ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ప్రోప్టోసిస్ (Proptosis)-గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కళ్లు ముందుకు పొడుచుకుని వస్తే?
సాధారణంగా కళ్లు ముందుకు పొడుచుకు రావడమనేది రెండు ప్రధాన కారణాల వలన జరుగుతుంటుంది.
ఒకటి, థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి చురుగ్గా తయారవడం (హైపర్ థైరాయిడిజం),రెండు కంటిలోపల కంతులవంటివి తయారవడం.
హైపర్ థైరాయిడిజంలో రెండు కళ్లలో ఒకటి తక్కువగానూ మరొకటి ఎక్కువగానూ ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తుంది.కంటికి సంబంధించిన కంతులున్నప్పుడు కేవలం ఒక కన్నే ముందుకు పొడుచుకు వచ్చి కనిపిస్తుంది. అయితే సరైన వ్యాధి నిర్ణయం జరగాలంటే సమస్యను మరింత లోతుగా విశ్లేషించడం అవసరం.
బరువు తగ్గడం
హైపర్ థైరాయిడిజంలో అకారణంగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి పని తీరు అతిగా వేగవంతమై హైపర్ థైరాయిడిజం ప్రాప్తించిన ప్పుడు చికిత్స తీసుకున్నా, తీసుకోకపోయినా, కంటి గోళం వెనుక భాగంలో ఒక రకమైన కొవ్వు పదార్థం పేరుకుపోతుంది. దీని పర్యవ సానంగా కళ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించడం, గుడ్లు అప్పగించి చూస్తున్నట్లు ఉండటం జరుగుతాయి. వైద్య పరిభాషలో దీనిని ప్రోప్టోసిస్ అంటారు. ఈ లక్షణంతోపాటు నాడి వేగం పెరగటం, చర్మం ఎర్రగా కమిలినట్లు ఉండటం, విరేచ నాలు, బరువు తగ్గడం, వేడి భరించలేకపోవడం వంటి లక్షణాలుంటాయి.
ఒక కన్నే ఉబ్బినట్లు ఉండటం
కంటి గోళం వెనుక పక్క ఏదైనా గ్రంథి లేదా కంతి పెరుగుతుంటే కేవలం ఆ ఒక్క కన్నే ఉబ్బినట్లు కనిపిస్తుంది.
ఈ పెరుగుదలలు ప్రమాదాన్ని కలిగించే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కానీ, ప్రమాద రహితమైన బినైన్ ట్యూమర్స్ కానీ, కంటి చూపును దెబ్బ తీసేవిగా కానీ, కంటి చూపుతో సంబంధం లేకుండా కాని ఉండవచ్చు. కంటి లోపల, లేదా కంటి వెనుక ప్రదేశంలో రక్తస్రావమైనప్పుడు కూడా ఇవే లక్షణం కనిపిం చవచ్చు. కన్ను ఉబ్బినప్పుడు ఈ లక్షణాల న్నింటినీ పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. హార్మోన్లు తీసుకుంటున్న స్త్రీలు తప్పనిసరిగా తరచుగా రక్తపోటును చూపించుకోవాలి.
- ===============================
Good information on your blog.. About the Eye Surgery is critical subject to my body. But latest technology is very helpful and successful for the hospitals. This technology is very costly so my country is former country. He does not offer table this costly surgery. But Dr.Rajeev Hardia Eye Surgery in indore provided this surgery is very low cost. They have very Well knowledgeable and experienced “Doctors” in these hospitals.
ReplyDelete