- ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మడమ నొప్పి,Heel pain- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలిని అలవర్చుకోలేక చాలామంది మడమ నొప్పితో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం తోడై మడమ నొప్పిని అతి చిన్నవయస్సులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటం వలన మడమ నొప్పితో కదలికలు కష్టంగా మారతాయి. మడమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదునుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
రాత్రంతా విశ్రాంతిగా పడుకున్న తర్వాత ఉదయం మంచం దిగుతూనే కాలు నేల మీద పెట్టాలంటే చాలామందికి నరకం కనిపిస్తుంటుంది. రోజులో ఎక్కువ సేపు నిలబడే ఉండటం, లేదా సాధారణంగా గట్టి నేల మీద నడక, పరుగు, జాగింగ్ వంటివి దీనికి ముఖ్య కారణం.
- కారణాలు :
- నివారణ--
- జాగ్రత్తలు
- మడమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయకూడదు.
- నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదాలను వేడి నీళ్ళల్లో ఉంచి అడుగు భాగమును నెమ్మదిగా ప్రెస్ చేయాలి.
- కాలి పాదాన్ని కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి త్రిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
- వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజయోథెరిపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
- నిప్పి ఉన్నప్పుడు అతిగా ‘పెయిన్ కిల్లర్స్’ వాడకుండా డాక్టర్ సలహా మేరకు మందులను వాడుకోవాలి.
- అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుటానికి ప్రయత్నించాలి.
- నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం చేయకూడదు.
- వైద్యుల సలహామేరకు తీసిన ఎక్స్‌రే వలన ఈ మడిమ నొప్పి తీవ్రత తెలుస్తుంది.
- వ్యాయామాలు
2. నేల మీద ఓ శౌకం (టవల్) పడెయ్యండి. దాన్ని కాలి వేళ్లతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ.. కొద్దికొద్దిగా మీ వైపు లాక్కుంటూ ఉండండి. రోజూ ఇలా 10 సార్లు చెయ్యండి.
- మడమనొప్పి ఎందుకు? - ఈనాడు సుఖీభవ (10 జనవరి 2012)
- లక్షణాలేంటి?
* నిలబడితే నొప్పి ఎక్కువ అవుతుండటం.
* వ్యాయామం చేసిన తర్వాత మడమ నొప్పిగా ఉండటం.
- చికిత్స
* షూ వేసుకున్నప్పుడు అరికాలు వంపునకు దన్నుగా ఉండే ప్యాడ్స్ ధరించటం
* మడమ నుంచి పైకి వెళ్లే కండర బంధనం, పిక్క కండరాలు సాగేలా తేలికపాటి వ్యాయామం చేయటం
* నొప్పి ఉన్నచోట మంచు గడ్డలను ఉంచటం
* ఐబూప్రొఫెన్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు వేసుకోవటం.
* అధికబరువును తగ్గించుకోవటం.
* కొందరికి కార్టికోస్టిరాయిడ్ ఇంజెక్షన్లూ అవసరమవుతాయి.
* ఏ చికిత్సలూ పనిచేయకపోతే ఆపరేషన్ కూడా చేయాల్సి రావొచ్చు.
- ఇతర కారణాలు
- ====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.