మెడ నుంచి భుజానికో, చేతుల చివర్లకో నొప్పి పాకు తూ ఉంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మెడ నొప్పి తీవ్రమైపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
మనం నిలబడే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్ళే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్తప్రసారంలో తేడా వచ్చి మెదడుకు రక్త ప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తల తిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతు లు అవడం జరుగుతుంది.
మెడ దగ్గర ఉండే వెన్నుముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని, రెండవ దానిని ఆక్సిస్ అని అంటారు. ఆ తర్వాత పూ సలను వరుసగా సర్వెకల్ 3,4,5,6,7 అంటారు. ఇవ న్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమర్చి ఉంటాయి. మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పు వల్ల తీవ్ర మెడనొప్పి వస్తుంది. ఈ సమస్యనే సర్వికల్ స్పాండిలోసిస్ అంటారు. వీటిలో స్పైనల్ కెనాల్ ఉంటుంది. దాని ద్వారా స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్ వెర్టిబ్రల్ పారామినా నుండి ఒకకొక్క నరం బయటకు వస్తుం ది. ఈ నరాలు ఒక్కో వైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ షాక్ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది.
కారణాలు :
- ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడడం వల్ల వస్తుంది.
- స్పాంజి లేదా దూది ఎక్కువ ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం.
- కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
- ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం.
- నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్ లోపించడం.
పరీక్షలు :
ఎక్స్‌రే -స్కానింగ్: మెడనొప్పి వచ్చేవారికి ఎక్స్‌రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తెలుసుకొని దీనిని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దానిని బట్టి పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా? మధ్యలో ఏమైనా వచ్చి చేరాయా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎం.ఆర్.ఐ. స్కాన్ ద్వారా పరీక్షలు నిర్వహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత వత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల వచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్.ఐ. పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్ ప్రొలాప్స్ (డిస్క్ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంతమేరకు ఆ సమస్య ఉందో గమనించి దానికి చికిత్స చేస్తారు.
పర్సనల్ కేర్: మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో మెత్త టి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాప డం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్ కిల్లర్ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది.
బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.
- డా జగదీష్,ఛీఫ్ న్యూరో సర్జెన్,అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్,ఎల్.బి.నగర్, హైదరాబాద్-ఫోన్: 9000114040
మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...
తలెగరేస్తూ అలా నడవకు పొగరను కుంటారు. తల వంచుకుని కూర్చోవాలి తెలిసిందా. ఆడపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే మాటలే ఇవి. కానీ ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు కావని చెప్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. ఎందుకంటే తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువ్ఞను మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్ లోషన్లు వాడటం కూడా మంచిదే.
కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి. టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు ...................... వంగవద్దు.
కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.
చింతాకుల ముద్ద మెడచుట్టూ నాలుగు నుండి ఐదురోజులు పట్టిస్తూ ఉంటే మెడనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది చిట్కా మాత్రమే. కొన్నిసార్లు మెడ దగ్గర చాలా ఎక్కువగా ఉండే లింఫ్‌గ్లాండ్స్ వాస్తే కూడా మెడనొప్పి వస్తుంది. మెడనరాలపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు నొప్పి చేతులు, భుజాలలోకి వ్యాపించడం జివ్ఞ్వమని లాగడం ఉంటుంది. ఛాతీలో ముందు వెనుకలకు కూడా వ్యాపించ వచ్చు.
కంటిదోషాల వల్ల కూడా మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిన వైద్యం చేయిస్తే మెడనొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండ, వేడి, చలి వీటికి మెడ ఎక్స్‌పోజ్ చేయకూడదు. అలాచేస్తే మెడ కమిలి పోతుంది. నల్లబడుతుంది. మరీ ఎక్కువ ఆభర ణాలతో మెడను ఇబ్బంది పెడితే చర్మం ఒరుసుకు పోతుంది. బిరుసుగా అవ్ఞతుంది. ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్‌గా ఉండే నగలు ధరించడం మంచిది. ముఖంతో పాటు మెడను కూడా సబ్బుతో శుభ్రపరుస్తుండాలి.
గిల్ట్ నగలు ధరించినప్పుడు ఆయా నగల తయా రీలో ఉపయోగించిన మెటల్స్ పడక కొందరికి ఎలర్జీ వస్తుంది. మెడనల్లగా మారడానికి స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా కొంత వరకు కారణం.
మెడకు కూడా వ్యాయామం అవ సరం. అన్ని వైపులకు మెడను తిప్పాలి. అందువల్ల మెడకు సరిగా రక్తప్రసరణ జరుగుతుంది. అంతేగాక మెడ కొవ్ఞ్వ కరిగి చర్మం పలచబడుతుంది. నాజూకుగా ఉంటుంది. ఎక్కువ బరువ్ఞలు మోయడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, నిలబడడం మానాలి.
నిద్రపోయే సమయంలో చాలామంది తలగడపై తల మాత్రమే ఉంచుతారు. తలతో పాటు మెడ కూడా ఉంచాలి. నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. యోగా చేసేవారు కూర్మాసనం వేస్తే మెడలోని అనవసరపు కొవ్ఞ్వ తగ్గి మెడ సన్నబడుతుంది.
జాగ్రత్తలు--- డాక్టర్ అమీర్ భాషా,న్యూరోసర్జన్ హైదరాబాద్@andhraprabha - Tue, 20 May 2014,
- మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెడితే సాధారణ నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
- మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
- ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.
- సాధారణ నొప్పి అయితే పెయిన్ కిల్లర్ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకు అయిదారుసార్లు సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
- బరువైన బ్యాగ్‌లను ఒక భుజానికే తగిలించుకుని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.
- నడిచేప్పుడు ఒకవైపు ఒంగి నడవడం మంచిది కాదు.
- =========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.