Saturday, December 3, 2011

సుగర్ అదుపు తప్పితే వచ్చే అనర్దాలు, Effects of uncontrolled Diabetes



  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సుగర్ అదుపు తప్పితే వచ్చే అనర్దాలు(Effects of uncontrolled Diabetes)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్తంలో సుగర్ ఎక్కువయితే అది శరీరంలోని కణాల నుంచి నీటిని తీసుకుంటుంటుంది. దాంతో ‘డిహైడ్రేషన్’ కలుగుతుంది. అందుకే రక్తంలో సుగర్ ఎక్కువగా వున్నవాళ్ళు డయాబెటిక్స్ దాహంతో బాధపడుతుంటారు. డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఆకలితో ఎందుకు అలమటిస్తుంటారంటే ఎంత తిన్నా జీర్ణమైన ఆహారం కణాలకు చేరదు కాబట్టి. వాటితోబాటు మూత్రానికి ఎక్కువసార్లు పోతున్నా, కారణం లేకుండా బరువు తగ్గిపోతున్నా, అలసట, నీరసం ఎక్కువగా ఉన్నా చూపు అలికినట్లున్నా, గాయాలై త్వరగా మానకుండా ఉన్నా, కాళ్ళుచేతుల్లో తిమ్మిర్లుగా వుంటున్నా, చిగుళ్ళు ఎర్రగా వుండి వాస్తున్నా, వంశంలో ఈ వ్యాధి ఉన్నా, ఊబకాయం ఉన్నా, వయసు 30 దాటుతున్నా రక్తపరీక్షల ద్వారా డయాబెటిస్ ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. వ్యాధి ఉంటే వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త పడాలి. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే అనర్థాలు అధికం. డయాబెటిస్ జబ్బు కాదు గానీ అన్ని జబ్బులకు మూలం, అదుపులో ఉంచుకోకపోతే. ఆర్టెరీస్ రక్తనాళాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా సన్నటి రక్తనాళాలకు ముప్పు ఉంటుంది. ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువ. అలా రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడంవల్ల హార్ట్ ఎటాక్ లేక స్ట్రోక్‌లాంటివి రావచ్చు. పెద్ద రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కాళ్ళలో రక్తనాళాలు దెబ్బతిని, గాంగ్రిన్ లాంటివి కలిగే ప్రమాదాలున్నాయి. అధిక రక్తపోటు కలగవచ్చు. అదీ గుండెకి ప్రమాదమే కదా? ఆహార నియంత్రణ చాలా అవసరం. కొవ్వు పదార్థాల్ని తగ్గించివేయాలి. కడుపునిండా తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండకూడదు. నాలుగు గంటలకోసారి కొద్దికొద్దిగా తీసుకోవాలి. పీచు పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. తీసుకున్న కేలరీలు ఖర్చుపెట్టడానికి రోజూ వ్యాయామం అవసరం. కదలికలు లేని జీవన విధానం ఇబ్బందుల్ని తెస్తుంది.

  • డయాబెటిస్‌తో నరాలు దెబ్బతింటాయి. నరాల మీద ఉండే పొర దెబ్బతినడంతో ‘న్యూరోపతి’ వస్తుంది. రక్తనాళాలు దెబ్బతింటే, ‘వాస్క్యులోపతి’ అంటారు. పొడవాటి రక్తనాళాలు దెబ్బతిన్నట్లే, పొడవాటి నరాలు దెబ్బతింటాయి. అందుకే పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారానికొకసారైనా గోరు వెచ్చని నీటిలో పాదాల్ని ఉంచి, తర్వాత శుభ్రంగా తుడవాలి. చిన్న చిన్న పొక్కుల్లా వున్నా చిదపకూడదు. పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. ఇంట్లో తిరుగుతున్నా పాదరక్షలు వేసుకోవాలి.
మూత్రపిండాలలో ఎన్నో సన్నటి రక్తనాళాలుంటాయి. డయాబెటిస్‌తో మూత్రపిండాలలోని ఫిల్టర్ వ్యవస్థ దెబ్బతినే అవకాశముంది. నీరు శరీరంలో చేరుకుపోయి అలసట, అధిక రక్తపోటు, పాదాలు వాచడం, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, అనీమియా ,బ్లడ్‌ప్రొటీన్ అల్బ్యుమిన్ మూత్రం ద్వారా పోవడం జరుగుతుంటుంది. డయాబెటిస్‌వల్ల ఒక్కోసారి మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతినవచ్చు.

  • డయాబెటిక్ వల్ల రెటినోపతి రావచ్చు. కళ్ళలోని రెటీనా దెబ్బతినడంవల్ల ఇది వస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ త్వరగా రావచ్చు. క్షణాల్లో వ్యాపించవచ్చు. అంగస్తంభన, నరాలు, రక్తనాళాలు దెబ్బతినడంవల్ల తగ్గి దాంపత్య జీవితం దెబ్బతింటుంది. నరాలు దెబ్బడంవల్ల నొప్పి లేకుండా గుండె నొప్పి లాంటివి వస్తాయి. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డయాబెటీస్‌ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.