Monday, December 19, 2011

thiamine,aneurin,vitaminB1, విటమిన్ బి 1,థయామిన్


  • image : courtesy with Google search

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Vitamin B1- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  • విటమిన్ బి 1: దీని రసాయనిక నామము థయామిన్ ..ఈ విటమిన్ను 'యాంటీ బెరి బెరి విటమిన్' మరియు 'యాంటీ న్యూరైటెక్ విటమిన్' అని కూడా అంటారు . ఇది సల్ఫర్ -కలిగిఉన్న విటమిన్‌ .మొదట "aneurin" అనేవారు . దీని ఫాస్పేట్ ఉత్పన్నము అనేక సెల్యులార్ ప్రక్రియల్లో పాలు పంచుకుంటుంది .ఉత్తమ లక్షణాలు కలిగిఉన్న రూపము thiamine పైరోఫాస్ఫేట్ (TPP), చక్కెరలు మరియు అమైనో ఆమ్లాల జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట, ఒక ఎంజైముల సహాయకారి గా ఉటుంది. Thiamine న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్ మరియు గామా-aminobutyric ఆమ్లం (GABA) జీవరసాయనచర్యలో ఉపయోగిస్తారు. ఈస్ట్ లో TPP ''మద్య(సారా) కిణ్వనం( alcoholic fermentation)'' కొరకు మొదటి దశలో అవసరం.

అన్ని జీవులు వాటి జీవరసాయన శాస్త్రం లో thiamine ఉపయోగించవచ్చు, కానీ ఇది కేవలం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మరియు మొక్కలలో తయారవుతుంది. జంతువులు , diinini వాటి ఆహారం నుండి పొందుతాయి .థయామిన్‌ లోపము ఏవిధముగా ఈ విచిత్రమైన లక్షణాలు కలుగుచున్నాయో ఇంకా సరియైన అవగాహన లేదు . ఇప్పుడిప్పుడే అనేక కొత్త రకాల థయామిన్‌ ఫార్ములు కనుగొనబడుచున్నాయి.ఇలా అనేక ఉప రకాలు బయటపడడము దానియొక్క సంక్లిష్టతను తెలియజేయుచున్నది . ఈ కొత్త డెరివేటివ్స్ మధుమేహ సంబంధిత బాధనివారణలో బహుప్రయోజనకరులుగా ఉన్నాయి. వీటిలోకొన్ని ... allithiamine, prosultiamine, fursultiamine, benfotiamine, and sulbutiamine,

  • చరిత్ర (History):
నీటిలో కరిగే విటమిన్లు లలో మొదట గా దీనిని కనిపెట్టేరు . 1884 లో Kanehiro Takaki (1849–1920), a surgeon general in the Japanese navy ... బెరిబెరి రావడానికి ముందుచెప్పుకున్న కారణాలు కంటే మన డైట్ లో ఏదో లోపమున్నదనే ఆలోచనతో తవుడుతో కూడుకున్న బియ్యము వాడడము , దానికి తోడుగా మాంసము , పాలు తీసుకోవడము తో బెరిబెరి లక్షణాలు పూర్తిగా తగ్గిపోవడము తో తవుడు నుండి యాంటీ బెరిబెరి ఫాక్టర్ కనిపెట్టడం జరిగినది . ఇదే విధముగా డచ్ దేశములో 1897 లో Christiaan Eijkman తన తోటి సహాయకులతో విటమిన్‌ బి1 తో పాటు అనేక ఇటువంటి మూలకాలను కనిపెట్టినందుకు ఆ విధము గా అనేక విటమిన్ల కనిపెట్టడానికి (నాంది పలకడానికి) మూలమైనందున 1929 లో Nobel Prize in Physiology and Medicine ఇచ్చారు . ఆ విధముగా థయామిన్‌ 1936 లో సింథసైజ్ చేయడము జరిగినది . మొదట దీని "aneurin" (for anti-neuritic vitamin) గా నామకరణము చేసారు .

  • లోపము (Deficiency) :
సరియైన సమతుల్య ఆహారము తినకపోవడము లేదా దొరక్క పోవడము వలనే ఈ థయమిన్‌ లోపము కలుగుతుంది . చాలా అరుదుగా Genetic diseases of thiamine transport మూలము గా Thiamine responsive megaloblastic anemia (TRMA) with diabetes mellitus and sensorineural deafness వచ్చే అవకాశాలు ఉన్నాయి .

ఈ విటమిన్ లోపము వల్ల 'బెరి బెరి 'అనే వ్యాధి కలుగుతుంది . కార్బోహైడ్రేట్స్ జీవ క్రియ లో ఉపయోగపడే ఎంజైం లకు ఈ విటమిన్‌ అవసరము .ముఖ్యము గా నాడీమండలము , గుండె ఈ విటవిన్‌ లోపము వలన ఎక్కువగా నష్టపోతాయి. నీరసము , నరాల మంట , కళ్ళలో నీరసము , శరీరము శుష్కించి పోవడము , ముఖ్యము గా beriberi and Wernicke-Korsakoff syndrome(diseases also common with chronic alcoholism),Wernicke’s encephalopathy,Korsakoff Psychosis వస్తాయి .

బెరిబెరి (Beriberi) విటమిన్ బి1 లేదా థయామిన్ లోపం వల్ల మానవులలో సంభవించే వ్యాధి. వాతులు, వణుకు , మూర్చ , శ్వాస తీసుకోవడం కష్టంగా వుండటం .. లాంటివి బెరి బెరి వ్యాధి లక్షణాలు . ఈ వ్యాధిలో తడి బెరిబెరి (Wet beriberi) మరియు పొడి బెరిబెరి (Dry beriberi) అని రెండు రకాలు. కండరాలు క్షీణించి, కాళ్ళు చేతులు పక్షవాతంతో పడిపోవడం పొడి బెరిబెరి లక్షణాలు. దేహకుహరంలో నీరుచేరి హృదయం ఉబ్బి కాలేయం నొక్కుకొని పోవడము తడి బెరిబెరి లక్షణాలు. కొందరిలో రెండింటి లక్షణాలు కనబడవచ్చును.

  • థయామిన్‌ లోపము ఎలా కనుగొంటాము (iagnostic testing):
మనుషులలో కనిపించే వ్యాధి లక్షణాలను బట్టి సుమారు 90% థయమిన్‌ లోపము కనిపెట్టవచ్చును .
A positive diagnosis test for thiamine deficiency can be ascertained by measuring the activity of the enzyme transketolase in erythrocytes (Erythrocyte Transketolase Activation Assay).
Capillary Electrophoresis (CE) techniques and in-capillary enzyme reaction methods have emerged as potential alternative techniques for the determination and monitoring of thiamine in samples.

  • వీటిలో లభించును :
వరి ,గోధుమ లాంటి ధాన్యాలు , వేరుశనగ ,పప్పులు ,మాంసము ,చేపలు , గుడ్లు లాంటి ఆహారములలో ఇది లబిస్తుంది .ఈస్ట్ లలో కూడా లభ్యమౌతుంది. ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తవుడులో ఉంటుంది.

  • రోజూవారీ అవసరము (Daily requirement):
విటమిన్ బి1(థయామిన్ )= 1.2 mg .

More details --

Vitamun B1-thiamin , విటమిన్ B 1 - థయమిన్-----------

( విటమిన్ B 1 ) విటమిన్ ను ‘ థయమిన్ ‘ అని కూడా అంటారు. ఈ థయమిన్ B విటమిన్ లలో మొదటిది. ‘థయ’ అంటే గంధకం. ఈ గంధకపు అణువు కలిగి ఉన్న విటమిన్ కాబట్టి దీనికి థయమిన్ అని పేరు వచ్చింది. ఈ థయమిన్ లేదా B1 విటమిన్ కేవలం బాక్టీరియా లూ , ఫంగస్ లూ ( శిలీంధ్రాలు అని కూడా అంటారు అంటే పుట్టగొడుగుల జాతి కి చెందినవి ) ఇంకా మొక్కలు మాత్రమే ఈ థయమిన్ విటమిన్ ను తయారు చేయ గలవు. కానీ మానవులకు ( జంతువులకు కూడా ) ఈ B 1 విటమిన్ లేదా థయమిన్ చాలా ముఖ్యం.

థయమిన్‌ (విటమిన్‌ 'బి1')

బికాంప్లెక్స్‌ విటమిన్‌లలో చాలా ముఖ్య మైనది. నరాలు, కండరాల ఆరోగ్యానికీ కార్బోహైడ్రేట్ల నుంచి శక్తి విడుదల అవడానికి థయమిన్‌ చాలా అవసరం. మన దేహానికి శక్తినిచ్చే పోషకాలన్నిటిలోకి కార్బోహైడ్రేట్లు ముఖ్యమైనవి. అంతేకాక మెదడు కార్బోహై డ్రేట్‌లను తప్ప మరి దేనినీ శక్తికోసం ఉప యాగించుకోలేదు. గోధుమలు, ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం, జొన్నల లోనూ, పెసలు, సెనగలు, మినుములు, కందులు లాంటి పప్పు దినుసులలోనూ, నువ్వులు, వేరుసెనగ, జీడిపప్పు, పిస్తా, బాదం,బఠాణీలాంటి గింజధాన్యాలలోనూ, సోయా చిక్కుడు, చిక్కుడు, బీట్‌రూట్‌, బం గాళాదుంప, గుడ్డు మొదలైన వాటిలోనూ థయమిన్‌ పుష్కలంగా లభిస్తుంది.

చాలా రకాల ధాన్యాలలో థయమిన్‌ పై పొరల లోనే ఉంటుంది. మర పట్టినప్పుడు ఈ పొరలు పోతాయి. అందుకే తెల్లని పాలిష్‌ పట్టిన బియ్యంతో వండిన అన్నం తినే వాళ్ళలో థయమిన్‌ లోపం కార ణంగా జబ్బులు ఎక్కువ వస్తాయి. ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినేవాళ్ళకు ఈ జబ్బులు రావు.

థయమిన్‌ లోపిస్తే ప్రారంభదశలో

నీరసం,అలసట, చికాకు, ఏకాగ్రత కుదరక పోవటం, ఒత్తిడి, నిద్రపట్టకపోవటం, ఆకలి మంద గించటం, బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపి స్తాయి. ఎక్కువ కాలం పాటు శరీరంలో థయమిన్‌ లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మూలం గా నరాలు, మెదడు, గుండెలో అసాధారణ లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఈ వ్యాధి మూలంగా ఎర్ర రక్తకణాల జీవక్రియలో మార్పులు జరిగి మూత్రంలోనూ, రక్తంలోనూ థయమిన్‌ (బి1 విటమిన్‌) స్థాయి పడిపోతుంది.

గుండె, రక్త ప్రసరణలకు సంబంధిం చినది ఒక రకం బెరిబెరి దీనిని (Wet Beriberi) అంటారు.

దీని లక్షణాలు:
నడిస్తే కాళ్ళనొప్పులు రావటం, విశ్రాంతి తరువాత తగ్గిపోవటం, దీని మొదటి లక్షణం. కాళ్ళు చేతులు వెచ్చగా వుంటాయి. రక్త ప్రసరణ వేగం పెరుగు తుంది. గుండె పరిమాణంలో వ్యాకో చం, సిరలలో పీడనం పెరగటం, గుండె పనిచేయకపోవటం జరుగుతాయి. థయ మిన్‌ లోపించి కార్బోహైడ్రేట్‌ల జీవక్రియ సరిగా జరగక పోవటం వలన ఇలా జరుగుతాయి. ఈ రకమైన బెరిబెరి లో మాంసకృత్తులు, ఐరన్‌, విట మిన్‌ 'ఎ', నికోటినిక్‌ ఆవ్లుం, మొద లైన వాటి లోపాలు కూడా కనిపి స్తాయి. స్థూలకాయులలో ఈ జబ్బు ఎక్కువ వచ్చే అవకాశం వుంది.

నరాలకు సంబంధించిన అసా ధారణ లక్షణాలను కలిగించేది రెండవ రకం బెరిబెరి. దీనిని ఉసా Dry Beriberi అంటారు.

దీని లక్షణాలు:
పాదాల మడమలలో సూదులు, పిన్నులతో గుచ్చుతున్నట్లుగా పోట్లు, పాదాలలో మంటలు పుడుతున్నట్లు అనిపించడం, కాలి పిక్కలలో నొప్పి, నేల మీద కూర్చు న్న స్థితి నుంచి పైకి లేవాలంటే ఇబ్బంది కనిపిస్తాయి. కొందరిలో మామూలు ప్రతి చర్యలన్నీ మందగించి పోతాయి. కాళ్ళు, చేతులలో స్పర్శలోపం కూడా ఏర్పడే అవకాశం వుంది.

మెదడుకు సంబంధించిన అసాధారణ లక్షణా లను కలిగించే ఇంకో రకం బెరి బెరి వ్యాధి ఉంది. 'సెరెబ్రల్‌ బెరిబెరి', మనిషికి అకస్మాత్తుగా తీవ్రమైన విటమిన్‌ బి1 లోపం ఏర్పడినపుడు ఇది వస్తుంది. విపరీతంగా వాంతులవుతున్న గర్భిణీ స్త్రీలకు, తీవ్రమైన తాగుడు లక్షణం కలవాళ్ళకూ ఈ వ్యాధి వస్తుంది. Mental Confusion, జ్ఞాపకశక్తి కోల్పో వటం వంటి అవలక్షణాలను కలిగి ఉండే వారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఆ మనిషి కోమా లోకి వెళ్ళిపోయే అవకాశం వుంది. మెదడుకు ఎంతో కొంత శాశ్వత నష్టం జరిగి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధినుంచి పూర్తిగా కోలు కోవటం కొందరిలో సాధ్యం కాదు. థయ మిన్‌ లోపంతో బాధపడుతున్న స్త్రీ పాలు తాగే పసిపిల్లలకు కూడా Infentile Beriberi వచ్చే అవకాశం ఉంది. 2-4 నెలల వయస్సు మధ్య ఉండే ఈ పిల్ల లకు హార్డ్‌ ఫెయిల్యూర్‌, స్వరలోపం, Peripheral nerves దెబ్బతినటం లాంటి నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది.

మనిషి వయస్సును బట్టి, శరీర స్థితి గతులను బట్టి, జీవనశైలిని బట్టి మనిషికి రోజుకి 0.5 నుంచి 2.0 మిల్లి గ్రాముల దాకా థయమిన్‌ అవసరం అవుతుంది.

ఈ థయమిన్ లోపం మనలో ఎట్లా కనిపించ వచ్చు ?:
మనం తీసుకునే ఆహారం లో థయమిన్ లోపం ఏదో రూపం లో ఉంటే ఆ లోప లక్షణాలు మనలో కనిపిస్తాయి.
మన దేహం లో అనేక అవయవాలు సరిగా పనిచేయడానికి ఈ థయమిన్ చాలా కీలకమైనది. కానీ మన నాడీ వ్యవస్థ లో ఈ విటమిన్ లోపం చాలా త్వరగానూ , ప్రస్ఫుటం గానూ కనిపిస్తుంది. ఎందుచేతనంటే , మన నాడీ మండలం లో అంటే ప్రతి నాడీ కణం లోనూ అనునిత్యం అంటే మన జీవితాంతం నిరంతరం గా జరిగే జీవ రసాయన చర్యలకు , ఈ థయమిన్ అవసరం తప్పని సరిగా ఉంటుంది. మిగతా అన్ని విటమిన్ల లానే కేవలం కొన్ని మిల్లీ గ్రాములలోనే ఈ విటమిన్ కూడా మనకు అవసరం అవుతుంది రోజూ ! కానీ ఆ కొన్ని మిల్లీ గ్రాములు కూడా లోపిస్తే , అదే మన ప్రాణాల మీదకు తెస్తుంది.

మన నాడీ మండలం లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపిస్తుంది ?:

కళ్ళు: ముఖ్యం గా కళ్ళు బైర్లు కమ్మడం , రంగులు సరిగా గుర్తించ లేక పోవడం , మొదటి దశలలో జరుగుతాయి. తరువాత , తరువాత , థయమిన్ లోపం సరిచేయక పొతే , రెండు కళ్ళ చూపూ మందగించి , విటమిన్ లోపం తీవ్రం గా ఉంటే అంధత్వం కూడా రావచ్చు. ఇట్లా అంధత్వం రావడం ‘ ఆప్టిక్ అట్రోఫీ ‘ అనబడుతుంది. అంటే కంటి లోపలి సున్నితమైన పొరలు పాడవుతాయి.

పెరిఫెరల్ న్యూ రోపతీ అంటే ఏమిటి ?: మన దేహం లో మెదడులో కాక , అవయవాల చివరల గా ఉన్న నాడులలో తిమ్మిరులూ , మంటలూ పుట్టిస్తుంది ఈ విటమిన్ లోపం. ఎందుకంటే ఈ విటమిన్ లోపం వల్ల ఆయా నాడులు సరిగా పని చేయక మంటలు పుట్టడం , తిమ్మిరులు కలగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యం గా శాక హారులలో , వయో వృద్ధులలో , ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో , మన పెద్ద వాళ్ళు , కాళ్ళు మంటలు పుడుతున్నాయని వారికి నచ్చిన నువ్వులనూనో , కొబ్బరి నూనో బాగా కాళ్ళకు పట్టించి మర్దనా అంటే మాసాజ్ చేసుకుంటూ ఉంటారు. అది కేవలం వృధా ప్రయాసే ! ఎందుకంటే వారి లక్షణాలకు కారణం విటమిన్ లోపం కదా !

మన గుండె లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపుతుంది?:
ఈ విటమిన్ లోపం అధికం గా ఉంటె, వారి గుండె కూడా ” వాచి ” పోతుంది. అంటే గుండె సామాన్యం గా ఉండే సైజు కన్నా పెద్దగా అవుతుంది. కానీ ఇట్లా పెద్దగా అవడం, ఆరోగ్య కరం గా కాక విటమిన్ B 1 లేక థయమిన్ లోపం వల్ల కలిగే ” అనారోగ్య వాపు ‘ దీనినే ” కార్డియో మెగాలీ ”  అంటారు. అంతే కాక గుండె నీరసం గా కొట్టుకుని , కాళ్ళ వాపు రావడం జరుగుతుంది. అంటే కాళ్ళలో నీరు చేరుతుంది
మనం మన ఆహారం సంపూర్ణం గా అంటే అన్ని పప్పులూ , ఆకు కూరలూ , కూరగాయలూ తింటున్నా కూడా , మనం ఆ ఆహారాలనూ , వంటలనూ , తయారు చేసుకోవడం లోనూ , లేదా ఇతర పదార్ధాలతో తినడడం వల్ల నో , మన శరీరం లో థయమిన్ ప్రవేశించినా , మన శరీర కణాలకు చేరుకోక , వ్యర్ధం అవుతుంది. ఆ కారణం గా మనలో థయమిన్ లోపం , ఆ లోప లక్షణాలు కూడా కనిపించ వచ్చు.

వంటలో లోపాలు : ధాన్యాలు అంటే , గోధుమ , వరి , జొన్నలు , మినుములు , కంది పప్పు , పెసర పప్పు, ఇట్లాంటి పప్పు దినుసులు , వాటి పోట్టులోనే ఈ B విటమిన్ అత్యధికం గా ఉంటుంది. కానీ సామాన్యం గా ఆకర్షణీయం గా ఉండడం కోసం చాలా దుకాణాలలో ఈ ధాన్యాలను పాలిష్ చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాక వాటిని కొన్న తరువాత వంట గదిలో అనేక సార్లు కడిగి ఉడికిన తరువాత తెల్లగా కనపడ డానికీ , పొట్టు వాసన రాకుండా ఉండడానికీ అనేక ప్రయత్నాలు చేసి , ఆ ధాన్యాలలో ఉన్న పోషక విలువలు, విటమిన్లు , వృధా చేస్తుంటాము. అంతే కాక , అత్యధిక వేడి లో , ఎక్కువ సమయం ఉడికిస్తే కూడా పోషక విలువలు తగ్గి పోతాయి. ముఖ్యం గా ఆకు కూరలూ , కూర గాయలూ ఇట్లా ఎక్కువ సమయం , అధిక వేడి లో వండడం వల్ల వాటిలో ఉన్న విటమిన్లు కోల్పోతాయి.

కాఫీలూ , టీలూ , వక్క పొడి : టీలూ కాఫీలూ ఎక్కువ గా తాగితే , జర్దా, వక్కపొడి ఎల్లకాలం నములుతూ ఉంటే కూడా మనం తీసుకునే ఆహారం లో ఉన్న థయమిన్ విటమిన్ మనకు అంటే మన శరీరం లోని కణాలకు అందదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. టీ లోనూ , కాఫీ లోనూ , ఇంకా వక్క పొడి , జర్దా లలో ఉండే కొన్ని రసాయన పదార్ధాలు , థయమిన్ విటమిన్ ను విరిచేస్తాయి అంటే దానిని పనికి రాకుండా చేస్తాయి ( అప్పుడు పాలు విరిగితే మనకు ఆ విరిగిన పాలు ఎట్లా ఉపయోగ పడవో , అట్లా అవుతుంది థయమిన్ విటమిన్ ! )

సరిగా వండని చేపలు : కొన్ని రకాల చేపలలో ( ప్రత్యేకించి చెరువు చేపలలో ) థయమిన్ విటమిన్ ను విరిచేసే తయమినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనివల్ల థయమిన్ విటమిన్ అంతా విరిచి వేయబడి మనకు ఏ విధం గానూ పనికి రాకుండా పోతుంది.

మరి ఆల్కహాలికులలో ( అంటే అతిగా మద్యం సేవించే వారిలో ) థయమిన్ లోపం ఎందుకు ఉంటుంది? : దీనికి చాలా కారణాలు ఉన్నాయి :

1. సాధారణం గా అతిగా మద్యం సేవించే వారు , వారి కడుపులో పోషక విలువలున్న ఆహారాన్ని కాక , ప్రధానం గా మద్యం తో నింపు తారు.
2. దానితో మన జీర్ణ కోశం లో ఉండే కణాలు మద్యం లో మునిగి పోయి , ఆహారం లో ఉండే థయమిన్ ను ” పీల్చుకో ” లేవు.
3. అతిగా సేవించే మద్యం కాలేయం అంటే లివర్ లోని కణాలను కూడా పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం లో ప్రవేశించే థయమిన్ నిలువ అవ్వడానికి వీలు పడదు ( సామాన్యం గా మనం మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ థయమిన్ ఆహారం లో తీసుకుంటే , అది మన కాలేయం అంటే లివర్ లో నిలువ చేయబడుతుంది )
4.అంతే కాక మద్యం థయమిన్ ను మన శరీర కణాలకు చేర నీయదు.

గమనించ వలసిన విషయం ఏమిటంటే , ఈ మార్పులు , చాలాకాలం , ఎక్కువ గా మద్య పానం చేసే వారిలో వస్తాయి. ఒక సారి ఈ మార్పులు వచ్చాక వారు మతి మరుపు తెచ్చుకుంటారు , కంఫ్యుస్ అవుతూ ఉంటారు. తికమక పడుతూ ఉంటారు. ఏకాగ్రత కోల్పోతారు. చీటికీ మాటికీ విసుక్కుంటూ ఉంటారు , చుట్టూ ఉన్న వారి బుర్ర తినేస్తూ ఉంటారు , ఎందుకంటే , వారి బుర్ర , నిరంతరం మద్యం లో ” మునిగి ” విటమిన్లు లోపించి సరిగా పని చేయదు కనుక ! కానీ వారు ఈ విషయాన్ని ఒప్పుకునే పరిస్థితి లో ఉండరు. మీరు గమనించారో లేదో , అతి గా తాగే వారు , వారి పరిస్థితిని అంత తేలిక గా ఒప్పుకోరు. వారి నిస్సహాయ స్థితిని వారి కోప తాపాలనూ , వారి కుటుంబ సభ్యుల మీదా , ( తల్లి తండ్రులూ , భార్య ల మీదా ) అమాయకులైన తమ సంతానం మీదా అంటే చిన్నారుల మీదా చూపిస్తూ ఉంటారు. ఇది చాలా విచార కర పరిస్థితి.

-Dr.Seshagiriao-MBBS-8 Apr 2014

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.