స్త్రీ పురుష లింగ బేధం ఏ దశలో ఏర్పడుతుందనే విషయాన్ని అనేక పరిశోధనల ద్వారా తెలుసుకొన్నారు. పురుష బీజం స్త్రీ గర్భంలోని అండాన్ని చేరుకొన్న క్షణంలోనే స్త్రీ పురుష లింగ బేధం ఏర్పడుతుందని నిర్ధారించ బడింది. కాని భౌతికంగా బాహ్య చిహ్నాలు కన్పించటానికి కొంతకాలం పడుతుంది. గర్భం దాల్చిన ఆరు వారాలకు పురుషలింగ చిహ్నం కన్పిస్తుంది. స్త్రీ మర్మావయవాలు రూపురేఖలు దిద్దుకోవడానికి మూడు నెలలు పడుతుంది. మెదడు లింగబేధానికి అవసరమైన హార్మోనులను ఉత్పత్తి చేయడానికి కార్యప్రణాళికను తయారు చేసి అమలు పరుస్తుంది. గర్భస్త శిశువు తన భావిజీవితానికి అవసరమైన శక్తి యుక్తులను పుట్టకపూర్వమే సంతరించుకొంటుంది. అందువల్లే పుట్టిన క్షణం నుండి ఆడపిల్లల, మగ పిల్లల ప్రవర్తనలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. జన్యుకణాల ద్వారాను, హార్మోనుల ద్వారాను గర్భస్థ శిశువు తన కవసరమైన శక్తియుక్తులను సంపాదించుకొంటుంది.
ఆడపిల్లలకు తల్లులు అవవలసిన అవసరం వుంది. కాబట్టి పుట్టినప్పటి నుండి మాటలను విని మనుష్యులను గుర్తించగలుగుతారు. శబ్దాలకు త్వరగా స్పందిస్తారు. మాట్లాడటానికి ఎక్కువ ప్రయత్నిస్తూ వివిధ శబ్దాలను చేస్తారు. నవ్వుతూ అందర్ని ఆకర్షించటానికి ప్రయత్నిస్తారు. మగపిల్లలు మనుష్యుల పోలికను బట్టి వ్యక్తులను గుర్తిస్తారు. ఇంపైన రంగులను చూసినప్పుడు ఆనందిస్తారు. బొమ్మలంటే ఇష్టపడ్తారు. మగపిల్లలకు మనుష్యుల కంటే బొమ్మలు ఇస్తే వూరుకుంటారు. ఆడ పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఓదార్చితే వూరుకొంటారు. ఆడపిల్లలు ఎదుటివారి భావాలను తేలికగా అర్థంచేసుకోగలుగుతారు.
- పరిణామ క్రమంలో
- మెదడు పనితీరులో
- ఆడపిల్లలు అన్నింటిలోనూ ముందుంటారు :
తండ్రి బీజంలోని 'X' క్రోమోజం తల్లి అండం లోని 'X' క్రోమోజంతో కలిసి స్త్రీ శిశువు జనానికి కారణ భూతమౌతుంది. ఈ రెండు 'XX' క్రోమోజంలు ఒకదానికి ఒకటి వత్తాసుగా వుండి ఆడపిల్లల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక క్రోమోజం లో ఏదయినా లోపం వుంటే రెండో క్రోమోజం ఆ లోపాన్ని సరిదిద్ది ఆడపిల్లల పురోభివృద్ధికి తోడ్పడుతుంది. స్త్రీలు ఇంకొక జీవిని ఉత్పత్తి చేయాలి కాబట్టి ప్రకృతి వారికి ఎక్కువ శక్తిని ప్రసాదించింది. అందువల్లే స్త్రీల సగటు ఆయుఃప్రమాణం పురుషుల కంటే సుమారు 6 లేక 7 సంవత్సరాలు ఎక్కువ వుంటుంది. ఈ వ్యత్యాసం అన్ని దేశాలలోను, అన్ని జాతులలోను స్పష్టంగా కన్పిస్తుంది.
తల్లి అండంలోని '×' క్రోమోజంతో తండ్రి బీజంలోని 'Y' క్రోమోజం కలిసినప్పుడు మగపిల్లవాడు పుడ్తాడు. 'Y' క్రోమోజం '×' క్రోమోజం కంటే చిన్నదిగా వుంటుంది. ఈ రెండు క్రోమోజంలు కలసి పని చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. అందువల్లే ఎక్కువ మంది మగశిశువులు పుట్టక ముందే చనిపోతారు. పుట్టిన తరువాత కూడ మొదటి వారంలో చనిపోయే శిశువులలో మగపిల్లల సంఖ్య ఎక్కువగా వుంటుంది.
మగపిల్లలు ఎక్కువగా ఏడుస్తూ తల్లిని అంటిపెట్టుకొని వుంటారు. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మెదడు పనితీరు ఒక నెల వయస్సు వున్న మగపిల్లవాని మెదడులాగ పనిచేస్తుంది. మూడేళ్ళు వచ్చేటప్పటికి ఆడపిల్లలు చేతులతో చేసే పనులలో మగపిల్లల కంటే ఎక్కువ నైపుణ్యం కలిగి వుంటారు. ముఖ్యంగా చేతివేళ్ళపై మంచి ఆధిక్యత కలిగి వుంటారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే ముందు పుస్తకాలు చదవటం మొదలు పెడ్తారు. ఆడపిల్లలు శ్రద్ధగా వింటారు. తమకు తెలిసిన విషయాలను ఇతరులకు వివరంగా చెప్పగలుగు తారు. ప్రైమరీ విద్యాస్థాయి లో ఆడపిల్లలు లెక్కలలో ముందుంటారు. కాని హైస్కూలు స్థాయిలో మగపిల్లలు ముందుకు పోతారు.
- ఆడ, మగ వారి మెదళ్ళలో తేడాలు
అనేకమంది మీద పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఆడ, మగ మెదళ్ళలోని కొన్ని తేడాలు కనిపెట్టారు. వీటిని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. వాటిలో కొన్ని మీరు ఇక్కడ చదవచ్చు.
- * మగవారి మెదళ్ళు పెద్దగా ఉంటాయి. కానీ వయసుతోపాటు, అదే వయసున్న ఆడవారి మెదళ్ల కంటే త్వరగా కుంచించుకు పోతాయి.
- * ఆలోచించేటప్పుడు మగవారి కంటే ఆడవారు మెదడుని ఎక్కువగా వాడతారు.
- * మన మెదడులో గ్రే మాటర్, వైట్ మాటర్ అని రెండు ఉంటాయి. గ్రే మాటర్ తార్కిక శక్తికి, వైట్ మాటర్ జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి. మగవారి మెదళ్ళలో గ్రే మాటర్ ఆడవారి మెదళ్ళలో కంటే 6.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆడవారి మెదళ్ళలో వైట్ మాటర్ మగవారి మెదళ్ళలో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిశోధకులు ఏమంటున్నారంటే మగవారు లెక్కలు వంటివాటిలో నిష్ణాతులని, ఆడవారు సాహిత్యం, భాష వంటివాటిలో పండితులని.
- * ఆడవారి మెదళ్ళు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువ గ్లూకోస్ ని వాడుకుంటాయి.
- * "ఇంటలిజెన్స్" పత్రిక 2006 లో చేసిన సర్వే ప్రకారం జ్ఞాపకశక్తి పరీక్షల్లో మగవారు సగటున నాలుగు నుండి ఐదు పాయింట్లు ఎక్కువగా సాధించారు.
- * మగవారు సెక్స్ గురించి చాలా ఎక్కువగా అంటే నిముషానికి ఒకసారి చొప్పున, ఆడవారు చాలా తక్కువగా అంటే ఒకటి లేక రెండు రోజులకు ఒకసారి చొప్పున ఆలోచిస్తారు.
- * శిశువుల మీద చేసిన పరిశోధనలలో డిస్టర్బ్ చేసే ధ్వనులకు మగశిశువుల కంటే ఆడశిశువులు ఎక్కువ ప్రతిస్పందించారు.
- * ఆడవారు మగవాళ్ళ కంటే చాలా ఎక్కువగా మాట్లాడతారు. దీనికి కారణం వారి మెదళ్ళలోని కొన్ని గ్రంధుల చర్యలే. ఆడవారు, మగవారు రోజూ మాట్లాడే మాటల మధ్య తేడా సగటున 1000 నుండి 10,000 వరకు ఉంటుంది.
- * ఆడవారు మగవారి కంటే ఎక్కువగా స్పర్శకు ప్రభావితమవుతారు. 20 సెకండ్ల కౌగిలింత ఆడవారి మెదడులో ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. ఇది తనను కౌగిలించుకున్న వ్యక్తి మీద నమ్మకాన్ని కలిగించటానికి దోహదపడుతుంది.
సమస్త జీవరాశిలో బుద్దిజీవులు గొప్పవారనేది జగమెరిగిన సత్యం. ఈ బుద్దిజీవుల్లో ఆడ, మగలలో ఎవరు గొప్ప అనేది ఒక తమాషా ప్రశ్న. కాని ఆడ, మగ వీరిరువురిని అనేక కోణాల్లో పరిశీలించి విశే్లషించి వారి ప్రత్యేకతలు చెప్పుకోవచ్చు. స్ర్తిలు శారీరకంగా, మేథోపరంగా మగవారికి తీసిపోరని ఆధునిక పరిశోధనలు చెపుతున్నాయి. జన్యుపరంగా స్ర్తిలు మగవారికన్నా బలవంతులని తెలుస్తోంది. మనిషిలో ఉండే 46క్రోమోజోమ్‌లలో రెండు లైంగిక క్రోమోజోమ్‌లు. స్ర్తిలలో ఎక్స్,ఎక్స్, పురుషులలో ఎక్స్,వై లైంగిక క్రోమోజోమ్‌లు ఉంటాయి. రెండు ఎక్స్‌క్రోమోజోమ్‌లుగల స్ర్తిలు జన్యుపరంగా పురుషులకన్నా పటిష్టంగా ఉంటారని పరిశోధకుల అభిప్రాయం.
మగవారి మెదడుకన్నా ఆడవారి మెదడు చిన్నది కావున వారికి తెలివి తేటలు సాపేక్షంగా తక్కువగా ఉంటాయనేవారు కూడా వున్నారు. అయితే పరిశోధకులు నిర్వహించిన అనేక పరిశోధనల ఫలితంగా ఆడ-మగ మెదడుల మధ్య సున్నితమైన వ్యత్యాసాలు వున్నాయని, వాటికి ప్రాముఖ్యముందని అంటున్నారు. ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోవాలంటే పురుషులు మెదడులో ఎడమవైపున ఉండే చిన్న ప్రదేశాన్ని ఉపయోగించుకుంటారు. స్ర్తిలు ఈ ప్రదేశానే్న కాకుండా మెదడు కుడివైపున వున్న ఒక ప్రదేశాన్నికూడా ఉపయోగించుకుంటున్నారు.
- ఆడవారు బలహీనులు
- స్ర్తి శక్తి
జీవ గడియారాలు
ఆడ- మగల్లో జీవ గడియారాలు భిన్నంగా ఉంటాయి. ఈ విషయం ఇటీవలనే శాస్తవ్రేత్తల దృష్టికి వచ్చింది. రుతుమార్పులకు మగవారికన్నా ఆడవారు బాగా స్పందిస్తారు. ఆడ-మగ రాత్రి సమయాల్లో సమాన కాలాలు నిద్రించవచ్చు. స్ర్తిలలో జీవ గడియారం సూర్యుడికి ప్రతిస్పందిస్తుంది. శీతాకాలంలో పగటికాలం తగ్గుతుంది. అటువంటప్పుడు స్ర్తిలలో రాత్రిపూట మెలటోనిన్ స్రావం ఎక్కువ అవుతుంది. వేసవిలో తగ్గుతుంది. మగవారిలో వేసవి, శీతాకాలాల్లో స్రవించే మెలటోనిన్ ఒకే విధంగా ఉంటుంది. శీతాకాలంలో ఆడవారు ఒక రకం డిప్రెషన్‌కు గురిఅవుతూ ఉంటారు.
- ఆడ-మగ తేడాలు
మగవాని అంగాలు స్ర్తిల అంగాలకన్నా బరువుగా ఉంటాయి. ఒక యువకుని మెదడు బరువు సగటున 1380 గ్రాములు ఉంటే అదే వయసుగల యువతి మెదడు బరువు సగటున 1250 గ్రాములు ఉంటుంది.
యవ్వనంలో స్ర్తి, పురుషుల మర్మాంగాల వికాసం, వాటి బలిష్టత, ఎస్ట్రోజన్, ఆండ్రోజన్ హార్మోనుల చర్యపై ఆధారపడి ఉంటుంది. ఆడవారి విషయంలో పొత్తికడుపు చుట్టూ ఉండే అస్థిపంజరంలో ఎదుగుదల యవ్వన దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్ట్రోజన్ హార్మోనువల్ల పెరిగే ఎముకలు కొంతవరకు ఎదిగిన తరువాత ఎదుగుదల ఆగిపోతుంది. అందువల్లనే ఆడవారి శరీర నిర్మాణం మగవారి శరీర నిర్మాణాన్ని మించదు.
- ==================================