Sunday, December 4, 2011

Dermatitis, Eczema ,డెర్మలైటిస్ ,ఎగ్జిమాఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Dermatitis, Eczema ,డెర్మలైటిస్ ,ఎగ్జిమా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


డెర్మలైటిస్ అంటే చర్మానికి వచ్చే ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం. ప్రత్యేకమైన ఇన్‌ఫెక్షన్‌ కనిపించనప్పుడు దానిని డెర్మలైటిస్‌గా వ్యవహరించడం పరిపాటి. చర్మానికి సంబంధించిన వ్యాధి . కొంతమంది " ఎక్యూట్ స్కిన్‌ ఇంఫ్లమేషన్‌" ని డెర్మటైటిస్ గాను, క్రానిక్ స్కిన్‌ ఇంఫ్లమేషన్‌ ని ' ఎక్జిమా' గాను వ్యవహరిస్తారు .


ఎగ్జిమా అనేది గ్రీకు పదం. నీటి బుగ్గల మాదిరిగా ఏర్పడటమని దీని అర్థం. దీనినే డెర్మటైటిస్ అని కూడా వ్యవహరిస్తారు. ఎగ్జిమాలో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లు కనిపించడం,కొద్దిగా పొరలుగా తయారవడం, వాపు ఉండటం, నీటి బుగ్గలు కనిపించటం, వ్యాధి సోకిన ప్రాంతం స్రావయుక్తంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దురద ప్రధాన లక్షణం. కాకపోతే వివిధ వ్యక్తుల మధ్య దీని తీవ్రత విషయంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఎగ్జిమా వ్యాధి బైటపడేటప్పుడు ఒక నిర్ధిష్టమైన విధానాన్ని అవలంభిస్తుంది. మొదట చర్మం ఎరుపురంగులో కములుతుంది. తరువాత వాపుతో కూడిన పొక్కులు లేస్తాయి. ఇవి క్రమంగా నీటి బుగ్గల ఆకృతిని సంతరించుకుంటున్నాయి. తరువాత రసి కారడం ప్రారంభమవుతుంది. కొంతకాలం తరువాత అస్పష్టమైన పొలుసులు తయారవుతాయి. ఈ సమయంలో సరైన చికిత్స తీసుకుంటే చర్మం తిరిగి మామూలుగా తయారవుతుంది. మచ్చలుకూడా పడవు. ఒకవేళ చికిత్స తీసుకోనట్లయితే చర్మపు ఉపరితలం ఎగుడు దిగుడుగా తయారై వ్యాధి మొదటికొస్తుంది. ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది

  • కారణాలు :
ఎగ్జిమా ప్రధానంగా రెండు వౌలికాంశాల వలన వస్తుంది. ఒకటి ఆయా వ్యక్తులకు ఎలర్జీ ఏర్పడే తత్వం ఉండటం. రెండు ఎలర్జీని కలిగించే అంశాలకు గురికావడం. దీనినే మరో రకంగా చెప్పాల్సి వస్తే ఎగ్జిమాతో సతమతమయ్యే వ్యక్తులు ఉంటారు. తప్పితే ఎగ్జిమా వ్యాధి అంటూ స్పష్టంగా కనిపించదని చెప్పవచ్చు. కొంతమందిలో ముఖం, మెడ, చేతులు వంటి అనార్చాదిత భాగాలలో ఎగ్జిమా ఎక్కువుగా కనిపిస్తుంది. దీనికి కారణం సూర్యకిరణాలు పడకపోవడమే. ఈ తరహా వ్యక్తులలో మామూలు సందర్భాలలో ఎండ వలన ఇబ్బంది కలుగకపోయినప్పటికీ సూర్యకిరణాలవల్ల తాకిడికి తోడు కొన్ని ప్రత్యేకమైన అంశాలు తోడైనప్పుడు ఎగ్జిమా వస్తుంది. ఉదాహరణకు కొన్ని రకాల బి.పి మందులకు కొన్ని రకాల షుగర్ మందులకు, టెర్రామైసిన్‌కు, మూత్రాన్ని జారీ చేయడానికి వాడే క్లోర్‌థియజైడ్‌కు, ఇటువంటివే మరికొన్ని మందులకు ఈ లక్షణం ఉంది. అలాగే కొన్ని రకాల గడ్డిజాతి మొక్కలు, ఆవాలు వంటివి కూడా ఎండడంతో కూడినప్పుడు ఎగ్జిమాను ప్రేరేపించే అవకాశం వుంది.


* స్పర్శ వలన వచ్చే కాంటాక్ట్ డెర్మలైటిస్ పారిశ్రామికీకరణం రసాయన పదార్థాల వినియోగం పెరుగుతుండటం వంటి కారణాల వలన డెర్మలైటిస్ క్రమంగా పెరిగిపోతున్నది. ఏదైనా సరిపడని వస్తువు శరీరానికి తగిలినప్పుడు ఆ ఒక్క భాగంలోనే కాకుండా మిగతా శరీరానికంతటికీ ఎలర్జిక్ రియాక్షన్ ప్రసరించే అవకాశం వుంది.

* సౌందర్య సాధనాలు: జట్టుకోసం వాడే రంగులు, బొట్టుకోసం వాడే కుంకుమ మొదలైన పదార్థాల వలన డెర్మలైటిస్ వస్తుంది. అలాగే. పెదాలకు వేసుకునే లిప్‌స్టిక్స్, ఎర్రచందనపు పేస్టు, పర్‌ప్యూమ్స్, ముఖానికి రాసుకునే క్రిములు, గోళ్ల రంగులు, ఐబ్రో పెన్సిళ్ళు, హెయిర్ రిమూవింగ్ పదార్థాలు, కృత్రిమ పరిమళ పదార్థాలతో తయారైన తల నూనెలు, షాంపూలు ఇవన్నీ డెర్మలైటిస్‌ను కలిగించే అవకాశం వుంది. లిప్‌స్టిక్ వలన వచ్చే డెర్మటైటిస్ ఎక్కువగా కింది పెదవికే పరిమితమవుతుంది. వాపు వుంటుంది. స్రావాలు ఉండవచ్చు. లేదా పెదవి పొడిపొడిగా తయారై చిట్లవచ్చు. గోళ్ల రంగుల వల్ల వచ్చే డెర్మలైటిస్ కేవలం గోళ్లకే పరిమితం కాకుండా చెంపలు, కనురెప్పలు, మెడ మొదలైన భాగాల్లో కూడా కనిపిస్తుంది.
వస్త్రాలు, ఇతరత్రా:రబ్బరు చెప్పులు, గ్లోవ్స్, కండోమ్స, కళ్లజోళ్ల ప్రేములు, వాచీ స్ట్రాపులు, జంతు చర్మాలతో తయారైన వస్తువులు రోల్డ్‌గోల్డ్ నగలు వీటన్నింటివలనా డెర్మలైటిస్ వచ్చే అవకాశం వుంది. ఉక్కపోతగా ఉండే కాలంలో వాటి వలన ఇబ్బందికి ఎక్కువ కావడాన్ని గమనించవచ్చు. ఉక్కపోతగా ఉండే కాలంలో చెమటలు ఎక్కువుగా పట్టడం దీనికి కారణం, నికెల్‌తో తయారైన వస్తువులు కూడా ఎలర్జీలను కలిగిస్తాయి.

బ్యాక్టీరియా , ఫంగల్ ఇంఫెక్షన్‌ వలన డెర్మటైటిస్ / ఎక్జిమా రావచ్చును .

  • ఎక్జిమా చికిత్స :
ఇది అలర్జీ వల్ల వచ్చేది. దురద ఉండి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఆహారంలో మార్పు వచ్చి పడని పదార్థాలు వాడినప్పుడు చల్లటి వాతావరణ వున్నప్పుడు ఎక్కువగా కన్పిస్తుంది. కొంత మందికి బొట్టు పెట్టుకుంటే నుదుటి మీదరావచ్చు. దీనికి ఇన్‌ఫెక్షన్‌ తోడైతే యాంటీబయాటిక్స్‌ వాడాలి. దురద తగ్గడానికి సిట్రిజిన్‌ మాత్రలు 10 మిల్లీగ్రాములు రోజుకు రెండు సార్లుగాని, ఒక్క సారిగాని వాడాలి. కాళ్లకుంటే... స్నానం చేసినప్పుడు కాళ్లు కడుకున్నప్పుడు వెంటనే పొడిగుడ్డతో తుడిచి దానికి అనువైన ఆయింట్‌మెంట్‌ పూయాలి. బెట్నోవేట్‌-సి గాని బెట్నోవిట్‌-జి గాని పు యాలి. కొంతమందికి పొడిబారిన డ్రై స్కిన్‌ వుం టే మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ రెండుసార్లు పూయాలి. శీతకాలంలో పొడిచర్మం వల్ల చాలా దురదగా వుంటుంది. ఫంగస్‌తో కూడిన చర్మవ్యాధులకు మికొనోజోల్‌ ఆయింట్‌మెంటు రోజుకు రెండుసార్లు పూయాలి. దురదకు లీవో సిట్రిజన్‌ 5 మిల్లీగ్రాములు బిళ్ళలు అవసరాన్ని బట్టి వాడాలి.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.