-వానాకాలం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉడడంతో చర్మం తడిగా ఉండి ఫంగల్ ఇన్‌ఫెక్షెన్లు త్వరగా వచ్చే ఆస్కారం ఎక్కువ. ముఖ్యంగా అరిచేతులకు, అరికాళ్ళకు ఇన్‌ఫెక్షన్ త్వరగా వస్తుంది. వర్షంలో తడిసినవెంటనే తల తుడుచుకుంటే సరిపోతుందనేది చాలామంది అభిప్రాయం. అలాగే చేస్తారు కూడా. కానీ అదే పొరపాటు. వర్షపునీటిలో ఉండే లెడ్, ఆర్సెనిక్ రసాయనాలు చర్మానికి, శిరోజాలకు హాని కలిగిస్తాయి కనుక తగినజాగ్రత్తలు పాటించాలి.
చర్మ సంరక్షణ
వానలో తడిసిన తర్వాత కళ్ళను చల్లని నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. స్నానానికి ముందు కాళ్లు, చేతులకు డెట్టాల్ సబ్బు రాసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుమూడుసార్లు చేయాలి.ఆడు వారు సున్నిపిండిలోనూ చిటికెడు పసుపు చేర్చి వాడాలి. నీటిలో వేపాకుల్ని వేసి మరగబెట్టి స్నానంచేసే నీటికి కలుపుకోవాలి. ఔషధగుణాలున్న సబ్బునే వాడాలి. టేబుల్ స్పూన్ పాలలో రెండు బాదం పలుకులు ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పొట్టుతీసి మెత్తగా చేయాలి.ఇందులో నాలుగు చుక్కల నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 25 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా 3 రోజులకు ఒకసారి చేస్తే 10 రోజులకల్లా చర్మంలో నిగారింపు వస్తుంది.
ఆహారం
ఈ కాలంలో చాలామందిని జలుబు, దగ్గు, విరేచనాలు వేధిస్తాయి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చు.
విటమిన్ సి సమృద్ధిగా లభించే పండ్లు, కూ రగాయలు తరచూ తినాలి. అర స్పూను మిరియాలు లేదా వాము పొడితో మొదటి అన్నం ముద్ద తినాలి. దీన్ని మధ్యాహ్న భోజనంలో తీసుకోవాలి. రోజులో ఒకసారి 4-6 వరకు పచ్చి వెల్లుల్లి రేకులను తినాలి. వారంలో కనీసం రెండు మూడుసార్లు కాకరకాయల్ని వేపుడు, కూర, పులుసు ఏ విధంగానైనా తప్పక వాడాలి. ఈ కాలంలో నిస్సత్తువుగా ఉంటుంది కనుక తరచూ లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ తాగాలి.కొత్తిమీర పుదీనాలను తరచుగా వాడుతుండాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించినట్లయితే వానాకాలంలో ఎలాంటి అనారోగ్యాలు దరిజేరవు.
- =======================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.