Saturday, December 31, 2011

విటమిన్ బి 2-(రైబో ఫ్లావిన్),Vitamin B2(Riboflavin)



  • image : courtesy with Sakshi News paper


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విటమిన్ బి 2-(రైబో ఫ్లావిన్),Vitamin B2(Riboflavin)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


విటమిన్ బి 2 ని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని ,రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. నీటిలో కరిగే విటమిన్‌ . రోజువారి కావలసిన మోతాదు (daily requirement) 1.3 మి.గ్రా. దీని లోపము వలన కలిగే రుగ్మత (Deficiency disease)ని Ariboflavinosis అంటారు . రెండు అంశాలనుంచి ఈ పేరు వచ్చింది. ‘రైబోస్’ అంటే విటమిన్లలోని ‘చక్కెర’ అని అర్థం. ఫ్లేవిన్ అంటే పసుపుపచ్చ అని అర్థం. బీకాంప్లెక్స్‌లోని చక్కెర పదార్థాలతో... ఉడికించాక కూడా మిగిలి ఉండే ఒక రకం చక్కెర ఇది.
కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని రైబోఫ్లేవిన్ అంటారు. ఆహార పదార్థాలను వండే క్రమంలో ఉడికించే సమయంలో వేడి వల్ల ఆహారంలో దీన్ని నష్టపోయేందుకు పెద్దగా అవకాశం లేదు. అయితే బాగా తీవ్రమైన ఎండకు ఆహారపదార్థాలు ఎక్స్‌పోజ్ అయినప్పుడు మాత్రం దీన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అలాగే సల్ఫాడ్రగ్స్ వాడుతున్నా, ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉన్నా దీని కోల్పోతారు.


  • గుర్తించింది ఇలా...
ఈ విటమిన్‌ను 1920 ప్రాంతాల్లో గుర్తించారు. విటమిన్ బి కాంప్లెక్స్‌ను వేడిచేశాక కూడా ఒక పదార్థం అంతగా తేలిగ్గా ఇగిరిపోవడం లేదని తెలుసుకున్నారు. 1934లో కున్ అనే శాస్తవ్రేత్త నేతృత్వంలోని పరిశోధక బృందం దాన్ని పాల నుంచి (మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే పాల ప్లాస్మా నుంచి) వేరుచేశారు.

  • లభించే పదార్ధాలు :
పాలు, గ్రుడ్లు, కాలేయంలలో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారాలలో విటమిన్ బి2 ఎక్కవగా ఉంటుంది. టర్నిప్ గ్రీన్, ర్యాడిష్ ఆకులు, కొలకేషియా వంటి ఆకులలో, బొప్పాయి, సీతాఫలం, యాప్రికాట్ వంటి పండ్లలో, వేటమాంసం, కాలేయం వంటి మాంసాహారంలో, ఆవుపాలలో ఇది ఎక్కువ. బాదం, వాల్‌నట్, మస్టర్డ్ సీడ్స్‌లోనూ ఎక్కువే. విటమిన్ బి2 శరీరానికి తగిన పాళ్లలో అందాలంటే పాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం.

  • ఉపయోగాలు :
అందాన్ని పెంపొందించడంలో విటమిన్ బి2 అద్వితీయమైన భూమిక పోషిస్తుంది. అందుకే దాన్ని ‘బ్యూటీ విటమిన్’ అంటారు. అందమైన విటమిన్ ఇది. చూడటానికి నారింజ పసుపు రంగులో అందంగా కనిపించడంతో పాటు... అందాన్ని కాపాడుతుంది. మన చర్మం ముడతలను నిరోధించడం, పెదవుల చివర్లు పగలకుండా చూడటం, వెంట్రుకలు జీవంతో మెరుస్తుండటానికి తోడ్పడటం వంటివి చేస్తుందిది. అందానికీ, ఆరోగ్యానికీ రెండింటికీ తోడ్పడుతుంది. వీటన్నింటికీ ఉపయోగపడే ఈ విటమిన్ పేరు రైబో ఫ్లేవిన్. వాడుకభాషలో విటమిన్ బి2 అంటారు . విటమిన్ బి2 సాధారణ ఆరోగ్యానికి, పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులకు సంబంధించిన జీవక్రియలు (మెటబాలిక్ యాక్టివిటీస్) జరిగే క్రమంలో కూడా ఇది తోడ్పడుతుంది. శరీర జీవకణ సముదాయం (టిష్యూస్) మెయింటెనెన్స్‌కు విటమిన్ బి2 ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకూ ఇది సహాయపడుతుంది. మన నోటిలోని మ్యూకస్ పొర (మ్యూకస్ లైనింగ్) సక్రమంగా ఉండేలా చూడటం, పెదవులు, నాలుక బాగుండేలా చూడటం, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా గ్లకోమా నివారణలో దీని పాత్ర ఎంతో ఉంది. శరీరాన్ని యౌవనంతో ఉంచేందుకు ఇది ఎంతో ప్రధానం. ఎందుకంటే చర్మంపై ముడుతలు తొలగిస్తుంది. ఇలా విటమిన్ బి2- ఆరోగ్యం, అందం... ఈ రెండు విషయాల్లోనూ ప్రధాన భూమిక పోషిస్తుంది.

  • శరీరంలోకి ప్రవేశించేది ఇలా...
విటమిన్ బి2 పుష్కలంగా కలిగి ఉన్న ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణప్రక్రియ ద్వారా చిన్న పేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తప్రవాహం నుంచి కణసముదాయాలకు (టిష్యూస్) అక్కడ నుంచి కణాల్లోకి వెళ్లి సెల్ ఎంజైమ్స్‌తో కలిసి శరీర జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా కాలేయంలో నిల్వ ఉంటుంది. మన శరీరంలోని మొత్తం రైబోఫ్లేవిన్‌లో మూడో వంతు కాలేయంలోనే ఉంటుంది.అంతేకాదు... మూత్రపిండాలు, గుండెలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. అయితే శరీరం దీన్ని ఎక్కువ పరిమాణంలో నిల్వ ఉంచుకోదు. క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమైన విటమిన్ బి2 అందించాల్సిందే. అయితే మన శరీర అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న రైబోఫ్లేవిన్ ప్రధానంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. అయితే బైల్, చెమట మార్గాల్లో చాలా కొద్ది మోతాదుల్లో బయటకు విసర్జితమవుతుంది.

  • చికిత్సగా...
పోషకాహార లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలు, జీర్ణప్రక్రియలో ఆటంకాలు, నరాలకు సంబంధించిన డిప్రెషన్ వంటి సందర్భాల్లో రైబోఫ్లేవిన్‌ను 25 ఎంజీ నుంచి 50 ఎంజి వరకు డాక్టర్లు సూచిస్తుంటారు. కంటి కండరాలు బలహీనమయినప్పుడు సైతం ఈ విటమిన్‌ను ఇస్తుంటారు. చర్మంపై గోధుమ రంగు మచ్చలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉన్నప్పుడు సైతం డాక్టర్లు తగిన మోతాదులో దీన్ని కనీసం ఆర్నెల్లపాటు ఇస్తుంటారు. అయితే ఈ విటమిన్‌ను స్వాభావికంగా దీన్ని తీసుకోవడమే మంచిది. విటమిన్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే మోతాదు మించినప్పుడు దురదలు, మంటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే దీన్ని పొందడం కోసం ఇవి పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. విటమిన్ బి2 లోపం ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకే దీన్ని వాడటం శ్రేయస్కరం.

  • బి2 విటమిన్ లోపం వల్ల కలిగే దుష్పరిణామాలు :
ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే 'గ్లాసిటిస్' అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారుతుంటుంది.విటమిన్ బి2 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు (యాంగులార్ కిలైటిస్), నోటిలో మంట, నాలుకపై పగుళ్లు, చర్మంపై పగుళ్లు వంటివి రావచ్చు. దీనిలోపం వల్ల చర్మంపై ముడతలు పడవచ్చు. ఈ ముడతలు బాహుమూలాల్లోనూ రావచ్చు. వెంట్రుకలు తమ సహజమైన కాంతిని కోల్పోతాయి. గోళ్లు చిట్లిపోతాయి. కాంతి పడినప్పుడు కళ్లు బైర్లుగమ్మినట్లు అనిపించవచ్చు. రక్తహీనత, యోని దగ్గర దురద, కాటరాక్ట్ వంటి సమస్యలు కూడా రావచ్చు. దీని ప్రాధాన్యాన్ని పరిశీలిస్తే ఇది సాధారణ ఆరోగ్యం కోసమే కాదు... అందానికీ దోహదపడుతుందని చెప్పవచ్చు.

  • విటమిన్-బి2 ఎక్కువగా ఉండే కొన్ని పదార్థాలు :

ఆహారం ------- పరిమాణం (మైక్రోగ్రాముల్లో )


: తృణధాన్యాలలో...
గోధుమ మొలకలు- 540,
వరి పొట్టు (రైస్‌బ్రాన్)- 480,
సజ్జలు- 250,
బార్లీ- 200,
రాగులు (ఫింగర్ మిల్లెట్స్)- 190,
పొట్టు తీయని గోధుమపిండి- 170,
దంపుడు బియ్యం- 120,

: పప్పులు,
సోయాబీన్స్- 390,
కందులు- 330,
పెసరపప్పు- 210,
మినప్పప్పు- 200,
లెంటిల్స్- 200,
కందిపప్పు- 190,
శనగలు (బెంగాల్‌గ్రామ్)- 180,

: కూరగాయలు, ఆకుకూరలు
టర్నిప్ గ్రీన్- 570
ముల్లంగి ఆకులు (ర్యాడిష్ లీవ్స్)- 470,
కొలకేషియా ఆకులు (నల్లవి)- 450,
క్యారట్ ఆకులు- 370,
పాలకూర- 260,
లెట్యూస్- 130,
వంకాయలు- 110,
క్యాలీఫ్లవర్- 100,

: నట్స్, నూనెగింజలు
బాదం- 570,
వాల్‌నట్ - 400,
మస్టర్డ్ సీడ్స్- 260,
జీడిపప్పు- 190,

: పండ్లు
పండిన బొప్పాయి- 250,
సీతాఫలం- 170,
యాప్రికాట్- 130,
పనస- 130,
పైనాపిల్- 120,

: మాంసాహారంలో
వేటమాంసం కాలేయం- 1,700,
గుడ్లు- 400,
తెల్లరకం పామ్‌ఫ్రెట్ చేపలు- 150,
వేటమాంసం- 140,
రొయ్యలు- 100,

: పాలు పాల ఉత్పాదనలు
స్కిమ్‌డ్ మిల్క్- 1,640,
ఆవుపాలు హోల్‌మిల్క్- 1,360,
ఆవుపాల కోవా- 410,
పెరుగు (ఆవు పాలు)- 160,
గేదె పెరుగు- 100,


  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, December 30, 2011

చెవుడు, చెముడు లేదా చెవిటితనం, Deafness or Hearing impairment.






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చెవుడు, చెముడు లేదా చెవిటితనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చెవుడు అనగా శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం. దీనికి చాలా విధాల జీవసంబంధ మరియు పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది.

ధ్వని తరంగాలు వ్యాప్తి మరియు ఫ్రీక్వెన్సీ లో తేడా ఉంది. ఆమ్ప్లిట్యూడ్( Amplitude) ధ్వని తరంగం యొక్క కొన ఒత్తిడి లో వైవిధ్యం ఉంది. ఫ్రీక్వెన్సీ ఒక ధ్వని తరంగం యొక్క sinusoidal భాగం యొక్క సెకనుకు చక్రాల సంఖ్య. కొన్ని పౌనఃపున్యాల గుర్తించడం, లేదా ఒక జీవి సహజంగా గుర్తించే శక్తి తక్కువ వ్యాప్తి శబ్దాలు గుర్తించే సామర్ధ్యాన్ని కోల్పోవడం వినికిడి లోపం అంటాము .

చెముడు కారకాలు --

* కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
* అంతర్‌ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల
* మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల .

వినికిడి యంత్రాలు

* ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు.
* చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు
* వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌

గుర్తించే పరీక్షలు

వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు). వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసేవి (ఆబ్జెక్టివ్‌).

* బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
* ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది.
* ప్యూర్‌టోన్‌ పరీక్ష: చెవులకు హెడ్‌ ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు.

మూలాలు

* http://www.eenadu.net/specialpages/sp-health.asp?qry=sp-health1

* Speech and Language Terms and Abbreviations.

చెవుడుకు చక్కని పరిష్కార మార్గాలు/- డా||శింగరి ప్రభాకర్‌.

వినికిడి శక్తి కరవైపోవడానికీ, చెవుడు రావడానికీ ఒక ముఖ్య కారణంగా ఆటో క్లీరోసిస్‌ను చెప్పుకోవచ్చు! చెవిలో వుండే మూడు ఎముకలలో చివరిదైన స్టేపిస్‌ అనే ఎముక అతుక్కుపోయి చెముడును తెప్పించడాన్నే ఆటోక్లీరోసిస్‌గా వ్యవహరిస్తాం. ఇది సాధారణంగా వయసులో ఉన్న స్త్రీలలో బయట పడుతుంది. అంతేకాకుండా పురుడు పోసుకున్నప్పుడుఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఈ చెవుడు వయసుతోబాటు అంటే ముసలితనంలో వస్తే మనం పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. కానీ పుట్టుకతో వస్తే తక్షణ వైద్య సహకారం తీసుకోవడం చాలా అవ సరం. ఈ పరిస్థితులలో వినికిడి సాధ నాలు అమర్చుకోవడం తప్పనిసరి! ఎందుకంటే వినికిడి సాధానాలను అమర్చుకోకుంటే మాటలు రాక మూగవారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ఇలా వచ్చే చెముడును ముఖ్యంగా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి బయట చెవిలోపాల వల్ల శబ్దతరంగాలు లోపలి చెవికి చేరలేక పోవడం (కండెక్టివ్‌ డెఫ్‌ నెస్‌), లోపలి చెవిలోపం కారణంగా ఏర్పడే నరాల బలహీనతవల్ల వచ్చే చెముడు (సెన్సోరీ న్యూరల్‌ డెఫ్‌నెస్‌). ఆధునిక వైద్య విజ్ఞానం మనకు అందిం చిన ఒక వరంగా వినికిడి సాధనాల ను మనం పేర్కొ నాలి. ఎందుకంటే - ఈ వినికిడి సాధనాలు ఎటువంటి చెవుడుకైనా పనిచేస్తాయి. ఇదిలా ఉంటే - ఈ వినికిడి సాధనాలు పనిచేయని వారికి 'కాక్లి యార్‌ ఇంప్లాంట్‌' అనే పరికరాన్ని చెవిలో అమర్చి వినికిడి శక్తిని పొందగల అవకాశం నేడు మనకు అందుబాటులోకి వచ్చింది.

  • ==========================
isit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, December 27, 2011

చెవికి నీరుపట్టడం ,సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా,secretory otitis media



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చెవికి నీరుపట్టడం ,సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా,secretory otitis media- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చెవిసమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో అతి ముఖ్య మైన, తాత్సారం చేస్తే మరిన్ని సమస్యలకు కారణమై పరి ష్కార మార్గాన్ని జటిలంగా మార్చే సే సమస్య నీరుపట్టడం! చెవికి నీరు పట్టడాన్ని 'సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా--(Otitis media with effusion (OME), also called serous or secretory otitis media (SOM), is simply a collection of fluid that occurs within the middle ear space) .' అంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఇది తొలిదశ అన్న మాట! తక్షణ జాగ్రత్తలు తీసుకో కుండా తాత్సారం చేస్తే ఈ నీరు కాస్తా చీముగా తయారవుతుంది. దీనినే వైద్యపరిభాషలో 'సప్పురైటివ్‌ ఆటైటిస్‌ మీడియా' అని వ్యవహరిస్తాం. చెవిదిబ్బడ వెయ్య డం, వినికిడి శక్తి తగ్గడం, చెవిలో మోతరావడం, గుటక వేసినప్పుడు చెవిలో శబ్దం రావడం- ఈ స్థితికి లక్షణాలు. ఈ స్థితిలో సత్వర వైద్యసహాయం తీసుకోకుండా అలసత్వం ప్రదర్శించినా, అతి తెలివికి పోయి చిట్కావైద్యాలు ప్రయోగించినా విపరీతమైన చెవిపోటు రావడం. ఆ వెంటనే టప్‌మంటూ శబ్దం వచ్చి ఒక్కసారిగా ఉపశమనం కలగడం జరిగిపోతుంది. చెవిలోంచి నీరు లేదా చీము వచ్చే అవకాశమూ ఉంది. అంటే-కర్ణభేరి కాస్తా పుటుక్కుమందన్నమాట! అంతే- ఆ తర్వాత జట్‌ విమానాలు పై నుంచి వెళ్తున్నా ఆయన గారికి ఏ విధమైన శబ్దం వినిపించదు. ఇటువంటి సమయంలో వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన మందులు వాడితే మళ్ళీ మన కర్ణభేరి యధాస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అశ్రద్ధచేశామో కర్ణభేరికి పడ్డ చిల్లు చీముకారిన ప్రతిసారీ పెద్దదౌతూ కర్ణభేరి మొత్తం చెడిపోతుంది. ఇక ఆపరే షన్‌ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమౌతుంది. చెవికి వచ్చిన సమస్య చెవికే పరిమితమైతే బాగానే ఉంటుంది. కానీ, మన అశ్రద్ధఫలితంగా ''తొండముదిరి ఊసరవిల్లి'' అయిన చందాన చెవిలోంచి కారిన చీము పక్కనున్న భాగాలకు చేరి మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. చెవిలో చీము ఎముకను తొలిచే 'కొలిస్టియటోమా'గా మారుతుంది. ఈ స్థితిలో చెవిలో చీము ఎక్కువగా కారకున్నా చెవినుండి దుర్వాసన రావడం, కళ్ళుతిరగడం జరుగుతుంటుంది. అంతేకాకుండా చెవి పక్కనున్న ఎముకలను తొలుచుకుంటూ మెదడు పొరలకూ, మోదడుకూ సోకి మైనం జైటిస్‌ (మెదడు వాపువ్యాధి)బ్రెయిన్‌ ఆప్సస్‌ (మెదడులో చీము గడ్డ) వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

చికిత్స

యాంటీబయాటిక్స్ లేదా decongestants, యాంటీహిస్టామైన్లు, లేదా నాసికా స్ప్రేలు ఇతర మందులు, చికిత్స చేసినప్పుడు రహస్య చెవిపోటు మీడియా తరచుగా పరిష్కరించేందుకు లేదు. కానీ తరచుగా వారాలు లేదా నెలల తరువాత కూడా ద్వారా పరిష్కరిస్తుంది.

రుగ్మత కొనసాగితే మరియు పిల్లలు 3 నెలల తర్వాత మెరుగుపరచడానికి లేకపోతే, శస్త్రచికిత్స సహాయపడవచ్చు. యునైటెడ్ స్టేట్స్ లో, కర్ణభేరికి కత్తిగాటు పూర్తి కావచ్చు. ఈ విధానం కోసం, వైద్యులు కర్ణభేరి ఒక చిన్న చీలిక తయారు, ద్రవం తొలగించండి, మరియు బాహ్య చెవి మధ్య నుండి పారుదల అందించడానికి చీలిక ఒక చిన్న ventilating (tympanostomy) ట్యూబ్ ఇన్సర్ట్. శాలూకం (గొంతు మరియు నాసికా ప్రకరణము కలిసే చోట ఉన్న లసికామయ కణజాలం సమాహారం) తరచుగా ఒకే సమయంలో తొలగిస్తారు. కొన్నిసార్లు ఒక కర్ణభేరికి కత్తిగాటు ద్రవం తొలగించడానికి కానీ ventilating గొట్టాలు ఇన్సర్ట్ చెయ్యడానికి కాదు జరుగుతుంది. ఈ విధానము tympanocentesis అని పిలుస్తారు.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, December 26, 2011

పార్శ్వపు నొప్పి,Partial headach,మైగ్రేన్,Migraine





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

తలనొప్పులు అనేకరకాలు. 20 శాతం మంది ఏదో ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మెదడులో కణితలు, కురుపులు, మెదడువాపు మెుదలగు జబ్బులవలన తలనొప్పి రావచ్చు. అయితే 80 శాతం మందిలో ఇవేమీ లేకుండా కూడా తలనొప్పి రావచ్చు. వీటిలో పార్శ్వనొప్పి అనేది చాలామందిలో వస్తుంది.

తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి( మైగ్రేన్ తలనొప్పి )ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషి కి మనిషి కి వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.
  • లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.



* ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది.
* కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది.

* ఆకలి మందగిస్తుంది.
* ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది.
* స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.


  • కారణాలు
* మానసిక వత్తిడి – తలనొప్పి
* అధిక శ్రమ
* ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు
* రుతు క్రమములో తేడాలు.
* కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది.
* మత్తుపానీయాలు – పొగత్రాగుట
* మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వచ్చి తలనొప్పి వస్తుంది.

  • మెదడుకు నొప్పి తెలియదు
శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకే చేరుతున్నా, నిజానికి మెదడుకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. మెదడు (బ్రెయిన్‌ పారంకైమా) నొప్పిని గ్రహించలేదు. అయితే మెదడుపై ఉన్న రక్షణ కవచాలు (డ్యూరా), 5, 7, 9, 10 క్రేనియల్‌ నరాలు, రక్తనాళాలు, తల చర్మం, మెడ కండరాలు, సైనస్‌లలోని మ్యూకోసా, దంతాలు మొదలైనవి నొప్పిని గ్రహించ గలవు. మనకు కలిగే వివిధ రకాల తలనొప్పుల గురించి తెలుసుకుందాం.

మైగ్రేన్‌ రకాలు : Migraine Types-పార్శ్వపు నొప్పి రకాలు

    • * ఉదర మైగ్రైన్-Abdominal Migraine,
    • * అడుగు భాగపు మైగ్రైన్-Basilar Migraine,
    • * క్లిష్టమైన మైగ్రైన్-Complicated Migraine,
    • * చక్రీయ మైగ్రైన్ సిండ్రోమ్-Cyclic Migraine Syndrome,
    • * పక్షవాతం మైగ్రైన్-Hemiplegic Migraine,
    • * నాక్టర్నల్ మైగ్రైన్-Nocturnal Migraine,
    • * కంటి సంభందిత మైగ్రైన్-Ophthalmoplegic Migraine,
    • * గర్భధారణ మరియు మైగ్రైన్-Pregnancy and Migraine.

మొత్తం జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారు. మళ్లీ మళ్లీ కలిగే తీవ్రమైన తలనొప్పులకు మైగ్రేన్‌ సమస్య ఒక ప్రధాన కారణం. మైగ్రేన్‌ను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు. అవి - క్లాసికల్‌ మైగ్రేన్‌, కామన్‌ మైగ్రేన్‌.

  • క్లాసికల్‌ మైగ్రేన్‌ :
ఈ రకం ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమపక్క కలుగవచ్చు. ఈ తలనొప్పిని 'థ్రాబింగ్‌, పల్సేటివ్‌, పౌండింగ్‌ తలనొప్పిగా వర్ణిస్తారు.
ఎక్కువగా పల్సేటివ్‌ తలనొప్పి కనిపిస్తుంటుంది. మద్యం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం అవుతాయి. విశ్రాంతి, నిద్ర, చీకటి గదిలో పడుకోవడం వల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సుమారు 20 శాతం మందిలో ఆరా కనిపిస్తుంది. కంటి ముందు మెరుపులు, కొంతభాగంలో చూపు కోల్పోవడం, అడ్డదిడ్డంగా మెరిసే రంగురంగుల కాంతులు కనిపించడం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు మొదలైనవాటికి తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు.

  • కామన్‌ మైగ్రేన్‌ :
సాధారంగా కనిపించే మైగ్రేన్‌ రకం ఇది. మధ్యవయస్కుల్లో, స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాంటల్‌, టెంపొరల్‌, ఆక్సిపిటల్‌, ఆర్బిటాల్‌ భాగాల్లో ఎక్కడైనా ఈ తలనొప్పి కలుగవచ్చు. తరచూ రెండువైపులా ఈ రకమైన తలనొప్పి కలుగుతుంది. నొప్పి మంద్రంగా, కళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది.

మైగ్రేన్‌ ట్రిగ్గర్స్‌ :


కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది.పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.
  • ట్రిగ్గర్స్‌గా పని చేసిఆహార పదార్థాలు
  • ఏదైనా, ప్రాసెస్ పులియబెట్టిన, పిక్లింగ్, లేదా marinated ఆహారాలు ,
  • కాల్చిన వస్తువులు,
  • చాక్లెట్,
  • పాల ఉత్పత్తులు,
  • Monosodium గ్లుటామాటే (MSG) కలిగి ఉన్న ఆహారాలు,
  • ఎరుపు వైన్,
  • జున్ను , వెన్న.
  • tyramine కలిగిన ఆహారాల చేపలు,
  • చికెన్ livers,
  • figs, మరియు కొన్ని బీన్స్ ,
  • ధూమపానం
  • పండ్లు (అవెకాడో పండు, అరటి, సిట్రస్ పండు),
  • నైట్రేట్స్ (బేకన్) కలిగి ఉన్న మాంసాలు,
  • కాయలు,
  • ఉల్లిపాయలు,
  • వేరు శనగ,

చికిత్స .

మైగ్రేన్ నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెయిన్‌కిల్లర్స్ డోలో-650, క్రోసిన్-500, డోలోకైండ్ ఎస్‌ఆర్ 200 వంటి వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే మైగ్రానిల్, వాసోగ్రైన్, సుమినాట్ 500 ఎంజీ వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఇక మళ్లీ రాకుండా ఇచ్చే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్‌లో మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వుందులు వాడాల్సి ఉంటుంది.
కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్--Amlodepin,
బీటా బ్లాకర్స్ -Propanolol, Atenolol,
యాంటి హిస్టమిన్‌(H1blockers)  - Levo cetrazine , Cetrazine,
యాంటి ఎమిటిక్స్(CTZ supressants) - Stemtil ,Ondensetran,
వంటి వుందులు ఉపయోగించాల్సి ఉంటుంది. పైగా ఇటీవల బోటాక్స్ ఇంజెక్షన్లతోనూ సత్ఫలితాలు ఉంటున్నాయి.

పార్శ్వనొప్పికి బొటాక్స్‌
తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.

patch treatment for migrine,పార్శనొప్పికి పట్టీ చికిత్స

తీవ్రమైన తలనొప్పితో పాటు వాంతి, వికారం, కళ్లల్లో మిరుమిట్లు గొలిపే కాంతి వంటి లక్షణాలతో వేధించే పార్శ్వనొప్పి రోజువారీ పనులను సైతం దెబ్బతీస్తుంది. అందుకే ఈ బాధల నుంచి తప్పించేందుకు రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా దీనికి ఓ కొత్తరకం 'పట్టీ' చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. జెక్యూటీ ప్యాచ్‌ అనే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీన్ని చేతికి గానీ తొడకు గానీ చుట్టుకోవచ్చు. పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు ఈ పట్టీకి గల మీటను నొక్కితే చాలు. గంటకు 6.5 మి.గ్రా. చొప్పున మందును చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దీంతో తలనొప్పితో పాటు వాంతి, వికారం కూడా చాలావరకు తగ్గుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. పార్శ్వనొప్పిలో తలనొప్పితో పాటు వికారమూ చాలా ఇబ్బంది పెడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లకుండా నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టే ఇలాంటి మందులతో చికిత్స ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అధిక రక్తపోటు నియంత్రణలో లేనివారు, గుండెజబ్బు సమస్యలు గలవారు జెక్యూటీ ప్యాచ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
  •  ------- source : Medicine updates Magazine.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

పుట్టుమచ్చలు-క్యాన్సర్‌,Malignent Melanoma,Birth moles and cancer




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పుట్టుమచ్చలు-క్యాన్సర్‌(Malignent Melanoma,Birth moles and cancer ) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ''మేలిగంట్‌ మెలనోమా'' అంటారు.

మేలిగంట్‌ మెలనోమా అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.

  • కారణాలు :
(1) ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే మిగతావారికి 10 శాతం ఎక్కువ రిస్కు ఉన్నట్లు కొన్ని అధ్యయనములలో తేలినది. ఈ మెలనోమా ఉన్న కుటుంబంలో ఎక్కువగా మ్యుటేటెడ్‌ gene CDKN2A అను జీన్‌ ఉన్న (ఉదా : వీజ×= జీన్‌) కుటుంబ సభ్యులలో ఎక్కువగా ఉంటుంది. (2) ఇంకోరకము జాతిలో ఇవి - అధిక సంఖ్యలో పుట్టు మచ్చలు వేర్వేరు సైజులలో వుంటాయి. ఇటువంటి వారిలో మెలనోమా క్యాన్సరు ఎక్కువగా రావచ్చును. కొన్ని సాధారణ పుట్టుమచ్చలు ఒక్కోసారి సైజు పెరిగి ఈ విధంగా మారవచ్చును. (3) ఇమ్యునో సప్రెషన్‌ - సాధారణ ప్రజలకన్నా, అవయవ మార్పిడి జరిగి ఇమ్యునోసప్రెషన్‌లో ఉన్నవారిలో 5శాతం చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కిడ్నీ మార్పిడి జరిగిన వారిలో కనపడుతుంది. (4) అల్ట్రావయెలెట్‌ రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల, అతిగా ఎండ తగలడం వల్ల ఈ క్యాన్సర్‌ రావటానికి అవకాశం వుంది. (5) కోల్‌తార్‌, క్రియోసొలేట్‌, ఆర్సినిక్‌, రేడియంల కు ఎక్ష్పోజ్ అవడము వల్ల ఈ క్యాన్సరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

  • మేలిగంట్‌ మెలనోమాలో రకాలు :-

(1) 70% ఈ కోవకు చెందినవి. ఎక్కువగా మధ్యవయస్సు వారిలో చూస్తాము. శరీరములో ఏ భాగమున అయినను రావచ్చును. ఎక్కువగా మగవారిలోను, ఆడవారిలోను వీపుపైభాగాన, ఆడవారిలో కాలుమీద కనిపిస్తుంది. మొదట ఇది చర్మం మీద ప్రాకుతుంది. ఆ తర్వాత చర్మంలోపలి భాగాలకు చొచ్చుకుపోతుంది. రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో ఎక్కువగా గ్రే రంగు నుండి నలుపు రంగు వరకూ ఈ మచ్చలు ఉంటాయి.

(2) 15-20 శాతం ఈ కోవకు చెందినవి. ముదురురంగు ఉబ్బుమచ్చలు లాగా పెరిగి, పుండు పడి రక్తం కారే అవకాశం ఉంది.

(3) లెంటిగో మేలిగ్నా మెలనోమా : 4-15 శాతం ఈ కోవకు చెందినవి. ముఖం మీద ముదురు బ్రౌన్‌ మచ్చలు 3-6 సెం.మీ. వరకు ఉంటాయి.

(4) ఏక్రల్‌ లెంటిజీనస్‌ మెలనోమా :- నల్లజాతి వారిలో ఎక్కువగా చూస్తాము. అరచేతులు, అరికాలు, వేళ్ళ చివరలో ఈ కాన్సరు వస్తుంది.

ఈ క్యాన్సరు లింఫ్‌ నాళాల ద్వారా లింఫ్‌ గ్రంథులకు, రక్తనాళాల ద్వారా వేర్వేరు భాగాలకు పాకుతుంది. (ఉదా : మెదడు, రొమ్ము, జీర్ణకోశము మొ||)

  • కనుక్కోవడం ఎలా ? :
రకరకాల మచ్చలు లేత నలుపు ,ఎర్ర గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.

  • వైద్య విధానము :
ప్రైమరీ ట్యూమర్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. ఈ మచ్చ ఎంత లోపలకు చొచ్చుకు పోయినది చూచి దానిని బట్టి ఎంత వరకు తీసివేయాలో నిర్ణయిస్తారు. లింఫ్‌ గ్రంథులను కొన్ని సందర్భాలలో ''రాడికల్‌ లింఫ్‌ నోడల్‌ డిసెక్షన్‌'' ద్వారా తొలగిస్తారు. కొన్ని దూర ప్రదేశాలకు ఈ క్యాన్సరు వ్యాపించినపుడు, సందర్భాన్నిబట్టి శస్త్రచికిత్స ద్వారా కూడా తీసివేస్తారు. కొన్ని సందర్భాలలో ఆపరేషన్‌ ఆ తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మరికొన్ని సందర్భాలలో ట్యూమర్‌ వల్ల నొప్పి వస్తున్నపుడు, ట్యూమర్‌ కొన్ని ముఖ్యభాగాలకు ప్రాకినపుడు రేడియోథెరపీ ఇస్తారు. (ఉదా : మెదడుకు ప్రాకినపుడు) కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ కూడా వాడతారు.

మిట్టమధ్యాహ్నం ఎక్కువగా వేడి ఉన్న ఎండలో తిరగకపోవటం, చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించటం, నల్లకళ్ళద్దాలు ధరించడం మొదలగునవి పాటించడం వల్ల కొంత వరకు ఇవి రాకుండా చూడవచ్చును. కుటుంబంలో ఎవరికైనా ఇది ఉన్నపుడు కనీసం సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధుల వైద్యునిచే పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి వ్యాధి ముదిరిన తర్వాత అరికట్టడం కష్టము. వయసు ప్రభావం వల్ల ఒక్కోసారి తెల్లమచ్చలు వచ్చి ఆపై నల్లమచ్చలు చర్మము మీద వస్తుంటాయి. ఈ కొత్త నల్లమచ్చలను చూచి కంగారు పడవద్దు. అవసరము అయితే డాక్టరును సంప్రదించండి.

  • -డా.V.రావు,క్యాన్సర్‌ వైద్య నిపుణులు.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, December 24, 2011

Family planning methods,కుటుంబ నియంత్రణ పద్ధతులు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Family planning methods,కుటుంబ నియంత్రణ పద్ధతులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన దేశంలో చాలామందికి కుటుంబనియంత్రణ అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ అమి మాత్రమే తెలుసు. అందుకే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని ఆపరేషన్ చేయించుకుంటారు. కొద్దిమందికి మాత్రం మాత్రల గురించి తెలుసు. ఒకవేళ ఎన్నోరకాల పద్ధతుల గురించి తెలిసినా వాటిపల్ల ఉండే సాధకబాధకాలు చాలామందికి తెలియదు. పత్రికలో, టివీలో నిరోధ్ గురించి ప్రకటనలు చేసే వాళ్ళుంటారు. కానీ, ఎలా వాడాలో ఎవరు చెప్తారు? మిగతా అన్ని సాధనాలు కూడా ఇలాగే ఏమీ అర్థం కాని విషయాలుగా ఉంటాయి. ఒకవైపు టివి, రేడియోలు, వ్యాపార ప్రకటనలు అన్నీ కుటుంబ నియంత్రణ గురించి తెలియచేస్తున్నాయి.

పద్ధతులు--- ఇందులో మూడు రకాలున్నాయి.

1. మాత్రలు
2. గర్భాశయంలో అమర్చే లూప్ (ఐ.యు.డి. లేదా కాపర్ టి)
3. వీర్యకణాలకు అడ్డుపడే సాధనాలు (నిరోధ్)

మాత్రలు (పిల్స్)
మాత్రలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అన్ని నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలలోను ఉచితంగా ఈ మాత్రల్ని పంచి పెట్టడం జరుగుతోంది. టి.వీ.లో మాలా.డి. ప్రకటల్ని అందరూ చూసే ఉంటారు. అయితే అసలు ఈ మీత్రలు ఏమిటి ఎలా పని చేస్తాయి వాటితో వచ్చే ఇబ్బందులు, ఫలితాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. ఇవి వాడాలని నిర్ణయించుకున్నవాళ్ళు అనుభవం ఉన్న డాక్టరు దగ్గర మొత్తం సమాచారం తీసుకోవాలి.

మాత్రల వలన కొన్ని సాధారణ ఫలితాలు
మాత్రలు కొన్ని రకాలు ఇబ్బంది, బాధ కలిగించేవి ఉంటాయి. కొంతమందికి కడుపులో తిప్పటం తప్ప వేరే సమస్యలుండవు. మాత్రలు మానేయగానే ఇబ్బందులు పోతాయి. కొన్నిసార్లు బ్రాండ్ మారిస్తే (డాక్టరు సలహాతో మాత్రమే) సమస్యలు తగ్గచ్చు. తలనొప్పి, వికారం, తల తిరగడం, రొమ్ముల్లో నొప్పి, కాళ్ళనొప్పులు, వంటి లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. అందరికి ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. కొన్ని సార్లు చికాకు, నిస్పృహ కలిగించే గుణం మాత్రలకుంది. మాత్రలు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత డాక్టరుతో పూర్తి పరీక్ష చేయించుకోవటం అవసరం. డాక్టరు ప్రిస్ర్కిప్షన్ తోటి మందులు కొనాలే గాని, మన ఇష్ట ప్రకారం కొనకూడదు.

రక్తపోటు, డయాబెటిస్, రక్తం గడ్డ కట్టే సమస్యలున్న వాళ్ళు ఏ మాత్రం మాత్రలు వేసుకోకూడదు.

మాత్రలలో ఎన్నోరకాలున్నాయి. డాక్టర్ని అడిగి మన శరీరానికి సరిపడే పద్ధతిని ఎన్నుకోవటం మంచిది. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రలు మానేసి రెండు మూడు నెలలు గర్భం రాకుండా నిరోధ్ వంటి పద్ధతులు వాడి తరువాత గర్భం వచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పిండం మీద మాత్రల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

పాలిచ్చే తల్లులు ఈ మాత్రల్ని వాడకూడదు. పాలతో మందు పిల్లల శరీరాలకు వెళ్తుంది.

ఇక్కడ సాధారణంగా దొరికే మాత్రలు కొన్ని ప్యాకెట్లలో 21 ఉంటాయి. రోజుకి ఒకటి చొప్పున 21 రోజులు వాడి చివరి 7 రోజులూ మానేయాలి. ఈ 7 రోజుల తరువాత బహిష్టు వస్తుంది. 28 మాత్రలున్నా 21 రోజులు వాడి చివరి 7 రోజుల మాత్రలు వేరే రంగులో ఉంటాయి. అవి ఐరన్ గోలీలుంటాయి. బహిస్టు వచ్చిన అయిదవ రోజు నుంచీ మాత్రలు మొదలు పెట్టమని చెప్తారు. చాలా రకాలు ప్రతి రోజూ ఒకే టైముకి వేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు వేసుకుంటే గుర్తుగా ఉంటుంది. ఒక రోజు మాత్ర మర్చిపోతే తరువాత రోజు రెండు మాత్రలు వాడాలి. కాని మూడు రోజులు మర్చిపోయారనుకోండి మూడు మాత్రలు వేసుకోవద్దు. పూర్తిగా మానేసి ఒక వారమైన తర్వాత కొత్త ప్యాకెట్ మొదలు పెట్టడం మంచిది. ఆ వారం రోజులు నిరేధ్ వంటివి వాడాలి.

కాపర్ టీ :
ఇది అతి సన్నని రాగి తీగతో చేసిన (T) ఆకారంలో ఉండే సాధనం. శిక్షణ పొందిన నర్సుకానీ, డాక్టరుకానీ దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. దీనికి రెండు దారాల వంటివి ఉంటాయి. అవి యోనిలోకి వేళ్ళాడతాయి. మనం వేలితో తడిమి చూసి సరైన స్థానంలో ఉందా లేదా అని చూడొచ్చు. సాధారణంగా దీన్ని లూప్ అని పిలుస్తారు.

దీనివల్ల కలిగే ఫలితాలు
ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాషయపు గోడలకు అంటుకోకుండా చేస్తుంది. ఇది ఉన్నంతకాలం సంతానం కలుగదు. మీరు ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు, సాధనాన్ని తేలికగా తీసివేయించుకోవచ్చు. ఇది 3 నుండి 5 సం.ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

దీనితో వచ్చే ఇబ్బందులు
చాలామందికి దీనితో సమస్యలుండకపోవచ్చు. కొందరికి పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. వేసిన కొత్తలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నొప్పి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. నూచికి ఎనబైమందికి ఏ బాధా ఉండదని డాక్టర్లు చెప్తారు. కొంతమందికి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువ రావచ్చు. ఈ లక్షణాలన్ని మొదటినెలల్లో ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం డాక్టరుతో పరీక్ష చేయించుకొని లూప్ సరైన స్థానంలో ఉందా లేదా తెలుసుకోవాలి. నూచికి పదిమందిలో ఇది వదులై గర్భాశయం నుంచి బయటకు వచ్చే ప్రమాదముంది. అందుకే స్నానం సమయంలో దారాల్ని తడిపి చూడాలి. బహిష్టయినప్పడు కూడా పరీక్షచేయాలి. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఇది మార్పించుకుంటే మంచిది. యోనిలో, గర్భాషయంలో ఇన్ ఫెక్షన్ ఉంటే ఇది వాడకూడదు. పొత్తికడుపులో నొప్పి, కడుపు తిప్పడం, నీరసంగా అనిపించడం, కలైక జరిగినప్పుడల్లా నొప్పి రావటం జరిగితే డాక్టర్ని సంప్రదించాలి.

ఇది ఎక్కడ దొరుకుతుంది
నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాపర్ టీ ఉచితంగా దొరుకుతుంది. బయట కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చవుతుంది. డాక్టరుకి కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అత్యంత నమ్మకమైన గర్భనిరోధక సాధనాలలో ఒకటి అని పరిశోధనలు చెప్తున్నాయి.

నిరోధ్ / కాండోమ్
ఇది లేటెక్స్ రబ్బరుతో చేసిన తొడుగు. పురుషాంగం స్తంభించి నిటారుగా అయినప్పుడు మాత్రమే ఇది తొడగటానికి వీలవుతుంది. కలయికలో పురుషాంగం నుంచి వచ్చే వీర్యం యోనిలో పడకుండా ఇది ఆపి ఉంచుతుంది.
సెక్స్ కలయిక సమయంలో అంగం నిటారుగా అయిన వెంటనే నిరోధ్ను తొడగాలి. తొడుగు చివర కొద్ది భాగం వదులుగా వదిలేయాలి. వీర్యం అందులో పడ్డప్పుడు స్థలం లేకపోతే అది పగిలిపోయే ప్రమాదముంది. అంగాన్ని బయటకి తేసేటప్పుడు, నిరోధ్ని చేత్తో పట్టుకోవాలి. లేకపోతే తొడుగు జారిపోయి వీర్యం యోనిలో పడే ప్రమాదముంది.

దీనివల్ల ఉపయోగాలి
అన్ని సాధనాల కంటే ఇది చవక. సులభంగా దొరుకుతుంది. వాడటం తేలిక. మనమే అన్ని బాధలూ పడాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతిలో బాధ్యత మగవాళ్ళదే. కాకపోతే మనం వాళ్ళమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన కంట్రోలులో ఉండే సాధనం కాదు. దీనివల్ల ఇన్ ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఎయిడ్స్ రాకుండా కూడా కాపాడ్తుంది.

అందుబాటు
ఏ మందుల దుకాణంలోనైనా, జనరల్ స్టోర్స్ లోనైనా కొన్ని పాన్ ఫాషులలో కూడా దొరుకుతుంది. సూపర్ బజారులో దొరకవచ్చు. కుటుంబ సంక్షేమ కేంద్రాలలో, నగర ఆరోగ్య కేంద్రాలలో ఇది ఉచితంగా ఇస్తారు.

సమర్ధత
నూచికి 97 శాతం ఇది పనిచేస్తుంది. చాలాసార్లు ఎలా వాడాలో తెలియక పొరపాటు చేస్తే అది 80-85 శాతం వరకు తగ్గచ్చు. పొరపాట్లు జరగకుండా చూసుకుంటే నూచికి నూరు సాతం ఫలితం ఉండే సాధనం ఇది.

శాశ్వత పద్ధతులు
ఈ పద్ధతులే కాకుండా పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చేసే ఆపరేషన్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చేస్తే ట్యూబెక్టమీ, మగవాళ్ళకి చేస్తే వేసెక్టమీ అంటారు. నో స్కాల్ పెల్ వాసక్టమీ (కత్తిగాటులేని), డబుల్ పంక్చర్ లేప్రొస్కోపి. ఈ ఆపరేషన్లు సాధారణంగా ప్రసవం కాగానే ఆడవాళ్ళకు చేయడం జరుగుతుంది. మగవాళ్ళెప్పుడైనా చేయించుకోవచ్చు. ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి చేయటం సులభం. మగవాళ్ళలో వేసక్టమీ వలన ముసలితనములో బి.పి.హెచ్ (BPH) వచ్చే అవకాశము ఎక్కువ .

అనుకోని పరిస్థితులలో అక్కరలేని గర్భం వస్తే తీసేయించుకోవటం ఎలా?
(మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్నీ)
చాలాసార్లు విషయం తెలీక, లేదా జరిగిపోయిన దాన్ని కప్పి పెట్టే ప్రయత్నంలో, లేక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దండనను ఎదుర్కొనే ధైర్యం లేక అన్నింటికీ మించి చేతిలో చాలినంత డబ్బు లేక చాలా మంది నా వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుని ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. గర్భం రాకుండా చూసుకునే పద్ధతుల గురించి తెలియక పోవటం దీనికి సగం కారణం. అందుకే గర్భస్రావాన్ని చాలామంది ఒక కుటుంబ నియంత్రణగా వాడటం ఇప్పటికి జరుగుతోంది.
మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయిన వైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థతి కులం, జాతి, వర్గం అని విదాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం.
గర్భం తీసేయించుకోవటానికి ఒక చట్టం అనేది ఉన్నా చాలామంది అవమానాల పాలవుతామ్మన భయం కొద్ది, అక్రమ గర్భం అని ఎగతాళి చేస్తారన్నభయం కొద్ది నాటు వైద్యుల దగ్గరకు పోతారు.

ఈ చట్టం ఏమిటో తెల్సుకుందాం
ఆరోగ్యానికి సమస్యలుంటే గర్భం వస్తే, డాక్టర్లు తీసేయమని సలహా ఇవ్వచ్చు.
ఇబ్బుడొచ్చే కొత్త సంకేతిక పరిజ్ఞానంతో పుట్టబోయే బిడ్డకు లోపాలుండే అవకాశం ఉందని తెలిస్తే
బలాత్కారానికి గురైన అమ్మాయికి గర్భం వస్తే
పెరుగుతున్న గర్భం తల్లి మానసిక క్షోభకు గరి అయేలా చేస్తే
సాంఘిక పరిస్థితులు పెరుగుతున్న గర్భానికి అనుకూలించక పోతే
కుటుంబ నియంత్రణ పద్ధతి పనిచేయక గర్భం వస్తే, 18 సం. రాకముందే గర్భం వస్తే కూడా తీసేయించుకోవచ్చు.

ఈ పరిస్థితులలో ఉన్న వారెవరైనా గర్భం తీసేయించుకునే హక్కు ఉంది. గర్భం వచ్చిన మొదటి దశలో ఉంటే నాలుగున్నర వారాల నుంచి 12 వారాల వరకు చేయించుకోవటం సులభం. అతి చిన్న వయస్సులో శరీరం సరిగా ఎదగని పరిస్థితిలో గర్భం వస్తే పిల్లల్ని కనటం కంటే గర్భం తీసేయించుకోవటం మంచిది.
చాలా మంది గర్భం తీసేయించుకుంటే మళ్ళీ రాదని ఇతరులు భయ పెట్టడం జరుగుతుంది. అర్హత గల వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటే ప్రమాదాలు ఎదురుకావు. గర్భస్రావం చేయించుకోగానే పిల్లల్ని కనకుండా మన శరీరానికనువుగా ఉండే సాధనం వాడాలి.

అసలు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి
సౌకర్యాలు సరిగ్గా అందుబాటులో లేవని అనుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళి బోలేడు ఖర్చు చేసుకుంటారు. నిర్దేశించిన నగర వైద్యశాలలో ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుందని ఇప్పటికి చాలా మందికి తెలియదు.

ఏం చెయ్యాలో ఎప్పుడు నిర్ణయించాలి?
మనకు నెల తప్పిందని అనుమానం రాగానే ముందు తేదీలు లెక్కలు కట్టాలి. డాక్టర్లు ఆఖరి ముట్టు ఎప్పుడు మొదలైందని ఆ రోజు నుంచి లెక్కలు కడతారు. చివరిసారి అయి నెల మీద రెండు వారాలయిందనుకుంటే డాక్టర్ల లెక్కలో ఆరువారాలైనట్లు లెక్క. గర్భం తేసేయాలనుకుంటే తొందరగా నిర్ణయించుకోవాలి. తొందరగా చేయించుకొనటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం గడిచే కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి, మనసుకు బాధ కూడా.

అట్లా అని ఆరువారాలలోపు తొందరపడి చేయించుకుంటే లోపల పిండం తగినంత సైజుకు పెరిగక శుభ్రం చేసినప్పుడు పూర్తిగా బయటికి రాకపోయే అవకాశం ఉంది. మిగిలిపోయిన ముక్కలు, కుళ్ళి, ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

అందుబాటులో ఉన్న గర్భ స్రావ పద్ధతులు
ఇంతకు ముందే గర్భం రావటం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఫలదీకరణ జరిగిన అండం గర్భం లోపల పొరకు అంటుకుని పెరగటం మొదలవుతుంది. చివరి బహిష్టు అయిన ఆరు వారాలకు దాని సైజు ఒక బఠాణీ గింజ అంత ఉంటుంది. దీనితో పాటు మాయ కూడా పెరుగుతుంది.

ఆధునిక పద్ధతులలో గర్భ స్రావం
పదినిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మనం కంగారు పడకుండా రిలాక్సవటం పనిని సులభం చేస్తుంది.
అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.

Source : http://www.indg.in/india
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, December 22, 2011

సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి కారణాలు ,Causes for decreased interest in sex


  • image : courtesy with Surya news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి కారణాలు ,Causes for decreased interest in sex - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • భార్యతో సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి ఏ ఇతర కారణాలు న్నాయో నిర్ణయించడం కష్టం. చాలా సందర్భాల్లో భార్య తమకు సహకరించడం లేదనే ఫిర్యాదులు భర్త నుంచి వస్తుంటాయి. ఇలా ఫిర్యాదు చేసే వారు నిజ జీవిత సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం మరచిపోతుంటారు. సమస్యను తమ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తుంటారు. అంతే తప్ప భార్య దృష్టి కోణం నుంచి ఆలోచించడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేందుకు ఆ బంధమే ప్రధానం కానప్పటికీ, అది కూడా ఎంతో కీలకమే. ప్రధానంగా బాడీ ఇమేజ్‌కి సంబంధించిన సమస్య ఉన్న వారిలో ఈ విధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తన అందం. సౌష్టవం, ఆకర్ణష శక్తి తగ్టిపోయాయని, చలాకీగా సెక్సుని అనుభవించి, ఆనందించే వయసు దాటిపోయిందనీ - ఈ తరహా నెగిటివ్‌ ఫీలింగ్స్‌ ఆమెలో బలంగా ఉన్నాయి. సెక్సు ఆపీల్‌కి సంబంధించిన నెగిటివ్‌ ఫీలింగ్స్‌ ఉంటే సెక్సుపరంగా చొరవ ఉండదు. ఎదుటి వ్యక్తి చొరవ ని స్వీకరించక , ఆనందించే సానుకూలత ఉండదు. రెండింటి వల్లా సెక్సు లైఫ్‌ పేలవంగా మారిపోతుంది.

పురుళ్ళు, పిల్లల పెంపకం బాధ్యతలు, ఇంటి బరువు... ఇవన్నీ మోస్తున్నందు వల్ల ఈ వయసులో స్ర్తీలకి మానసిక వొత్తిడి, శారీరక అలసట ఎక్కువ ఉంటాయి. కనుక ఆమెకి మీరు దినచర్యలో సహాయం, ఆసరా, మానసిక ఊతం కూడా అందించాలి. ఆమె ఆరోగ్యంగా ఉండేలా ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకి ఆనందం కలిగించే పనులు చేస్తూ ఉండాలి(సెక్సు కావలసిన రోజుల్లో మాత్రమే కాకుండా నిరంతర ప్రాతిపదిక మీద). మీకు ఆమెలో ఆకర్షణీయమైన అంశాలు ఏమున్నా వాటిని మెచ్చుకోవడానికి సందేహించకండి. మీరు మీపట్ల కూడా శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ ట్రిమ్‌గా, నీట్‌గా, హుందాగా ఉండటం అలవరచుకోండి. పిల్లల గురించి, ఇంటి గురించి శ్రద్ధ వహించండి. ప్రౌఢ స్ర్తీలు బాధ్యతాపరడైన భర్తని చాలా అభి మానిస్తారు.-అలాంటప్పుడు దంపతులిద్దరూ స్థిమితంగా చర్చించుకుని, ఒకరి అవసరాలకు అనుగుణంగా ఒకరు సర్దుబాట్లు చూసుకోవాలి. మీరు కొంత త్యాగం చెయ్యాలి. ఆమె మరికొంత ముందుకొచ్చి మీ అవసరాలు తీర్చాలి. ఒకరి ఇష్టాలను, అఇష్టాలను ఒకరికి తెలియ పరుచుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. వాటిని రెండవవారు ఈసడించుకోకుండా విని అర్థం చేసుకోవాలి. ఆ అభిప్రాయాలను గౌరవించి వాటికి అనుగుణంగా సర్దుకోవాలి. కోరికలు అందరిలోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. చిన్నప్పుడు వారు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే పరిస్థితులు ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే
దంపతులు మనస్సు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒకరికొకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటే ఈ విధమైన సమస్యలు తలెత్తవు.

  • ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం, అత్తామామలతో కలసి ఉండడం వంటి కారణాలతో భార్యకు ఆ విషయంలో రకరకాల పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ మగవారు దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం ఈ ఒక్క కారణంతో జీవితాన్ని కలహాల కాపురంగా చేసుకోవడం తగదు. ఒకరికొకరు సర్దుబాటు ధోరణితో వ్యవహరించుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మానసిక, శారీరక పరమైన సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. వివిధ రకాల ఒత్తిళ్ళకు లోనుకావడం మహిళల్లో అధికంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలే ఈ విధమైన ఒత్తిళ్ళకు అధికంగా లోనవుతుంటారు. ఈ విషయాలను దృష్టిలోకి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శారీరక సమస్యలు ఉన్న సందర్భాల్లో కూడా మహిళలు ఆ విషయంలో ఆసక్తి చూపడం తక్కువే. పురుషులతో పోలిస్తే ఈ విధమైన సమస్యలు కూడా మహిళల్లోనే అధికం. వారి శరీర నిర్మాణం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు.

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

అంగస్తంభన సమస్య – చికిత్సా విధానాలు, Erectile dysfunction -Treatment



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అంగస్తంభన సమస్య – చికిత్సా విధానాలు, Erectile dysfunction -Treatment- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




అంగస్తంభన సమస్య కేవలం అది వున్న వాళ్ళనే కాకుండా వాళ్ళ పార్టనర్లని, కుటుంబ సభ్యుల్ని కూడా బాధిస్తుంది. అందువలన దీని చికిత్స గూర్చిన వివరాలు అందరూ తెలుసుకుంటే మంచిది. నపుంసకర అన్నది కేవలం జననాంగానికి సంబంధించినదే కాదు. శరీరంలో కలిగే అనేక వికృతులు ఈ సమస్య కలిగిస్తాయి. శృంగారం అన్నది ఒక క్రీడ. ఈ క్రీడలో ఇద్దరూ భాగస్వాములే. అవతలి వాళ్ళకోసం వాళ్ళలోపం కూడా ఆడే వాడి మీద పడుతుంది. అనుమానించే భార్య, అసహ్యించుకునే భార్య, జడపదార్థం వలె పడుకునే భార్య, రసికత లేని భార్య, సెక్స్ డిమాండ్ చేసే భార్య, డామినేట్ చేసే భార్య – ఇలాంటి పార్టనర్ ప్రభావం కూడా సెక్స్ పై పడుతుంది.

సరైన ఏకాంతం లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, తల్లిగానీ, తండ్రిగానీ మగవాన్ని బాగా డామినేట్ చేయడం, కొన్ని సందర్భాల్లో అత్తమామల గొడవలు, ఇలా అనేక విషయాలు మగవాని సెక్స్ పై ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని చికిత్స చేయాలి. అంగస్తంభన కల్గించడమే సమస్యకు పరిష్కారం కాదు. అంగానికి ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్ లో ఒక రూములో భార్యాభర్తలను కలవమని చెప్పి చికిత్స చేసినా సమస్య పరిష్కారం కాని వాళ్ళున్నారు. అందుకే చికిత్సలో కౌన్సెలింగ్ ముఖ్యమైంది. సెక్స్ విషయంలో, సెక్స్ సమస్యల విషయంలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమయ్యింది. అన్ని చికిత్సా విధానాలు అందరికీ సరిపడవు. కొందరికి కొన్ని బాగా పనిచేస్తాయి. కొందరికి అదే అసలు పని చెయ్యదు. యాంత్రిక సాధనాలు కొన్ని రకాల చికిత్సలు కొందరికి సౌకర్యంగా ఉంటాయి. కొందరికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

అంగస్తంభమ సమస్యకు కారణాలు అనేకం ఉంటాయని చెప్పుకున్నాం. కారణం నిర్థారించిన అనంతరం దానిని బట్టి చికిత్స నిర్ణయిస్తాం. అంగస్తంభన కోసం వ్యాక్యూమ్ డివైస్, అంగంలో చేసే ఇంజెక్షన్ లు, ఇంప్లాంట్స్ లభ్యమవుతున్నా చాలామందిలో మందులతో మంచి ఫలితాలు కనబడుతున్నాయి .

చికిత్సకు మూడు నుంచి ఏడు నెలలదాకా సమయం పడుతుంది.
మందులు వాడిన వారిలో ఆందోళన, డిప్రెషన్ తగ్గడం, అంగస్తంభన సమస్యతో పాటు శీఘ్రస్ఖలనం కూడా తగ్గడంలాంటి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులున్నవారిలో వాటిని సరిచేసే చికిత్స అవసరమవుతుంది. మొత్తం మీద అంగస్తంభన సమస్యకు సంపూర్ణమైన సంతృప్తికరమైన చికిత్సా విధానాలున్నాయి. ఇంకా తేలికైన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా గల చికిత్సా విధానాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మనకు అందుబాటులోకి వస్తాయి.

అమెరికా, యూరప్ లలో అనుసరించే చికిత్స విధానాల్లో సెక్స్ థెరపీ ముఖ్యమైనది. భార్యాభర్తలిద్దరినీ కౌన్సెలింగ్ విడివిడిగా చెయ్యడం, కలిపి చెయ్యడం ద్వారా అంగస్తంభన సమస్యకు కారణాలు చాలా సందర్భాలలో బయటపడతాయి. పార్టనర్ సహకారంతో సెన్సేట్ ఫోకస్, ఫోర్ ప్లే టెక్నిక్ లు, సైకో థెరపీల ద్వారా చికిత్స జరుగుతుంది.

అంగస్తంభన సమస్యకు ఈ రోజుల్లో ముఖ్యకారణం ఇతర వ్యాధులకు చిరకాలం వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్, అధిక రక్తపోటుకు వాడే మందుల సైడ్ ఎఫెక్ట్స్ గా అంగస్తంభన సమస్య కల్గినా ఆ మందులు ఆపితే అధిక రక్తపోటు వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలాంటివారిలో నివారణ మందులు, బిపీకి వాడే మందులతో పాటు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు వాడే మందులు, కడుపులో అల్సర్ కి వాడే సిమిటిడిన్ లాంటి మందులు అంగస్తంభన సమస్య కలిగిస్తాయి. వైద్యుని సలహాతో మందులు మార్చడం, అల్సర్, డిప్రెషన్ లాంటి వాటికి సురక్షితమైన మందుల్ని ప్రయత్నించడం మంచిది.

యాంత్రిక సాధనాలతో చికిత్సలో వ్యాక్యూమ్ పంపులు, ఇంప్లాంట్స్ ముఖ్యమైనవి. ఆకస్మాత్తుగా, అనుకోకుండా కనుగొనబడినవి.... అంగంలో ఇంజెక్షన్స్ లు ప్రొ-బ్రిండ్లే, ప్రొ-విరాగ్ కృషి ఫలితంగా ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త మందులు కొత్త కొత్త విధానాలు వచ్చాయి. కొన్ని మందులు భారతదేశంలో దొరుకుతున్నాయి. కొన్ని ఇంకా మన మార్కెట్లోకి రావాల్సి ఉంది. అత్యంత ప్రాచీనమైనది, ప్రపంచంలో చాలామందికి అభిమానమైన మందులు, అత్యంత ఆధునికమైన మందులు, సాధనాలు రెండూ మనదేశంలో లభ్యమవుతున్నాయి. సురక్షితమైనవి, సైడ్ బెనిఫిట్స్ కలవి అయినందువలన మందులపై విశ్వాసం, ఆదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

వ్యాక్యూమ్ పంప్
అంగస్తంభన కలిగించే సాధనాల కోసం ప్రయత్నాలు అనేక సంవత్సరాలుగా జరపబడుతున్నాయి. వ్యాక్యూమ్ పంపులలో అనేక రకాలున్నాయి. అందులో ఒక రకం పంపులో ఎక్రలిక్ ట్యూబ్ లో అంగాన్ని ఉంచి వ్యాక్యూమ్ ప్రెషర్ ఇవ్వాలి. అంగస్తంభన కలిగాక అంగం మొదటి భాగంలో రింగులను ఉంచాలి. ఈ రింగులను ఉంచినందువలన రక్తం అంగం నుంచి బయటకు వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఆ తరువాత సిలండ్దర్ ని తీసివేసి రతిలో పాల్గొనవచ్చు. రిగులను తీసివేసేవరకూ (30 నిమిషాలలోపు) అంగస్తంభన కొనసాగుతుంది. రింగులు ఉన్నందువలన వీర్యస్ఖలనం సరిగా కాదు.

ఈ వ్యాక్యూమ్ పంప్ వాడిన కొద్దిమందిని ప్రశ్నించగా ఇది వాడేప్పుడు అంగంలో నొప్పి తిమ్మిరి కలిగాయని, ఆరు నెలల తరువాత ఇది వాడాలనే ఉత్సాం తగ్గిందని, కొందరు ఇక ఇది వాడదలుచుకోవడం లేదని కొందరు చెప్పారు. ఇది ఇంగ్లాండ్ లో జరిగిన పరిశీలన. అమెరికాలో ఇది వాడమని సలహా ఇస్తున్న డాక్టార్లు దీని పనిపై సరి అయిన సమాధానం ఇవ్వలేదు. అమెరికాలో ఇది తయారు చేసే కంపెనీ ఇచ్చే సమాచారంలో మూడు వేలమందికి పైగా వారు చెప్పినవి పొందుపరిచి పంపారు. వ్యాక్యూమ్ పంప్ పెట్టిన అరనిమిషం నుంచి అయిదు నిమిషాల లోపు అంగస్తంభనలు కలిగినట్లు, 52 శాతం మందికి వీర్య స్ఖలనంలో ఏ విధమైన సమస్యలు కలగనట్లు, 16 శాతం మందికి వీర్య స్ఖలనంలో సమస్యలు కలిగినట్లు తెలియజేశారు. వ్యాక్యూమ్ పంపులు, రింగులు వాడవద్దని చెప్పే డాక్టర్లు ఇవి వాడాక అంగంలోని కణజాలానికి నష్టం కలుగుతుందని, మూత్ర మార్గానికి ఇన్ ఫెక్షన్ లు కలుగుతాయని చెప్తున్నారు.

ఒక రకమైన వ్యాక్యూమ్ పంప్ సుమారు 12,500 రూపాయలు ఖరీదు చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే వ్యాక్యూమ్ పంపు సుమారు 23,500 రూపాయలు చేస్తుంది. ఇంకోరకం వ్యాక్యూమ్ పంప్ అంగంపై కండోమ్ లాగా అతికిఉంటాయి. దీన్ని వేసుకుని రతి జరపవచ్చు. ఈ సాధనాలు జననాంగాలకు ఏ విధమైన హానీ చెయ్యవు అన్నది ఇంకా శాస్త్రీయంగా నిర్థారించబడలేదు. అమెరికాలో ఉండేవారికి దీని ఖరీదు భరించవీలవుతుంది. సుమారు 350 అమెరికన్ డాలర్లు కనుక, అదే మన దేశంలో అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఇవి దేశీయంగా తయారు చేస్తే అత్యంత చవకగా అమ్మవచ్చు. అప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయి.

అంగంలోకి ఇంజెక్షన్లు :
ఇంగ్లాండ్ కి చెందిన ప్రొఫెసర్ బ్రిండ్లే, ఫ్రాన్స్ కి చెందిన ప్రొఫెసర్ విరగ్ కృషి ఫలితంగా అంగంలోకి చేసే ఇంజెక్షన్లు అంగస్తంభన సమస్య వ్యాధి నిర్థారనలోనూ, చికిత్సలోనూ ఉపయోగపడుతున్నాయి. నాడీ మండలానికి సంబంధించిన వికృతుల వలన కల్గిన అంగస్తంభన సమస్య కలవారిలో ఈ ఇంజెక్షన్లు నూరు శాతం మంచి ఫలితాన్నిచ్చినట్టు, రక్తనాళాలకు సంబంధించిన వికృతి కలిగిన వారిలో 66 శాతం మందిలోనూ, ఇవి మంచి ఫలితాన్నిచ్చినట్టు చూశారు. మానసిక కారణాలు కలవారిలో ఈ ఇంజెక్షన్ల ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరిలో అతి తక్కువ మోతాదులో కూడా ఉపద్రవాలు కలుగుతాయి. కొందరిలో అసలు అంగస్తంభన కలగదు.
ఈ ఇంజెక్షన్లలో కలిగే ముఖ్యమైన ఉపద్రవం అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోవడం. 6-12 గంటలు మించి అంగస్తంభన ఉండిపోతే వెంటనే చికిత్స చేసి అంగస్తంభన తగ్గించాలి. లేకపోతే అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోతే అంగంలో కణజాలాలకు హాని కలిగి అంగస్తంభన శాశ్వతంగా కలగదు. ఈ ఇంజెక్షన్ లని సొంతంగా చేసుకోవడం నేర్చి చికిత్స చేసుకోవచ్చు. ప్రొఫెసర్ బిండ్లే 15 రోజులకు ఒక ఇంజెక్షన్ మాత్రమే చేసుకోవాలన్నారు. ఇంజెక్షన్ చేసుకున్న కొద్ది నిమిషాలలోనే అంగస్తంభనం కలుగుతుంది. కలిగిన స్తంభనం ఎక్కువసేపు ఉంటుంది. అయినప్పటికీ మనదేశంలోనే కాక విదేశాలలో కూడా రెగ్యులర్ గా వీటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడడం లేదు.
ఇంజెక్షన్లలో మూడు రకాలున్నాయి. కావర్ జెక్ట్ ఖరీదైనది. ఒక ఇంజెక్షన్ ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుంది. కొద్ది నొప్పి ఉండవచ్చు. దీనివలన కలిగిన అంగస్తంభనాలు గంట అంతకంటే ఎక్కువ సేపు నిలబడుంటుంది. 1955లో ఇది ఎఫ్.డి.ఎ. అప్రూవల్ పొందింది. 1977లో ఈడెక్స్ అనే మరో ఇంజెక్షన్ ఎఫ్.డి.ఎ. అప్రూవల్ పొందింది. ఇది కానరెక్ట్ కంటే చవకైనది. ఇంకా చిన్న నీడిల్ తో ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అంగస్తంభన గంట సేపు ఎక్కువ నిలబడుతుంది. ఇన్విరాక్స్ అనునది పెంటాలమైన్, వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పోలీపెప్టైడ్ ల మిశ్రమం ఇది. ఇది అల్ప్రోస్టాడిల్ కంటే సమర్థవంతమైంది. నొప్పి అసలు ఉండదు. వెంటనే అంగస్తంభనాన్ని కలిగిస్తుంది. ఇవేకాక క్రీమ్‍లద్వారా అంగస్తంభన కలిగించే మందులపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ప్రొఫెసర్ విరాగ్ 1979 నుంచి 1993 వరకు 2056 మందిలో 163042 ఇంజెక్షన్లు మొత్తం వాడినవారిని పరిశీలించారు.
అంగంలో చిన్న చిన్న గడ్డలు 10 శాతం మందిలో 235 ఇంజెక్షన్ల తర్వాత అంగస్తంభన ఎక్కువ సేపు నిలబడిపోవడం ఆయన గమనించారు. 1989 తర్వాత ఉపద్రవాలు తక్కువ కలిగినట్లు చూశారు. అనుభవం పెరిగే కొద్దీ ఉపద్రవాలు తక్కువ కలగడం చూశారు. డాక్టర్ గణేశన్ అదైకన్ ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 తో దీర్ఘకాలం వాడినప్పుడు అంగంలోని కణజాలంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది పరిశీలించారు. ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 వాడినవారిలో అంగస్తంభన ఎక్కువసేపు ఉండడం అనే ఉపద్రవం తక్కువగా కలిగినట్లు తక్కిన మందులు వాడినప్పుడు 5 శాతం 10 శాతం మందిలో ఈ ఉపద్రవం కలిగినట్లు ఆయన చూశారు. అంగంలో కొద్దిపాటి నొప్పి కలుగుతుందని వాడిన వారు చెప్పారు. జంతువులలో ఎనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు పెపావరిన్, ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 వాడి అంగంలోని కణజాలంలో కలిగే మార్పులు గమనించారు. అంగంలోని కణజాలంలో వాపు కుంచించుకు పోవడం లాంటి మార్పులు పెపావరిన్ లో కలిగినట్టు, ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 లో కలగనట్టు చూశారు. అంగస్తంభన సమస్య చికిత్స విషయంలో ఇంజెక్షన్ల ద్వారా వాడే మందులలో ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 ఉత్తమమైనదిగా ఆయన చెప్తారు. ఈ ఇంజెక్షన్ ఖరీదు 1100 రూపాయలు. ఒక ఇంజెక్షన్ ఒక్కసారికే పనికివస్తుంది. ప్రతిసారీ అంత మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది.

అంగస్తంభనానికి మూత్ర మార్గం ద్వారా మందు :
మూసే అన్న పేరుతో అమెరికన్ మార్కెట్లో అంగస్తంభనాన్ని వెంటనే కలిగించే సాధనం విడుదలైంది. 1996 నవంబరులో ఎఫ్.డి.ఎ అప్రూవల్ కూడా లభించింది. ఈ సాధనం ద్వారా మూత్ర మార్గములోకి మందును ప్రవేశపెట్టవచ్చు. ఈ సాధనం ప్రవేశపెట్టడానికి ముందు మూత్ర విసర్జన చేసి జననావయవాల్ని బాగా కడగాలి. మూత్ర మార్గం తడిగా ఉన్నందువలన ఈ సాధనాన్ని మూత్రమార్గంలో ప్రవేశపెట్టడం తేలికవుతుంది. అంతేకాకుండా కొద్దిపాటి మూత్రపు చుక్కలున్నందువలన మందు త్వరగా శోషణం చెంది అంగస్తంభనాన్ని కలిగిస్తుంది. కూర్చొని లేదా నిల్చుని నెమ్మదిగా జననావయవాన్ని సాగదీయాల. అంగాన్ని వేళ్ళతో పైకి పట్టుకుని ఈ సాధనాన్ని లోపలికి ప్రవేశపెట్టి పైన ఉన్న బటన్ నొక్కాలి. దీనివలన మందు మూత్ర మార్గంలో పడుతుంది. రెండు చేతుల మధ్య అంగాన్ని ఉంచి పది సెకన్లు బాగా రుద్దాలి. ఒకవేళ మంట కలిగితే ఇంకొక నిమిషం వరకు అంగాన్ని రుద్దాలి. ఈ సాధనాన్ని ప్రవేశపెట్టిన 15 నిమిషాల వరకు కూర్చోవడం, నిల్చోవడం లేదా నడవడం లేదా ఫ్లోర్ ప్లేలో పాల్గొనడం చేయాలి. దీనివలన అంగంలోకి రక్తప్రసారం పెరిగి మంచి స్తంభన కలుగుతుంది.
ఆందోళన, అలసట, టెన్షన్, ఎక్కువ మద్యం సేవించడం, ఈ సాధనం పెట్టుకోగానే పడుకోవడం లేదా మూత్ర విసర్జన చేయడం లాంటివి అంగస్తంభనాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా జలుబుకు, ఎలర్జీ, సైనసెటిస్ వాటికి వాడే మందులు కూడా అంగస్తంభనాలను తగ్గిస్తాయి.
ఈ సాధనం వాడే మొదట్లో మూత్ర మార్గములోకి ప్రవేశపెట్టడం కొంత కష్టంగా ఉండవచ్చు. అలవాటు పడితే అంత కష్టముండదు. ఒక సాధనం ఒకసారికే పని చేస్తుంది. ప్రతిసారీ కొత్తది వాడాల్సొస్తుంది. సాధనం ఖరీదు 20 నుంచి 38 డాలర్లదాకా ఉంది. కనుక ప్రతిసారీ అంత ఖర్చు చేయాల్సి వస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ :
అంగంలో మంట, నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం, నాడి వేగంగా కొట్టుకోవడంలాంటివి కలుగుతాయి. ఈ సాధనం ప్రవేశపెట్టిన అయిదు నుంచి పది నిమిషాలలో అంగస్తంభన కలుగుతుంది. సుమారు 30-60 నిమిషాలు అది నిలబడి ఉంటుంది. కొందరిలో ఇంకా అది నిలబడిఉ ఉండే అవకాశాలున్నాయి. నాలుగు గంటలకు మించి అంగస్తంభన ఉండిపోతే వెంటనే డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. ఐస్ ను తొడల లోపలి భాగంలో రుద్దడం ద్వారా కూడా స్తంభనాన్ని తగ్గించవచ్చు. భార్య గర్భవతిగా ఉన్నవాళ్ళు కండోమ్ వాడాలి. ఇది వాడిన వారి భార్యలలో యోనిలో దురద, మంట కలగడం గమనించారు.

జెల్లిలాంటివి వాడడం కూడా అవసరమవుతుంది. సాధనము వాడే వాళ్ళలో దీర్ఘకాలంలో ఏమైనా నష్టాలొస్తాయన్నది ఇంతవరకూ చూడలేదు.
ఈ సాధనంలో వాడే మందు ప్రొస్టాగ్లాండిస్ ఈ 1. మానవుని శుక్రంలో ప్రొస్టాగ్లాండిస్ ఈ 1, ఈ 2లు ఎక్కువగా ఉంటాయి. స్ఖలనం అయిన వీర్యంలో ప్రతి మిల్లీలీటర్ కు 100-200 మైక్రోగ్రాముల ప్రొస్టాగ్లాండిన్స్ ఉంటాయి. మూత్రమార్గంలోకి 500 మైక్రోగ్రాముల ప్రొస్టాగ్లాండిన్స్ ప్రవేశపెట్టినప్పుడు అంగంలో రక్తప్రసారం 5-10 రెట్లు అధికమైనట్టు డాప్లర్ పరీక్షలలో గమనించారు. అంటే మూత్ర మార్గం ద్వారా ప్రవేశపెట్టిన మందు అక్కడా శోషణం చెంది అంగంలోని అన్ని కణాలకు చేరి అంగస్తంభన కలిగిస్తుంది అని తెలుస్తుంది. మూత్రమార్గంలోని గోడల కుండా కార్పరి స్పాంజియోజ ద్వారా కారిప్రాకావర్నోజాలోకి మందు వెళ్తుంది. పది నిమిషాలలో మందు శోషణం చెందుతుంది.

ఈ సాధనం మార్కెట్లోకి వచ్చాక అంగస్తంభనాన్ని కలిగించే మందులపై పరిశోధనలు తీవ్రతరమయ్యాయి. అనేక మందులపై పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి. అవి సత్ఫలితాల్నిస్తున్నాయి కూడా. నాలుక క్రింద ఉంచుకునే మాత్రలు, అంగంపై పూత మందులు వీటన్నిటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలలోనే ఇవి పరిశోధనలు పూర్తి చేసుకుని రావచ్చు. ఈ మందులు మానవుని చిరకాల వాంఛను నెరవేరుస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలాంటి మందులు, సాధనాల కోసమే కలలు కంటూ వచ్చారు. 1980 తర్వాత ఇలాంటి కలలు నిజమయ్యే రోజు వచ్చింది.
కానీ శృంగారం అంటే మగాడికి సంబంధించినదేనా? ఆడవాళ్ళ పరిస్థితేంటి? శృంగారంలోనూ, శృంగార సమస్యల విషయంలోనూ, శృంగార సమస్యల పరిష్కార విషయంలోనూ స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి స్త్రీని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అని అమెరికాకు చెందిన యూరాలజిస్ట్ లు చెబుతున్నారు. అదే విధంగా మగవారి సమస్యలకు అనేక కారణాలుంటాయి. వివిధ కారణాలు అన్వేషించడం, కౌన్సెలింగ్, చికిత్స ఇవి ఎంతో ముఖ్యమైనవి. కాకపోతే అంగంలోకి వేసే ఇంప్లాంట్స్ అవసరాన్ని చాలావరకు ఈ మందులు, సాధనాలు తగ్గిస్తున్నాయి. కనుక రాబోయే సంవత్సరాలలో ఇంప్లాంట్స్ సర్జరీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ సాధనాలు అంగస్తంభనాన్ని కలిగిస్తాయి కానీ సుఖవ్యాధుల నుంచి రక్షణనీయవు. కనుక సురక్షిత శృంగార మార్గాలు అవలంభించకపోతే సుఖవ్యాధులు కలిగే ప్రమాదం ఉంది.

వయాగ్రా :
అంగస్తంభనం వెంటనే కలిగించే నోటి ద్వారా వాడే మందు ఫుడ్ అండ్ డ్రగ్స్ ఎడ్మినిస్ట్రేషన్, అమెరికా వారి ఆమోదం పొంది అమెరికన్ మార్కెట్లో విడుదలయిన మొదటివారంలోనే సంచలనం సృష్టించింది. దాని పేరు వయాగ్రా. ఫైజర్ కంపెనీ తయారు చేసింది.
సెక్స్ టానిక్స్, వాటికి డిమాండ్, వాటి అవసరం అత్యధికంగా ఉన్నా ఇన్నాళ్ళూ ఈ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్లక్ష్యం చేశారు. దానికి ముఖ్య కారణము  సెక్స్ పెంచే మందులపై పరిశోధనలకు రీసెర్చ్ ఫండింగ్ లేకపోవడమే. అంగస్తంభన ప్రక్రియలో నైట్రిక్ ఆక్సైడ్ ముఖ్యపాత్ర వహిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిలిస్ కు చెందిన డాక్టర్ జాకబ్ రాజ్ ఫర్ కనుగొన్నారు. జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సాల్మన్ నైడర్ ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేశారు.
సింగపూర్ కు చెందిన డాక్టర్ గణేశన్ అదైకన్ అంగస్తంభనలో నైట్రిక్ ఆక్సైడ్ పాత్రను అమెరికన్ల కంటే ముందే గుర్తించారు. అంగస్తంభన చికిత్సలో ఇంజెక్షన్లు 1980లలో ప్రొఫెసర్ విరాగ్, ప్రొఫెసర్ బ్రిండ్లే కృషి ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత మూత్రమార్గం ద్వారా ప్రొస్టాగ్లాండిస్ ఈ 1ని ప్రవేశపెట్టే సాధనం మార్కెట్లోకి వచ్చింది. ఈ సాధనం మార్కెట్లోకి రాగానే అంగస్తంభనాన్ని వెంటనే కలిగించే మందులపై పరిశోధనలపై అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి.
ఫైజర్ కంపెనీ వయాగ్రా పేరుతో ఒక మందును మార్కెట్లోకి విడుదల చేసింది. అంగస్తంభన కలిగించడానికి నోటి ద్వారా వాడే మాత్రలలో ఎఫ్ డి ఎ అప్రూవల్ పొందిన తొలి మాత్ర ఇదే.
వయాగ్రా వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ఈ మందు ముట్లుడిగిన స్త్రీలలో కూడా వాడవచ్చని రోపోర్ట్స్ వస్తున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులిస్తాయా? సెక్స్ ఎంత సరిపోతుంది? ఎంత సహజము? ఎంత అవసరము? అన్నది ఎలా నిర్ణయిస్తారన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ముందున్న ముఖ్యమైన సమస్య. ప్లేబాయ్ శీర్షిక నిర్వహించే జేమ్స్ పీటర్ సన్ ‘చూస్తుండండి ఒక సంవత్సరంలో ఉమెన్స్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ వస్తాయి. ఆ శక్తి మీదా? వయాగ్రాదా? అని. అంతేకాదు కుటుంబ నియంత్రణ పిల్ ఎంత ముఖ్యమైనదో ఈ మందు కూడా అంతే ముఖ్యమైందని అంటున్నారు. వృద్ధులలో ఈ మందు వాడాక వాళ్ళ శృంగార సామర్థ్యం పెరగడం, తద్వారా ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువకాలం జీవించడం సంభవిస్తాయి. ఒక విధంగా శృంగారంలో వృద్ధాప్యాన్ని మరిచిపోయి యువకుల్లా ప్రవర్తించవచ్చు.

కామోద్రేకం కలిగినప్పుడు అంగంలో అంగస్తంభన కలిగించే కార్పస్ కావర్నోజమ్ లోకి నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ గ్యానిలేట్ సైక్లేస్ అనే ఎంజైమ్ ప్రేరేపించినందువలన సైక్లిక్ గ్వానిజిన్ ఫాస్ఫేట్ (-ఏః) పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా అంగంలోకి రక్తప్రసారం ఎక్కువవుతుంది. వయాగ్రాలో ఉండే మందు సిల్జినాపిల్ సిట్రేట్. కామోద్రేకం కలిగినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుంది. సిల్జినాపిల్ ఫాస్ఫోడైయిస్టరెస్ టైప్-5ని ఇన్ హిబిట్ చేయడం ద్వారా -ఏః పరిమాణాన్ని పెరిగేట్లు చేస్తుంది. అప్పుడు స్మూత్ మజిల్ రిలాక్స్ అయి అంగంలోకి రక్తప్రవాహం పెరిగి అంగస్తంభన కలుగుతుంది. కామోద్రేకం లేనప్పుడు ఈ మందు అంగస్తంభన కలిగించదు.
ఖాళీ కడుపుతో ఈ మాత్ర తీసుకున్నప్పుడు 30 నుంచి 120 నిమిషాలలో ఈ మందు శరీరంలోకి శోషణం చెందుతుంది. తిన్న తర్వాత వేసుకున్నట్లయితే శోషణం తగ్గుతుంది. మాత్ర వేసుకొన్న 90 నిమిషాల తర్వాత వీర్యంలో ఈ మందు యొక్క పరిమాణం 0.001మి కంటే తక్కువ. ఇది వాడినవారిలో కొన్ని గంటలు చూపు మందగించినట్లు గమనించారు.
19-87 సంవత్సరాల మధ్య వయస్సు కల అంగస్తంభన సమస్య కలవారిపై 3700 మందిలో దీన్ని వాడారు. వారిలో 58మి లో అంగస్తంభన సమస్య శారీరక కారణాలవలన కలిగింది. (వెన్నెముక దెబ్బలు కల్గినవారిని తీసుకోలేదు). మధుమేహం వలన సమస్య కల్గినవారు ఇందులో వున్నారు 17., మానసిక కారణాల వలన అంగస్తంభన సమస్య కల్గినవారు. 24.. శారీరక, మానసిక కారణాలు రెండూ వున్నవారు 25మి గ్రా మందువాడినవారిలో 63,--50 మి గ్రా మందు వాడిన వారిలో 74 మంది। 100 మి గ్రా మందువాడిన వారిలో 82 మందిలోనూ అంగస్తంభనాలు కలిగినట్లు చూశారు.

వెన్నెముక దెబ్బ తగిలిన 178 మందిలో ఈ మందునిచ్చి చూడగా వారిలో 83మి మందిలో అంగస్తంభనాలు బాగా కలిగినట్లు, 59 మి మంది విజయవంతంగా శృంగారం జరిపినట్లు చూశారు. ప్రొస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించిన వారిలో 43మి వయాగ్రా అంగస్తంభనాలను వృద్ధి పొందించింది. మానసిక కారణాలవలన అంగస్తంభన సమస్య కలిగిన 179 మందిలో 84మి మందిఉలో వయాగ్రా మంచి అంగస్తంభనాలు కలిగించింది. గుండె జబ్బు (కరోనరీ ఆర్టరీ డిసీజ్), అధిక రక్తపోటు, ఇతర గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, రాడికల్ ప్రొస్టేటెక్ట్ లు, ట్రాన్స్ యురెత్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్‍, వెన్నెముకకు దెబ్బలు తగిలినవారు, డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు మందులు వాడేవారు, అధిక రక్తపోటుకు మందులు వాడేవారు – వీరందరిలో కల్గిన అంగస్తంభన సమస్యను వయాగ్రా చాలావరకు తొలగించగలిగింది.
ఆర్గానిక్ నైట్రేట్స్ వాడేవారు వయాగ్రా వాడరాదు. అసలు అంగస్తంభన సమస్యకు కారణాలన్వేషించి పూర్తి చెకప్ చేయాలి. గుండె జబ్బు వున్నవారు ఈ మందును వాడ్డానికి ముందు కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం తప్పనిసరి. బ్లీడింగ్ డిజార్డర్స్ వున్నవారు, పెప్టిక్ అల్సర్ వున్నవాళ్ళు, రెటినైటిస్ పిగ్మెంటోజా వున్నవారు ఈ మందును జాగ్రత్తగా వాడాలి.
వయాగ్రా 3700 మందిలో వాడబడింది. వారిలో 550 మంది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఈ మందు వాడారు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగినవారు మొత్తం 730 మంది.తలనొప్పి, ముక్కుదిబ్బడ, యూరినరీ ఇన్ ఫెక్షన్లు, దృష్టిలోపాలు, అతిసారం, శరీరంపై పొక్కులు, మొహం ఉబ్బడం, కడుపునొప్పి, వాంతులు, నోరెండిపోవడం, దాహం, షుగర్ కలవారికి రక్తంలో షుగర్ పెరగడం మొదలగు సైడ్ ఎఫెక్ట్స్ చూశారు. ఎవరిలోనూ అంగం ఎక్కువసేపు నిలబడిపోవడం చూడబడలేదు. శృంగారానికి గంటముందు ఈ మాత్ర వేసుకోవాలి. రోజూ ఒక మాత్ర కంటే ఎక్కువ వాడకూడదు.

ఇక ఈ మందు చిరకాలం వాడిన వారిలో ఎలాంటి దుష్పరిమాణాల్ని కల్గిస్తుంది. ఇతర మందులతో కలిపి వాడినప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయం తెలియాల్సి ఉంది. అప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ గూర్చి అమెరికాలో చర్చ మొదలైంది. అసలు ఈ మందు గుండెనొప్పి తగ్గించడం కోసం ప్రయత్నించబడింది. ఈ మందు ప్రభావం వల్ల గుండెలోకి కాక తక్కిన అవయవాల్లోకి రక్తప్రసారం పెరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ మందుని రూపొందించారు.

మధుమేహం వలన అంగస్తంభన సమస్య కల్గి 10 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడిన ఒక వ్యక్తి ఈ మాత్రలు వాడ్డం మొదలు పెట్టాక 3వ సారి నుంచి బాగా పనిచేయడం ప్రారంభించింది. 59 సంవత్సరాల ఆ వ్యక్తి 30 ఏళ్ళ వాడిలాగా ఫీలవుతున్నానని చెప్తున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ మందు డబ్బులివ్వనూ అంటే నెలకు కనీసం 20 సార్లయినా తనే కొనుక్కుంటానని చెపుతున్నాడు.

లాస్ ఏంజిలిస్ కు చెందిన 63 ఏళ్ళ బోమన్ ప్రోస్టేట్‍ ఆపరేషన్ తర్వాత అంగస్తంభన కోల్పోయాడు. 1995లో ఇకదానికి చికిత్స ఇంప్లాంట్ కానీ, వ్యాక్యూమ్ పంపుగానీ, ప్రోస్టాగ్లాండిస్ ఈ 1 ఇంజెక్షన్స్ ని అతను వాడాడు. ఫలితంగా బాగానే కలిగింది కానీ అంగస్తంభన ఒక్కొక్క సేపు బాగా నిలబడి పోయేది. ఆ తర్వాత అతను మూత్రమార్గం ద్వారా వాడే మందు “మూసే” ప్రయత్నించాడు. అది పని చేయలేదు. ఆ తర్వాత వయాగ్రా క్లినికల్ ట్రయల్స్ లో అతను పాల్గొన్నాడు. ఆ మందు బాగా పనిచేసింది. ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో వున్నట్లు భావిస్తున్నాను అని అతను చెపుతున్నాడు. అనేక చోట్ల అమెరికన్లకు నోటి ద్వారా వాడే మాత్రలు గొప్ప ఆశాకిరణాలవుతున్నాయి. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ లెక్కల ప్రకారం 1-2 కోట్ల అమెరికన్లు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువమందిలోనే ఈ సమస్య ఉంటుందని సెక్సాలజిస్ట్ లు చెపుతున్నారు. చాలామంది మాత్రమే చికిత్సకు వస్తారు. అందువలన ఇంకా అనేక కోట్లమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఆడవాళ్ళు ఫేస్ లిస్ట్ లు చేయించుకొని అందంగా తయారవ్వగాలేంది మగవాళ్ళు మందులు వాడి యువకులుగా ఎందుకు తయారవ్వకూడదు అని అంటున్నాడు మరొక వ్యక్తి.

విగర్, నయాగరా ఈ రెండింటిని కలిపి వయాగ్రా అన్న పేరు ఈ మందుకు ఫైజర్ కంపెనీ పెట్టింది. గుండెనొప్పి కలవారికి గుండెలో రక్తప్రసారం పెంచడానికి ఈ మందు ప్రయత్నించబడింది. ఇది వాడేవారిలో అంగస్తంభనలు పెరగడం సైడ్ ఎఫెక్ట్ గా గమనించి ఈ మందును అంగస్తంభనానికి ఉపయోగించారు.

చాలామంది సెక్స్ కి సంబంధించిన విషయాలపై జోక్ చేస్తుంటారు. అంగస్తంభన సమస్య అనేక కోట్ల మందిని బాధించే సమస్య. ఇతర వ్యాధుల విషయంలో చూపించే శ్రద్ధ, ఆసక్తి, సీరియస్ నెస్ సెక్స్ సమస్యల విషయంలో కూడా చూపించాలి. వయాగ్రా ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. సెక్స్ సమస్యలకు కారణాలనేకం వుంటాయి. ఆత్మ విశ్వాసం కొరవడడం, భార్యాభర్తల అనుబంధం తక్కువగా ఉండడం, ఆందోళన, డిప్రెషన్ మొదలగునవి.

సైడ్ ఎఫెక్ట్స్ :
వయాగ్రా కోట్ల కొలది ఆడమగలకు ఉపయోగపడవచ్చు. కానీ అదే సంపూర్ణ సెక్స్ క్యూర్ కాదు. కామోద్రేకం లేని వారికి అది పని చేయదు. మామూలు వారికి అది ఎక్కువగా గట్టిగా లేదా ఎక్కువసేపు ఉండేట్టు చేయలేదు. వివాహాల్ని విడాకుల్నించి రక్షించలేదు.
ఈ మందుకుండే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్
- తలనొప్పి : వాడిన ప్రతి పదిమందిలో ఒకరికి తీవ్రమైన తలనొప్పి కలిగింది. డోస్ పెరిగే కొద్దీ తలనొప్పి కూడా ఎక్కువ అవుతుంది.
-చూపు నీలంగా వుండడం : అంగంలో వుండే ఎంజైమే కళ్ళలో కూడా ఉంటుంది. దానిపైన వయాగ్రా పనిచేస్తుంది. వాడినవారిలో30 మంది తాత్కాలికంగా కళ్ళుకనబడకపోవడం, మసగ్గా కనబడ్డం, నీలంగా కనబడ్డం సంభవించింది.
- కళ్ళు తిరిగి పడ్డం : ఈ మందు రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తపోటుని తగ్గించే ఇతరమందులు వాడి అంగస్తంభనానికి ఈ మాత్ర వేసుకున్నప్పుడు రక్తపోటు మరింత పడిపోయి కళ్ళు తిరిగి పడ్డం, షాక్ లోకి వెళ్ళడం సంభవిస్తుంది.
-అంగస్తంభన ఎక్కువసేపు నిలబడిపోవడం : ఈ మాత్ర అంగస్తంభనాన్ని ఎక్కువసేపు నిలబడేలా చేసినట్టు రిపోర్ట్స్ లేకపోయినా అవకాశాలు మాత్రం లేకపోలేదు.
-అంగస్తంభన సమస్య ఇతర సమస్యల్ని సూచించివచ్చు. గుండెజబ్బు, మధుమేహం మొదలగు వ్యాధుల్లో ఈ మందు అంగస్తంభన సమస్య కల్గుతుంది. ఆ తర్వాత అసలు వ్యాధి బయట పడవచ్చు. వయాగ్రా వాడుతుంటే ఈ వ్యాధులు గుర్తించాలన్న ఆలోచన తగ్గవచ్చు. గుండెజబ్బులున్నవారు కార్డియాలజిస్ట్ ను సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ఈ మాత్రవాడాలి.
-అలవాటుగా పరిణమించడం : ఈ మాత్రలపై లాంగ్ టెర్మ్ రిసెర్చెస్ లేవు. ఎంతమందికి ఇది అలవాటుగా పరిణమిస్తుంది అన్నది ఇప్పుడే చెప్పలేం.

ఎలా పనిచేస్తుంది ?
1. పరిస్థితులన్నీ బావుంటే మొదడునుంచి వచ్చే కామసంకేతాలు అంగంలో సైక్లిక్ అనే రసాయనం విడుదలయ్యేట్టు చేస్తాయి. దీనివలన అంగస్తంభన కణజాలాలు రిలాక్స్ అయి వాటిలో ధమనులు వ్యాకోచిస్తాయి.
2. రక్తం అంగస్తంభన కణాల్లోకి వచ్చి అంగం గట్టిపడనారంభిస్తుంది. రక్తాన్ని బయటకు తీసుకెళ్ళే సిరలు మూసుకుపోయి అంగం గట్టిగా వుండడానికి దోహదపడ్తుంది. అంగస్తంభమ సమస్య కలవారిలో సైక్లిక్ ఏః తక్కువై సిరలను గట్టిగా నొక్కేంతగా వ్యాకోచాన్ని అంగంలోని కణజాలాలు పొందలేవు.
3. వయాగ్రా సైక్లిక్ ఏః మీద పనిచేస్తుంది. అంగస్తంభన కలిగేట్టు చేస్తుంది.

జీన్ థెరపీలపై కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మందులన్నీ మార్కెట్లో సంచలనం కల్గిస్తున్నాయి. ఇవి వచ్చాక అనేక వేలమంది నిర్భయంగా చికిత్సకొస్తున్నారు. వయాగ్రా పరిశోధనలకు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది. డిప్రెషన్ కు, స్థౌల్యానికి మందులు సంచలనం సృష్టించాయి. ఈ రెండూ కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపణయ్యాక అంగస్తంభన సమస్య కూడా కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపించబడింది.
వయాగ్రా వాడిన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు వచ్చినవార్త గొప్ప సంచలనం సృష్టించింది. మరణం వయాగ్రా వలన కల్గిందని ఇంకా నిర్థారించబడలేదని తెలియజేసింది. అయినప్పటికీ మరణానికి కారణాలను ఫైజర్ కంపెనీ అన్వేషిస్తుంది. 10 లక్షల మంది కంటే ఎక్కువమంది ఈ మందువాడారు. అందులో చాలామంది మధ్యవయస్కులే. ఈ మందు సురక్షితమైనది. ఈ మందు లేబెల్ పై గుండె జబ్బులు కలవారు, నైట్రో గ్లిజరిన్ లేదా తక్కిన నైట్రేట్స్ తో కలిపి వాడరాదని సూచించడం జరిగింది.
ఈ మరణాలు డ్రగ్, డ్రగ్ ఇంటర్ యాక్షన్ వలన కలిగాయా? లేదా అసలు వయాగ్రాకు సంబంధంలేనివా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మందు పరిశోధన దశలో 3000 మందిలో ఇది వాడారు. వాడిన వారిలో 8 మంది మరణించారు. మందు వాడినందువలన ఎవరిలోనూ మరణం సంభవించలేదని రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. వయాగ్రాని నైట్రోగ్లిజరిన్ తో కలిపి వాడినప్పుడు బ్లడ్ ప్రెజర్ బాగా పడిపోయి ప్రమాదం సంభవిస్తుంది. వయాగ్రాని గుండె జబ్బులతో వాడే మందులతో కలిపి ఇవ్వనప్పటికీ పారామెడికల్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా రతిక్రియలో ఉద్రేకం వలన ఎక్కువసేపు శృంగారం చేసినందు వలన గుండె జబ్బులు కలవాళ్ళకు ఒక్కొక్కసారి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని కంపెనీ తెలియచేస్తుంది.

--డా.కంభంపాటి స్వయంప్రకాష్

  • ==================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కటి వ్యాయామం-మూత్ర సమస్యలు , Hip exercise is good Urine problems


  • imagie : courtesy with google
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కటి వ్యాయామం-మూత్ర సమస్యలు , Hip exercise is good Urine problems- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావటమనేది మహిళల్లో తరచుగా కనిపించే సమస్యే. అయితే ఇలాంటిది పురుషుల్లో కనిపిస్తే చాలామంది ప్రోస్టేట్‌ సంబంధ సమస్యగా భావిస్తుంటారు. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. మూత్రం ఆపుకోలేని మహిళలకు కటి భాగం కండరాలు బలోపేతం కావటానికి ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి స్త్రీలకు మాత్రమే కాదు ఇలాంటి సమస్యతో బాధపడే పురుషులకూ మేలు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బటయపడింది. ఇవి మందులతో సమానంగా పనిచేస్తున్నట్టూ వెల్లడైంది. మూత్రాశయం అతిగా స్పందించే (ఓవర్‌యాక్టివ్‌ బ్లాడర్‌) గుణం గలవాళ్లు మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే బాత్రూమ్‌కు వెళ్లాల్సిందే. ఇది క్రమంగా మూత్రం ఆపుకోలేకపోవటానికీ దారితీస్తుంది. వీళ్లు ప్రవర్తనకు సంబంధించిన మార్పులను పాటించటంతో పాటు అవసరమైతే మందులూ వేసుకోవాల్సి ఉంటుంది. మందులు వేసుకుంటున్నప్పటికీ మూత్ర సమస్యలతో బాధపడుతున్న మధ్యవయసు, వృద్ధులపై ఇటీవల అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. అప్పటికే వేసుకుంటున్న మందులకు తోడు అదనంగా ఆక్సీబుటీనిన్‌ మందు వేసుకోవటం గానీ ప్రవర్తన పరమైన మార్పులను గానీ ఎనిమిది వారాల పాటు పాటించాలని వీరికి సూచించారు. ఈ పద్ధతుల్లో సాయంత్రం వేళల్లో ద్రవాలను తగ్గించటం, రాత్రిపూట మూత్రం వస్తున్నట్టు అనిపించినపుడు దాన్ని ఆపుకునే ప్రయత్నం చేయటం, కటి భాగం కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వంటివి ఉన్నాయి. ఈ వ్యాయామాల్లో భాగంగా.. కటి భాగం కండరాలు సంకోచించేలా రెండు నుంచి పది సెకన్ల పాటు గట్టిగా బిగపట్టి వదిలేయాలని చెప్పారు. ఈ వ్యాయామాన్ని రోజుకి 45 సార్లు (మొత్తం మూడు విడతల్లో) చేయాలని సూచించారు. మందులు వేసుకున్నవారితో పోలిస్తే వ్యాయామం చేసినవారిలో రాత్రిపూట మూత్రానికి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో మొత్తమ్మీద 90 శాతం మంది కొత్త చికిత్సతో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పటం విశేషం. మూత్రాశయ నియంత్రణ సమస్యలు గల పురుషుల్లో కటి వ్యాయాయం ప్రభావాలపై చేసిన తొలి అధ్యయనం ఇదేనని ఎమోరీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ తియోడోర్‌ ఎం.జాన్సన్‌ వివరిస్తున్నారు. ఈ సమస్యలకు మందులను ఇస్తున్నప్పటికీ వీటితో నోరు ఎండిపోవటం, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుండటంతో చాలామంది మధ్యలోనే మానివేస్తుంటారు. కాబట్టి తేలికైన, ఖర్చుతో పనిలేని ఈ వ్యాయామం చేయటం మంచిదని జాన్సన్‌ సూచిస్తున్నారు.

Kegel ఎక్సర్సైజేస్- పురుషులకు * Kegel ఎక్సర్సైజేస్

Kegel వ్యాయామాలు కటి కండరాలు శక్తివంతం సహాయపడతాయి. Kegel వ్యాయామాలు బాగు లేదా మూత్ర ఆపుకొనలేని ఉన్న ప్రజలకు మూత్రాశయమును నియంత్రణ (మూత్రం లీకేజ్) మెరుగు కు సహాయపడవచ్చు. ఈ వ్యాయామాలు కాంట్రాక్టు (కష్టతరం) మరియు కటి కండరాలు వదులు చేయడం ద్వారా పూర్తి చేసారు. Kegel వ్యాయామాలు కూడా కటి ఫ్లోర్ కండరము శిక్షణ లేదా కటి ఫ్లోర్ వ్యాయామాలు అని పిలుస్తారు. అవి కటి కండరాలు శక్తివంతం సహాయం చేయడానికి సరిగ్గా మరియు క్రమం తప్పకుండా చేయాలి.

కటి కండరాలు ఏమిటి?
కటి కండరాలు మీ కటి (హిప్) ఎముకలు మధ్య ప్రదేశం జోడించబడినవి. ఈ కండరాలు మీ కటి అవయవాలు స్థానంలోఉంచడాఅనికి సహాయపడుతుంది .. కటి అవయవాలు ఉదాహరణలు మూత్రాయమును (మూత్రం ఉంది) మరియు పురీషనాళం (ప్రేగు ఉద్యమాలు ఉన్నది) ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కటి కండరాలు నిర్వీర్యం చేయడానికి కారణం కావచ్చు. ఈ పరిస్థితులు కొన్ని-- అధిక బరువు మోయడము , వయస్సు మీదపడిన, లేదా ప్రోస్టేట్ శస్త్రచికిత్స మొదలగునవి . మీ కటి కండరాలు బలహీనంగా మారి మీరు మూత్రం ఆపుకొనలేని లేదా ఇతర సమస్యలు ఉండవచ్చు.

==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Heart attack,హఠాత్తుగా ఆగే హృదయం,సడన్‌ కార్డియాక్‌ డెత్‌,సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌,గుండెపోటు


  • Courtesy with Eenadu sukheebhava.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart attack- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • courtesy with : Dr.B.K.S.sastry --senior cardiologist Care Hos. Hyderabad.

అప్పటి వరకూ చురుకుగా పని చేసిన మనిషి.. హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవటం.. కుటుంబ సభ్యులో, స్నేహితులో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే.. మనకు దక్కకుండా పోవటం... తరచూ వినిపిస్తున్న వార్తే ఇది! వ్యక్తులు మారొచ్చు.. సందర్భాలు మారొచ్చుగానీ.. ఈ వార్త మాత్రం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది.
గుండె.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా ఎందుకు జారేస్తోంది? దీన్ని ఎదుర్కొనేదెలా...? ఇది ప్రాణప్రదమైన ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ప్రాణాలను నిలబెట్టే ప్రశ్న. సమాధానం తెలిస్తే ఆ క్లిష్ట సమయంలో కూడా.. ఆపన్నహస్తం అందించొచ్చు. అందుకే 'సడన్‌ కార్డియాక్‌ డెత్‌'... 'సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌'... వీటికి సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకుందాం.

హఠాన్మరణం ఎవరిలో ఎక్కువ?
* గతంలో ఒకసారి గుండెపోటు బారినపడిన వారు
* గుండె కండరం బలహీనంగా ఉన్నవారు.
* రక్తం పంపింగ్‌ (ఈఎఫ్‌) 35 కంటే తక్కువ ఉన్నవారు
* కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు
* కుటుంబంలో గుండెలో విద్యుత్‌ సమస్యలు (బ్రుగాడా, లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ మొ.) ఉన్నవారు
* గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు

హఠాత్తుగా గుండె ఆగి మరణించటం... సడెన్‌ కార్డియాక్‌ డెత్‌.. ఆగమేఘాల మీద స్పందించాల్సిన అత్యవసర సమస్య. ఈ స్థితిలో క్షణక్షణం.. ప్రతి ఘడియా కీలకమే. ఈ సమస్య ఇప్పటికే గుండె జబ్బు తీవ్రంగా ఉన్న వారిలో రావచ్చు.... ఇప్పటి వరకూ ఎటువంటి గుండె జబ్బూ ఉన్నట్టు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే సమస్య ఇది. అయితే... ఈ ఘడియల్లో వేగంగా స్పందిస్తే.. అవగాహనతో స్పందిస్తే.. మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

గుండె ఆగి హఠాన్మరణం సంభవించటమన్నది... సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్లు, తీవ్ర గుండె వైఫల్యం ఉన్నవాళ్లు, గుండె నిర్మాణంలో లోపాలున్న వారిలో ఎక్కువ. అయితే వీరే కాదు.. గుండెపోటు వచ్చే రిస్కులు ఉన్నవారిలోనూ ఇది సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన అంశమేమంటే- ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులున్న వారిలో హఠాన్మరణం పాలయ్యే వారి శాతం ఎక్కువ. వీరితో పోలిస్తే... కేవలం హైబీపీ, హైకొలెస్ట్రాల్‌, మధుమేహం, పొగతాగే అలవాటు వంటి గుండె పోటు రిస్కులున్న వారిలో హఠాన్మరణం సంభవించటమన్నది శాతాలపరంగా తక్కువగానే ఉండొచ్చు. కానీ సమాజం మొత్తం మీద సంఖ్యాపరంగా చూసినప్పుడు... మన సమాజంలో తీవ్రమైన గుండె జబ్బులుండి ఇలా హఠాన్మరణం పాలయ్యే వారికంటే కూడా ఈ గుండెపోటు రిస్కులుండి హఠాన్మరణం పాలయ్యే వారి సంఖ్యే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందుకే... హఠాత్తుగా గుండె ఆగి మరణించే వారి సంఖ్యను తగ్గించాలంటే గుండెపోటు రిస్కుల విషయంలో అంతా జాగ్రత్తగా ఉండటం అవసరం.

రిస్కులు కలిసిన కొద్దీ.. పెద్ద రిస్కు!
నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.

గుండెపోటు లేకుండానూ...
చాలామంది హఠాత్తుగా గుండె ఆగి మరణించటానికి ప్రధాన కారణం గుండె పోటే. గుండె పోటు లేకుండా కూడా కొందరిలో ఇటువంటి హఠాన్మరణం సంభవించవచ్చుగానీ.. వీరిలో పుట్టుకతోనే గుండె లోపాలుండటమో, లేక గుండె కండరం మందంగా (హైపర్‌ట్రోఫీ కార్డియోమయోపతీ) ఉండటం వంటి లోపాలు ఉండి ఉండొచ్చు. లేకపోతే గుండెలోపల విద్యుత్తు ప్రవాహం దెబ్బతినొచ్చు. మామూలుగా మన గుండెలో విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఈ విద్యుత్తు ప్రకంపనాలు తరంగాల మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే గుండె సక్రమంగా కొట్టుకుంటుంది. కానీ ఇవన్నీ ఒక్కసారిగా కట్టకట్టుకొని (వెంట్రికల్‌ టెకీకార్డియా) ప్రసారమైతే.. గుండె లయ విపరీతమైన వేగాన్ని అందుకుని.. అది అస్తవ్యస్తంగా కొట్టుకోవటం ఆరంభిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు ఎలాంటి విద్యుత్తు ప్రకంపనాలు సమయానికి చేరుకోకపోయినా (వెంట్రికల్‌ ఫిబ్రిలేషన్‌) గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తం కావొచ్చు. గుండె కండరంలో విద్యుత్తు ప్రసార వ్యవస్థలో ఎక్కడ అవాంతరం తలెత్తినా.. ఇలాంటి అస్తవ్యస్త స్థితి తలెత్తి.. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవచ్చు. ఇలాంటి విద్యుత్‌ ప్రసార సమస్యలన్నింటినీ కలిపి 'ఛానెలోపతీ' అంటారు. 'లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌, 'బ్రుగాడా సిండ్రోమ్‌' వంటివి దీనికి కారణమవుతుంటాయి. కారణమేదైనా గుండె లయ అస్తవ్యస్తమై.. కొన్ని సెకన్ల పాటు గుండె సమర్థంగా పని చేయకపోతే మెదడుకు రక్తప్రసారం దెబ్బతిని వెంటనే వ్యక్తి స్పృహ కోల్పోతాడు. కొద్ది నిమిషాలు ఇలాగే కొనసాగితే మరణించే ప్రమాదముంటుంది. ఇవన్నీ గుండె పోటుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటానికి కారణమవుతున్నాయి. ఇవి కొన్ని కుటుంబాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. దగ్గరి రక్తసంబంధికుల్లో ఎవరికైనా ఈ సమస్యలుంటే ఆ కుటుంబంలో మిగతా వారిలోనూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో ఎవరైనా ముఖ్యంగా 45 ఏళ్ల లోపువాళ్లు హఠాత్తుగా గుండె ఆగి చనిపోతే.. ఆ కుటుంబంలోని మిగతా వాళ్లూ ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. వీటిని ఈసీజీ, 2డీ ఎకోగ్రామ్‌ వంటి పరీక్షల ద్వారా గుర్తించే వీలుంటుంది. సరైన చికిత్స తీసుకుంటే హఠాన్మరణాన్ని నివారించే వీలూ ఉంటుంది.


పెద్ద ముప్పు.. గుండెపోటు
గుండెపోటు వచ్చి చనిపోయేవారిలో.. దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు వచ్చినవారిలో మరణాల రేటు 16-17% ఉండేది. వీరిలో చాలామంది ఆసుపత్రి కూడా చేరక ముందే, ఇంటివద్దో, దారిలోనో చనిపోతుండేవారు. ఇప్పుడున్న అత్యాధునిక చికిత్సలతో ఆసుపత్రికి వచ్చినవారిలో ఈ మరణాల రేటును 7-8 శాతానికి తీసుకురాగలిగాం. ఆసుపత్రికి చేరనివారిలో మరణాలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత వాటిని గుర్తించటం ఒక ఎత్తయితే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రి చేరటం మరోఎత్తు. దీని విషయంలో అవగాహన చాలా అవసరం. గణాంకాలు చూస్తే- గుండెపోటు మూలంగా సంభవించే అధిక శాతం మరణాలు మొదటి అర గంటలోనే సంభవిస్తున్నాయి. కొన్ని మొదటి 1, 2 నిమిషాల్లోనే సంభవిస్తున్నాయి. తర్వాత అర గంటలో ఎక్కువ. కాబట్టి త్వరగా స్పందించటం ముఖ్యం.

తాత్సారం వద్దు
హఠాన్మరణానికి దారితీసే అతిపెద్ద సమస్య హఠాత్తుగా వచ్చే గుండెపోటు. కాబట్టి గుండెపోటు రాకుండా చూసుకునే మార్గాలన్నీ.. హాఠాత్తుగా గుండె ఆగి సంభవించే మరణాలను తగ్గించగలిగేవే. అందుకే దీనిపై మరింత శ్రద్ధపెట్టాలి. గుండె నొప్పి అని అనుమానం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చెయ్యకూడదు. కొందరు ఈ కీలక ఘడియల్లోనూ తాత్సారం చేస్తుంటారు. వైద్యులు బలమైన అనుమానం ఉందని చెప్పినా ఏమీ లేదని అపోహలు పడుతూ తోసేసుకు తిరగటం, లేదా రకరకాల ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. గుండె పోటును- గుండె నొప్పి లక్షణాలు, వ్యక్తికి ఉన్న ఇతరత్రా రిస్కులు, ఈసీజీ వంటివన్నీ చూసి నిర్ధారిస్తారు. ఉదాహరణకు చిన్నవయసు అమ్మాయి గుండెలో నొప్పి అని వస్తే వెంటనే గుండెపోటును అనుమానించకపోవచ్చు. కానీ అదే 60 ఏళ్ల వ్యక్తి వచ్చి అదే లక్షణాలు చెబితే.. అప్పటికే అతనికి మధుమేహం, హైబీపీ, పొగతాగే అలవాటు వంటివి ఉంటే.. నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నా వెంటనే అనుమానించటం అవసరం. దీన్నే 'ప్రీ టెస్ట్‌ ప్రాబబిలిటీ' అంటారు.

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని 'గ్యాస్‌ ప్రాబ్లమ్‌'గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి... వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

నివారణ ముఖ్యం
అసలు గుండెపోటు అన్నదే రాకుండా నివారించుకోవటం అత్యుత్తమం. అందుకు ఉప్పు తక్కువ తినటం, పండ్లు ఎక్కువ తినటం, నిత్యం వ్యాయామం చెయ్యటం, బీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహం ఉందేమో పరీక్షలు చేయించుకోవటం... ఇవన్నీ ముఖ్యం. వీటిని పాటించటం ద్వారా చాలా మట్టుకు హఠాన్మరణాలు రాకుండా చూసుకోవచ్చు. వీటితో హఠాన్మరణాలు చాలా వరకూ తగ్గాయని వివిధ దేశాల అనుభవాలు, అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఒకసారి గుండెపోటు వస్తే..?
హఠాత్తుగా గుండె ఆగి మరణించటమన్నది ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న వారిలో చాలా ఎక్కువ. ఎందుకో చూద్దాం. ఇప్పటికే ఒకసారి తీవ్రమైన గుండెపోటు వస్తే.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చికిత్స ఎంత జాప్యమైతే గుండె కండరం అంత దెబ్బతింటుంది. కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా చికిత్స ఇవ్వగలిగితే.. గుండె కండరం అంత తక్కువగా దెబ్బతింటుంది, తర్వాతి కాలంలో హఠాన్మరణం సంభవించే అవకాశం అంతగా తగ్గిపోతుంది. కండరం బాగా దెబ్బతింటే గుండె రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌- ఈఎఫ్‌) అన్నది తగ్గుతుంటుంది, అది 35% కంటే తగ్గుతున్న కొద్దీ హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ముప్పు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. గుండెలో కరెంటు తీగలు, గుండె కండరం కలిసి ఉంటాయి. ఒకసారి గుండెపోటు వస్తే గుండె కండరంలో కొంతభాగం దెబ్బతింటుంది, అది చచ్చుబడినట్లవుతుంది. దాని మధ్యలో ఈ కరెంటు తీగలు చిక్కుబడినట్లవుతాయి. దీంతో కరెంటు షార్ట్‌సర్క్యూట్‌ అయినట్లయి... అక్కడక్కడే తిరుగుతుంటుంది, దీంతో గుండె మామూలుగా నిమిషానికి 80 సార్లు కొట్టుకోవాల్సింది... 200, 300 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ, కాబట్టి లయలు అస్తవ్యస్తమై (వీటీ, వీఎఫ్‌) హఠాత్తుగా మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువని గుర్తించాలి. కాబట్టి ఒకసారి గుండెపోటు వస్తే- వెంటనే వైద్యులు- వారిలో హాఠాత్తుగా మరణం ముంచుకొచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? అన్నది అంచనా వేస్తారు. ఒకవేళ గుండె పంపింగ్‌ సామర్థ్యం (ఈఎఫ్‌) తక్కువుండి, ఈసీజీలో మార్పులుండి, గుండె లయలో తేడాలు కనబడుతుంటే భవిష్యత్తులో హఠాన్మరణాలను నివారించేందుకు కొంత ఖరీదైనదే అయినా శరీరంలో 'ఏఐసీడీ' అన్న పరికరం అమర్చుకోవాలని సూచిస్తారు.

దీనితో పాటు.. ఒకసారి గుండెపోటు బారినపడితే.. అది మళ్లీ రాకుండా చూసుకోవటం, వైద్యులు చెప్పినట్టు మందులు, చికిత్స కొనసాగించటం చాలా అవసరం. ఇటీవలే సలీం యూసుఫ్‌ బృందం 'ప్యూర్‌ స్టడీ' పేరుతో నిర్వహించిన అధ్యయనంలో- మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత మందులు, చికిత్స సరిగా పాటించటం లేదని తేలింది. గుండెపోటు అన్నది జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిన సమస్య అని ఎట్టిపరిస్థితుల్లోనూ మరువకూడదు.
  • హఠాన్మరణాన్ని.. గుర్తుపట్టేదెలా?
ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే.. వెంటనే వాళ్లు స్సృహలో ఉన్నారా? లేదా? శ్వాస తీసుకుంటున్నారా? లేదా? గుండె కొట్టుకుంటోందా? లేదా? చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే 'కార్డియాక్‌ మసాజ్‌ (సీపీఆర్‌)' ఇవ్వటం తక్షణావసరం. విదేశాల్లో ఇటువంటి అత్యవసర ఘడియల్లో ఛాతీకి షాక్‌లు ఇచ్చి గుండె తిరిగి పనిచేసేలా చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో డిఫిబ్రిలేటర్‌ అనే పరికరాలు (ఏఈడీ) ఉంచుతారు. వీటితో గుండె తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయి. సత్వరమే వారిని అత్యవసరంగా మంచి సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రిలో వారికి అవసరమైతే డీసీ షాక్‌ ఇచ్చి గుండె తిరిగికోలుకునేలా చేస్తారు. ఒకవేళ గుండె కొట్టుకోవటం గాడిలో పడినా.. ఎక్కువ సమయం మెదడుకు రక్తసరఫరా లేకపోతే మనిషి'బ్రెయిన్‌ డెడ్‌'గా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారిచేందుకు చల్లటి దుప్పట్లలో (కోల్డ్‌ బ్లాంకెట్స్‌) పెట్టి శారీరక ఉష్ణోగ్రతను 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంచటం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వీటితో తిరిగి బతికి బట్టకట్టే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత దీర్ఘకాలం చికిత్స ఏమిటన్నది ఆలోచిస్తారు. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్‌ పెట్టటం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్‌ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణం పరిస్థితులు తలెత్తకుండా 'ఏఐసీడీఈ' అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు.
ప్రాణం పోయండి!

  • సీపీఆర్‌
ఎవరెనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టటం ముఖ్యం. వెంటనే 'బాగానే ఉన్నారా?' అని పిలవటం, శ్వాస పీలుస్తున్నారా? లేదా? నాడి కొట్టుకుంటోందా? లేదా? లేదా ఛాతీ మీద చెవి పెట్టుకుని గుండె కొట్టుకుంటోందా? లేదా?.. చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం 'కార్డియాక్‌ మసాజ్‌' (సీపీఆర్‌) చెయ్యటం అవసరం. ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదు ఇస్తారు.గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. ఆంబులెన్స్‌ వచ్చే వరకూ రక్త ప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం.

ముందుగా బాధితులను పడుకోబెట్టి.. పక్కనే మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్‌ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకప్పుడు ఇదే సమయంలో నోటిలో నోరుపెట్టి గాలి ఇవ్వాలనీ చెప్పేవారుగానీ ఇప్పుడది అవసరం లేదని తేలింది. కాబట్టి కేవలం ఛాతీ మీద నొక్కుతూ గుండె తిరిగి కొట్టుకోవటం ఆరంభించేలా చేస్తే చాలు.

పడిపోయిన తర్వాత వేగంగా సీపీఆర్‌ ఆరంభించటం ముఖ్యం. 5-6 సెకండ్లలో రక్తసరఫరా పునరుద్ధరించకపోతే మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోతుంది. 40 సెకన్లు సరఫరా లేకపోతే వాళ్లు బ్రెయిన్‌ డెడ్‌ స్థితిలోకి వెళతారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో వేగంగా పని చేయాల్సి ఉంటుంది.
  • క్రీడలకు ముందు ఓ ఈసీజీ
ఎవరైనా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్‌ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. పోలీసు, ఎస్సై వంటి పోస్టులకు జరిపే దేహదారుఢ్య పరీక్షల్లో చాలా దూరాలు పరుగులుపెట్టే కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలాంటి శారీరక దారుఢ్య పరీక్షలకు వెళ్లినప్పుడు అప్పటికే వీరిలో లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ వంటివి ఉంటే ఇలాంటి సమయంలో అవి మరింత సమస్యాత్మకంగా మారి, హఠాత్తుగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు ఆరంభించే ముందు తప్పనిసరిగా ఈసీజీ పరీక్ష తీయించి, సమస్యేమీ లేదని నిర్ధారించుకోవటం మంచిది. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. కొందరు కొంచెం సేపు ఎక్కువ వ్యాయామం చేస్తే కళ్లు తిరిగి పడిపోతుంటారు. వీరు కూడా ఓసారి వైద్యులను సంప్రదించి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/