Monday, December 26, 2011

పుట్టుమచ్చలు-క్యాన్సర్‌,Malignent Melanoma,Birth moles and cancer




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పుట్టుమచ్చలు-క్యాన్సర్‌(Malignent Melanoma,Birth moles and cancer ) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ''మేలిగంట్‌ మెలనోమా'' అంటారు.

మేలిగంట్‌ మెలనోమా అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.

  • కారణాలు :
(1) ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే మిగతావారికి 10 శాతం ఎక్కువ రిస్కు ఉన్నట్లు కొన్ని అధ్యయనములలో తేలినది. ఈ మెలనోమా ఉన్న కుటుంబంలో ఎక్కువగా మ్యుటేటెడ్‌ gene CDKN2A అను జీన్‌ ఉన్న (ఉదా : వీజ×= జీన్‌) కుటుంబ సభ్యులలో ఎక్కువగా ఉంటుంది. (2) ఇంకోరకము జాతిలో ఇవి - అధిక సంఖ్యలో పుట్టు మచ్చలు వేర్వేరు సైజులలో వుంటాయి. ఇటువంటి వారిలో మెలనోమా క్యాన్సరు ఎక్కువగా రావచ్చును. కొన్ని సాధారణ పుట్టుమచ్చలు ఒక్కోసారి సైజు పెరిగి ఈ విధంగా మారవచ్చును. (3) ఇమ్యునో సప్రెషన్‌ - సాధారణ ప్రజలకన్నా, అవయవ మార్పిడి జరిగి ఇమ్యునోసప్రెషన్‌లో ఉన్నవారిలో 5శాతం చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కిడ్నీ మార్పిడి జరిగిన వారిలో కనపడుతుంది. (4) అల్ట్రావయెలెట్‌ రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల, అతిగా ఎండ తగలడం వల్ల ఈ క్యాన్సర్‌ రావటానికి అవకాశం వుంది. (5) కోల్‌తార్‌, క్రియోసొలేట్‌, ఆర్సినిక్‌, రేడియంల కు ఎక్ష్పోజ్ అవడము వల్ల ఈ క్యాన్సరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

  • మేలిగంట్‌ మెలనోమాలో రకాలు :-

(1) 70% ఈ కోవకు చెందినవి. ఎక్కువగా మధ్యవయస్సు వారిలో చూస్తాము. శరీరములో ఏ భాగమున అయినను రావచ్చును. ఎక్కువగా మగవారిలోను, ఆడవారిలోను వీపుపైభాగాన, ఆడవారిలో కాలుమీద కనిపిస్తుంది. మొదట ఇది చర్మం మీద ప్రాకుతుంది. ఆ తర్వాత చర్మంలోపలి భాగాలకు చొచ్చుకుపోతుంది. రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో ఎక్కువగా గ్రే రంగు నుండి నలుపు రంగు వరకూ ఈ మచ్చలు ఉంటాయి.

(2) 15-20 శాతం ఈ కోవకు చెందినవి. ముదురురంగు ఉబ్బుమచ్చలు లాగా పెరిగి, పుండు పడి రక్తం కారే అవకాశం ఉంది.

(3) లెంటిగో మేలిగ్నా మెలనోమా : 4-15 శాతం ఈ కోవకు చెందినవి. ముఖం మీద ముదురు బ్రౌన్‌ మచ్చలు 3-6 సెం.మీ. వరకు ఉంటాయి.

(4) ఏక్రల్‌ లెంటిజీనస్‌ మెలనోమా :- నల్లజాతి వారిలో ఎక్కువగా చూస్తాము. అరచేతులు, అరికాలు, వేళ్ళ చివరలో ఈ కాన్సరు వస్తుంది.

ఈ క్యాన్సరు లింఫ్‌ నాళాల ద్వారా లింఫ్‌ గ్రంథులకు, రక్తనాళాల ద్వారా వేర్వేరు భాగాలకు పాకుతుంది. (ఉదా : మెదడు, రొమ్ము, జీర్ణకోశము మొ||)

  • కనుక్కోవడం ఎలా ? :
రకరకాల మచ్చలు లేత నలుపు ,ఎర్ర గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.

  • వైద్య విధానము :
ప్రైమరీ ట్యూమర్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. ఈ మచ్చ ఎంత లోపలకు చొచ్చుకు పోయినది చూచి దానిని బట్టి ఎంత వరకు తీసివేయాలో నిర్ణయిస్తారు. లింఫ్‌ గ్రంథులను కొన్ని సందర్భాలలో ''రాడికల్‌ లింఫ్‌ నోడల్‌ డిసెక్షన్‌'' ద్వారా తొలగిస్తారు. కొన్ని దూర ప్రదేశాలకు ఈ క్యాన్సరు వ్యాపించినపుడు, సందర్భాన్నిబట్టి శస్త్రచికిత్స ద్వారా కూడా తీసివేస్తారు. కొన్ని సందర్భాలలో ఆపరేషన్‌ ఆ తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మరికొన్ని సందర్భాలలో ట్యూమర్‌ వల్ల నొప్పి వస్తున్నపుడు, ట్యూమర్‌ కొన్ని ముఖ్యభాగాలకు ప్రాకినపుడు రేడియోథెరపీ ఇస్తారు. (ఉదా : మెదడుకు ప్రాకినపుడు) కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ కూడా వాడతారు.

మిట్టమధ్యాహ్నం ఎక్కువగా వేడి ఉన్న ఎండలో తిరగకపోవటం, చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించటం, నల్లకళ్ళద్దాలు ధరించడం మొదలగునవి పాటించడం వల్ల కొంత వరకు ఇవి రాకుండా చూడవచ్చును. కుటుంబంలో ఎవరికైనా ఇది ఉన్నపుడు కనీసం సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధుల వైద్యునిచే పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి వ్యాధి ముదిరిన తర్వాత అరికట్టడం కష్టము. వయసు ప్రభావం వల్ల ఒక్కోసారి తెల్లమచ్చలు వచ్చి ఆపై నల్లమచ్చలు చర్మము మీద వస్తుంటాయి. ఈ కొత్త నల్లమచ్చలను చూచి కంగారు పడవద్దు. అవసరము అయితే డాక్టరును సంప్రదించండి.

  • -డా.V.రావు,క్యాన్సర్‌ వైద్య నిపుణులు.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.