Saturday, March 19, 2011

ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి -లక్షణాలు,Aids disease spread and symptoms


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Aids- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

నిర్వచనము : -మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్‌ (హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్‌ లేదా హెచ్‌ఐవి) కారణంగా వ్యాధినిరోధక శక్తి నశించి, పలువ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌ లేదా ఎయిడ్స్‌ అని వ్యవహరిస్తాము. 25నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్స్‌.

ఇదే వయస్సున్న స్త్రీలలో మరణాలు సంభవించడానికి నాలుగవ అతి పెద్ద కారణం ఎయిడ్సే.

హెచ్‌ఐవి క్రిములు మానవ శరీరంలోకి ప్రవే శించి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి దానిని నిర్వీర్యం చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి నశించడంతో వివిధ రకాలైన ప్రాణాంతక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.

లక్షణాలు
హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తరు వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్‌ఐవి క్రిముల కారణంగా కాకుండా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి.

హెచ్‌ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపి స్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్‌ఐవి సోకిందనే అనుమానం కలుగకపోవచ్చు. హెచ్‌ఐవికి సంబంధించిన పరీక్షలను ఒకటికి రెండుసార్లు చేయించుకుని, స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు హెచ్‌ఐవి వ్యాధికి సంబంధించినవి నిర్ధారించకూడదు.

హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి చేరిన తరువాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాలనుంచి నెలల వరకూ పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయిం చుకుంటే హెచ్‌ఐవి పాజిటివ్‌ అని ఫలితం రాదు. అయితే, బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింప చేయగలిగే స్థితిలో ఉంటారు.

హెచ్‌ఐవి క్రిములతో పోరాడటానికి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయనారంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్‌ఐవి పాజిటివ్‌ అని ఫలితం వస్తుంది. హెచ్‌ఐవి శరీరంలోకి చేరిన తరువాత తొలిదశలో కనిపించే.. ఫ్లూ వంటి లక్షణాలు తగ్గి పోయిన తరువాత బాధితులు కనీసం పదేళ్ల వరకూ ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో హెచ్‌ఐవి క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి.

వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సిడి4 కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు. సిడి 4 కణాలను టి-హె ల్పర్‌ కణాలని కూడా అంటారు. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతులలో సిడి4 కణాలు ప్రతి మిల్లీ లీటర్‌ రక్తంలో 500 నుంచి 1500 వరకూ ఉంటాయి. సరైన చికిత్స తీసుకోని పక్షంలో సిడి4 కౌంట్‌ గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్‌ఐవి వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది.

--వ్యాప్తి
హెచ్‌ఐవి ప్రధానంగా మూడు రకాలుగా వ్యాప్తి చెందుతుంది.
1.అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలు కలిగి ఉండటం,
2. మాదక ద్రవ్యాలవంటి వాటిని తీసుకో వడానికి ఒకే సిరంజిని, సూదిని పలువురు కలిసి ఉపయోగించడం.
3.రక్తమార్పిడి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

తల్లి గర్భంలో ఉండే శిశువుకు తల్లినుంచి ఈ వ్యాధి శిశువు గర్భంలో ఉన్నప్పుడు కాని, జనన సమయంలో కాని వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ వంటివి సరైన విధంగా శుభ్రపరచి వాడకపోతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

ఎలా వ్యాపించదు?
హెచ్‌ఐవి బాధితుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అలాగే హెచ్‌ఐవి బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు

లేవు. దోమలు కుట్టడం ద్వారా హెచ్‌ఐవి వ్యాప్తి చెందదు. తుమ్ములు, దగ్గు, ఇంట్లో వస్తువు లను కలిసి ఉపయోగించుకోవడం మొదలైన వాటి వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.

  • ఎఆర్‌టి మందులతో హెచ్‌ఐవి నివారణ

హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తల్లులకు లేదా పాలుతాగే పిల్లలకు 28 వారాలపాటు యాంటి రిట్రోవైరల్‌ మందులు ఇవ్వడం వల్ల హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ తల్లి నుండి బిడ్డకు సంక్రమించడాన్ని నివారించొచ్చని పరిశోధకులు తెలిపారు. భారీ స్థాయిలో యాదృశ్చికంగా జరిగిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని తెలిపాయి. యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరొలినా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

For some more information : see Wikipedia.org/
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

24 comments:

  1. if a person got hiv positive now he is taking treatment 6months later he check the cd4 test again., please tell me how many cells above it is not required to take tablets

    ReplyDelete
  2. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు. నార్మల్ గా 500 -1500 /మైక్రోలీటర్ . ఈ రేంజ్ లో ఉంటే వైరల్ మందులు వాడనవసరము ఉండదు . మిగతా జబ్బులేమైనా (ఉదా. టి.బి )ఉంటే వాటికి సంబంధించి చికిత్స తీసుకోవాలి .

    ReplyDelete
  3. HELLO SIR AM RAJU FROM JANAGAM......na friend ki hiv vundi ani naku anumanam ga undi....nduku ante ataniki muthra pindala dagara water vachindi .docter dagaraku velte water ni thesasadu but docter edi common ga vastadi ani anadu......kani naku anumanam ga undi .atanini hiv test ki ela theska povali test ki veldam ante godava chestadamo ani bayam vestundi...epudu nenu em cheyali..e lakshanalu hiv ki dari thestaia will u please replay here...............

    ReplyDelete
    Replies
    1. Babu Raju,

      Athani blood thisukuni vellu

      Delete
    2. Babu Raju, athani Blood sample thisukuni velu

      Delete
  4. hello sir na peru mahesh ma frn satish apple juice tagadu kani dantlo tanu gittani vallu hiv blood kaliparanta tanaki aids vache avakasam vundemo ani anumanam ila edo oka tine dantlo kalisi vunte aids vastunada sir

    ReplyDelete
  5. good evng sir na peru shiva nenu oka ametho sex lo palgonna ame na classmate thanaki marriage aindi aina few days ke nenu thanatho sex lo palgonna aithe ha time lo condom use cheyaledu kabatti maku HIV soke chance unda sir please give me reply sir..........

    ReplyDelete
  6. hello sir good evening nenu na neighbor aunty tho sex lo palgonna. aithe ha time lo nenu condom use cheyaledu kabatti maku HIV vache chance unda sir Please give me reoly sir...........

    ReplyDelete
  7. hello sir good evening nenu oka amai tho sex lo palgonna. ameku hiv undo ledho telvadhu. nenu enni days tarvatha test cheinchu kunte manchidhi?
    plz sir give me reply

    ReplyDelete
  8. hello sir, nanu Hyd lo road side tatto veyinchukunanu, Apudu atanu sudi, ink, marchaledu ipatiki * months ayindi naku hiv undemo ani bayapadi tenction to chasyuna plzz adyna solve chepandi plzzz

    ReplyDelete
  9. Hello Sir, Nenu hyd, lo april2 na Road Side tatto veyinchukunanu.. atanu sudi, ink marchaledu.. naku hiv undemo ani chala bhayanga undi. plzz edyna solve chepandi plzz. ipatiki 8 months ayindi. naku test cheyinchukolante bhayanga undi.

    ReplyDelete
  10. Sir oka ammaini kiss chess thanaki HIV untadi and anukuntna aithe thank inner lip in karichindi 10 min tarvata chusa konchem layer lechindi tarvata biryani time Sariki lip mandindi risk untada sir emaina

    ReplyDelete
  11. Sir HIV vasthey emi jagrathalu thisikovali Emmi madulu thisukavali

    ReplyDelete
  12. Sir HIV vathey Emmi jagrathalu thisukovalu Aaa mandulu thisukovali

    ReplyDelete
  13. Sir na paru riyaz na friend ki HIV uindane anukuntuna sir naku einglesh radu sir kocham mistake uinta
    Friend pass chasaka aitane pass lo blood vastundi einduku

    ReplyDelete
  14. Sir na paru riyaz na friend ki HIV uindane anukuntuna sir naku einglesh radu sir kocham mistake uinta
    Friend pass chasaka aitane pass lo blood vastundi einduku

    ReplyDelete
  15. hi sir my name is manju nenu ninna okka ammayitho sex chesa but naku theliyakundane condom pagilipoindi naku bayanga undi emaina problrem avutjademo ani ippudu nenu em cheyali emaina test lu cheyinchala

    ReplyDelete
  16. Hello sir, ma friend recent ga 1week back sex chesadu stranger woman tho so thanaku HIV vachindhani bayapaduthunnadu, HIV test appudu cheyenchavachu please solution evvandi

    ReplyDelete
  17. Hello sir, ma friend recent ga 1week back sex chesadu stranger woman tho so thanaku HIV vachindhani bayapaduthunnadu, HIV test appudu cheyenchavachu please solution evvandi

    ReplyDelete
  18. Hi sir naa peru nani nenu oka aavidatho sex chesa thanaki aids undhani dought ani cheppindhi kani neni thana yoni ni toungtho chesa ala cheyadam valla aids vastundha plz answer

    ReplyDelete
  19. Hi sir na peru Thirupathi, naku 1ka ammaitho 5years ga sex lo palguntunam helth paranga ame nenu bagane unnam inka maku pelli avaledu, HIV test 3times chepinchanu ledani vasthundi bt na pursh angamu paina pulipirlu ga avthunai DOCTORS ki chupincha thaggadam ledu roju roju ki avi peddaga avthunai sir na problem ento artham kavat ledu fucher lo amaina avthunda sir pleeeeeez Reply sir

    ReplyDelete
  20. hi sir i nagendra hiv oka women and oka gent sex lo palgonadal valana kuda adhi unmarried persons please dhiniki answer ivvandi sir iddaru unmarried couple

    ReplyDelete
  21. sir naku oka doubt hiv vasthe enni rojulla tharuvatha mati matiki fever vasthuvuntadhi plz tell me answer

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.