Tuesday, February 22, 2011

నొప్పి-వ్యాయామం ,Pain and Exercise


  • http://2.bp.blogspot.com/_DP4mgmsZ7NQ/TMgqDwdQL1I/AAAAAAAABFg/-JBTiqLWi0I/s1600/Exercises+after+delivery.jpg
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నొప్పి-వ్యాయామం (Pain and Exercise)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వ్యాయామ జీవితం :
చాలామంది వ్యాయామానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వరు. సన్నబడటం, మధుమే హాన్ని నియంత్రించుకోవటం వంటి వాటి కోసమే వ్యాయామాలు చేయాలి అనుకుంటారు. లేదా వ్యాయామనేది క్రీడాకారులకు సంబంధిం చిన వ్యవహారమనుకుంటారు.కానీ ప్రతివారూ వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా నడుము నొప్పితో బాధపడేవారికి వ్యాయామ చికిత్స అద్భుతంగా పని చేస్తుంది. శరీర నిర్మాణం, కండరాల శక్తి సామర్థ్యాలు, వ్యాధి తీవ్రత, ఇతర వ్యాధుల ప్రభావం వంటి అంశాల ఆధారంగా వ్యాయామ చికిత్సను వ్యక్తి గతంగా సూచించాల్సి ఉంటుంది.

-వెన్ను నొప్పిలో వ్యాయామం కీలక పాత్ర పోషి స్తుంది. మామూలు సందర్భాలలో నొప్పి ఉన్న ప్పుడు శారీరక కదలికలు తగ్గుతాయి. దీని పర్య వసానంగా నడుము కండరాలు దృఢత్వాన్ని కోల్పోయి శక్తిహీనంగా మారుతాయి. కొద్దిపాటి పనికే కండరాలు సడలిపోయి నొప్పి బయలు దేరుతుంది.

దీనిని చక్కదిద్దాలంటే నడుము కండరాలు తిరిగి దృఢంగా, బలంగా తయారు కావాలి. అప్పుడు ఇవి అదురును, దెబ్బలనూ కాచుకుని, వెన్నుపామును కాపాడుతాయి. వ్యాయామాల వలన శరీరంలో ఎండార్ఫిన్స్‌ విడుదలై నొప్పిని సహజమైన రీతిలో తగ్గిస్తాయి. ఇంతే కాకుండా, వ్యాయామాల వల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి.

1. శరీరంలో కదలికలు మెరుగుపడి కొయ్య బారినట్లు ఉండటమనేది తగ్గుతుంది. 2. కండ రాల్లో దృఢత్వం, శక్తి సామర్థ్యాలు పెరుగు తాయి. 3. సాధారణ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
చాలామంది వ్యాయామాలు చేయమనప్పుడు నొప్పి పెరిగినట్లుగా ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా నొప్పి పెరగడమనేది సహజ పరిణామమే. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే మాత్రం వ్యాయా మాలు అల్పస్థాయిలో మొదలెట్టి క్రమంగా మోతాదు పెంచుకుంటూ వెళ్లాలి. అంతేకాని, నొప్పి వస్తున్నదనే కారణంతో మానేయకూడదు. వ్యాయామ సమయంలో జనించే నొప్పికి ఐస్‌క్యూబ్స్‌ను, హాట్‌వాటర్‌ బ్యాగ్‌లను మార్చి మార్చి ప్రయోగించవచ్చు.

నడుము నొప్పిలో ఉపకరించే వ్యాయామా లను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి- శరీరాన్ని సాగదీస్తూ చేసే వ్యాయామాలు (స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌)కండరాలను స్థిరంగా, శక్తివంతంగా చేసే వ్యాయామాలు (స్టెబిలైజింగ్‌ ఎక్సర్‌సైజెస్‌) సాధారణ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వ్యాయామాలు (జనరల్‌ ఎక్సర్‌సైజెస్‌)

శరీరంలో కేవలం నడుము నొప్పే కాకుండా ఇతర జాయింట్ల నొప్పులున్న వారు కూడా ఈ తరహా వ్యాయామాలను చేయవచ్చు. కాకపోతే ఏది చేయాలి? ఏది చేయకూదనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

వెన్ను నొప్పిని తీవ్రతరం చేసే అంశాలు
ఒకమనిషి ఉన్నట్లుగా మరొకరు ఉండరు. గుణగణాలనుంచి శారీరక లక్షణాల వరకూ అన్ని టిలోనూ తేడాలు ఉంటాయి. ఒక్కొక్క శారీరక ప్రకృతికి ఒక్కొక్క అంశం ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. నాడి, ఆకృతి, నాలుక, స్పర్శ వంటి ఎనిమిది రకాల పరీక్షలను అష్టస్థాన పరీక్షలం టారు. వీటిని ఆధారం చేసుకుని చికిత్సను సూచించాల్సి ఉంటుంది.
మనందరిలోనూ కొన్ని సామాన్య లక్షణాలు న్నట్లుగానే కొన్ని సామాన్య వ్యాధి కారకాలు కూడా ఉంటాయి. నడుము నొప్పిని కలిగించే సామాన్య హేతువులను తెలుసుకుందాం.

ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం: ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ వాడకం అనివా ర్యమైపోయింది. అలాగే ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుని పని చేయాల్సిన వృత్తులు కూడా ఎక్కువైపోతున్నాయి.
కుర్చీలో ఒంగిపోయి లేదా చేరగిలపడి పని చేసే వారిలో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన భంగిమలో కూర్చోవటం అలవ ర్చుకుంటే నడుము నొప్పి బాధించదు.

వాహనాలు సరిగ్గా నడపకపోవడం
వాహనాలు మన జీవితంలో నిత్యావసరా లైపోయాయి. నేటి కాలంలో నడుము నొప్పికి దారి తీసే అతి పెద్ద కారణం వాహనాలను సక్ర మంగా నడిపించక పోవడమే.

వాహనం సీటును, స్టీరింగ్‌ లేదా హ్యాండిల్‌ ఎత్తుకు సరిపోయే విధంగా అమర్చు కోవడం ముఖ్యం. అవసరమైతే సీటుమీద మరొక కుషన్‌ వేసుకుని సరైన ఎత్తుకు చేరుకోవచ్చు. ఒకవేళ కారులాంటి నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారైతే నడుము వంపునకు అనుగుణంగా సీటు ఆకృతిని మార్చుకోవాలి.

సీటును మార్చడం కుదరకపోతే ఏదైనా బట్టను చుట్టి నడుము వంపు దగ్గర అమర్చు కున్నా సరిపోతుంది. మార్కెట్‌లో వీపు ఆకృతికి అనుగుణంగా తయారు చేసిన కుషన్లు దొరుకు తున్నాయి. వాటిని వాడవచ్చు. దూర ప్రయా ణాలు చేసేవారు ప్రతి గంటకూ ఐదేసి నిము షాల విరామం తీసుకోవాలి.

అలవి కాని బరువులను లేపడం
సాధ్యమైనంత వరకూ అధిక బరువులను లేపకూడదు. ఒకవేళ లేపాల్సి వస్తే బరువును శరీరానికి దగ్గరగా ఉంచుకుని మోకాళ్లు వంచి లేపాలి. బరువులను ఎత్తేప్పుడు పాదాలను ఎడంగా ఉంచడం మర్చిపోకూడదు.

ముందుకు వంగి పని చేయడం
బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, కుట్టు మిషన్‌పై పని చేయడం, మట్టి తవ్వడం వంటివి చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందుకు వంగాల్సి వస్తుంది. ఇలా ముందుకు వంగి పని చేసే వారిలో చాలామందికి నడుము నొప్పి వస్తుంది. వృత్తిరీత్యా చేయాల్సి వచ్చే ఇటువంటి రోజువారీ పనులను కొద్దిపాటి మార్పులు, చేర్పులతో చేసుకుంటే నడుము నొప్పి బాధించదు.
మానసిక ఆందోళన
అన్ని వేళలా ఉత్కంఠత, ఆందోళన అనుభ వించే వారిని నడుము నొప్పి ఎక్కువగా బాధి స్తుంది. మానసిక ఆందోళన వలన కండరాలు బిగదీసుకుపోయి రక్త సరఫరా తగ్గుతుంది. నడుము భాగంలో అనేక నిర్మాణాలు కొద్ది ప్రదే శంలో ఇరుకుగా అమరిఉండటంతో టెన్షన్‌ పెరిగి నప్పుడల్లా రక్త సరఫరా తగ్గి కండరాల్లో మలి నాలు సంచితమవుతాయి. దీని పర్యవసానంగా నడుము నొప్పి వస్తుంది.


సూచనలు
బెల్టుల పాత్ర : నేటికీ చాలామంది డాక్టర్లు నడుము నొప్పికి లంబో సాక్రల్‌ బెల్ట్‌ (కార్సె ట్‌)ను సూచిస్తున్నారు. అయితే ఈ బెల్టుల వలన ఆశించినంత ఫలితం కనిపించడం లేదు.
నడుము కదలికలను నియంత్రించాలని లేదా శరీరపు పైబరువును మోయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది డాక్టర్లు వీటిని సిఫార్సు చేస్తు న్నారు. కొద్దికాలంపాటు వీటిని వాడితే ఎలాంటి నష్టమూ ఉండదు.

ఈ బెల్టులు ఎక్కువ కాలం వాడితే కదలికలు తగ్గిపోవటం వల్ల కండరాలు క్రమంగా సన్నబడి పోయి డీలాపడతాయి. శరీరపు బరువును మోసే శక్తి సామర్థ్యాలను కోల్పోతాయి. అంటే వీటి వల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ గా జరుగుతుందన్నమాట.
చికిత్సగా మసాజ్‌ : శాస్త్రీయ పద్ధతిలో చేసే మసాజ్‌ వలన నిశ్చయంగా ఫలితం ఉంటుంది. థెరాప్టిక్‌ మసాజ్‌ అంటే కండరాల అమరికను, మానవ శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని చేసే చికిత్స. దీనిలో నిలబడటం, కూర్చోవటం వంటి వ్యక్తిగత భంగిమలను సైతం పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.