Monday, December 19, 2011

రొమ్ము కాన్సెర్ మామోగ్రఫీ , Breast Cancer and Mammography


  • image : courtesy with Eenadu news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - రొమ్ము కాన్సెర్ మామోగ్రఫీ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రొమ్ముక్యాన్సర్‌ ఉండొచ్చనే భయం ఓ వైపు వేధిస్తోన్నా.. వైద్యుల్ని సంప్రదించడానికి సంకోచం. అంతకన్నా ముందు.. పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలామందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ముక్యాన్సర్‌ ఉన్నా లేకపోయినా.. ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్‌ విధానం ఉంది.

మూడు రకాల్లో అందుబాటులో ఉండే ఈ విధానం వల్ల ఎలా మేలు జరుగుతుందో చూద్దాం.
  • స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌:
ఒక మహిళ గాని, వైద్యులు గాని... క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ పరీక్షను సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే.. సమస్య ఉన్నా లేకపోయినా కూడా.. నలభైఏళ్లు దాటినప్పటి నుంచీ ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకుంటే.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్స సాధ్యమవుతుంది. ఆ తరవాత త్వరగా కోలుకోగలుగుతారు కూడా.

  • సర్వైలన్స్‌ మామోగ్రామ్‌:
క్యాన్సర్‌ వచ్చి.. చికిత్స తీసుకుని రొమ్మును తొలగించని వారు ఏడాదికోసారి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష. దానివల్ల ఆ రొమ్ములోనే కాదు.. రెండోదానికీ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తొలిదశలోనే అంచనా వేయవచ్చు.

  • డయాగ్నొస్టిక్‌ మామోగ్రామ్‌:
రొమ్ములో కణితి లేదా కొత్తగా చోటు చేసుకున్న మార్పును గుర్తించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్థారించేందుకు తోడ్పడుతుందీ పరీక్ష. వైద్యులు స్వయంగా పరీక్ష చేయడం.. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ నిర్వహించడం (ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష) ఇందులో భాగం.

  • డిజిటల్‌ మామోగ్రామ్‌:
ఏ వయసువారిలోనైనా తొలిదశలోనే క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. సాధారణ మామోగ్రామ్‌తో పోలిస్తే.. ఇది అత్యాధునికమైన విధానం. ఇక, మన దేశంలో యువతుల్లోనూ క్యాన్సర్‌ ప్రమాదం కనిపిస్తోంది. అయితే యువతుల్లో రొమ్ము కణజాలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రారంభ దశలో ఆ లక్షణాలను త్వరగా గుర్తించలేం. అలాంటప్పుడు ఈ మామోగ్రఫీ చేయడం సరైన ప్రత్యామ్నాయం. దీనివల్ల పరీక్ష సమయంలో నొప్పితో పాటు రేడియేషన్‌ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ పరీక్షలో భాగంగా తీసిన చిత్రాలను రెండో అభిప్రాయం కోసం ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు. అయితే ఈ విధానం మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఖరీదూ కొద్దిగా ఎక్కువే.

  • source : from the article /Dr. P . Raghuram - Hyderabad(KIMS usha-laxmi center for breast cancer)

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.