Friday, February 18, 2011

ఎక్కిళ్ళు- ఇబ్బంది, Hiccoughs-disturbence

 •  
 •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎక్కిళ్ళు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-ఎక్కిళ్లను నిత్యజీవితం లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొం టారు. ఎక్కిళ్లు డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన 'ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది.

ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో 'హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

కారణాలు :
ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే
మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల,
విష పదార్థాల సేవనం వల్ల,
శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల,
కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
ఆదుర్థా, భయం, దు:ఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్లు రావచ్చు.
ఎక్కువ మసాలా పదార్ధాలు ఉన్న ఆహారము తినడం వల్ల ,
కారము ఎక్కువగా ఉన్న ఆహారము భుజించడం వలన ,
సుగరు వ్యాధి ముదినపుడు ,
ఎక్కువగా మందు (సారా) త్రాగడం వల్న ,
ఎక్కువగ పొగ త్రాగడం వలన ,
నోటి పూత తో బాధపదుతున్నా,
ఉదరకోశ క్యాన్సర్ ఉన్నపుడు ,
కామెర్ల జబ్బు తో బాదపడుతున్నపుడు ,
తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు లతో బాధపడుతున్నపుడు ,
తీవ్రమైన అజీర్ణవ్యాదులతో బాదపడుతున్నపుడు ,
అంటే నిజానికి ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.


ఆయుర్వేధిక చిట్కాలు :
 • పంచదారను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • క్కోసారి మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
 • పచ్చి తాటాకు నమిలి ఊటను మింగుతే ఎక్కిళ్లు పోతాయి.దయం,
 • సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
 • నేల ఉసిరి ఆకుల్ని నమిలి మింగటం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిల్లు ఆగుతాయి.
 • తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.
 • రాతి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.ప్రతిరోజూ వీటి రసం తాగినా ఎక్కిళ్లు పోతాయి.
 • కొబ్బరి బోండాం నీళ్లు తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని తాగినా, నిమ్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • జామకాయను తిన్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • శొంఠి లేదా కరక్కార పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకున చెంచాడు తేనెను కలిపి చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటే ఎక్కిళ్లు పోతాయి.
 • విటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.
 • వేపాకు పొడి, ఉసిరిక పొడిని సమాన మెతాదులో తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
 • ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యకమైన వార్తను చెప్పాలి. దీంతో వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
 • ఆవాలను పొంగబెట్టి తాగిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి.
అల్లోపతిక్ చికిత్స :
Tab . backfen (antispasmodic) 1 tab 3 times /day for 3-4 days ,
Tab . Aceloc Rd (anti acidic) 1 tab 3 times /day for 3-4 days


ఎక్కిళ్లు వేధిస్తుంటే?--చిట్కాలు :

ఎక్కిళ్లతో ప్రమాదమేమీ లేకపోవచ్చు గానీ వచ్చినపుడు మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి. చిన్న చిట్కాలతో వీటిని తగ్గించుకునే అవకాశముంది.
* ఛాతీ నిండుగా గాలి పీల్చుకొని.. కొద్దిసేపు అలాగే పట్టి ఉంచండి. దీంతో డయాఫ్రం సర్దుకొని ఎక్కిళ్లు తగ్గటానికి తోడ్పడుతుంది.
* కాస్త చక్కెరను నోట్లో వేసుకొని చప్పరించండి. ఇది అన్నవాహికను ఒకింత చికాకు పరచి, మెడ నుంచి డయాఫ్రం వరకు వెళ్లే ఫ్రెనిక్‌ నాడి సర్దుకునేలా చేస్తుంది. లేకపోతే ఒక చెంచాడు వెనిగర్‌నైనా తీసుకొని చూడండి.
* వేడి సూప్‌ కూడా ఉపయోగపడొచ్చు. దీన్ని తాగినపుడు మనసు ఎక్కిళ్ల మీద కన్నా వేడి, మంట మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది.
* గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె కలిపి.. నాలుక వెనక భాగంలో వేసుకొని మింగి చూడండి. తేనె వేగస్‌ నాడిని సైతం ప్రేరేపిస్తుంది కాబట్టి ఎక్కిళ్లు తగ్గటానికి తోడ్పడుతుంది.
* కాగితం కవరులో ముఖాన్ని పెట్టి నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకొని చూడండి. ఇది రక్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులు పెరిగేలా చేస్తుంది. అప్పుడు మరింత ఆక్సిజన్‌ను లోనికి తీసుకోవటానికి డయాఫ్రం సంకోచించటం వల్ల ఎక్కిళ్లు తగ్గొచ్చు.


ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే...

ఒక్కోసారి కొందరికి ఎక్కిళ్లు అదేపనిగా వస్తుంటాయి. అలాంటప్పుడు మనకే కాదు, తోటివారికీ ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే తరచూ వచ్చే ఎక్కిళ్లను త్వరగా తగ్గించాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ప్రయత్నిస్తే

సరిపోతుంది.

అల్లం: చాలామంది వంటల్లో అల్లాన్ని వేస్తారు తప్ప తినడానికి ఇష్టపడరు. కానీ అల్లాన్ని సన్నగా తరిగి ఎక్కిళ్లు వచ్చినప్పుడు బుగ్గన పెట్టుకుని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. రెండు

చుక్కల వెనిగర్‌ని నాలుక మీద వేసుకుని చప్పరిస్తే, ఆ పుల్లదనానికీ ఎక్కిళ్లు ఆగిపోతాయి.

యాలకులు: ఎక్కిళ్లు అదే పనిగా వచ్చిపోతుంటే ఇలా చేయొచ్చు. కప్పున్నర నీళ్లలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించాలి. తరవాత వడకట్టి తాగాలి. ఆ నీళ్ల వల్ల గొంతూ, శ్వాసకోశ వ్యవస్థ ఉత్తేజితమై ఎక్కిళ్లు

తగ్గుతాయి. ఆ సమయంలో పెరుగులో ఉప్పు కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ఆవాలు: చిటికెడు ఆవాల పొడిలో అరచెంచా నెయ్యి కలిపి, ఆ మిశ్రమాన్ని తినేయాలి. ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి. తీపి పదార్థాలు నోట్లో వేసుకున్నా ఫలితం ఉంటుంది.

 • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.