-ఆధునికత పెరిగిన కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, పొగతాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా సమస్యల కు కారణమవ్ఞతున్నాయి. అలాంటి వాటిలో సంతానలేమి కూడా ఒకటి. ప్రతి ఇరవై జంట ల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. అందుకే సంతాన సాఫల్యత కేంద్రా లకు వచ్చే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సాధారణంగా పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఏడాదిలోపైతే 75 శాతం అవకాశం ఉంటుంది. 85 నుంచి 90 శాతం మందిలో పెళ్లయిన రెండేళ్లలోగా గర్భం రావచ్చు. రానియెడల ఆ స్థితిని ప్రాధమిక సంతానలేమి (primary ifertility) అంటాము .
పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?,
పెళ్లవగానే అందరూ ఎదురుచూసే తీపి కబురు కొత్త పెళ్లికూతురు నెల తప్పడం. కొంతమంది ఈ కబురు త్వరగా చెప్పేస్తారు. మరికొంతమందికి ఇలాంటి కబురు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు .కారణము తెలియదు .
ఎవరు కారకులు?
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇటువంటి కేసుల్లో 33 శాతం మగవారు, 33 శాతం ఆడవారు కారణం కాగా మిగిలిన 34 శాతానికి కారణాలు పూర్తిగా తెలియరావడం లేదు. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దీనివల్ల కొంతమందికి సంతాన సామర్ధ్యం ఉండడం లేదు. వేగంగా వాహనాలు నడపడం, అతిగా మద్యం సేవించడం, తినకూడనివి తినడం వంటి వాటివల్ల మగవారిలో పునరుత్పత్తి శక్తి దెబ్బతింటోంది. కొంతమంది మగవారిలో 35 సంవత్సరాలకే వీర్యంలో క్వాలిటీ తగ్గిపోతోంది. అటువంటి వారికి పిల్లలు పుట్టించే సామర్ధ్యం క్షీణించిపోతుంది. కొన్ని పరిశ్రమల్లో పనిచేసే మగవారి వృషణాలు ఎక్కువ ఉష్ణానికి గురికావడం వల్ల వారి వీర్యం పలుచబడిపోయి సంతానం పొందే సమర్థత కోల్పోతున్నారు. చిన్నతనంలో గవదలు వంటి రోగాల వల్ల శాశ్వతంగా వృషణాలు హానికి గురవుతుంటాయి.
మగవారిలో వంధత్వానికి కారణాలు
* ఏదో ఒక రకమైన అనారోగ్యం
* వైద్య చరిత్ర (గవద బిళ్లలు, సుఖరోగాల వంటివి)
* శస్త్రచికిత్సల చరిత్ర (వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా మరమ్మతు, శస్త్రచికిత్స వంటివి)
* వృత్తిపరమైన ప్రమాదాలు ( అధికంగా వేడికి గురికావడం, విష పదార్థాల ప్రభావానికి లోను కావడం వంటివి)
* ఔషధాలు (కీమోథెరపీ)
* పొగతాగడం, మద్యం సేవించడం.
ఆడవారిలో కారణాలు
*వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వైద్య చికిత్స చేయించినా ఇటువంటి వారిలో సత్ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తక్కువ వయసుగల యువతుల్లో అండాశయం పలుచగా ఉంటుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.
* గైనకాలజీ పరిస్థితులు
* అండాశయం సరిగా పనిచేయలేకపోవడం, రుతుస్రావం బాగా తగ్గిపోవడం, సెర్వికల్ మ్యూకస్ లోపాలు, యుటిరిన్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్... మొదలైనవి.
* సంధాన సమస్యలు
* క్రమరహిత రుతుస్రావం
* పెల్‌విక్ ఇన్‌ఫెక్షన్స్ (ప్రస్తుతం లేదా పూర్వం)
* టి.బి (క్షయ) వంటి ప్రస్తుత రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
90 శాతం స్త్రీలు ఏడాదిలోపుగానే గర్భం ధరిస్తారు. క్రమం తప్పకుండా శృంగార జీవితం గడిపే దంపతుల విషయంలో 95 శాతం స్త్రీలు రెండు సంవత్సరాలలోపు గర్భం ధరిస్తారు. ఈ కాల వ్యవధిలో సంతానం కోసం చికిత్స అవసరం లేదు. ప్రయత్నించినా సాధారణంగా వైద్య చికిత్సకు వైద్యులు ఇష్టపడరు. ఈ సమయం దాటితే స్పెషలిస్టుని సంప్రదించడం మంచిది.
వైద్యుని దగ్గరకి ఎప్పుడు వెళ్లాలి?
*పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలుగకపోతే ,
*స్త్రీ వయసు 38 సంవత్సరాలు దాటితే ,
*మగవారిలో తక్కువ లేదా అసాధారణ వీర్య కణాలు ఉన్నప్పుడు.
*వంధత్వానికి కారణాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వైద్యచికిత్స ప్రారంభిస్తారు.
కొన్ని ముఖ్య సంగతులు
పిల్లలు కలుగని దంపతుల్లో 15శాతం మందిలో లోపానికి ఒకటికి మించి కారణాలు ఉంటాయి. మగవారికి వీర్యపరీక్ష ప్రాథమిక పరిశోధనగా చేయిస్తారు. వీర్యం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోతే రెండు లేదా మూడు నెలల కాలవ్యవధిలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వైద్యచికిత్సలు అవసరం మేరకు అందిస్తారు. ఆడవారి విషయంలో వైద్య పరీక్షలు కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. రుతుచక్రంలో వేర్వేరు సమయాల్లో అనేక హార్మోన్ల స్థాయిని కనుగొంటారు. దాన్ని బట్టి అండాశయంలో అండం విడుదల లోపాలను తెలుసుకుంటారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ఆడవారిలో 20 శాతం మందికి అండాశయ సమస్యలు ఉంటాయి. క్రమ పద్ధతిలో అండం విడుదల కాకపోతే హార్మోన్ల చికిత్స చేస్తారు. ఆడవారికి సెర్వికల్ మ్యూకస్ దళసరిగా తయారై ఉండడం, మగవారికి శీఘ్రస్కలనం, మగతనం లేకపోవడం లేదా తదితర శారీరక అసాధారణాలు ఉంటే స్త్రీ సెర్విక్సులోకి వీర్యాన్ని పంపుతారు.
ఇటువంటి చికిత్స ఆరోగ్యకరమైన ఫెలోపియన్ ట్యూబులు గల ఆడవారికే వీలవుతుంది. గర్భం ధరించే అవకాశాలు పెంచేందుకు స్త్రీలకు ఫెర్టిలిటి ఔషధాలు ఇస్తారు. దీనివల్ల అండాశయం నుండి కనీసం ఒక అండమైనా విడుదలయ్యేందుకు ఉత్తేజం కలుగుతుంది. కొంతమందికి అండంతో వీర్యకణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లో సాధారణ పరిస్థితిలో కలవడం చాలా కష్టం లేదా అసంభవం కావచ్చు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా శరీరానికి వెలుపల ఒక గ్లాసు డిష్‌లో వీర్యం, అండం ఫలదీకరణ చెందిస్తారు. దీనినే కల్చర్ డిష్ అంటారు. సంతానం పొందేందుకు ఇంకా ఎన్నెన్నో అధునాతన విధానాలు అమల్లోకి వచ్చాయి. కేసును బట్టి వైద్య నిపుణులు తగిన పద్ధతి ఎన్నుకుంటారు.
ఇంకా కొన్ని కారణాలు :
హార్మోన్లలో తేడాలున్నా,
గర్భాశయంలో అనుకూల పరిస్థితులు లేకపోయినా గర్భం నిలవదు.
అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయకున్నా,
లోపభూయిష్ఠ అండాలు విడుదలైనా,
ఫెలోపియన్ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు. అంతేకాదు ,
క్షయ, వ్యాధులుంటే ,
ఎండోమెట్రియాసిస్ వ్యాధులుంటే ,
గర్భా శయం, దాని ముఖద్వారంలో చిక్కని ద్రవాలు ఉత్పత్తి అయి అడ్డు యేర్పడినా.
ఈ ద్రవాల గాఢతలో చాలా మార్పులు ఉం టాయి. అందువల్ల వీర్యకణాలు లోపలికి రాలేవు . పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉం డటం ఎక్కువ మందిలో కనిపి స్తుంది. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ వీర్యం లో 60 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే సం తానం కల గడం కష్టమవ్ఞతుంది. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ పరీక్ష చేస్తే తప్ప లోపం ఎవరిలో ఉందో, సమస్యకు పరిష్కారం ఏమిటో తేలదు.
ఫెలోపియన్ ట్యూబ్‌లో లోపం ఉన్నప్పుడు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలా వీలుపడకపోతే ఐవిఎఫ్ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు. ఈ విధానాన్నే టెస్ట్ ట్యూబ్ పద్ధతి అంటారు. గర్భాశయ ముఖద్వారం లో సమస్యలుంటే ఐయుఐ పద్ధతి ద్వారా కృత్రిమంగా వీరాన్ని సరాసరి గర్భాశయ ముఖద్వారం వద్దకు పంపిస్తారు.
వీర్యకణాలు అతి తక్కువ ఉన్న యెడల ఇక్సీ టెక్నిక్ ద్వారా సంతానప్రాప్తి కలిగించవచ్చు. వీర్యంలో కణాలు లేకుంటే నేరుగా బీజము నుండి కణాలను తీసే పద్ధతిలో సంతాన ప్రాప్తిని కలిగించవచ్చు. సాదారణముగా వీర్యకణాలు 60,000,000/క్యూబిక్ మి.మీ. ఉండాలి .
- ===========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.