ల చెవిలోని ఎముకలు బిగుసుకుపోయినప్పుడు, చెవిలో రంధ్రం పడినప్పుడు కూడా మైక్రోసర్జరీ అవసరం అవుతుంది. మధ్యచెవిలో నీరు చేరితే (సెక్షికిటరీ ఓటైటిస్ మీడియా) ఆ ద్రవాన్ని కర్ణభేరి ఆపరేషన్ ద్వారా బయటకు తీసేస్తారు. ఆపరేషన్ తరువాత మళ్లీ నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం వరకు కర్ణభేరిలో ఒకరకమైన బటన్‌ను ఉంచుతారు. దీనివల్ల మధ్యచెవిలో తయారయ్యే ద్రవం బయటకు వెళ్లిపోతుంది. దీన్ని మెరింగాటమీ, గ్రొమెట్ ఆపరేషన్ అంటారు. కొన్నిసార్లు ఈ సర్జరీ చేసినా చెవిలో ద్రవం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ కారణాన్ని పరీక్షించి తదనుగుణమైన చికిత్స అందించాలి. మధ్యచెవిలో ద్రవం ఏర్పడటానికి యూస్టేషియన్ నాళానికి సంబంధించిన వ్యాధులు, ఎడినాయిడ్స్, ముక్కు వెనకాల ఉండే టాన్సిల్స్ లాంటి కండరాలు, సైనసైటిస్, టాన్సిల్స్,క్లఫ్ పాలెట్ మొదలైనవి ముఖ్యమైన కారణాలు. వీటన్నింటినీ సర్జరీ ద్వారా సరిచేయవచ్చు.

  • ఎలా తెలుసుకోవాలి...?
పుట్టగానే..
మోరోరిఫ్లెక్స్ లేదా స్టార్టల్ రిఫ్లెక్స్ - పెద్దశబ్దం విన్నప్పుడు ఏడుస్తారు.
3 నెలలు...
శబ్దం విన్నప్పుడు కాళ్లూచేతులు ఆడిస్తూ ఆడుకునే పిల్లలు కదలిక లేకుండా ఆగిపోవడం లేదా కళ్లు మూసుకోవడం, భృకుటి ముడుచుకోవడం
5వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు కళ్లు తిప్పడం
6వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు తల తిప్పడం
7 నుంచి 9 నెలలు...
శబ్దం చేస్తే అది ఎటువైపు నుంచి వస్తోందో సరిగ్గా గుర్తించడం
18వ నెలలో..
మనం అడిగే ప్రశ్నలు విని అన్నింటికి సమాధానాలు ఇవ్వడం. ఉదా.. ముక్కు, పిల్లి ఎక్కడ.. అంటే చేతితో చూపించడం ఇలా శబ్దం వచ్చినప్పుడు ఒక్కో వయసు పిల్లలు ఒక్కోలా స్పందిస్తారు. ఆ స్పందన సరిగ్గా ఉందా లేదా అన్న విషయాన్ని బట్టి వినికిడి శక్తిని అంచనా వేయవచ్చు. ఇవే కాకుండా విజువల్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ టెస్టు, కండిషనింగ్ ఆడియోమెట్రీ, స్పీచ్ పరీక్షలు, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఇవోక్ట్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు.


Courtesy with : Dr.Anil Vasireddy , MS-ENT(Sai ENT hos.Hyd.)

  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, May 6, 2012

పిల్లల్లో క్యాన్సర్లు-అవగాహన ,Cancers in Children-Awareness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లల్లో క్యాన్సర్లు-అవగాహన ,Cancers in Children-Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ఆడుకునే పసివూపాయం, అభం శుభం తెలియని అమాయకత్వం క్యాన్సర్ అనే పదానికి అర్థమే తెలియని బాల్యం కానీ ఇవేమీ క్యాన్సర్‌కు అడ్డుకాదు. పెద్దవారిలో వచ్చే అన్ని క్యాన్సర్లు పిల్లల్లో వచ్చే ప్రమాదం ఉన్నా కొన్ని క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి రక్త సంబంధిత క్యాన్సర్లు(లుకేమియా) మెదడులో వచ్చే కణితులు బెయిన్ ట్యూమర్లు) లింఫోమా, సాఫ్ట్‌టిష్యు సార్‌కోమా, పిల్లల్లో క్యాన్సర్ ఎటువంటి లక్షణాలు కలిగించకుండానే అకస్మాత్తుగా జ్వరం వంటి లక్షణాలతో బయటపడవచ్చు. ఎన్నివిధాలుగా ఆలోచించి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఒకరిని లేదా ఇద్దరిని అపురూపంగా పెంచుకునే తల్లిదండ్రులకు పాపకో బాబుకో క్యాన్సర్ అని తెలియగానే ఎంతో తల్లడిల్లి పోతారు. తీవ్రమైన మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. కాని కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే పిల్లల్లో క్యాన్సర్స్ చాలా వరకు పూర్తిగా నయం చేయదగినవే.

చిన్నపుడు 20 గ్రేల కంటే అధిక రేడియేషన్‌కు గురయినా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గ్రే అంటే శరీరం గ్రహించిన రేడియేషన్ అని అర్ధం. మామెక్షిగామ్ వంటి పరీక్షలు మరీ చిన్న వయసులో చేయించుకోవడం కూడా అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటే మంచిది.

పీడియాట్రిక్ క్యాన్సర్ చాలా వరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్ భయపడి థెరపీకీ సహకరించకపోతే ఒక్కోసారి వారికి మత్తు ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాలు పైబడ్డాక అమ్మాయికి గాని అబ్బాయికి కాని క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ వల్ల పునరుత్పతత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. అనుకుంటే ముందుగానే వారి అండాలను వీర్యకణాలను తీసి భద్రపరుస్తుంటారు.

పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ లుకేమియా. ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడే తెల్లరక్త కణాలను అడ్డుకొని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలాగ ఒక్కసారిగా జరగటం కాని లేదా దీర్ఘకాలికంగా కానీ జరగవచ్చు. చాలా వరకు నయం చేయగలిగే ఈ క్యాన్సర్‌కు చికిత్సలు కీమోథెరపీ, రేడియోథెరపీలతో ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాం స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదట బిడ్డకు రక్త సంబంధిత క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పిల్లలు పాలిపోయినట్లు ఉండడం, ఆకలి, బరువు తగ్గడం నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలు మచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తవూస్రావం, ఒంటినొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగను(bone marrow) పరీక్షించటం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు.

పెద్దవారిలో కంటే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువని చెప్పుకోవచ్చు. పొద్దునే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారటం, ఆందోళన, ఫిట్స్, చూపు, మాట మందగించటం వంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. క్యాన్సర్ కణితి అయినా కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీ చేయవచ్చు లేదా ఇతర ట్రీట్‌మెంట్స్ చేస్తే మంచిదా అని నిర్ణయిస్తారు. ఒక్కొక్కసారి మెదడు కణితిని రేడియోసర్జరీతో తొలగిస్తారు. నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్రపోషించే లింఫ్ నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హార్జ్‌కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జ్జల్లో, లింఫ్‌నాళాలు వాయటం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రుళ్లు చెమట, దగ్గు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం మొదలగు లక్షణాలతో లింఫోమాలు బయట పడుతుంటాయి. ఇతర టిష్యూలకు కలిపే సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌ను సాఫ్ట్‌టిష్యు సార్‌కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ లక్షణాలు వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండడం వల్ల తొలి దశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్‌టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌కు ప్రధానంగా సర్జరీ, తర్వాత లేదా ముందు అవసరాన్ని బట్టి రేడియో, కీమో థెరపిలుంటాయి. అండాలలో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో ఎక్కువ.

రెండు ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లల్లో అడ్రినల్ గ్రంథిలో, మెడ, ఛాతి, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణితలు బ్లాస్టోమాలు, ఎముకలు టిష్యూలలో వచ్చే ఈవింగ్ సార్కోమా, మూత్రపిండాలలో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా, పిల్లల్లో ఎక్కువగా కన్పించే క్యాన్సర్స్. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగే ఈ క్యాన్సర్లు పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం నయం చేయడం కష్టతరం అవచ్చు. పిల్లల్లో అరుదుగా కన్పించే మిగతా క్యాన్సర్స్ అదుపులో రావటం కష్టం కావటం, ఎంత ప్రయత్నించిన చికిత్సకు లొంగకపోవటం జరగవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు సంబంధమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్స్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉంటే రెండో వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలను గుర్తించి సరియైన ట్రీట్‌మెంట్స్ అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, ట్రీట్‌మెంట్స్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి.


Courtesy with : Dr.Ch.Mohana Vamsy- chief surgical Oncologist , Omega hospitals , Hyderabad.A.P_India.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, May 5, 2012

Medicinr updates in telugu-మధుమేహులు బరువు తగ్గితే గుండెపోటు దూరం.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మధుమేహులు బరువు తగ్గితే గుండెపోటు దూరం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-

మధుమేహంతో బాధపడుతున్న వూబకాయులు ఆరు కిలోల బరువు తగ్గినా మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో రక్తనాళాలు గట్టిపడటం 20% తగ్గుతున్నట్టు.. ఈ మేరకు గుండె పోటు ముప్పూ దూరమవుతున్నట్టు బయటపడింది. మిగతావారికన్నా మధుమేహలకు గుండెజబ్బు ముప్పు ఆరు రెట్లు ఎక్కువ. మధుమేహుల్లో 68% మరణాలకు ఇదే కారణమవుతోంది కూడా. ఇందుకు ప్రధానంగా రక్తనాళాలు గట్టిపడే (అథెరోస్క్లెరోసిస్‌) సమస్య దోహదం చేస్తుండటం గమనార్హం. వాపు, రోగనిరోధక ప్రతిస్పందనతో ఈ సమస్య నేరుగా ముడిపడి ఉన్నట్టు గార్‌వన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి, సెయింట్‌ విన్సెంట్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు తాజాగా నిరూపించారు. ఇలాంటి అధ్యయనం ఇదే తొలిసారని చెప్పారు.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, May 2, 2012

Facing of Medical emergency, వైద్యం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం , మెడికల్ ఎమర్జెన్సీ ని ఎదుర్కోవడము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Facing of Medical emergency, వైద్యం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం , మెడికల్ ఎమర్జెన్సీ ని ఎదుర్కోవడము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వైద్యము లో ప్రతి రోగము వెంటనే నయము చేసుకోవడము అవసరమే అయినా... కొన్ని వ్యాదులు వెంటనే తగిన చికిత్స చేయకపోతే ప్రాణాలు పోతాయి లేదా జీవితాంతము బాధతోను , ఆ జబ్బుతోను , ఆ జబ్బు మిగిల్చే శేషాలతోను బ్రతకవలసి ఉంటుంది . ఆ కోవలో ముఖ్యమైనవి ....
  • గుండె పోటు(Heart attack) ,
  • పక్షవాతము (Paralysis),
  • కాలిన గాయాలు(Burns) ,
  • శ్వాసించడము లో ఇబ్బంది (ఉబ్బసము - Asthma),
  • పాముకాటు (snake bite)

గుండెపోటు--
అంటురోగాలు , ఇతర రొగాలకన్నా గుండె జబ్బులు ప్రమాదకరమైనవి . తక్షణము వైద్య సహకారము అవసరమైనవి . నేడు సాధారణ గుండెజబ్బులను గుండెపోటు , గుండె ఆగిపోవడము , ఎక్యూట్ మయోకార్డియల్ ఇంఫ్రాక్షన్‌ అంటాము . శరీరము లో అంగాలన్నింటిలో కీలకమైనది గుండె . శరీర భాగాలన్నింటికి అవసరమైన రక్తాన్ని సమర్ధవంతము గా పంప్ చేసే అంగం గుండె .అటువంటి గుండెకండరాలకు తగినంత ఆక్షిజన్‌ సరఫరా అవనపుడు క్రమముగా గుండె కండరాలు దెబ్బతిని తెలియకుండానే గుండెపోటు తెస్తుంది .
  • గుండె పోటుకు కారణాలు :
ముఖ్యమైనవి -- ఎథెరొస్క్లిరోసిస్ , ఆర్టీరియో స్క్లిరోసిస్ , రక్తనాళాలలోపల ఏర్పడిన గార (ఎథిరోమ ). నస్టపరిచే ఇతర కారణాలు -- పొగతాగడము , హైపర్ లిపిడీమియా , ఒత్తిడి , అధిక స్థాయి కొలెస్టిరాల్ , అధిక రక్తపోటు , మధుమేహము , భారీకాయము .

లక్షణాలు : గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ కు హెచ్చరిక చాతి నొప్పి . ఆ నొప్పి సాధారణము గా పిండినట్లు గా ఉంటుంది . చాతీ బిగుసుకున్నటువంటి భావన లేదా బాగా ఒత్తిడి పడుతున్న భావన . సధారణము గా ఆ నొప్పి చాతీనుండి విస్తరిస్తుంది. ఎడమ చేతివైపుకు నొప్పి విస్తరణ సాధారణమైనప్పటికీ కింది దవడ , మెడ , కుడిచెయ్యి , వీపుకు విస్తరిస్తుంది . కడుపులో మంటను పోలిన బాధ కలుగుతుంది.

ఇతర లక్షణాలు : ఊపిరి అందకపోవడము , తీవ్రము గా చెమట పట్టడము , తల తేలిపోవడము , గుండెదడ , నీరసము , కడుపులో తిప్పడము , తలతిరగడము లేదా స్పృహ కోల్పోవడము .

గుండెపోటుకు ప్రాధమిక చికిత్స : గుండె పోటు వచ్చినవారిలో పైన చెప్పిన లక్షణాలు , సంకేతాలు కనిపిస్తాయి. వాటిలో తీవ్ర చాతీనొప్పి తట్టుకోలేనిది . అటువంటివారిని హాస్పిటల్ కి తరలించేలోగా సమయము వృధాచేయక ప్రాధమిక చికిత్స అందించాలి . గుండెపోటు కేసుల్లో సమయము చాలా కీలకము .ఆలస్యమైతే గుండె కండరము దెబ్బతింటుంది . చేయవలసినవి ...*అత్యవసర సర్వీస్ నంబర్ కి ఫోను చేయడం , *రోగి దుస్తులను వదులు చేయడము , *రోగిని కంగారు పెట్టకుండ ధైర్యము చెప్పడము , *కొంచము వంగి కూర్చున్న భంగిమ ను ఏర్పాటు చేయడము ,* అనవవసర కదలికలు చేయకూడదు , *శ్రమపడితే ఆక్షిజన్‌ పెట్టే సదుపాయము చేయడము , *వెంటనే హృద్రోగ నిపుణులున్న హాస్పిటల్ కి తరలించడము ... ముఖ్యమైనవి . దొరికితే .. సార్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెట్టడము చేయాలి .


పక్ష వాతము

మనిషి బ్రతికే ఉంచి అచేతనం గా ఉండే విచిత్ర స్థితి . శరీరము లో ఒక భాగము కాని , సగము కాని , పూర్తిగా కాని తమ కదేలే శక్తిని సంపూర్ణము గా కోల్పోతే దాన్ని పక్షవాతము (paralysis) అంటారు . ఇది వస్తే ఆ భాగము స్పర్శ , కదలిక ఏమీ ఉండవు . శరీరం అంతా బిగుసుకుపోవడం, మూతి అష్టవంకరలు తిరిగిపోవడం, కాళ్ళు చేతులు వెనుతిరగి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవం పై పక్షవాతం ప్రభావం ఏదో విధంగా తెలియ కుండా కనిపిస్తుంది.

ఏ కారణాల వల్ల వస్తుంది :
స్ట్రోక్ : ఈ స్ట్రోక్ లో మెదడుకి రక్త ప్రసారము ఆగిపోతుంది .. . దానివల్ల మెదడు లో జీవకణాలు చచ్చిపోతాయి . ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది .
ఒక దానిలో మెదడకు వెళ్ళే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం .... దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము .
రెండవది .. మెదడు లోని రక్తనలలో వత్తిడి పెరిగి పగిలి రక్తస్రావము జరగడం ... దీన్ని " హెమరేజిక్ స్ట్రోక్ అంటాము .
ఏది ఏమైనా మెదడులోని కొన్ని కణాలూ చనిపోవడం వలనే ... ఆ సంభదిత అవయవాలు చచ్చుబడి పక్షవాతము వస్తుంది



కాలిన గాయాలు--
కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.
చెయ్యవలసినవి
*మంట ప్రభావాన్ని ముందుగా ఆపండి .*మంటనుండి మనిషిని బయటకు లాగడము లేదా మందమైన దుప్పటి తో కప్పి మంటలను ఆపాలి .*ప్రమాదము నుండి రోగిని దూరము గా తీసుకు వెళ్ళాలి .* కాలిన ప్రదేశము లో దుస్తులు లేదా నగలను తొలగించాలి . *కాలిన 20 నిముషాలలోపే ప్రభావితమైన శరీర భాగాలను చల్లని తేదా గొరువెచ్చని నీటితో10-30 నిముషాలు చల్లబరచాలి . * చర్మానికి తగలకుండా తెల్లటి పలుచని గుడ్డతో కపాలి. * హాస్పిటల్ కి వీలైనంత త్వరలో తీసుకు వెళ్ళాలి .
చెయ్యకూడనివి --
* ఐస్ లేదా ఐస్ నీళ్ళు లో కడగడం గాని తుడవడం గాని చేయవద్దు . * క్రీమ్స్ లేదా వెన్న వంటివి రాయడను , సిరా (పెన్ను ఇంక్ )లాంటివి పోయడము చేయవద్దు .



శ్వాసించడములో ఇబ్బంది --

ఊపిరి పీల్చ్లేకపోవడము లేదా ఊపిరి అందకపొవడానికి ఏ రోగి లోనైనా రెండు కారణాలుంటాయి. 1.శ్వాసనాళాలఓ అడ్డంకి . 2. శ్వాసనాళాలు మూసుకుపోవడము . కొద్ది సేపూ ఆక్షిజన్‌ మెదడకు అందకపోతే ప్రాణాపాయము కలుగుతుంది . కావున అన్ని సమయములో శ్వాస -నిశ్వాసలు సరిగా జరిగేటట్లు చుడాలి . వెంటనే దగ్గరగా ఉన్న వైద్యశాలకు తరలించాలి .


పాముకాటు :
సాదారణం గా పాములు సంతానోత్పత్తి కోసం వేసవి కాలం లో జత కడతాయి . తరువాత వర్షాకాలం లో గుడ్లలను పొదుగుతాయి . ఆయాసమయాల్లో అవి చాలా చిరాకుగా ఉండి తీవ్రం గా స్పందిస్తాయి . ఈ కారణం గానే వేసవి , వర్షాకాలం లో పశువులతో పాటు మనుషులు అధికంగా పాముకాటుకు గురిఅవుతారు .

పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం.

పాముల్లో చాలా రకాలున్నాయి. పాము లెన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాలకన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం మంచిది. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే- విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో మరికొందరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.


  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 1, 2012

ఫ్లూ జ్వరం,ఫ్లూ వైరస్‌,Flue fever



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఫ్లూ జ్వరం,ఫ్లూ వైరస్‌,Flue fever- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జలుబు తెచ్చిపెట్టే వైరస్‌లు వందల సంఖ్యలో వుంటాయి. అందుకే జలుబు నిరోధక వ్యాక్సీన్‌లు మనకు అందుబాటులో లేవు. ఫ్లూకు సంబంధించి ప్రధానంగా రెండు తరగతుల వైరసులను గుర్తించడం జరిగింది. వీటికి వైరస్‌-ఎ, వైరస్‌-బి అని పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నారు. మూడవ తరగతి వైరస్‌ 'సి' ఉనికి తక్కువే. అది అంతగా బాధ పెట్టదు కూడా. ఫ్లూ జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. చలిచలిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటాయి.తలనొప్పి, ఒళ్ళునొప్పులు బాధ అనిపిస్తాయి. బాగా నీరసం అనిపిస్తుంది. కడుపులో వికారమూ ఉంటుంది.ఫ్లూ జ్వరాన్నే ఇన్ ఫ్లూయింజా జ్వరం అంటారు. ఈ జ్వరం జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలోఎక్కువమందికి సోకుతుంది. ఇంట్లో ఒకరికి వస్తే తక్కినవాళ్ళకి కూడా రావచ్చు, ఈ జ్వరం రావడానికి ఇన్ ఫ్లూయింజా వైరస్ ఏ,బి,సి రకాలు కారణం. ఇన్ ఫ్లూయింజా వైరస్ శరీరంలో చేరిన 1-3 రోజులలో ఫ్లూ జ్వరం వస్తుంది.

ఫ్లూ వైరస్‌ సోకిన ఒకటి రెండు రోజుల తరవాత ఫ్లూ లక్షణాలు ప్రారంభమవుతాయి. చలి మొదటి లక్షణం. తరవాత జ్వరం 102-103 ఫారన్‌హీట్‌ డిగ్రీల దాకా పెరుగుతుంది. తీవ్రంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు. వీపు నొప్పి అధికంగా వుంటుంది. మూడు నాలుగు రోజుల్లో బాధలన్నీ తగ్గిపోతాయిగానీ దగ్గు మాత్రం వారం, పది రోజుల వరకూ బాధించవచ్చు.


  • వ్యాపించే విధానము :
ఫ్లూ కారక వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి పీల్చే గాలి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే ముక్కు నుండి వెలువడే స్రావాలతో కలుషితమైన గ్లాసులు, పాత్రలు, వస్తువుల ద్వారా కూడా సంక్రమించవచ్చు.

  • ఫ్లూ జ్వరంలో రకాలు :
ఫ్లూ జ్వరంలో రకాలున్నాయి. ఒక రకంలో ఫ్లూ కేవలం జ్వరంవరకే పరిమితం అవుతుంది. ఇందులో జ్వరం, ఒళ్ళునొప్పులు, జలుబు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబడటం, నీరసం ప్రధానంగా వుంటాయి. పొడిదగ్గు ఉంటుంది. నాలుగు నుండి ఆరు రోజులలో జ్వరం తగ్గిపోతుంది ఇలాంటి జ్వరం ఎక్కువమందిలో కనిపిస్తుంది.

శ్వాసకోశాలకి సంబంధించిన ఫ్లూ జ్వరంలో జ్వరంతో పాటు బ్రోంకైటీస్, బ్రోంఖోన్యుమోనియా, ఫ్లూరసి వుంటాయి. కళ్ళే జిగురుగా, ఎరుపుగా వుంటుంది. ఇటువంటి ఫ్లూజ్వరం గురించి అప్రమత్తత అవసరం.

జీర్ణకోశ పెగులకి సంబంధించినటువంటి ఫ్లూ జ్వరం మరొకటి ఇందులో ఫ్లూజ్వరంతోపాటు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం వంటివి ప్రధానంగా వుంటాయి. కొంతమందిలో మలబద్ధకం బదులు విరేచనాలు వుంటాయి.

నరాలకి చెందిన ఫ్లూజ్వరం కూడా ఉంది. ఇందులో విపరీతంగా తలనొప్పి ఉంటుంది. అపస్మారకస్థితి కూడా ఏర్పడుతుంది. మెనింజైటీస్ ఫ్లూ జ్వరం అనేది మరొకటివుంది. దీన్నే విషజ్వరం అని అంటారు. ఈ జ్వరం వచ్చినవాళ్ళలో ఒళ్ళు నీలంగా మారుతుంది.

  • ఫ్లూ జ్వరానికి చికిత్స ఏమిటి?
ఫ్లూ జ్వరం వచ్చిన వ్యక్తికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. జ్వర తీవ్రత, ఒళ్ళునొప్పులు తగ్గడానికి ''పెరాసిటమాల బిళ్ళలు'' వాడాలి. గొంతునొప్పి, దగ్గు తగ్గడానికి '' కాఫ్ సిరప్ '' వాడాలి. సాధారణంగా ఎలాంటి యాంటిబయోటిక్ మందులవసరం లేకుండానే ఉపశాంతికి వాడే మందులతో ఫ్లూజ్వరం తేలికగా తగ్గుతుంది.

కాంప్లికేషన్లు ఎదురైతే వాటికి చికిత్స చేయాలి. వైరల్ ఇన్ ఫెక్షన్ తోపాటు బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కూడా తోడైతే యాంపిసిలిన్, ఎమాక్సిసిలిన్, ఎజిద్రోమైసిన్ ఇతర యాంటిబయాటిక్ మందులు వాడాలి. ఇన్ ఫ్లూయింజా జ్వరం రాకుండా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. అవి చిన్నవయసులోనే వాడాల్సి వుంటుంది. జ్వరం వచ్చాక ప్రయోజనం ఉండదు. వైరస్‌ వ్యాధికి బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ తోడయినా యాంటిబయాటిక్స్‌ వంటి ఔషధాలతో అంత ప్రయోజనం ఉండదు. సిగరెట్లు, మద్యపానం లాంటి అలవాట్లున్న వారు ఈ సమయంలో వాటికి దూరంగా వుండాలి. ప్లూ వ్యాధిగ్రస్తులలో బ్రాంకైటిస్‌, న్యుమోనియా లాంటి వ్యాధులు చోటు చేసుకోవచ్చు.


soruce : Price Text book of Medicine

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/