- విటమిన్ సి
- విటమిన్ సి లోపిం :
విటమిన్ సి లోపించినవారు స్కర్వి వ్యాధికి లోనవుతారు. ఈ వ్యాధి గలవారు శరీరమంతా నీరసంతో, పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ, ఎముకల ఎదుగుదల లేక బాధ పడతారు. గాయాలను మానపటానికి కొన్ని రకాల హార్మోన్ల మేళవింపునకు విటమిన్ సి సహాయపడుతుంది. అమినో యాసిడ్, కార్బో హైడ్రేట్లు (పిండిపదార్ధాలు) జైవికక్రియకు, అహారంలోని ఇనుముధాతువు శరీరంలో ఇమిడిపోవడానికి కూడా తోడ్పడుతుంది.
నోటిలో పుండ్లు పడటం, దంతాలు కదలడం, చర్మం కింద ఉండే కేపిల్లరీస్ చిట్లి రక్తస్రావం కావడం జరుగుతాయి.
విటమిన్ సి ఉపయోగాలు :
- గాయాలు త్వరగా మానడానికి విటమిన్ సిను ఇస్తారు.
- గుండెకు 'సి' రక్ష
ఒకసారి గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) బారినపడ్డవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటివారికి మరోసారి గుండెజబ్బు ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువ. వీళ్లు విటమిన్ సి దండిగా ఉండే బొప్పాయి, నారింజ, గోబీపువ్వు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిదని నార్వే పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో తిరిగి గుండెజబ్బుతో ఆసుపత్రిలో చేరటమనేది విటమిన్ సి అంతగా తీసుకోనివారిలోనే ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. వీరి రక్తంలో సి-రియాక్టివ్ ప్రొటీన్ (సీఆర్‌పీ) కూడా రెట్టింపు కన్నా ఎక్కువగానే ఉంటున్నట్టు తేలింది. ఈ సీఆర్‌పీ గుండెజబ్బుతో ముడిపడి ఉంటుండటం గమనార్హం. హార్ట్ ఫెయిల్యూర్ బారినపడ్డవాళ్లు విటమిన్ సి నిండిన పదార్థాలు తీసుకుంటే ఎక్కువకాలం జీవిస్తున్నారని తేలటం ఇదే తొలిసారని అధ్యయనకర్త గ్రేస్ సాంగ్ అంటున్నారు. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఇది శరీరంలో వాపును తగ్గించటం ద్వారా గుండె వైఫల్యం బాధితులకు రక్షణ కల్పిస్తోందన్నది ఆయన అభిప్రాయం. అధ్యయనంలో భాగంగా గుండె వైఫల్యం బారినపడ్డవారు ఆసుపత్రిలో చేరినప్పుడు వారి ఆహార అలవాట్లను పరిశీలించారు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఆధారంగా వాళ్లు ఎంత మోతాదులో విటమిన్ సి తీసుకుంటున్నారో అంచనా వేశారు. వారి రక్తంలోని సీఆర్‌పీని కూడా నమోదు చేశారు. అనంతరం ఏడాది పాటు వారిని గమనించగా.. విటమిన్ సి తక్కువగా తీసుకునేవాళ్లు తక్కువ సమయంలోనే రెట్టింపు సంఖ్యలో రెండోసారి గుండెజబ్బుతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు తేలింది. అయితే కొందరు పరిశోధకులు దీన్ని పూర్తిగా అంగీకరించటం లేదు. విటమిన్ సి ఒక్కటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందనే సంగతి స్పష్టంగా బయటపడలేదని ఉదహరిస్తున్నారు. ఆహారం ద్వారా తగినంత విటమిన్ సి తీసుకునేవాళ్లు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారని.. ఇలాంటి ఆహారం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందన్నది తెలిసిందేనని చెబుతున్నారు. విటమిన్ సి ప్రభావమో, కూరగాయలు పండ్ల ఫలితమో.. ఏదైనా ఆరోగ్యకర ఆహారమే కాబట్టి మంచి అలవాట్లను పాటించటంలో తప్పులేదని నిపుణులు చెబుతున్నారు.
- నారింజ,
- ఉసిరి,
- నిమ్మకాయ లాంటి పులుపు పండ్లు అన్నిటిలోను విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
- మనం సాధారణంగా తీసుకొనే టమాటా,
- జామపండ్లు
- మొలకెత్తిన పప్పు ధాన్యాలు కూడా విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తాయి.
- ఇతర ఉపయోగాలు
- కంటి చూపును మరింత ప్రకాశవంతం చేస్తుంది. ఆస్తమా, ఎక్సిమా, హే ఫీవర్ వంటి అలర్జీల చికిత్సలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
- ఎండ వల్ల చర్మం కమిలి పోకుండా చూస్తుంది. చర్మం మీద ఏర్పడిన గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. డయాబెటిస్ వ్యాధి గ్రస్థుల్లో షుగర్ స్థాయి నియంవూతణలో తోడ్పడుతుంది
ఎందులో లభిస్తుంది
ఇంత అద్భుతమైన ఈ పోషక పదార్థం నారింజ, పచ్చి మిరప, పుచ్చపండు, పొప్పడి, ద్రాక్ష, మామిడి, జామ పండు, టమాట, గోబీపువ్వు, క్యాబేజి, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసాల్లో పుష్కలంగా లభిస్తుంది. అంతే కాదు ఆకుకూరల్లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ పోషకం రక్తంలో తగ్గకుండా చూసుకోవచ్చు.
ఎవరికి ఎంత?
విటమిన్ సి శరీరానికి అందాలంటే చాలా కాయగూరలు, పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే విటమిన్ సి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా తీసుకున్నప్పటికీ శరీరానికి కావాల్సినంత విటమిన్ సి మాత్రం తప్పనిసరి.
- పిల్లల్లో 14 సంవత్సరాల లోపు వారికి 45 మిల్లి గ్రాముల వరకు
- మహిళలకు 75 మిల్లి గ్రాములు
- గర్భవతులకు 85 మిల్లీ గ్రాములు
- పాలిచ్చే తల్లులకు 115 మిల్లీ గ్రాములు
- పురుషులకు 90 మిల్లీ గ్రాములు విటమిన్ సి రోజు వారి అవసరమవుతుంది.
- =========================
ఆర్యా! భిషగ్వరేణ్యా! నమస్తే.
ReplyDeleteమీరు చాలా చక్కని ప్రయోజనకరమైన ఆరోగ్య ప్రదాయకమైన అంశాల్ని సహృదయతతో సామాజికులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి.
ముఖ పత్రంలో మీ ఛాయా చిత్రాన్ని చూచే భాగ్యం కూడా మాకు మీరు కలిగిస్తే బాగుంటుందని నా భిప్రాయం.
ఇంత చక్కటి సామాజిక దృక్పథంతో సేవచేస్తున్న మీకు నా అభినందన పూర్వక ధన్యవాదములు.
నమస్తే.