Thursday, February 24, 2011

రజస్వల,Menarche



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రజస్వల - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆట పాటలతో అల్లరిచేసే చిన్నారి శరీరము లో హఠాత్తుగా వచ్చిన మార్పుకు అటు తల్లీ ఇటు బిడ్డా ఇద్దరూ కంగారుపడతారు . ఎవరెంత కంగారుపడినా అందోళన చెందినా ఇది సహజ పరిణామము . . శారీరక ఎదుగుదళ లలో బాగము . అమ్మాయి వయస్సు పదేళ్ళు దాటిన తర్వాత శారీరక స్థితిని అనుసరించి ఎప్పుడైనా రజస్వల కావచ్చు. నేటి కాలంలోఆడపిల్లల్లో రజస్వల వయస్సు త్వరగా వచ్చేస్తున్నదని పోషకాహారము , పరిసరాల (టి.వి) స్టిములేషన్‌ ఇందుకు కారణమేననిపుణులు చెప్తున్నారు . కాబబట్టి పిల్లలు ఐదు తరగతులకు చేరగానే వారికి తమ శరీరం గురించిన పరిజ్ఞానమును , మార్పులను తెలియజెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు .

యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని రజస్వల లేదా పుష్పవతి (Menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.


బహిస్ట రకము లో ఏముంటుంది : ప్రతి నెల అండము విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లో తయారవుతుంది. బహిష్ట ఫ్లో(రక్తము)(consists of a combination of fresh and clotted blood with endometrial tissue) మంచి, చెడు రక్తము, విచ్చిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారు గా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.

ఋతుక్రమము దగ్గరలో మార్పులు :
ఋతుక్రమము దగ్గరపడగానే స్తనాలు బరువుగా .. చాలా సున్నితముగా మారుతాయి . స్త్రీ జీవితం పూర్తిగా హార్మోనల్ నెలసరులతో నిండి ఉంటుంది . ప్రధాన హార్నోన్‌లు అయిన ఈస్ట్రోజన్‌ , ప్రొజెస్ట్రోన్‌ ల నడుమ ఉండే సహజ వ్యత్యాసాల రీర్యా నెలసరులు ఉంటాయి. రెండో స్త్రీతత్వ లక్షణమైన స్తనాల ఎదుగుగలకు కూడా ఇవే కారణమవుతాయి. కాబట్టి అమ్మాయి జీవితం తో స్తనాల ఎదుగుదల రజస్వల ఒకేసారి సంబవిస్తాయి. నెలసరిలో హార్మోనులు స్తనాల్ని ప్రభావితం చేస్తాయి. ప్రొజెస్టరాన్‌ ప్రభావము వల్ల కొద్దిగా నొప్పిగా(tender)మారుతాయి .. వాపూ ఉంటుంది. దాదాపు మహిళలందరికీ ఈ మార్ప్లులు సహజము , కొందరికి మరీ సున్నితం గా ఎక్కువ కాలము ఉంటుంది. దీనికి ఉపశమన మార్గము అవసరము లేదు . అవి సహజమేనని సర్ది చెప్పుకోవడం మే అలవాటు చేయాలి . మరీ ఇబ్బదిందిగా , నొప్పిగా బరువుగా ఉంటే తక్కువ దోసులో డైయూరెటిక్స్ (Lasix .tabs) 1-2 రోజులు ఇవ్వాలి , దీనివలన అసౌకర్యము తగ్గుతుంది .

ఆలస్యంగా రజస్వల అవడము

కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి 'ప్రైమరీ ఎమెనూరియా' కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు ... ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.

కారణాలు

* విపరీతమైన డైటింగు చేయడం
* ఎడతెరిపిలేని వ్యాయామాలద్వారా బాగా బరువుతగ్గడము
* పోషకాలు, పోషకాహారము అందకపోవడము
* స్థూలకాయము
* దీర్గకాళిక అనారోగ్యము
* పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు,
* థైరాయిడ్ సమస్యలు
* అండకోశ వ్యాధులు , మున్నగునవి.

ఋతుచక్రం (Menstrual cycle) స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. పూర్వం ఇలా నెలసరి లో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా ముట్టు అంటు బహిష్టు మైల అంటూ ఆరోగ్యకారణాల రీత్యా ఇంటి బయటే ఉంచేవారు. కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. ఇప్పుడు ముట్టు గుడ్డల(Napkins) వాడకంతో స్త్రీలు తమ తమ పనులు మామూలుగానే చేసుకోగలుగుతున్నారు.పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ (ముట్లుడిగిపోవటం) అంటారు.

నెలసరి నేప్కిన్లు

గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో నెలసరి సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం రుతుక్రమం వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లు (ముట్టు బట్టలు,ప్యాడ్లు/నేప్కిన్లు) ప్రభుత్వం అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్‌ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.

పి.ఎమ్.ఎస్.

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome): పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.

* బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
* జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
* పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
* వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
* కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ,
* తీపి తినాలనిపించడము.

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని ,ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంత వైవిద్యముగల లక్షణాలున్న ఈ పరిస్తితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.బహిష్టు కాలంలో నొప్పి ఎర్రబట్ట మరియు తెల్ల బట్ట తగ్గటానికి ట్రీట్మెంటు తీసుకుంటూ ఉండాలి .

* 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి .
*మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
* క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.
* క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
* కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
* నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.
బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటే - tab. Styptochrome లేదా tab.Keutan C అనే మాత్రలు రోజుకు 3 చొప్పున్న 2-4 రోజులు తీసుకోవాలి .

డిస్మెనోరియా Dysmenorrhea:
డిస్మెనోరియా (Dysmenorrhea) అనేది బహిష్టు సమయంలో చోటు చేసుకునే నొప్పికి సంబంధించిన ఒక స్త్రీ జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరిస్థితి, అది రోజువారీ చర్యలకు ఆటంకం కలిగించేదిగా ఉంటుంది ఇప్పటికీ, డిస్మెనోరియాను తరచుగా బహిష్టు నొప్పి గా నిర్వచించబడింది, రోజువారీ చర్యలకు ఆటంకం కలిగించే నొప్పి, డిస్మెనోరియా వివిధరకాల నొప్పులను కలిగి ఉండవచ్చు, ఇందులో కోతవలే అనుభవం కలగడం, నాడి అధికంగా కొట్టుకోవటం, మందకొడితనం, వికారం, మండుతున్నట్టు లేదా పోటు ఉంటుంది. రుతుస్రావం కన్నా అనేక రోజుల ముందు లేదా దానితో పాటు డిస్మెనోరియా ఉండవచ్చు, సాధారణంగా రుతుస్రావం తగ్గినప్పుడు ఇది తగ్గిపోతుంది. డిస్మెనోరియా అధిక రక్త నష్టంతో పాటు కూడా సంభవించవచ్చు, దీనిని మెనరాజియా అని పిలుస్తారు.

గర్భాశయం లోపల లేదా వెలుపల దాగి ఉన్న వ్యాధి, క్రమభంగం లేదా నిర్మాణాత్మక అసాధారణత లక్షణాలను ఆపాదించినప్పుడు ద్వితీయ స్థాయి డిస్మెనోరియా (Secondary Dysmenorrhea) ను నిర్థారించబడుతుంది. ఇందులో ఏ ఒక్కదాన్ని గుర్తించనిచో ప్రాధమిక డిస్మెనోరియా ( Primary Dysmenorrhea) గా నిర్థారించబడుతుంది.

చికిత్స :
Tab. Meftal spas ... 1 tab 3 times /day 2-3days or
Tab. Dysmen .... 1 tab 3 times / day 2-3 days వాడాలి .


  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.