Sunday, December 11, 2011

For Good memory power,మంచి జ్ఞాపకశక్తి కోసం,



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Good memory power- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  • జ్ఞాకపశక్తి వంశపారంపర్యము గా సంక్రమిస్తుంది. హెరిడిటరీ గా వస్తుంది . ఉన్న జ్ఞాపకశక్తిని పోగొట్టుకోకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి ఎక్కువ చదివితే పిచ్చ్చె క్కినట్టు ఉందం టారు. నిజానికి ఎంత ఎక్కువ సమాచారాన్ని మనం అందిస్తే అంత శక్తివంతంగా మెదడు పనిచేస్తుంది. దాని వల్ల కొత్త నాడీకణాల మార్గాలు ఏర్పడతాయి. అవి జ్ఞాపకశక్తిని అధికం చేస్తాయి. 'సగటు మనిషి తన మేధాశక్తిలో కేవలం పది శాతం మాత్రమే వినియోగించుకుంటాడు. మిగతా 90 శాతం నిరుపయోగం కావడానికి జ్ఞాపకశక్తి సూత్రాలను ఉల్లంఘించడమే' అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్టు కార్ట్‌ సీషోర్‌. అసలు మెదడులో సమాచారం ఎలా నిక్షిప్తమవుతుంది? మళ్లీ ఎలా గుర్తుకొస్తుంది? ఎంత సేపు చదవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

శాశ్వత జ్ఞాపకంగా మారాలంటే

  • మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ ఆధారపడివుంటుంది. తాత్కాలిక జ్ఞాపకం శాశ్వత జ్ఞాపకంగా మారాలంటే ఏమిచేయాలో చూద్దాం... చాలా మంది విద్యార్థులు ఏకబిగిన పుస్తకం చదవాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే బాగా గుర్తుంటుందని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చి చదివితేనే విషయాలు బాగా గుర్తుంటాయి. శాస్త్రీయంగా నిరూపితమైన సత్యమిది ! సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించటం (రిజిస్ట్రేషన్‌) జ్ఞాపకశక్తికి తొలి దశ. చదివిన విషయాన్ని ఎంత స్పష్టంగా నమోదు చేస్తే అంత విపులంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చాలా మార్గాలున్నాయి. ప్రధానమైనవాటిని పరిశీలిద్దాం.

విరామం ఇస్తూ చదవాలి : మనం చదివినదాంట్లో తుదీ, మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వస్తాయి. అందువల్ల చదివినదాంట్లో అతి తక్కువమాత్రమే మనసులో నమోదు అవుతుంది. చదివే రెండు గంటల కాలంలో నాలుగు సార్లు వ్యవధి ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు 4 తుది ఘటనలు ఏర్పడతాయి. అందువల్ల చదివినదానిలో ఎక్కువ నమోదు కావడానికీ, గుర్తుండటానికీ వీలవుతుంది.

  • ఏకాగ్రతతో చదవాలి :నాలుక మీద కదలాడుతోంది, కానీ బయటకు రావటం లేదంటూ చాలా మంది చికాకుపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం విషయాన్ని ఏకాగ్రతతో నమోదు చేయకపోవటమే. ఇతర పనుల మీద మనసు మళ్ళకుండా... చేసే పనిపై శ్రద్ధ పెట్టడమే ఏకాగ్రత. ఇది కుదరాలంటే ఆకలి, అలసట, ఒత్తిడి వంటి పరిస్థితులుండకూడదు. శబ్దాలు, కాలుష్యం, ఆకర్షణలకు దూరంగా ఉండాలి.

స్పష్టంగా అర్థం చేసుకోవాలి : పొగమంచులో ఫోటో తీస్తే బొమ్మ సరిగా రాదు. సమాచారం స్పష్టంగా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సమాచారాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి స్పష్టంగా అర్థం చేసుకుంటేనే మెదడు మీద ముద్రపడుతుంది.

  • మూడు లోపాలు

  • జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధా వికైనా, సామాన్యడికైనా ఉండే మెదడు 1450 గ్రాములు. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ, జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో మరొకటి సుమారు 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి.పెద్ద టెలిఫోన్‌ ఎక్చేంజిలో వైర్ల నెట్‌వర్క్‌ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి, విశ్లేషించగలుగుతుంది. సెరిబ్రం, తలామస్‌, లింబిక్‌ సిస్టం, రేటికులార్‌ సిస్టంలు జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలు. మన పరీక్షలు చాలా వరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే ! అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు.. అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమి కాదు. నాలుక మీదే ఉంటుంది.. బయటికి రాదు అని ఇంకొంత మంది అనటం చూస్తుంటాం. కొన్ని శాస్త్రీయ సూత్రాలను సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగవుతుంది. చదివిన విషయాలను తేలిగ్గా మరచిపోవడం వల్ల పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సి వస్తుంది. జ్ఞాపకశక్తి లోపానికి కింది మూడింటిలో ఏదో ఒక కారణం కావొచ్చు.

* సమాచారాన్ని స్పష్టంగా మనసుపై ముద్రించకపోవడం.

*మనసుపై ముంద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచకపోవడం.

* ఆ భద్రపరచిన సమాచారాన్ని సరిగ్గా వెలికితీయలేకపోవడం.

  • ప్రాథమిక విషయాలు

సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రిం చడం, జాగ్ర త్తగా భద్రపరచడం, సరిగ్గా వెలికితీయడం అనే మూడు దశలను సమర్ధవంతంగా అమలు చేయడమే జ్ఞాపకశక్తి. దీని అమలుకు ముందు జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం అవసరం. మెదడు విషయాలను ఎలా భద్రపరుస్తుందన్న విషయంపై అందరు దాదాపుగా ఆమోదించే సిద్ధాంతం ఒక్కటే. దాని ప్రకారం మనం ఏదైనా చదివినా, నేర్చుకున్నా, ఏదైనా అనుభవాన్ని పొందినా మెదడులోని నరాలలో స్పందనలు ఉత్పత్తి అవుతాయి.ఈ స్పందనలు మెదడులోని తమ ప్రభావాన్ని చూపి జ్ఞాపకశక్తి జాడలని ఏర్పరస్తాయి. ఈ జాడలు తాత్కాలికంగా ఏర్పడగాయి. కానీ విషయం గాఢంగా ముద్రించినప్పుడు అవి శాశ్వతంగా రూపొందుతాయి. ఈ జాడలను బట్టి జ్ఞాపకశక్తిని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. తాత్కాలిక జ్ఞాపకశక్తి, కొంతకాలం గుర్తుండే జ్ఞాపకశక్తి, దీర్ఘకాల జ్ఞాపకశక్తి.

  • తాత్కాలిక జ్ఞాపకశక్తి : ఏడు నుంచి 10 నెంబర్లు కల ఒక టెలిఫోన్‌ నంబరును అప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవడం. ఇది కేవలం కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ఇది న్యూరాన్లు లేదా నాడీకణాల్లో జరిగే రసాయనిక మార్పుల వల్ల ఇది జరుగుతుంది.

కొంతకాలం గుర్తుండే జ్ఞాపకశక్తి : ఇందులో చాలా నిమిషాల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది. ఇది నాడీ కణాల్లో జరిగే రసాయనిక మార్పులతో పాటు భౌతిక మార్పుల వల్ల జరుగుతుంది.

  • దీర్ఘకాల జ్ఞాపకశక్తి : ఇందులో జ్ఞాపకశక్తి జాడలు స్థిరపడతాయి. మెదడులో శాశ్వతంగా ఉండిపోతాయి. అందువల్ల ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోతాయి. ఓ జీవిత కాలం కూడా గుర్తుండిపోతాయి. ఇందులో నాడీకణాల లింకులు రసాయనిక, భౌతిక మార్పులతోపాటు శాశ్విత నిర్మాణాత్మక మార్పులు కూడా జరుగుతాయి. అందువల్ల శాశ్వత జాడలు ఏర్పడతాయి.

  • హెల్దీ ఫుడ్ :జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు వైటమిన్-బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్) పళ్లు, ఆపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి.

మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్ ఎక్కువగా మాంసాహారం, సీ ఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు.

  • నిద్ర : సరిపోయినంత ఉండాలి . నిద్రలేమి జ్ఞాపకశక్తిని తగ్గించివేస్తుంది. ఒక్కో వయసుకి ఒక్కోవిదముగా నిద్ర గంటలు ఉంటాయి.

విశ్రాంతి : ఏ పనినీ నిరరంతమూ చేయకూడదు . మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. అలసట ఉండకూడదు .

  • వ్యాయామము : ఎక్షరసైజ్ లు చేయడము వలన శరీరము ఆరోగ్యముగా ఉండి మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి పెరుగును . a sound body contains soud mind.

జ్ఞాపకశక్తిని తిరిగి పెంపొందించుకోవచ్చు , Getting back the lost memory power

  • మన పని సమయాలు, పద్ధతులు మారిపోతున్నాయి. ఆహార అలవాట్లూ సరేసరి. వ్యాయామం చేసేదీ అంతంత మాత్రమే. ఇక నిద్ర తగ్గిపోవటం గురించి చెప్పాల్సిన పనేలేదు. అర్ధరాత్రుల వరకూ మేల్కొని ఉండటం.. పొద్దున నిద్ర మొహంతోనే లేచి ఆఫీసులకు పరుగెత్తటం పరిపాటయిపోయింది. ఇలాంటివన్నీ మన మెదడుపై ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవటంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే జ్ఞాపకశక్తిని తిరిగి పెంపొందించుకోవచ్చు. ఏకాగ్రతతో వేగంగా పనిచేయొచ్చు.


*తగినంత నిద్ర: మనం నిద్రపోయినప్పుడు మెదడు కొత్త జ్ఞాపకాలను పదిలపరచుకుంటుంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే, సమస్యలను పరిష్కరించే శక్తిని పుంజుకుంటుంది. తగినంత నిద్ర లేకపోతే మెదడు జ్ఞాపకాలను సరిగా నిల్వ చేసుకోలేదు. కాబట్టి రోజూ రాత్రిపూట 6-8 గంటల సేపు నిద్రపోవటం తప్పనిసరి.

*పొగ మానెయ్యాలి: పొగ తాగటం వల్ల మానసిక శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. దీనిని మానేస్తే వాటిని తిరిగి పొందొచ్చు. సూక్ష్మ స్థాయిలో మెదడు దెబ్బతినే ముప్పూ తగ్గుతుంది. పొగ తాగటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. ఇవి రెండూ మతిమరుపు సమస్యను తెచ్చిపెట్టేవే.

*మద్యం పరిమితి: మితిమీరి మద్యం తాగటం మెదడు పనితీరును అణచివేస్తుంది. ఆలోచనా ప్రక్రియను దెబ్బతీస్తుంది. దీంతో నిరాశా పూరిత ఆలోచనలు పెరుగుతాయి. స్పష్టత కూడా లోపిస్తుంది.

* సంగీతం వినటం: ఖాళీ దొరికినప్పుడల్లా నచ్చిన సంగీతం వినటం మంచిది. ఇది మనసుకు ఆహ్లాదాన్ని కలిగించటమే కాదు.. ఒత్తిడినీ, కుంగుబాటునూ తగ్గిస్తుంది. సమాచారాన్ని మననం చేసుకోవటంలోనూ, నిల్వ చేసుకోవటంలోనూ తోడ్పడుతుంది.

* మేధో వ్యాయామం: సమయం దొరికినప్పుడల్లా రకరకాల పజిళ్లు, పదకేళీలను పూరించటం వల్ల మెదడు కూడా చురుకుగా ఉంటుంది. మ్యాగజైన్లు, పత్రికలు, పుస్తకాలు చదివేవారికి.. పదకేళీ, సుడోకు వంటి పజిళ్లను నింపేవారికి మెదడు క్షీణించే ముప్పు తక్కువ. ఇటువంటి ప్రేరేపణలతో మెదడు కణాల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయి.

* రకరకాల వ్యాపకాలు: పనిచేయకపోతే మన కండరాలు బలహీనపడటమే కాదు.. ముడుచుకుపోతాయి కూడా. మెదడు కూడా అంతే. ఇది ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు నిరంతరం ప్రేరేపించటం అవసరం. రకరకాల లక్ష్యాల సాధనతో మెదడుకు పని చెబుతుంటే చురుకుగా పనిచేస్తుంది.

* ఆనందకర ఆలోచనలు: మనసుకు ఆనందాన్ని కలిగించే ఆలోచనలను నెమరువేసుకోవటం ఎంతో మేలు. దీంతో జ్ఞాపకశక్తి స్థిరంగా ఉండటంతో పాటు తిరిగి పుంజుకుంటుంది.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.