Wednesday, February 23, 2011

సౌందర్య పోషకాలు ఆరోగ్యముపై చెడుప్రభావము ,Cosmetics and side effects


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సౌందర్య పోషకాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సౌందర్యపోషకాలు(cosmetics) : మన శరీరము పై ఎటువంటి అసౌకర్యము , పనితనము లో మార్పులు కలుగజేయని రసాయనాలు ...శరీరము క్లీనింగ కోసము , శరీరము అందము కోసం , శరీరం ఆకర్షణ కోసము , శరీర చెడువాసలుపోగొట్టడానికి , ఇతరులచే ఆకర్షించబడుటకు వాడే వాటినే సౌందర్యపోషకాలు /సాదనాలు అంటాము .

రసాయనాలు మన దైనందిన జీవితంలో ఎంతగా కలిసిపోయాయంటే అది మన అంచనాలను మించిపోతోంది. వాటివల్ల జరుగుతున్న హాని మనపై చూపిస్తున్న ప్రభావం లెక్కకు మిక్కిలిగా వుంది. ఇవన్నీ తెలిసీ తెలియక కూడా వాటిని మనం ఎక్కువగా వాడుతున్నాం.
కొన్ని సౌందర్యపోషకాలు :
 • చర్మ సౌందర్యానికి వాడే క్రీములు , లోషన్లు ,
 • పౌడర్లు ,
 • వాసనకోసం వాడే ' ఫెర్ఫ్యూములు " ,
 • లిప్స్టిక్స్ - లిప్ గ్లాస్ లు ,
 • గోళ్ళ పోలిష్ రంగులు ,
 • కళ్ళకు , కళ్ళ బొమలకు రాసే రంగులు , కాటుకలు ,
 • జుట్టు కోసము డైస్ , స్ప్రేలు ,
 • షాంపూలు , హైర్ కేర్ లోషన్లు ,
 • స్నానాలలో వాడే ... బబుల్ బాత్స్ , బాత్ ఆయిల్స్ ,
 • చెమటవాసనలు పోగొట్టే ... డియోడరెంట్స్ , ........ మున్నగునవి .

ఇవి ఎంతవరకూ మన ఆరోగ్యంమీద ప్రభావం చూపెడతాయనేది మనకు తెలియదు. వాటిని గురించి తెలుసుకోవడానికి సమయం లేదు. ఒకరు వాడుతున్నారని ఇంకొకరు వాడటం లేక ప్రకటనలు చూసి ఆకర్షితులై కొనేయడం. ఆయా వస్తువుల లేబుల్స్‌ చదివి ఎలా ఉపయోగించాలి, ఎంతవరకూ ఉపయోగించాలి అనేది అసలు పట్టించుకోం. వీటిలో హాని కారకాలైన పదార్థాలున్నాయని తెలుసుకోవడానికి కూడా నేడెవరికీ తీరక లేదు. కానీ వీటివల్ల ఒనగూడుతున్న నష్టం గురించి కొంతైనా తెలుసుకోవాలి. అప్పుడే వాటిని ఎంతవరకూ ఉపయోగించాలి, వాటినుండి హానిరాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోగలం.

మనపై ప్రభావం చూపించే రసాయనాలు ఎక్కువగా వుండేది...
1. తినే పదార్థాలు కావచ్చు 2. సౌందర్య పోషకాలు కావచ్చు 3. ఇంటిని శుభ్రపరిచే ద్రవాలు కావచ్చు.

రసాయనాలవల్ల ముఖ్యంగా ఎవరికి హానికరం?

1. ఆడవాళ్లు పిల్లలను కనబోయేముందు, గర్భవతిగా ఉన్నపుడు ఆ స్త్రీకి, లోపల వున్న బిడ్డకీ.

2. పుట్టినప్పటినుండి పెరిగేదాకా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో

ఇంట్లో వాడే ఆహారంలో డయాక్సిన్‌ అనే రసాయనం ఎక్కువగా వుంటుంది.

కొవ్వు ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలలో రసాయన మందులు ఎక్కువగా వుంటున్నాయి. కొవ్వు ఎక్కువగా వుండే పందిమాంసం, హాకన్‌, ఎక్కువ కొవ్వు గల చీజ్‌, కొవ్వు అధికంగల చేపవంటివి అదేపనిగా రోజూ తినకూడదు. తక్కువ మోతాదులో తినాలి.

ఏమి తినొచ్చు:

డయాక్సిన్‌ తక్కువగా వుండే ఆహారంతినడం శ్రేయస్కరం. రొయ్యలు, తక్కువ హాని కలిగించే చీజ్‌, తక్కువ కొవ్వు వుండే మాంసం, మార్గరిన్‌. కొవ్వులేని మాంసం అంటే చికెన్‌, చెరువు చేప ముఖ్యమైనవి. తక్కువ కొవ్వుండే మేకమాంసం అప్పుడప్పుడూ తీసుకోవచ్చు.

జంతువుల కొవ్వుకంటే వెజిటబుల్‌ ఆయిల్‌నే వాడాలి. ఎందుకంటే జంతువుల కొవ్వులో రసాయనాలు కలిసే అవకాశం ఎక్కువ.

నేటి కూరగాయల్లో రసాయనాల శాతం చాలా వుంటోంది. పంట దిగుబడికోసం ఎక్కువ పురుగుమందులు వేసి పెంచుతున్నారు. వీటిలో పురుగుమందుల శాతం తగ్గించాలంటే కూరగాయలు రెండుమూడుసార్లు నీటిలో కడగాలి. నేలలో పండే కేరెట్‌, ముల్లంగివంటి దుంపలు తోలు తీసి వాడుకోవాలి. ఆపిల్‌కూడా పై తోలు తీయాలి. ఇప్పటి యాపిల్స్‌ను నునుపు, మెరుపుకోసం వాక్స్‌(మైనం) పాలీష్‌చేసి అమ్ముతున్నారు. అందుకే ఈ జాగ్రత్త.

- సౌందర్యపోషకాలు: మనం సౌందర్యసాధనాలు అంటూ ఎంతో ప్రీతిపాత్రంగా ఉపయోగిస్తున్నవన్నీ వివిధ రసాయనాల సమ్మేళనాలే. ఇవన్నీ సౌందర్యం ఇనుమడించడానికి ఇసుమంతైనా సాయపడకపోగా ఇక్కట్లపాలు చేయడమే ఎక్కువ. సౌందర్యం అనగానే మనకు గుర్తొచ్చే టాల్కమ్‌ పౌడర్లు, లిప్‌స్టిక్‌లు, కాటుక, సుర్మా, గోళ్లరంగు, షాంపూలు, చలికాలంలో వాడే క్రీములు... ఇవన్నీ రసాయనాలు నిండిన పదార్థాలే. ఇవి నేడు ప్రతి ఇంట్లో, మళ్లీ మాట్లాడితే ప్రతి అమ్మాయి హ్యాండ్‌బ్యాగుల్లోనూ తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఇవికాక చెమటవాసన రాకుండా డియోడరెంట్లు, అలమరాలలో చెడు వాసన అరికట్టడానికి కెమికల్స్‌ మరెన్నో విరివిగా వాడుతున్నారు.

సౌందర్య సాధనాలను ప్రపంచం భారీగా తయారుచేస్తోంది. మందులకు, సౌందర్య సాధనాలకు మధ్య విభజన రేఖే బక్కచిక్కిపోయింది. క్రమబద్ధీకరించని రసాయనాలను మితిమీరి ఉపయోగించడం ఆరోగ్యాన్ని చాపకింద నీరులా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. కఠిన పరీక్షలు, నిఘా, ప్రమాణాలను నిర్ణయించే వ్యవస్థలనుంచి తప్పించుకుని మందులే సౌందర్య సాధనాల పేరిట విపణివీధికొచ్చి చేరిపోతున్నాయి.

ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ మరియు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికోలాజికల్‌ రిసెర్చ్‌ తాజా అధ్యయనాలు అనేక వాస్తవాలను వెల్లడిచేశాయి. ఇండియన్‌ ఐ రిసెర్చ్‌ గ్రూప్‌ అధ్యయనాలు కంటి ముస్తాబుకు సంబంధించిన కఠిన నిజాలను వెలికి తీసుకొచ్చాయి. ఈ వివరాలు ఇండియా టుడే ప్రకటించింది.

లక్నో మెడికల్‌ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ అబ్బాస్‌ అలీ మహ్దీ, ''ఆయా ఉత్పత్తుల్లో ఏం కలుపుతున్నారో ఎవరికీ తెలీదు. అవి చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతాయని ప్రతి ఉత్పత్తిదారుడూ ఊరిస్తారు. వాస్తవానికి అవి శరీర స్వాభావిక యంత్రాంగంలో జోక్యం చేసుకోవడం ద్వారా వ్యవస్థను దెబ్బతీసే అవకాశం వుంది. అనేక ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో ఉపయోగించే హైడ్రోక్వినోన్‌ చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్ల యంత్రాంగంలో జోక్యం చేసుకుంటుంది. దానికి కేన్సర్‌ను కలిగించే శక్తి ఉంది అంటున్నారు. పౌడర్లు, ఫౌండేషన్లలో మెత్తగా వుండడానికి అతిగా చూర్ణంచేసిన నానో కణాలను కలుపుతున్నారు. అవి చర్మం, రక్తనాళాలు, కణాల్లోకి చొచ్చుకుపోయి లోపలి అవయవాల్లో తిష్టవేస్తాయి. అంతేకాదు, అవి ఆకతాయి కణాలను పుట్టించి డిఎన్‌ఏని, జీవకణాలను విచ్ఛిన్నంచేస్తాయి. షాంపూలు నిల్వ వుండటంకోసం వాటిలో వివాదాస్పదమైన పేరాబెంజన్లను ఉపయోగించినట్లు నిర్థారణ అయింది. ఇవి శరీరంలోని ఎండోక్రైన్లను దెబ్బతీయడంతోపాటూ, కేన్సర్‌ను కలిగించగలవు. అమోదయోగ్యమైన 0.8శాతానికి మించి వాటిలో అవి వున్నాయి. ఈ రకమైన రసాయనాల సమ్మేళనం సాధారణ ఉత్పత్తులలో కాదు. ప్రముఖ కంపెనీ ఉత్పత్తుల్లో మితిమీరి కనిపించడం విశేషం. నానో కణాలు ఎల్‌ ఓ రియల్‌ యాంటీ రింకిల్‌ ఫౌండేషన్‌, రెవ్‌లాన్‌ ఏజ్‌ డి ఫైయింగ్‌ స్పా కన్సీలర్‌ 15 ఎస్‌పిఎఫ్‌లు వుందని తేలింది.

సౌందర్యసాధనాలైన లిప్‌స్టిక్‌, టాల్కమ్‌ పౌడర్‌, షాంపూ, కాటుక, జుట్టురంగుల్లో సీసం, రాగి, నికెల్‌, క్రోమియం, కోబాల్ట్‌, ఆర్సెనిక్‌ లాంటి విష పదార్థాలను గుర్తించారు. ఆఖరికి హెర్బల్‌ ప్రొడక్ట్‌ అని పేరుపెట్టిన సౌందర్యసాధనాల్లోనూ నిల్వ వుండటంకోసం రసాయనాలు ఉపయోగిస్తున్నారని తేలింది. ''మూలికా మిశ్రమాల్లో అలర్జీ కారకాలు ఎక్కువగా వున్నాయి. వాటిలో పిసరంతే మూలికలు. తక్కినదంతా ఇతర ఉత్పత్తుల తరహానే'' అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు డాక్టర్‌ వికె శర్మ.

సీసం పరిమిత శాతం 20 పిపిఎంలు కాగా టాల్కంపౌడర్‌- 21, షాంపూ-24.2, కాటుక- 136.3, హెయిర్‌ కలర్‌- 71.9 పిపిఎంలు వున్నట్లు తేలింది.

పైన చెప్పిన సౌందర్యసాధనాలన్నీ ఎంత ఎక్కువగా ఆపితే అంత మంచిది. నిజానికి మనది వేడి ప్రాంతం. నవంబరు, డిశంబరు తప్ప ఎక్కువగా మనం వేడినే భరిస్తుంటాం. మన వాతావరణానికి క్రీములు, పౌడర్లు అనవసరం. కావలసింది చెమటలనుంచి వచ్చే చికాకు, స్కిన్‌ ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవడం. అందుకు రెండుపూటలా స్నానంచేసి బట్టలు మార్చుకుంటే సరిపోతుంది. శారీరక పరిశుభ్రత ముఖ్యం. ఆరోగ్యంగా, చర్మం మెరుగ్గా వుండటానికి అది చాలు.

దేశీయ పద్ధతులు అన్నివిధాలా మంచిది. కానీ వాటిని మనం వదిలేశాం. కుంకుడుకాయలు, షీకాకారులు తలస్నానానికి వాడొచ్చు. కాటుక ఇంట్లో చేసుకోవచ్చు. మీగడలు, సున్నిపిండిలు సరేసరి. ప్రకృతి సహజంగా దొరికే ఎలోవెరా, పసుపు, నిమ్మ వంటి అనేక పదార్థాలను ఉపయోగించి సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవచ్చు. వీటివల్ల చాలా అలర్జీలు తగ్గిపోతాయి. ఒక్క కాటుక వల్లనే 10- 15శాతం ఎలర్జీలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. కళ్లు శుభ్రంగా వుండాలంటే రసాయనాలు వాడకూడదు.

ఆరేండ్లలోపు చిన్నపిల్లలున్నచోట జుట్టు రంగులు వాడకపోవడం మంచిది. ఇప్పుడు తల నెరిసినవారు కాకుండా ఫ్యాషన్‌కోసమంటూ రకరకాల హెయిర్‌ డైలు వాడుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికే కాదు, కుటుంబంలోని వారికి కీడుచేస్తుంది.

క్రిందనున్న పట్టిక చూస్తే మనం వాడే సౌందర్యసాధనాల్లో వుండే రసాయనాలు, వాటి పర్యవసానాలు మనకిట్టే అర్థమవుతాయి.

Ingredients and Diseases:

 • Paraben can cause skin irritation and contact dermatitis ,
 • Prolonged use of makeup has also been linked to thinning eyelashes,
 • Synthetic fragrances are widely used in consumer products. ..cause allergic reactions,
 • SLS ( Sodium Laureal Sulphate) causes a number of skin issues ncluding dermatitis,
 • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.