Monday, December 12, 2011

PSA(Prostrate Specific Antigen),పీఎస్‌ఏ(ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌)ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -PSA(Prostrate Specific Antigen),పీఎస్‌ఏ(ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పెద్ద వయసులో చాలామంది పురుషులను అనివార్యంగా ఇబ్బంది పెడుతుంది ప్రోస్టేట్‌. వీర్యం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ గ్రంథి.. మలివయసుకు వచ్చేసరికి బాగా ఉబ్బిపోయి మూత్ర విసర్జనలో అవరోధంగా తయారవుతుంది. లేదంటే క్యాన్సర్‌ బారినపడి తీవ్ర ఇక్కట్లూ తెచ్చిపెట్టొచ్చు. ఈ రెండు బాధలూ కూడా ప్రోస్టేటు గ్రంథికి సంబంధించి పురుషులు తరచూ ఎదుర్కొంటున్నవే. ఈ రెండింటిలోనూ కూడా పైకి కనిపించే లక్షణాలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. అందుకే వీటి విషయంలో చాలామంది గందరగోళ పడుతుంటారు. పురుషులంతా ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ ప్రోస్టేటు సమస్యల మీద ఒక కన్నేసి ఉంచటం.. ఈ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించటం చాలా అవసరం, అందుకు 'పీఎస్‌ఏ' పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.

'పీఎస్‌ఏ' కీలకం -పురుషులకు ప్రత్యేకం
prostrate specific antigen : 

ఇది గ్లైకోప్రోటీన్‌ ఎంజైం . మానవులలో  KLK3 జీన్‌ కి ఎంకోడై ఉంటుంది. kallikrein సంబంధిత పెప్టిడేస్ కుటుంబానికి చెందినదై ప్రోస్ట్రేట్ గ్రంధి ఎపితీలియల్ కణాలు నుండి ఊరుతుంది. మగవారిలో ఇంద్రియము పల్చబడి ఇజాక్యులేట్ అవడానికి , పురుషబీజకణాలు సులువుగా కదలడానికి , స్త్రీల సెర్వైకల్ మ్యూకస్ ను కరిగించుటలోను సహకరించి పురుషబీజకణాలు గర్భకోశములోనికి సునాయాసము గా ప్రవేశానికి దోహదపడుతుంది.సీరం లో నార్మల్ గా కొద్ది మోతాదులోనే 4 ng /ml ఉంటుంది .
మిగతా క్యాన్సర్లన్నింటి మాదిరే.. ప్రోస్టేటు క్యాన్సర్‌ను కూడా తొలిదశలో గుర్తిస్తే చికిత్స తేలిక. అందుకు 'ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌(పీఎస్‌ఏ)' అన్నది బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఇది వీర్యాన్ని పల్చగా ఉంచేందుకు అవసరమైన ప్రోటీన్‌. దీన్ని ప్రోస్టేటు గ్రంథి ఉత్పత్తి చేస్తుంటుంది. ప్రోస్టేటు గ్రంథి పెద్దగా ఉబ్బినా, లేక దానికి క్యాన్సర్‌ సోకినా... ఈ ప్రోటీను ఉత్పత్తి బాగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తంలో 'పీఎస్‌ఏ' పరిమాణం కూడా బాగా పెరుగుతుంది. 'పీఎస్‌ఏ' పరీక్షలో ప్రధానంగా రక్తంలో ఈ హార్మోన్‌ స్థాయి ఏ తీరులో ఉందో చూస్తారు. ఇది ఎక్కువగా ఉండటం క్యాన్సర్‌ ముప్పుకు అత్యంత కీలకమైన సంకేతం.
  •  

అయితే కేవలం రక్తంలో 'పీఎస్‌ఏ' ఎక్కువగా ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌గా భావించాల్సిన పనిలేదు. అందుకే ఈ పరీక్షతో పాటు వైద్యులు ప్రోస్టేటు గ్రంథి సైజు ఎలా ఉంది, పీఎస్‌ఏ పెరగటానికి ఇతరత్రా అంశాలేమైనా కారణమవుతున్నాయా? అన్నది కూడా చూసి అప్పుడు దీనిపై ఒక నిర్ధారణకు వస్తారు. మొత్తమ్మీద 'పీఎస్‌ఏ' పరీక్ష అన్నది ప్రోస్టేటు క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు అత్యంత కీలకమైన మార్గం.
* ప్రోస్టేటు సమస్యలు 60-65 ఏళ్లు దాటిన వారిలో చాలా ఎక్కువ. అందుకే 40 ఏళ్ల తర్వాత ఎప్పుడన్నా ఒకసారి, అలాగే 60-65 ఏళ్లు దాటిన తర్వాత క్రమం తప్పకుండా ఏటా పీఎస్‌ఏ పరీక్ష చేయించుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తికి 40 ఏళ్ల వయసు నుంచీ పీఎస్‌ఏ సాధారణంగా ఏ స్థాయిలో ఉంటోందన్నది గుర్తిస్తే.. అది పెరుగుతున్నప్పుడు సత్వరమే గుర్తించే వీలుంటుంది.
* అయితే పీఎస్‌ఏ స్థాయి పెరిగినంత మాత్రాన దాన్ని క్యాన్సర్‌గా భావించటానికి లేదు. ఎందుకంటే మలివయసులో చాలామందికి సర్వసహజంగా ప్రోస్టేటు గ్రంథి ఉబ్బుతుంది (బీపీహెచ్‌), దీనిలోనూ పీఎస్‌ఏ ఎక్కువగా ఉండొచ్చు. అలాగే ప్రోస్టేటు గ్రంథికి ఏదైనా ఇన్ఫెక్షన్‌ సోకినా పీఎస్‌ఏ పెరగొచ్చు. మరోవైపు పీఎస్‌ఏ తక్కువగా ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌ ముప్పు అస్సలు లేదని చెప్పటానికీ లేదు. అందుకే దీనికి తోడుగా వైద్యుల పరీక్షా కీలకమే.

ఈ లక్షణాలను విస్మరించొద్దు
* తరచూ మూత్రానికి వెళ్లాలన్న భావన, ఆ భావన కలిగిన తర్వాత మూత్రాన్ని కొద్దిసేపు కూడా ఆపుకోలేకపోతుండటం
* రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం
* మూత్ర విసర్జన ధారగా కాకుండా బొట్లుబొట్లుగా వస్తుండటం
* మూత్రానికి బలవంతంగా వెళ్లటానికి ముక్కాల్సి వస్తుండటం
ప్రోస్టేట్‌గ్రంథి ఉసిరికాయంత పరిమాణంలో మూత్రమార్గం చుట్టూ ఆవరించి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బినపుడు మూత్రమార్గం సన్నబడి విసర్జనలో ఇబ్బంది తలెత్తుతుంది. ఈ గ్రంథి పరిమాణం, స్వభావం ఎలా ఉందో తెలుసుకునేందుకు వైద్యులు మలద్వారం గుండా వేలితో పరీక్షిస్తారు. దీనినే డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామ్‌ అంటారు.
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.