ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విటమిన్ ఇ , Vitamin E- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
- విటమిన్ ఇ 8 రకాల కొవ్వులో కరిగే సమ్మేళనాలు , ముఖ్యముగా Tocopherols and Tocotrienols ఉన్నాయి. దీనిలో వివిధ సమ్మేళనాలలో Y-tocopherol ముఖ్యమైనది .
- శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైంది. అవి ఏమాత్రం లోపించినా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకొనేది విటమిన్ 'ఇ'.. ఇది అందం.. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయుక్తం. 'విటమిన్ ఇ' ని పునరుత్పత్తి శక్తి ప్రదాతగా అభివర్ణించడమే కాక దానికి 'టొకోఫెరాల్ ' అని పేరు పెట్టారు. అంటే శిశు జనన కారకం అని అర్థం. 'ఆయిల్ ఆఫ్ ఫెర్టిలిటి' అంటారు. దీనివల్ల శరీర పటుత్వం బాగా ఉంటుంది. చర్మం ముడుతలు పడదు. క్రీడా సామర్ధ్యం పెంచుతుంది. స్త్రీల జననాంగాల్లో తడి ఆరిపోకుండా కాపాడుతుందని ఇటీవల పరిశోధనల్లో తెలుసుకున్నారు.
ఉపయోగాలు :
- వూబకాయం:
- యాంటీ ఆక్సిడెంట్లు:
- రక్తకణాల వృద్ధి:
- చర్మసంరక్షణ:
- నొప్పినివారిణి:
- సంతానలేమి సమస్య
- బ్యూటీ టిప్స్:
అందమె ఆనందం.. ఆరోగ్యమే అందం... ‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ జామ్ ఫరెవర్’’ ఇవన్నీ మంచి ఆరోగ్యం వున్నప్పుడే లభిస్తాయి. అందానికి మొదటి పెట్టుబడి ‘ఆరోగ్యం’. ఈసురోమని మనిషి ఉంటే.. బుగ్గల నిగారింపు లెక్కడా? సరే.. ఇంతకీ అందం పెరగాలంటే --విటమిన్-ఇ వాడవసినదే .
* ఇ-విటమిన్ అన్ని సౌందర్య ఉత్పత్తుల్లోనూ వాడతారు.
* పడతుల మేని మెరుగుకు ఈ విటమిన్‌ది అగ్రస్థానం,
* ప్రీరాడికల్స్ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
* లైటనింగ్ రాడ్‌గా పిలవబడే ఈ విటమిన్ కణక్షయాన్ని నివారిస్తుంది.
* అతి నీలలోహిత కిరణాల హానీ నుండి రక్షిస్తుంది.
- విటమిన్'ఇ' లభించే కొన్ని పదార్థాలు :
- వీట్ జర్మ్ ఆయిల్ --149.4 మి.గా %,
- ఆకుకూరలు...1.5 to 2.0 mg%,
- నట్స్--15 -25 మి.గా %,
- గుమ్మడికాయ--0.8 - 1.06 మి.గా %,
- చిలగడదుంప-- 0.26 to 0.94 mg%,
- రాక్‌ఫిష్-- 0.36 to 0.44 mg%,
- బ్రొకోలీ..0.8 to 1.45 mg% ,
- పొద్దుతిరుగుడు నూనె--31-41 మి.గా%,
- బాదంపప్పులు.... 15 to 25 mg%,
- పాలకూర .... 1.5 to 3.5 mg%,
- టమెటో... 0.54 to 0.56 mg%,
- బొప్పాయి.... 0.3 mg% ,
- ఆలివ్ నూనె .........వంటి వాటిలో ‘ఇ-విటమిన్’ పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ లోపము వలన కలిగే కొన్ని దుష్పరిణామాలు :
- తూలు పోవడము --spinocerabellar ataxia ,
- కండరాలకు సంబందించిన రుగ్మతలు --myopathies ,
- చేతులు , కాళ్ళు బాహ్య నరాల మంటలు ,తిమిర్లు -- pheripheral neuropathy,
- కండరాల పీకులు, నొప్పులు తో కలిగే రుగ్మతలు --skeletal myopathy,
- కంటి నరాల రుగ్మతలు -- Retinopathy ,
- వ్యాధినిరోధక రక్షణ మందగించడము -- impairment of the immune response,
విటమిన్ ఇ చరిత్ర :
- ఒక చికిత్సా agent గా విటమిన్ E మొదటి ఉపయోగం Widenbauer ద్వారా 1938 లో నిర్వహించారు. Widenbauer పెరుగుదల వైఫల్యం నుండి బాధ 17 అకాల కొత్త జన్మించిన శిశువులకు గోధుమ బీజ నూనె సప్లిమెంట్ ఉపయోగించారు. అసలు 17 రోగుల పదకొండుమంది పుంజుకుని సాధారణ వృద్ధి రేటు ప్రారంభించడానిక సరిపోయారు. తరువాత 1948 లో, ఎలుకలు పై , Gyorge మరియు Rose ... alloxan ప్రభావాలు ప్రయోగాలు నిర్వహించడం జరిపి టోకోఫెరాల్ తీసుకున్న ఎలుకలు , టోకోఫెరాల్ ఇవ్వని వాటి కంటే తక్కువ హేమోలిసిస్ బాధపడడము గుర్తించారు రోజ్. 1949 లో, Gerloczy వాపు నిరోధించడానికి మరియు నయం అవడానికి -α-tocopheryl లవణం నిర్వహించి వాపు తగ్గడం గమనించారు . ఉపయోగించే మెథడ్స్ సానుకూల స్పందన చూపించారు, రెండు.. నోటి మరియు కండరము లోపల , ఒకే స్పందన చూపించు లేదు. విటమిన్ E భర్తీ యొక్క ప్రయోజనాలు న ఈ ప్రారంభ పరిశోధనాత్మక పని విటమిన్ E లోపం 1960 సమయంలో వర్ణించాడు.లోపము వలన హెమోలిటిక్ ఎనీమియా కలుగుతుంది నిర్ధారణ్ జరిగినది. అప్పటి నుండి, విటమిన్ E తో శిశువుల మరణాలకు హెమోలిటిక్ ఒక కారణం మని దీనిని ఈ విటమిన్ లోపం యొక్క బర్తీ తో నిర్మూలించవచ్చు అనే నమ్మకానికి వచ్చారు .
- =================================
విటమిన్ ఇ కోసం మంచి విషయాలు తెలుసుకున్నా. నాది కూడా పొడి చర్మమే. మీరు చెప్పిన సూచనలు ఈరోజు నుంచే పాటిస్తా. థాంక్యూ సో మచ్
ReplyDeleteవిటమిన్ ఇ కోసం చాలా మంచి విషయాలు తెలుసుకున్నా. నాది కూడా పొడి చర్మమే. చలి కాలంలో కొంచెం ఇబ్బంది పడుతుంటా. ఈరోజు నుంచి మీ సూచనలు పాటిస్తా. థ్యాంక్యూ సో మచ్.
ReplyDelete