Saturday, December 10, 2011

పులిపిరులు , పులిపెరకాయలు, Viral Warts,ఉలిపిరి కాయలు


 • image : courtesy with http://wikipedia.org/

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పులిపిరులు , పులిపెరకాయలు, Viral Warts- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మనిషి శరీరంలో అక్కడక్కడ చర్మము ఎక్కువగా ఉండి కాలిఫ్లవర్ ఆకారములో, చిన్నపాటి కురుపులా ఉండటాన్ని పులిపెర అంటారు. పులిపిరి సుఖవ్యాధి ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్’వల్ల వస్తుంటాయి. పొక్కులు , గడ్డలు లాంటి వాటిని లాగేసినా మళ్ళీ వస్తుంటాయి. వీటిలో సుమారు పది రకాలు ఉన్నాయి . ఇది అంటువ్యాది .. గాయపడిన చర్మము , మ్యూకస్ పొరల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపించును . ఈ పులిపిరులు వాటంతటవే తగ్గిపోవును .  కొంతమందిలో సంవత్సరాల కొద్ది ఉండిపోవును . కొంతమందిలో మాయమై మళ్ళీ కనిపించును (recurring) . వీటిలో రకాలు అవి శరీరములో ఉన్న ప్రదేశము బట్టి, పాపిల్లోమా వైరస్ టైపు బట్టి వర్గీకరిస్తారు .

కామన్‌ వార్ట్ (Verruca vulgaris): రఫ్ గా ఉన్న ఉపరితలముతో కొంచము ఎత్తు గా ముఖ్యముగా చేతులపై కనిపించును . చేతులపైనే కాకుండా శరీరము పై ఎక్కడైనా పుట్టవచ్చును .

ప్లాట్ వార్ట్ (Verruca plana) : ఇది బల్లపరుప గా మాంసము (flesh) రంగులో ఎక్కువ సంఖ్యలో ముఖ్యముగా ముఖము మెడ , చేతులు , మణికట్టు , ముడుక భాగాలలో కనిపుంచును .

ఫిలిఫారమ్‌ వార్ట్ (Filiform) : చిన్న పోగులా , లేదా పిలక లా ఉండి కనురెప్పలు , పెదవులు , ముఖము భాగాలలో వ్యాపించును .

జెనిటల్ వార్ట్శ్ (Venerial warts-condyloma acuminatum) : పురజాల భాగాలలో ... కోడి జుత్తు ఆకారములో వ్యాప్తి చెందును .

మొజాయిక్ వార్ట్స్ (Mosaik warts) : గుత్తు గుత్తులు గా గ్రూపులు గా అరికాలు, అరిచేతులు భాగాలలో ఎక్కువగా కనిపించును .

పెరీఅంగుల్ వార్ట్స్ (periungual wart) : కాలిఫ్లవర్ ఆకారములో గోళ్ళు చుట్టు వ్యాపించి అసహ్యముగా కనిపించును .

ప్లాంటార్ వార్ట్స్ (verruca plantaris) : గట్టిగా కాయమాదిరిగా , నొప్పితోకూడికొని అరిపాదాలు ,చేతులు భాగాలలో అరుగుదల చెందే శరీరభాగాలలో (pressure points) కనిపించును .

కారణము :
 • హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ (HPV) . ఈ వైరస్ లో సుమారు 100 రకాలు ఉన్నాయి. చర్మములో కందికాయలు నుండి కోడి జుత్తు వరకు . . స్త్రీలలో సెర్వైకల్ క్యాన్క్షర్ నుండి నోరు ,గొంతు క్యాన్‌సర్లు వరకు వీటివలన కలిగే ప్రమాదము ఉంది . 
 • వ్యాధి కారకం

   మానవ పులుపురికాయ -- HPV అనే వైరస్ ద్వారా వస్తాయి. మానవ పులుపురికాయ వైరస్లు సుమారు 100 జాతులు ఉన్నాయి.  రకం 1, 2, మరియు 3 కారణాలు చాలా సాధారణంగా వార్ట్ ల్లో - టైప్ 1 లోతైన అరికాలి (అడుగుల) మరియు చేతి వార్ట్ ల్లో (అరచేతిలో) తో ముడిపడి ఉంది. టైప్ 2 సాధారణ వార్ట్ ల్లో, సూక్ష్మతంతువు వార్ట్ ల్లో, అరికాలి వార్ట్ ల్లో, మొజాయిక్  వార్ట్ ల్లో కారణమవుతుంది. టైప్ 3 సమతల వార్ట్ లకు  కారణమవుతుంది, లేదా చదునుగా ఉన్న వార్ట్స్  అని పిలుస్తారు ..  సంభోగ వార్ట్స్  రకాలు 6, 11, 16, 18, 30, 31, 33, 34, 35, 39, 40  కారణమవుతుంది. HPV టైప్ 6 మరియు టైప్11 జననేంద్రియ వార్ట్స్  కేసుల్లో 90%  లు కారణమవుతున్నాయి. HPV రకాలు 16 మరియు 18 గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో ప్రస్తుతం 70% కారణం , మరియు కొన్ని vulvar , యోని , పురుషాంగము మరియు ఆసన క్యాన్సర్లుకు  కారణం. గార్డాసిల్ అనేది HPV టీకా మందు.  HPV రకాలు 16, 18, 6, మరియు 11 వ్యాధి కోసం నివారించడానికి ఉద్దేశించబడింది. ఇది HPVs ఇతర రకాల వ్యతిరేకంగా క్రాస్ రక్షణ ద్వారా సంభోగాంగ మొటిమల్లో ఇతర జాతులు సోకకుండా నిరోధించడానికి పనికొస్తుందని ప్రకటించారు. HPV నోటి క్యాన్సర్, స్వరపేటిక కాన్సర్, బ్రోంఖియాల్ మరియు ఊపిరితిత్తుల కాన్సర్ తో ముడిపడి ఉంది అని అదారాలు ఉన్నాయి. 

చికిత్స :
 • సరియైన పూర్తి గా నయమయ్యే చికిత్స లేదు .
 • సాలిసిలిక్ యాసిడ్ తో క్రయో తెరఫీ చేయడము .
 • జెనిటల్ వార్ట్స్ కి " ఫోడోపైలం " రెసిన్‌ అప్లై చేయడం ,
 • ఇమిక్విమోడ్ క్రీం వార్ట్ పై పెట్టడము మూలముగా " interferon" తయారై మన శరీరమే వైరస్ ని నిర్మూలించే పద్దతి .
 • కాంతారిడిన్‌ (Cantharidin) అనే కెమికల్ తమలపాకు సంబంధిత మొక్కలనుండి తీసి అప్లై చేయడము ,
 • బ్లియోమైసిన్‌ ని లోకల్ గా ఇంజక్ట్ చేయడం వలన వార్ట్స్ కుళ్ళి నశించును ,
 • Dinithrochlorobenzene ఇది సాలిసిలిక్ యాసిడ్ లాగనే వార్ట్ ఉన్న ప్రదేశమును కొరికి నాశనము చేయును .
 • Flurouraxil వైరస్ "డి.ఎన్‌.ఎ" ను నాశనము చేసి వార్ట్స్ బారినుండి కాపాడును .
 • - గడ్డ(wart)ను లేజర్ ద్వారా సమూలంగా పునాదినుంచి పెకలిస్తాము. ఆ తర్వాత దానిని బయాప్సీకి పంపిస్తాము. తద్వారా దాని అసలు గుణం తెలుస్తుంది. పులిపిరి(వార్ట్) లకు కారణమైన ’హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్ పి వి) లోని మిగిలిన రకాలను(సబ్ టైప్)కనిపెట్టి, గర్భాశయ కాన్సర్ కు ’హెర్పస్ సింప్లెక్స్ వైరస్’ కారణమని నిరూపించి వారు జూర్ హుస్సేన్(జర్మనీ) .

ఉలిపిర్ల నివారణకు కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు :
 • కొంతమందికి ముఖంపైన మెడ మీద పులిపిరి కాయలు వస్తూంటాయి. అలాంటి వారు దాల్చిన చెక్క కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి నూనెలో నూరి వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి.
 • పులిపిరి కాయలు పోవాలంటే అల్లాన్ని సున్నంతో అద్దిపెడితే రాలిపోతాయి.
 • పులిపిర్లు పోవాలంటే కాలిఫ్లవర్‌ రసాన్ని రాయాలి. కాలిఫ్లవర్‌ను గ్రైండ్‌ చేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పులిపిరి మీద రాస్తుండాలి. రోజుకు వీలైనన్నిసార్లు కనీసం అరగంట విరామంతో రాస్తుంటే పులిపిరి రాలిపోతుంది. మచ్చకాని గుంట కాని పడటం జరగదు.
 • మందం గా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
 • రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి సున్నపు నీరు తేటను కలిపి నిల్వచేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి అది పులిపిరి ఫై పుస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
 • చిటికెడు అతిమధురం పొడి, చిటికెడు అశ్వగంధ పొడి, రెండు చుక్కలు కొబ్బరి నూనె ,రెండు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి అల్లంను పుల్లలగా సన్నగా కట్ చేసుకుని ఈ అల్లం పుల్లతో ఫై పేస్టు ను తీసుకుని పులిపిరి ఫై రాయాలి.
 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.