Sunday, February 20, 2011

క్లాడికేషన్‌ ,Claudication


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -క్లాడికేషన్‌ ,Claudication- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-కాళ్లలో అప్పుడప్పుడు పిండుతున్నట్లు (క్రాంప్స్‌) ఉండే నొప్పి కలగడాన్ని ఇంటర్‌మి టెంట్‌ క్లాడికేషన్‌ అంటారు. కాళ్లకు రక్త సర ఫరా తగ్గడం వల్ల ఈ రకమైన నొప్పి వస్తుంది. సాధారణంగా పిక్కలు ఈ రకమైన నొప్పికి గురై నప్పటికీ, తొడ కండరాలు కూడా ఈ నొప్పికి గురవుతాయి.

రక్తనాళాల లోపలి భాగంలో అడ్డంకి ఏర్పడి రక్త వ్రవాహానికి ఆటంకం ఏర్పడే విధంగా అవి సన్నబడి పోవడాన్ని ఎథిరోస్ల్కీరోసిస్‌ అంటారు. ఇంటర్‌మిటెంట్‌ క్లాడికేషన్‌కు ఎథిరోస్ల్కీరోసిస్‌ ఒక ప్రధాన కారణం.
బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోనే 65 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో 10 శాతం మంది ఎథిరోస్ల్కీరోసిస్‌తో బాధపడు తుండగా, వారిలో 5 శాతం మంది ఇంటర్‌మి టెంట్‌ క్లాడికేషన్‌ సమస్యతో బాధపడు తున్నారు. సాధారణంగా 50 సంవత్సరాలు దాటిన పురుషుల్లో ఇంటర్‌మిటెంట్‌ క్లాడికేషన్‌ సమస్య కనిపిస్తుంది.

లక్షణాలు
కాళ్లలో ఎథిరో స్ల్కీరోసిస్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు క్లాడికేషన్‌కు గురైన వారిలో కనిపిస్తాయి. అవి
- సయనోసిస్‌
- జుట్టు రాలిపోవడం,
- శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం
- నాడి కొట్టుకునే వేగం తగ్గడం,
- చర్మపు రంగు మారడం,
- నొప్పి,
- స్పర్శ తగ్గడం
- పక్షవాతం
మొదలైనవి ప్రధానమైనవి.

క్లాడికేషన్‌కు కారణమయ్యే పిఎడి
పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌ను పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ (పిఎడి) అని, పెరిఫెరల్‌ ఆర్టరీ అక్లూజివ్‌ డిసీజ్‌ (పిఎఒడి) అని అంటారు. చర్మం కిందుగా ఉండే లేదా ఉపరితల ధమ నుల్లో (పెరిఫెరల్‌ ఆర్టరీస్‌) కలిగే ఆటంకం కార ణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
ఎథిరోస్ల్కీరోసిస్‌, రక్తనాళం కుంచించుకుపోవ డానికి కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియలు, రక్తపు గడ్డలు ఏర్పడటం మొదలైనవి రక్త ప్రసరణకు అంతరాయం కలిగించి తద్వారా పిఎడికి కారణమవుతాయి.

ఈ సమస్యను నాలుగు ప్రధాన దశలుగా వర్గీకరించవచ్చు. అవి - నడుస్తున్నప్పుడు మంద్రస్థాయిలో నొప్పి (క్లాడికేషన్‌), తక్కువ దూరం నడిచినప్పటికీ తీవ్రస్థాయిలో కాళ్లలో నొప్పి రావడం (ఇంటర్‌మిటెంట్‌ క్లాడికేషన్‌), విశ్రాంతి సమయంలో నొప్పి, కణజాలం నెమ్మ దిగా నశించిపోవడం (గాంగ్రీన్‌).

లక్షణాలు
క్లాడికేషన్‌ - నొప్పి, బలహీనత, రక్త సర ఫరా తగ్గినందున కండరాలు పట్టుకుపోవడం
పుండ్లు, గాయాలు మొదలైనవి అతి నెమ్మ దిగా తగ్గుతాయి. లేదా అసలు నయం కావు.
చర్మం రంగు మారడం (నీలి వర్ణంలోకి మారుతుంది.)

కారణాలు
ధూమపానం : ఏ రూపంలో పొగాకును ఉపయోగించినా అది పిఎడి సమస్యకు కారణ మవుతుంది. సాధారణ వ్యక్తులతో పోల్చిన ప్పుడు ధూమపానం చేసేవారు కనీసం పది రెట్లు అధికంగా ఈ సమస్యకు గురవుతారు.
మధుమేహం : పెరిఫెరల్‌ ధమనుల్లోని ఎండోథీలియల్‌, మృదు కణజాల పనితీరు దెబ్బతినే అవకాశం మధుమేహంతో బాధపడు తున్న వారిలో ఎక్కువగా ఉంటుంది. మధుమే హాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా పిఎడి వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నివారించుకోవడం సాధ్యమ వుతుంది.

డిస్లిపిడీమియా : మొత్తం కొలెస్టరాల్‌, ఎల్‌డి ఎల్‌ కొలె స్టరాల్‌, ట్రైగ్లిజరైడ్‌ల స్థాయి పెరిగితే పెరిఫెరల్‌ ఆర్టరీ అక్లూజివ్‌ డిసీజ్‌ (పిఎఒడి) సోకే అవకాశాలు కూడా అధిక మవుతాయి.
అధిక రక్తపోటు : అధిక రక్తపోటు కూడా పిఎడి సోకడానికి ఒక కారణంగా గుర్తిం చడం జరిగింది.
అంతేకాకుండా, 50 సంవత్సరాల వయ స్సు దాటిన పురు షుల్లో, స్థూలకా యుల్లో, గతంలో వాస్క్యులార్‌ వ్యాధికి గురైన వారిలో, గుండెజబ్బు, పక్షవాతం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ సోకే అవకాశాలున్నాయి.

నిర్ధారణ
కాళ్లకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో రక్తపో టును నిర్ధారించే పరీక్షలను చేయడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
యాంకిల్‌ బ్రేకియల్‌ ప్రెషర్‌ ఇండెక్స్‌ (ఎబిపిఐ) 0.9 కంటే తక్కువ ఉంటే పిఎఒడి ఉన్నట్లుగా భావించవచ్చు. 0.8 కంటే ఉంటే వ్యాధి ఒక మాదిరి స్థాయిలో ఉన్నట్లు, 0.5 కంటే తక్కువగా ఉంటే తీవ్రస్థాయిలో ఉన్నట్లు అర్థం.
ఎబిపిఐ పరీక్షలో ఫలితాలను అనుసరించి డాప్లర్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. అవసరాన్నిబట్టి సి.టి. స్కాన్‌ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.

క్లాడికేషన్‌కు చికిత్స
ధూమపానం కారణంగా ఈ సమస్య ఉత్ప న్నమైన వారిలో తక్షణమే ధూమపానం మాని వేయడం చాలా ఉత్తమమైన చికిత్సగా పేర్కొన వచ్చు.
మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన వాటిని నియంత్రించడానికి ఔషధాలు వాడి నట్లుగా, ఈ వ్యాధిలో వ్యాయామాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
తీవ్రమైన కేసుల్లో శస్త్ర చికిత్స ద్వారా ఆ అవయ వాన్ని తొలగించాల్సి వస్తుంది. రోగి పరిస్థితినిబట్టి వాస్క్యులార్‌ సర్జన్స్‌ కాళ్లలోని రక్తనాళాలకు (ధమనులకు) ఎండార్టెక్టమీ అనే శస్త్ర చికిత్సను కాని, ఆర్టీరియల్‌ బైపాస్‌ శస్త్ర చికిత్సను కాని చేస్తారు.

ఔషధాలు
యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ (ఎసిఇ) ఇన్హిబిటర్స్‌, బీటాబ్లాకర్స్‌ర్స్‌, కొన్ని రకాల పిడిఇ 3 ఇన్హిబిటర్స్‌ మొదలైన ఔషధాలను ఈ సమస్యలో ఉపయోగపడే ఔషధాలు.
  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.