Tuesday, February 22, 2011

పొలమారడం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పొలమారడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నప్పుడు అది పొరపా టున మన శ్వాసనాళంలోకి వెళ్లినప్పుడు దానిని బయటకు నెట్టివేయడానికి పొలమరిస్తూ దగ్గుతూ నానా తంటాలు పడతాము. ఇటువంటి సందర్భాలలోనే పెద్దవాళ్లు నెత్తి మీద అరచేతితో చిన్నగా చరుస్తూ 'ఎవరో తలచుకుం టున్నారు అంటూంటారు. పొలమరింతను కొద్ది నిము షాలలోపే తగ్గించకపోతే ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించడానికి అవకాశముంది.

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో డాక్టర్‌ను పిలవ డానికి అవకాశం ఉండదు. ఇంటిలోని వారే ఎవరో ఒకరు పూనుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సి ఉంటుంది. ఇది ఒక విధంగా ఎమర్జెన్సీలాంటిదే. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలనే విషయం ప్రతివారికీ తెలిసి ఉండటం అవసరం.

పొలమరింతకు సబంధించిన ఉక్కిరిబిక్కిరి (చోకింగ్‌) ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా అయిదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. వీళ్లు ఆటల్లో చిన్న చిన్న వస్తువులను నోటిలో పెట్టుకోవటం ఇందుకు కారణం.
చిన్న చిన్న గింజలు, ఆహారపు తునకలు మొదలైనవి వీళ్లకు ఎక్కువగా శ్వాసనాళాలలోకి వెళ్లి అడ్డు పడు తుంటాయి.
ఏవైనా తినడానికి పనికి వచ్చే పిండి, మిల్క్‌ పౌడర్‌, చక్కెర మొదలైనవి కూడా ఒక్కసారిగా నోటిలో వేసు కుంటూ ఉంటారు పిల్లలు. అదే సమయంలో గాలి పీల్చు కోవడానికి కూడా చేసే ప్రయత్నంలో ఆ పౌడర్‌ శ్వాస నాళంలోకి పోయి తీవ్రంగా దగ్గడం, ఉక్కిరిబిక్కిరి కావడం జరుగుతుంది.

పొలమరింత, దగ్గుతో కూడుకున్న ఉక్కిరిబిక్కిరి కలగ డానికి సాధారణంగా గబగబా తినడానికి ప్రయత్నించడం కారణమవుతుంది. పుట్టుకతో వచ్చే అంగుటి లోపాలు, పెద్ద పెద్ద టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ మొదలైనవి కూడా పొలమరింతకు కారణమవుతాయి.
మాటిమాటికీ జలుబుతో ముక్కు దిబ్బడ వేసేవాళ్లు నోటి ద్వారా గాలిని పీల్చే అలవాటు చేసుకుంటారు. అలాంటి పిల్లలు తరచుగా పొలమరింతలకు గురయ్యే అవకాశాలున్నాయి. మరీ బలహీనులు, జబ్బుతో ఉన్న వాళ్లకు తినడానికి సంబంధించిన అసంకల్పిత చర్యలు సరిగ్గా పని చేయవు.

పక్షవాతంతో బాధపడే రోగులకు కూడా మింగటానికి పనికి వచ్చే అసంకల్పిత చర్యలు సరిగ్గా పని చేయవు. ఇటువంటి వారికి తరచుగా ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు శ్వాసనాళంలోకి పోయి వాళ్లు పొలమరింత బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొందరు తల్లులు పిల్లలు ఏడుస్తున్నా బలవంతాన ముద్దలను నోటిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సందర్భాలలో కూడా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి పొల మరింతలు, ఒక్కొక్కసారి మరణం సంభవించే ప్రమాదా లున్నాయి.
స్పృహ తప్పి ఉన్న మనుష్యులలో వాంతి మొదలైనా, బాగా తాగి ఉన్న మనిషికి వాంతులు అవుతున్నా, ఆ వాంతులకు సంబంధించిన పదార్థాలు శ్వాసనాళంలోకి వెళ్లి చోకింగ్‌కు కారణమవుతాయి. స్పృహలో లేని వ్యక్తికి వాంతులు అవుతుంటే అతడిని బోర్లా పడుకోబెట్టడం మంచిది.

పొలమరింతతో మనిషి బాగా దగ్గుతున్నప్పుడు శ్వాస పీల్చుకోవడం కష్టసాధ్యమవుతుంది. ముఖం, కళ్లు ఎర్రగా అవుతాయి. పెదవులు, మెడ, వేళ్ల కొసలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి, ఆ భాగాలు నీలిరంగులోకి మారు తాయి. స్పృహను కోల్పోయి, శ్వాస నిలిచిపోయి ఆ వ్యక్తి మరణించవచ్చు.

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో డాక్టర్‌ను పిలిచేంత వ్యవధి ఉండదు. నిముషాలలోనేప్రమాదం ముంచుకు వస్తుంది. కనుక ప్రతివారూ పొలమరింత తీవ్రంగా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుని ఉండాలి.

చికిత్స
ఒక మనిషి పొలమరింతకు గురయినప్పుడు అతడికి మూడు విధాలుగా ఉపశమనాన్ని కలుగజేయవచ్చు.
1. వీపు మీద చరచడం - పొలమరిస్తున్న వ్యక్తికి ఎడమవైపు ఒక పక్కగా నిలబడి వీపుమీద అరచేత్తో నాలుగు సార్లు గట్టిగా చరచాలి.
చరుస్తున్న చేతిని కాక రెండవ చేతిని పొలమరిస్తున్న వ్యక్తి ఛాతీమాద సపోర్ట్‌ కింద అదిమిపెట్టి ఉంచాలి.
అలాగే పొలమరిస్తున్న వ్యక్తి తలను ఛాతీ మీదకు కొద్దిగా వంచుకునేట్లు చేయాలి.
ఒకవేళ పొలమరిస్తున్న వ్యక్తి మరీ చిన్నపిల్లవాడైతే తల కిందివైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులా మూసి ఉంచి ప్లిలవాడి వెన్నుకింద చిన్నగా చరుస్తుండాలి.

2. స్పృహ లేని వ్యక్తి విషయంలో - పొలమరింత మొదలైనప్పుడు రెండు చేతులతో అతడిని పొట్ట వద్ద పట్టుకుని నిలబెట్టటం లేదా కుర్చీలో కూర్చోబెట్టడం చేయాలి.

అప్పుడు అతడిని వెనుకనుంచి రెండు చేతులతో బొడ్డు పైభాగాన పొట్టమీద పట్టుకుని నాలుగు సార్లు గట్టిగా పై వైపునకు నొక్కాలి.
దాని వలన అతడి శ్వాసనాళంలోకి వచ్చినపదార్థం బైటికి వచ్చేయటానికి అవకాశం ఉంటుంది.
అలా కానిపక్షంలో రోగిని వెల్లకిలా నేలమీద పడుకోబెట్టి మీ కాళ్లను అటూ ఇటూ వేసి, మోకాళ్ల మీద నిలబడి అరచేతుల్తో రోగి బొడ్డు పైభాగాన పొత్తి కడుపు మీద ఛాతీవైపునకు నాలుగుసార్లు గబగబా నొక్కాలి.

3. పొలమరిస్తున్న వ్యక్తి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటనవేలును, మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెచరుకునేట్లుగా చేసి, మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలోకంటా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటికి లాగివేయడానికి చేసే ప్రయత్నం మూడవది.

ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్‌లాగా వంచి పట్టుకుని ఇవతలకు లాగాల్సి ఉంటుంది.
పై పద్ధతులేవీ పని చేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలి.

  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.