Friday, December 2, 2011

Burning Mouth Syndrome,బర్నింగ్ వౌత్ సిండ్రోమ్,నోటిలో మంటగా ఉండటం

  •  
  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Burning Mouth Syndrome,బర్నింగ్ వౌత్ సిండ్రోమ్,నోటిలో మంటగా ఉండటం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 


నోటికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినప్పటికీ నోటిలోపల భాగమంతా తీవ్రమైన మంటకు గురికావడాన్ని వైద్యపరిభాషలో బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ అని వ్యవహరిస్తారు. దీనిని బర్నింగ్ లిప్స్ సిండ్రోమ్, స్టోమటోడైనియా, గ్లాసోడైనియా, గ్లాసోపైరొసిస్ వంటి ఇతర పేర్లతోనూ వ్యవహరిస్తారు. ఈ సమస్యకు గురైనప్పుడు నోటిలో పైభాగం, నాలుకపైన ముందుభాగం, పెదవులు అరుదుగా చిగుళ్ళు, నాలుకు కిందిభాగం మంటగా ఉంటాయి. ఈ సమస్య పురుషుల్లో కంటే స్ర్తిలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 40 సంవత్సరాల వయస్సు దాటిన స్ర్తిలలో ఈ సమస్య కనిపిస్తుంటుంది.
  • రకాలు
బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ మూడు రకాలుగా ఉంటుంది.
మొదటిరకం: వ్యాధి లక్షణాలు ఉదయం నిద్రలేచిన తరువాత కనిపించవు. రోజు గడుస్తున్నకొద్ది నెమ్మదిగా మంట ఆరంభమవుతుంది. రాత్రి అయ్యేసరికి మంట తీవ్రస్థాయికి చేరుతుంది.
రెండవరకం: ఎలాంటి ఉపశమనమూ, విరామమూ లేకుండా మంట నిరంతరమూ ఉంటుంది.
మూడవరకం: మంట కొద్దిసేపు కనిపిస్తుంది. కొంత విరామం తరువాత మళ్ళీ మంట ఉంటుంది.

  • కారణాలు
బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ సమస్య ఉత్పన్నం కావడానికి అనేక కారణాలున్నాయి. ఎలాంటి స్పష్టమైన కారణమూ కనిపించకుండా నోటిలో మంటగా ఉండటం. దీనిని ఇడియోపతిక్ బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ అంటారు.
రక్తహీనతకు గురికావడం: ప్రధానంగా బర్నింగ్ వౌత్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారిలో హిమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా రక్తహీనతతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో విటమిన్ బి-12, బి-6, ఐరన్ వంటి విటమిన్ల స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఆందోళన, వ్యాకులతలకు గురికావడం: తీవ్రమైన వ్యాకులతకు, అందోళనకు గురయ్యే వారిలో కనిపించే మానసిక ఒత్తిడి ఈ సమస్య ఉత్పన్నం కావడానికి మరింత అధికం కావడానికి దోహదం చేస్తాయి. వ్యాకులతతో బాధపడుతున్న వారికంటె ఎక్కువగా ఆందోళనకు గురయ్యే వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
నోటికి సంబంధించిన కొన్ని అలవాట్ల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఉదాహరణకు నాలుకను తరచూ నోటిలో తిప్పుతుండటం, కొరుక్కోవడం, పళ్ళు నూరటం, పళ్ళు కొరకడం వంటి అలవాట్లు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి దోహదం చేస్తాయి.
ఇవేకాకుండా నోటి లోపలి భాగం అంటే ఆహారనాళము వరకూ ఉంటే ఇంట్రా ‘బరల్ భాగం’లో మంటకు ఫంగల్ ఇన్‌పెక్షన్లు, మధుమేహం, జీర్ణకోసం నుంచి ఆమ్లాలు, ఆహారపదార్థాలు పైకి ఎగదన్నుకు వచ్చే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిప్లక్స్ డిసీజ్, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు నోటిలో మంట కనిపించడానికి కారణమవుతాయి.
బర్నింగ్ వౌత్ సిండ్రోమ్‌కు గురైన సుమారు 50శాతం కేసుల్లో బాధితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైయినాయి. మంద్రస్థాయి నుంచి ఒక మాదిరి వరకూ ఆందోళనతో బాధపడుతున్న వారిలో టైప్ 1 రకం బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ కనిపిస్తుంది.
టైప్ 2 రకం బర్నింగ్ వౌత్ సిండ్రోమ్‌లో బాధపడుతున్న వారిలో తీవ్రమైన మానసిక సమస్యలు కాని, కేన్సర్ సోకుతుందనే భయాందోళనలకు గురవడం కాని కనిపిస్తుంది.
దంతాలన్నీ ఊడిపోయి, డెంచర్లు వాడుతున్న వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. డెంచర్లకు అతిగా ప్రతిస్పందించే (సెన్సిటివిటీ) శరీరతత్వం ఉన్న వారిలో ఈ సమస్య కనిపించే అవకాశాలున్నాయి.
స్ర్తిలలో హార్మోన్లలో మార్పులు సంభవించడంవల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. బహిష్టులు తగ్గిపోయే దశలో చికిత్స తీసుకునేవారిలో సుమారు 20 శాతం మంది వరకూ నోటిలో మంటగా ఉందని చెబుతుంటారు. లాలాజల గ్రంధుల పనితీరులో లోపాలు కూడా బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ సమస్యకు కారణమవుతుంది.

-డాక్టర్ యం. ఎస్. గౌడ్-డా. గౌడ్స్ డెంటల్ హాస్పటల్స్ 19,దుర్గ ఎన్‌క్లేవ్, రోడ్ నెం. 12.బంజరాహిల్స్ హైదరాబాద్ - 500 034
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.