Monday, February 21, 2011

చిన్న పిల్లల్లో ఎఎస్‌డి, విఎస్‌డి రంధ్రాలు ,ASD,VSD in children


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చిన్న పిల్లల్లో ఎఎస్‌డి, విఎస్‌డి రంధ్రాలు ,ASD,VSD in children - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-సాధారణంగా ఫిజిషియన్‌ పాప తల్లి చెప్పిన కొన్ని లక్షణాలనుబట్టి తన స్టెతస్కోప్‌ సహా యంతో పరీక్ష చేసినప్పుడు కొన్ని భరించరాని చప్పుళ్లు వింటాడు. వీటినే మర్మర్స్‌ అంటారు. తరువాత కొన్ని పరీక్షలు నిర్వహించి గుండెలో రంధ్రం ఉందని నిర్ధారిస్తాడు. వీటి గురించి ఎన్నిసార్లు వివరించినా సందేహాలు పీడిస్తూనే ఉంటాయి. కొన్నింటికి అర్థాలు, చికిత్స ఎలా చేయాలో తెలుసుకుందాం.

పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు 1000 మందిలో 8 మందికి వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఖచ్చితంగా తెలియదు కాని గర్భంతో ఉన్నప్పుడు సోకిన వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, జన్యులోపం వల్ల కాని వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా ఏర్పడుతుందంటే శిశువు పుట్టక ముందు ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయన ప్పుడు రెండు ధమనుల మధ్య, రెండు ఏట్రి యమ్‌ల మధ్య ఏర్పడే రంధ్రం. ఈ ఫోరమెన్‌ ఒవేల్‌ సాధారణంగా శిశువు తీసుకునే మొదటి శ్వాసతో మూసుకుపోతుంది. కొన్ని సంద ర్భాల్లో ఇది ఫెయిల్‌అయి, ఇంకొన్నిసార్లు అరు దుగా సంవత్సరాల తరబడి ఇది మిగిలిపో తుంది. ఈ పదం రంధ్రం అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే శిశువు పుట్టేటప్పుడు రెండు ఏట్రియమ్‌ల మధ్య సంబంధం తెగిపోతే ఏర్పడుతుంది.

విభాజకంలో లోపం (సెప్టల్‌ డిఫెక్ట్‌)
దీనినే కొన్నిసార్లు గుండెలో రంధ్రం అంటారు. గుండె కుడి, ఎడమ గదులను వేరు చేసే కండరం తాలూకు గోడను సెప్టమ్‌ అంటారు. శిశువు ఈ రంధ్రంతో జన్మిస్తే రక్తం గుండె ఎడమ వెనుకభాగంనుంచి కారి కుడిభాగంలోకి వస్తుంది.
ఇది చిన్నదయితే చిన్న సమస్యలు ఉంటాయి. ఇది పెద్దదయితే పిల్లలు శ్వాస తీసుకోలేకపోతారు. సమస్యలు పెద్దవవుతాయి. ఎదుగుదల ఉండదు.

ఎఎస్‌డి
గుండెలో రెండు కర్ణికల మధ్యగల విభా జకంలో లోపం. అంటే రంధ్రం పై గదులు కుడి కర్ణిక, ఎడమ కర్ణిక మధ్య ఏర్పడిందని అర్థం. ఎందుకటే ఒత్తిడి గుండెకు ఎడమవైపు ఎక్కువగా ఉంది. రక్తం ఈ రంధ్రం ద్వారా ఎడమనుండి కుడికి ప్రవహిస్తుంది. శిశువు పుట్టక ముందు ఒక రంధ్రం ఉంటుంది. జన్మించే సరికి అది మూసుకుపోతుంది. ఒకవేళ మూసుకోకపోతే కొన్ని లక్షణాలు -

1) శ్వాస రేటు తగ్గిపోవడం లేదా శ్వాస పీల్చడం కష్టం కావడం
2) గుండె దడ, లేదా గుండె వేగంగా కొట్టుకోవడం (పాల్పిటేషన్స్‌)
3) ఎదుగుదల నిలిచిపోవడం
ఎఎస్‌డి ఉన్నప్పటికీ, పిల్లల స్కూల్‌ జీవితం అయ్యే వరకూ బైటపడకపోవచ్చు. కుడి జఠరిక క్రమంగా పెరుగుతుంది. ఇదిపెద్దయ్యాకా సమ స్యలు సృష్టిస్తుంది. వీరికి గుండె లయ తప్పి కొట్టుకోవడం, లేదా గుండె ఫెయిల్‌ కావడం సంభవిస్తుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే గుండెకు రక్త ప్రసరణ సరిపడా లేదా శరీర అవ సరాలకు సరి పడినంత లేదని అర్థం. తద్వారా ద్రవం శరీ రంలో నిలిచిపోతుంది. ఉదాహరణ : ఊపిరి తిత్తులు, కడుపు, లివర్‌, కాళ్లు.

ఎలా నయం చేయాలి?
దాదాపు 40 శాతం మందికి రెండు సంవ త్సరాల వచ్చేసరికి ఎఎస్‌డి సహజంగా మూసు కుపోతుంది. తరువాత సహజంగా మూసుకు పోవడం అరుదు. అందువల్ల శస్త్ర చికిత్స ద్వారా మూసివేయవచ్చు.
క్యాథ్‌ ప్రొసీజర్‌ : కొంతమంది వైద్యులు శస్త్ర చికిత్స అవసరం లేకుండా కూడా క్యాథటరై జేషన్‌ అనే పద్ధతి ద్వారా ఒక పొడవైన సన్నని గొట్టం (క్యాథటర్‌) శరీరంలోకి చొప్పించి టైనీ పరికరాల ద్వారా రంధ్రం మూసివేసి క్యాథటర్‌ తీసివేస్తారు.
శస్త్ర చికిత్స : 99 శాతం ఎఎస్‌డిలు సక్సెస్‌ అవుతాయి. చిన్న తనంలో శస్త్ర చికిత్స చేస్తే గుండె పరిమాణం 4 నుండి 6 నెలల్లో సాధారణ స్థితికి చేరుకుంటుంది.

విఎస్‌డి
వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌. ఇది కూడా ఒక రంధ్రం. ఇది గుండె కింది గదులను వేరు చేస్తుంది. సాధా రణంగా ఎడమ కుహరం మంచి రక్తాన్ని, ఆక్సిజన్‌ను అంద జేస్తుంది. రక్తాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో విఎస్‌డి ఉంటే కొంత రక్తం ఈ రంధ్రంలో పడుతుంది. ఇది సాధారణ ప్రసర ణకు ఆటంకం కలుగుతుంది. ఇంతే కాక, కుడి ఎడమ జఠరికలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు పని ఒత్తిడి గుండె పరిమాణం పెరగడానికి దోహద పడుతుంది.

విఎస్‌డి లక్షణాలు
శ్వాస రేటు తగ్గిపోవడం, చర్మం పాలిపో వడం, వేగంగా శ్వాస తీసుకోవడం, నాడి వేగం పెరగడం, తరచుగా శ్వాస పీల్చడంలో ఇన్‌ఫెక్షన్‌లు, పెరుగుదల మందగించడం. పుట్టిన కొన్ని వారల వరకూ ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.

ఎలా నయం చేయాలి?
చాలామందికి విఎస్‌డి ఉంటే శస్త్ర చికిత్స అవసరం రాకపోవచ్చు. మొదటి 4 సంవత్సరా లలోపు ఇది సాధారణంగా మూసుకుపోతుంది. లేదా చిన్నగా ఉండి శరీరానికి, గుండెకు హాని చేయనంతగా ఉంటుంది.
ఒకవేళ విఎస్‌డి పెద్దది అయితే శస్త్ర చికిత్స అవసరం. పల్మొనరీ ఆర్టరీ బాండింగ్‌ అనేది ఒక రకమైన పద్ధతి.
దీనిలో రక్త ప్రసరణపై ఒత్తిడి బాండ్‌ సహాయంతో తగ్గిస్తారు. తరువాత పాప / బాబు పెద్దయిన తరువాత ఈ బాండ్‌ తొలగించి, విఎస్‌డిని ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సహాయంతో పూర్తి చేస్తారు. ఒకవేళ రంధ్రంమరమ్మతు అవసరమైతే దాని అంచులు కుట్టివేస్తారు. ఒక కప్పుతో మూసివేస్తారు.

మనం ముందుగా రంధ్రం అన్నది ఉందని తెలుసుకుంటే కార్డియాలజిస్ట్‌ సహాయంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మందులు ఏవి వాడాలో పాటించడం అవసరం. పిల్లల్లో ఈ రంధ్రాలు ఉంటే అవసరమైతే వెంటనే శస్త్ర చికిత్స చేయాలి.

  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.