వేజర్ లైపోసక్షన్ అంటే ఏమిటి..?
వేజర్ అంటే వైబ్రేషన్ ఆంప్లిఫైడ్ స్టిమ్యు లేటెడ్ ఎనర్జీ అని అర్థం. ఇక శరీరంలో కొవ్వును తీసివేసే ప్రక్రియనే లైపోసక్షన్ అని అంటారు. లైపో అంటే కొవ్వు అని...సక్షన్ అంటే లాగివేయడం అని అర్థం. గత రెండు దశాబ్దాలుగా విదేశాల్లో దీన్ని ఎక్కువగా చేస్తున్నారు. అమెరికన్ ప్లాస్టిక్ సర్జరీ అసోసి యేషన్ లెక్కల ప్రకారం గత ఏడాది 16 లక్షల మంది లైపోసక్షన్ సర్జరీ చేయించు కున్నారు. మన దేశంలో కూడా గత ఏడాది నాలుగు లక్షల మంది ఈ ప్రక్రియ ద్వారా లబ్దిపొందారు. ఈ చికిత్సలో భాగంగా శరీ రంలో మూడు నుంచి నాలుగు మి.మీ.ల చిన్నపాటి రంధ్రాన్ని చేస్తారు. అనంతరం అందులో నుంచి వేజర్ ప్రోప్స్‌ను పంపించి కొవ్వును తీసి వేస్తారు. అల్ట్రా సౌండ్ ఎనర్జీతో సెకన్‌కు 36 వేల వైబ్రేషన్స్‌తో ఈ ప్రోప్స్ ద్వారా కొవ్వును తొలగిస్తారు. ఇలా కరిగించిన కొవ్వును తక్కువ పవర్ గల సక్షన్ ద్వారా తీసివేస్తారు. దీనిలో రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. ఒక లీటర్ కొవ్వులో 10 మి.లీ.ల కంటే తక్కువ రక్తం పోతుంది. 10 లీటర్లు తీసిన కేసుల్లో 100మి.లీ.ల రక్తం పోయింది.
ఎంత వరకు కొవ్వు తీయవచ్చు...?
ఈ ప్రక్రియలో భాగంగా ఒక సిట్టింగ్ ద్వారా 25 సంవత్సరాల వయస్సు లోపువారి నుంచి 12 లీటర్ల వరకు, 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు లోపు వారికి 8 నుంచి 10 లీటర్ల వరకు, 35 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారి నుంచి 8 లీటర్ల వరకు, 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారి నుంచి 5 లీటర్ల వరకు కొవ్వును తీసివేస్తారు. ఇక కొద్దిమందికి ఒకే సిట్టింగ్, మరికొందరు రెండు, మూడు సిట్టింగ్‌లు అవసరమవుతాయి. అంటే వయసుని బట్టి సిట్టింగ్స్, చికిత్స ఉంటాయన్న మాట.
ఎవరికి చేయవచ్చు...?
ఆరోగ్యంగా ఉండే ప్రతిమనిషికి ఈ లైపోసక్షన్ చికిత్స చేయవచ్చు. కానీ షుగర్ ఉన్న వాళ్లకి షుగర్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత, బిపి, థైరాయిడ్ ఉన్న వారికి అవి కంట్రోల్ అయిన తర్వాత ఈ చికిత్స చేస్తారు.
నొప్పులు ఉండవు...
ఈ సర్జరీని మూడు నుంచి నాలుగు గంటల వరకు చేస్తారు. ఈ సర్జరీ తర్వాత 24 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉంచుకొని తిరిగి ఇంటికి పంపిస్తారు. అనంతరం వారు రెండు, మూడు రోజుల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రక్రియలో నొప్పులు రావు. తర్వాత పనులన్నీ ఎప్పటిలాగే చేసుకోవచ్చు. కొవ్వును తీసివేసినా చర్మం వదులుగా మారదు. చర్మం వదు లుగా కాకుండా సర్జరీ తర్వాత ప్రెషర్ గార్మెంట్స్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ ప్రెషర్ గార్మెంట్స్‌ను ధరిస్తే చర్మం కింద ఉన్న లేయర్‌కు అతుక్కుపోతుంది.
సైడ్ ఎఫెక్ట్‌స లేవు...
లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా బలహీన పడతామని చాలామంది అపోహపడతారు. అది సరికాదు. లావుగా ఉండే పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని అందుకోసం వెంటనే సన్నగా మారేం దుకు లైపోసక్షన్‌ను ఆశ్రయించమని డాక్టర్లు కూడా చెబుతున్నా రు. సన్నగా మారిన వారికి బిపి, షుగర్, గుండె సంబంధిత వ్యాధు లనుంచి దూరంగా ఉండవచ్చు. ఇక ఈ శస్త్ర చికిత్సను లావుగా ఉన్న డాక్టర్లు కూడా చేయించుకుంటున్నారు.
అందుకే అందాన్ని కాపాడుకునే వాళ్ళు, ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈ సర్జరీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా వారు అయితే వారి అవసరాల రీత్యా దీన్ని ఆశ్రయిస్తున్నారు.
- డాక్టర్ నాగరాజ్,ప్లాస్టిక్ సర్జన్, ఆకృతి కాస్మొటిక్ సర్జరీ సెంటర్, అమీర్‌పేట్, హైదారాబాద్.
- ====================================
What would be the cost for liposuction?
ReplyDelete